కేంద్రీకృత పాలన మంచిదేనా!

Fri,April 19, 2019 01:22 AM

ఒక ప్రాంత సంస్కృతి ఆచారాలు అనాదిగా వస్తే, ఆ ప్రజల భావజాలం, ఆలోచనా సరళి వారు జీవించిన విధానాల వల్ల ప్రభావితమవుతాయి. మన దేశం గురించి ఒక ఉదాహరణ చూద్దాం! ప్రాచీనకాలం నుంచీ జీవన ప్రదాత అయిన సూర్యుడికి కేటాయించిన రోజు ఆదివారం. ఇది ఖగోళ శాస్త్రజ్ఞులు ఎంతో శాస్త్రీయంగా నిర్ణయించి, ఆ రోజున ప్రజలు చాలా ఉత్సాహంగా వారి వారి పనులు చేసుకోవాలని, కొత్త పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన రోజు. వేద విజ్ఞానం పాటించినంత కాలం అలాగే జరిగింది. అయితే బ్రిటిష్ వారి రాజకీయ ప్రాబల్యం పెరిగాక ఆదివారం ఒక బద్ధకంగా, ప్రణాళిక లేకుండా, చిత్తం వచ్చినట్టు గడిపే పనికి రాని దినమై పోయిం ది. ప్రస్తుతం తమ సంస్కృతిని ఎంతో శ్రద్ధగా పాటించే భారతీయులకు కూడా ఈ రోజు వర్కింగ్ డే చేస్తే ఒప్పుకోవటం కష్టమవుతుంది. ప్రాచీన కాలం నుంచీ ఆర్యావర్తం అన్నది ఉత్తర భారతదేశంగానూ ద్రవిడ జాతులు నివసించిన దక్షిణ భారతదేశం వివిధ రాజ్యాలతోనూ నిండి ఉంది. ఉత్తర భారతదేశంలో కూడా మహాభారతంలో వ్యాసమహర్షి వర్ణించిన కురు, మత్స్య, పొచాల మొదలగు దేశాలు ఇంకా పైన ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్‌లో వివిధ జాతులు నివసించేవి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే రామాయణంలోనూ, భారతంలోనూ కూడా ప్రస్తుత భారతదేశంలో వివిధ రాజ్యాలు ఉన్నాయని రాసిన విషయం. ఈ రాజ్యాల సంస్కృతులు కూడా భిన్నంగా ఉండేవనటానికి సాక్ష్యం సాక్షాత్తూ శ్రీ కృష్ణుడే. రుక్మిణి ప్రేమించిన శ్రీకృష్ణుడిని ఆమె తండ్రి, అన్న వ్యతిరేకించటానికి కారణం విదర్భ రాజ్యంలోని సంస్కృతి కృష్ణుడి యాదవ రాజ్యంలోని సంస్కృతి పూర్తిగా భిన్నమైనవి కావటమే. అంటే కశ్మీర దేశం నుంచీ, కేరళ ప్రదేశం దాకా ప్రాచీన కాలం నుంచీ ఉన్న వివిధ దేశాలు (రామాయణ, భారతాల్లో ఈ రాజ్యాలన్నింటి పేర్లు దొరుకుతాయి.

తమ తమ దేశాలు వదిలి, భాషలు వదిలి, ఇంగ్లీష్‌ను మాతృభాషగా చేసుకొని, ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తన సొంత రాజ్యాంగం రాసుకొని అమెరికాను వృద్ధి చేసుకున్నారు ఆ దేశ ప్రజలు. నిజానికి తమ భాషలు వదిలేయటంతో ఒక లాంటి సంస్కృతి పెంపొందించుకొని రాష్ర్టాలకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగి బతుకుతున్న అమెరికా వాసులకంటే భారతదేశం లో ఇంకా ఎక్కువ వైవిధ్యం ఉంది.వలస పాలకులు వదిలిపోయి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నది.


సీతను వెతుకటానికి తమ వారిని పంపుతూ సుగ్రీవుడు లంక దాకా ఉన్న రాజ్యాల పేర్లు చెప్పుతాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు అతని తమ్ముళ్ళు జయించిన రాజ్యాల పేర్లన్నీ భారతంలో ఉన్నాయి. ఇవి కశ్మీరు దాటి ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్, రష్యా దాకా వ్యాపించి ఉన్నాయి.) వాటి పేర్లు మనకు చెప్పే చరిత్రలు మన గ్రంథాల్లో మనకు దొరుకుతాయి. భారతదేశం వివిధ రాజ్యాల సమాహారంగా ప్రాచీనకా లం నుచీ వెలిగి, వివిధ జాతుల, సంస్కృతుల ఆచారాలకు నిలయమైం ది. గత వెయ్యేండ్లుగా 1947 దాకా విదేశీయుల పాలనలో ఉన్నా కూడా ప్రజలు వారివారి జీవన విధానాలనే అనుసరించారు. అయితే ఇది ఒక దేశంగా మొదట మొఘల్ రాజులు (కింది మైసూర్ దాకా) పాలించగా, బ్రిటిష్ వారి కాలంలో మొత్తం శ్రీలంకతో సహా వారు ఆక్రమించి పరిపాలించారు. వేల సంవత్సరాలు వివిధ రాజ్యాలుగా ఉన్న భారత ఉప ఖండం మొట్టమొదటిసారి ఒక దేశంగా మార్చబడింది బ్రిటిష్ వారి పాలనలోనే. అయితే సంస్కృతి, ఆచారవ్యవహారాలు మారలేదు. వివిధ దేశా లు వివిధ రాష్ర్టాలయ్యాయి. దీనికి తోడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష ప్రాచీన కాలం నుంచీ ఉన్నది అలాగే కొనసాగి, ఎవరి భాషా, సాహిత్యా లు వారికి తమ గుర్తింపు చిహ్నంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరి శతాబ్దాల పాటు వేర్వేరు భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు పాటించిన వీరికి అందరి జుట్టు తమ చేతిలో పెట్టుకొని ప్రాంత వైవిధ్యం అవగాహన లేని పరిపాలన చేసే కేంద్రీయ (యూనిటరీ) ప్రభుత్వ పరిపాలన సరిపడుతుందా? ఇది వరకు లాగా ఒక రాష్ర్టాల సమాహారంగా ఉంటే పరిపాలన తేలికవుతుందా? ప్రజలు ఇప్పుడు ఆలోచన చేయవలసిన అతి ముఖ్యమైన అంశం ఇది. మనముందు ఇంకొక అద్భుతమైన ఉదాహరణ ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలోని యువతకు కలల ప్రపంచంగా కనిపించే అమెరికా కూడా యూరప్ వాసులైన స్పానిష్, డచ్, ఫ్రెంచ్ ప్రజల వలసీకరణతో ఏర్పడింది.

అమెరికా లాగా ఫెడరల్ నిర్మాణం ఉంటేనే భారతదేశంలోని రాష్ర్టాలన్నీ ప్రగతి సాధించగలవు. అందరికీ అవసరమైన మిలిటరీ, నదీ జలాల వంటివి మాత్రం కేంద్రమనబడే దాని చేతిలో ఉండి, విద్య, వైద్యం, వ్యవసాయం వంటివన్నీ రాష్ర్టాల పరిధిలో సర్వాధికారాలతో ఉంటే అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ర్టాలు బాగుపడుతాయి.


1607లో మొట్టమొదటగా బ్రిటిష్ వారు ఏర్పరిచిన జేమ్స్‌టౌన్ తో వారి వలస స్థిరపడి మెల్లగా దేశమంతా పాకింది. 1750 నాటికి యూరప్‌లోని చాలా దేశాల ప్రజలు తమ దేశాల్లో వనరులు లేక ఉపాధి కోసం అమెరికా వలస వెళ్లారు. వివిధ దేశాల నుంచి, వివిధ భాషలు మాట్లాడేవారు ఆదేశానికి వెడితే, బ్రిటిష్ వారు మాత్రం పాలకులుగా మారి దాదాపు 170 ఏండ్లు అమెరికాను పరిపాలించారు. వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి చివరికి జూలై 4, 1776 లో స్వాతంత్య్రం సాధించింది అమెరికా. వివిధ భాషలు మాట్లాడే వారికి బ్రిటిష్ వారు అమెరికాలో ప్రవేశపెట్టిన విద్యా విధానం ఇంగ్లీషులో సాగ డం వల్ల ఆ భాషే ఉపయోగించి కలిసికట్టుగా బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టారు అమెరికన్లు. అప్పుడు ఇంగ్లీషు వారు అటువంటి పొరపాటు మళ్లీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కానీ భారతదేశంలో వారి వలస పాలన స్థిరపడటం, ఈ దేశాన్ని పాలించటానికి ఈ ప్రజల సంస్కృతి వారికి దూరం చేయడం ఒకటే మార్గమని తలచిన బ్రిటిష్ పాలకులు 1840లలో వారి విద్యా విధానాన్ని రూపొందించి ప్రవేశపెట్టారు. దాని తో వివిధ రాష్ర్టాల్లో వివిధ భాషలున్న భారతీయులకు ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్ అయ్యింది. అయినా, దేశ భాషగా బలవంతంగా హిందీ ప్రవేశ పెట్టినా, రాష్ర్టాల సంస్కృతి సంప్రదాయాలలో వైవిధ్యం అలాగే కొనసాగుతున్నది. అయితే 70 ఏండ్ల తర్వాత కూడా జాతీయ పార్టీలు రాష్ర్టా ల మధ్య వైవిధ్యాన్ని గానీ, ఈ దేశ చరిత్ర పూర్వాపరాలు కానీ అవగాహణ చేసుకోకుండా తమ చిత్తం వచ్చినట్టు వ్యవహరిస్తూ పాలిస్తున్నా యి. వారి నిరంకుశత్వం వలన రాష్ట్రస్థాయి నేతలు తమతమ ప్రాంతాల అవసరాల గురించి వారికి చెప్పటానికి కూడా భయపడుతారు. రాష్ర్టాల అవసరాలు గుర్తించకుండా, తమ ధోరణిలో పాలన సాగించటంతో దేశం మొత్తం ప్రపంచ దేశాలలో వెనుకబడింది. ప్రపంచంలోనే జనాభాలో రెండవ స్థానం, యువత సంఖ్యలో మొదటి స్థానంలో ఉండి, సహజ వనరులు పుష్కలంగా ఉన్న భారతదేశం ఇంకా అభివృద్ధిచెందుతున్న దేశంగా ఉండటం విషాదం.

అవినీతిలోనూ, ఆడవారిపై లైంగిక హింసలలో మాత్రం మొదటి స్థానాన్ని ఆక్రమించడం చూస్తే ఈ దేశాన్ని పాలించిన జాతీయపార్టీలు ఎంత ఘోరంగా విఫలమయ్యాయో అర్థం అవుతున్నది. అమెరికా లాంటి నిర్మాణం కలిగిన భారతదేశం రాష్ర్టాల సమాహారం గా సమాంతర, సమానమైన అధికారం, ప్రతిపత్తి కలిగి ఉంటేనే ఏ ప్రాం తం, ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం ప్రగతి సాధించగలుగుతుంది. తమ ప్రజల అవసరాలు గమనించి, గుర్తించి పలనావిధానాలు రూపొందించిన నాడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రాంతాలు, రాష్ర్టాల వారీగా నాయకులు ప్రజల మధ్యలో రాష్ట్రంలోనే ఉంటారు కాబట్టి వారిని నిలదీసే అవకాశం ప్రజలకు ఉంటుంది. పరస్పర పోటీతో అన్ని రాష్ర్టాలు అభివృద్ధి సాధిస్తా యి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉన్న నిబంధనలు చేసుకుంటే అందరికీ ఉపయోగం. తమ తమ దేశాలు వదిలి, భాషలు వదిలి, ఇంగ్లీష్‌ను మాతృభాషగా చేసుకొని, ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తన సొంత రాజ్యాంగం రాసుకొని అమెరికాను వృద్ధి చేసుకున్నారు ఆ దేశ ప్రజలు. నిజానికి తమ భాషలు వదిలేయటంతో ఒక లాంటి సంస్కృతి పెంపొందించుకొని రాష్ర్టాలకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగి బతుకుతున్న అమెరికా వాసులకంటే భారతదేశం లో ఇంకా ఎక్కువ వైవిధ్యం ఉంది.వలస పాలకులు వదిలిపోయి స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నది. ఇంత వైవిధ్యభరితమైన దేశంలో రాష్ర్టాలకు స్వాతం త్య్రం, ప్రత్యేకత నిలిపే రాజ్యాంగం ఉండటం ఎంతో అవసరం. అమెరికా లాగా ఫెడరల్ నిర్మాణం ఉంటేనే భారతదేశంలోని రాష్ర్టాలన్నీ ప్రగతి సాధించగలవు. అందరికీ అవసరమైన మిలిటరీ, నదీ జలాల వంటివి మాత్రం కేంద్రమనబడే దాని చేతిలో ఉండి, విద్య, వైద్యం, వ్యవసాయం వంటివన్నీ రాష్ర్టాల పరిధిలో సర్వాధికారాలతో ఉంటే అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ర్టాలు బాగుపడుతాయి. దానికి ఈ మంత్రులు, కేంద్రానికి ఇన్ని అధికారాలు కూడా అవసరం లేదు.
Kanakadurga
రాష్ర్టాల ఆదాయంలో 10శాతం కేంద్రానికి ఇచ్చి మిగితా ఆదాయాన్ని వారి పథకాలకు వాడుకునేటట్టు రాష్ర్టాలకు అధికారం కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇదంతా జరుగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ స్ట్రక్చర్ ఒక్కటే శరణ్యం.70 ఏండ్లు రెండు పార్టీలు వారు పోతే వీరు, వీరు పోతే వారు అన్నట్టు రాష్ర్టాల అధికారాలను చేతిలో పెట్టుకొని కేంద్ర నాయకత్వాలు నాటకాలాడుతున్నాయి. ఈ వ్యవస్థ మారి ఒక ఇష్యూ బేస్డ్ సిస్టమ్ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యవహారాలు తామే చూసుకొనే సమాంతర, సమాన ప్రతిపత్తి కలిగిన రాష్ర్టాల సమాహారంగా ఈ దేశం ఏర్పడాలి. అదే దేశ ప్రగతికి సోపానం. ఆ దిశగా నేడు కొన్ని ప్రయత్నాలు జరుగటం శుభసూచకం. కేంద్రంలో ఏ జాతీయ పార్టీకీ కావలసిన సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేదనే సంకేతాలు బలంగా కనిపిస్తున్న తరుణంలో ఫెడరల్ నిర్మాణమే పరిష్కారం.

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles