సంస్కరణలను స్వాగతిద్దాం

Sun,April 21, 2019 12:50 AM

ప్రజలకు నాణ్యమైన మెరుగైన పారదర్శక సేవలు అందిచాలన్న సత్ సంకల్పంతోనే పాలనా సంస్కరణలని మనమందరం గుర్తించాలి. వివిధ శాఖలను కొన్ని శాఖల్లో విభాగాలను ప్రక్షాళన చేస్తే పౌరసేవలను మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి.

kaleru
ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అడుగు లు వేస్తున్నారు. సుదీర్ఘంగా చట్టసభలకు ఎన్నికవుతున్న నేత, ఉద్యమకాలంలో యావత్ తెలంగాణ స్థితిగతులను సంపూర్ణ అవగాహన చేసుకున్న కేసీఆర్‌కు ఈ రాష్ర్టానికి ఎప్పు డు ఏమి చేస్తే బాగుంటుందో బాగా తెలుసు.ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధాన రూపకల్పన, అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల్లో అధిక శాతం నిరక్షరాస్యులుగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు. దీనివల్ల వీరు ప్రభుత్వ పాలనపై చాలా ఆశలు పెట్టుకుంటారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాధనం పట్ల నిర్ల క్ష్య వైఖరిని కలిగి ఉండటమే గాక వారిలో అంకితభా వం సేవా తత్పరత శ్రద్ధ కనడటం లేదని విమర్శలు అనాదిగా వస్తూనే ఉన్నాయి. కొద్దిమంది ఉద్యోగుల అనైతిక ప్రవర్తన కారణంగా నిధుల దుర్వినియోగం, బంధుప్రీతి, ప్రభుత్వ రహస్యాలను బహిర్గతపర్చడం తమ బంధువులకు లేదా స్నేహితులకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమ అధికారాలను ఉపయోగించడం వంటి పరిస్థితులు పాలనలో చోటు చేసుకు న్న ఫలితం గా ప్రజల్లో ప్రభుత్వ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్నది.

1970ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి అనైతి క ప్రవర్తన పెరిగింది. రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాల కలయిక ఫలితంగా పాలనా అధికారాలు యం త్రాంగం ఉద్యోగుల ప్రవర్తన దృక్పథంపై తీవ్ర ప్రభావాన్ని చూపడానికి దారితీసింది. ప్రభుత్వ పాలనలో సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంఘాలను కమిటీలను నియమించా యి. గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ, గోర్యాల కమి టీ, సంతానం కమిటీ, పాలనా సంస్కరణల సంఘం, ఎల్.కె. జాల్ కమిటీ మొదలైన కమిటీలు చేసిన సిఫారసులు చిత్తశుద్ధి లోపం కారణంగా అనేక ముఖ్య సూచనలను అమలు పర్చలేకపోయారు.
స్వతంత్ర దేశంలో పరిపాలన పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఇంతవరకు ప్రయత్నాలు జరుగలేదు. దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాలకు అనర్థాలకు ప్రభుత్వ వ్యవస్థ లోపాలే కారణం.ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రైవేటీకరణకు ప్రజ లు ఆకర్షితులయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రజలకు దాపరికం లేకుండా సామాన్యులకు అందుబాటులో జవాబుదారీగా ఉండాల్సిన పాలన, అవినీతికి రహస్య ఒప్పందాలకు, ఏకపక్ష నిర్ణయాలకు అక్రమ సంపాదనలకు కారణం అవుతున్నది. కేవలం ఉద్యోగులే కాదు కొందరు వ్యక్తులు తమ పనులకోసం అడ్డదారిలో అవలంబించే దుర్వినియోగ పద్ధతులూ కారణం. పారదర్శక పాలన నినాదంగానే మారిపోయింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రత్యక్షంగా సేవలందించాల్సిన ప్రభుత్వ శాఖలు రెవెన్యూ, పోలీస్,మున్సిపల్ పంచాయతీరాజ్ కమర్షియల్ టాక్స్ రవాణా తదితర విభాగాల్లో అవినీతి గురించి ప్రతిరోజు కథనాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క పనికి ఒకొక్క రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అవినీతి నిరోధక శాఖ లు, సి.బి.ఐ లాంటి సంస్థల్లోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఏమాత్రం రాజకీయ అండలేని చిరుఉద్యోగుల పైనా దాడులు జరుగుతున్నాయని, పెద్ద తిమింగలాలు తప్పించుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిబంధనలు సవరించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి నిర్మూలన విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ అకుంఠిత దీక్షతో పరిపూర్ణమైన నిష్పాక్షికత అంకితభావంతో పనిచేసినపుడే పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్న కోట్లాది ప్రజాధనం ఉపయోగపడుతుంది.

రాజకీయ చిత్తశుద్ధి సమాజంలో వివిధ వ్యవస్థలోని నైతిక విలువలు ప్రభుత్వోద్యోగిలో నిస్వార్థం ఉన్నప్పు డే అవినీతి నిర్మూలన జరుగుతుంది. ఎంతోమంది ఉద్యోగులు చిత్తశుద్ధితో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారు. వారిని గుర్తించి ప్రోత్సహించాలి. ప్రతి శాఖలో బాధ్యతాయుతంగా నీతిమంతంగా పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
మిగతావర్గాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కొంత సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండాలి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలాగా ఉండాలి. జవాబుదారీ తనంతో మెలగాలి. ప్రజలకు నాణ్యమైన మెరుగైన పారదర్శక సేవలు అందిచాలన్న సత్ సంకల్పంతోనే అని ఉద్యో గులందరూ గుర్తించాలి. వివిధ శాఖలను కొన్ని శాఖల్లో విభాగాలను ప్రక్షాళన చేస్తే పౌరసేవలను మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి.
పాత కాలం నాటి పద్ధతులు, చట్టాలను ఉపయోగించి ప్రస్తుత పాలనను కొనసాగించడం సాధ్యం కానప్పుడు కొత్త చట్టాలను సంస్కరణలను హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపైన సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉన్నది. ముఖ్యమం త్రి తన ఆలోచనలు, ఆశయాలు ఎలా ఆచరణలో చూపిస్తారో ఉద్యోగులకు తెలుసు. కేసీఆర్ చేపట్టే చర్యలు రాష్ర్టాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుం టే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోయే సంస్కరణల్లో రూపొందిం చే కొత్త చట్టాల్లో వాస్తవ పరిస్థితులపై అవగాహన, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తే చట్టాలు, సంస్కరణలు మరింత పటిష్టంగా అమలవు తాయి. వ్యవస్థలను సంస్కరించే సమయం ఇది. స్వాగతిద్దాం.
(వ్యాసకర్త: తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు )

307
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles