పుస్తకాలే మన నేస్తాలు

Tue,April 23, 2019 01:16 AM

యువత లక్ష్య సాధన కోసం ముందుకు సాగడానికై పుస్తకం ఎంతో దోహదం చేస్తుంది. ఒక మంచి నేస్తం గా జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకోవడానికి ఉపయోగపడే గొప్ప సాధనం పుస్తకం. పుస్తకాలతోనే సమా జంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రఖ్యాత ఆం గ్ల రచయిత విలియం షేక్‌స్పియర్ వర్ధంతి సందర్భంగా ఏటా ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహించాలని యునెస్కో నిర్ణహించింది. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసి వ్యక్తిత్వ వికాసానికి పదును పెట్టే పుస్తకంలోని ప్రతి అక్షరాలు మానవ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి. మూఢ విశ్వాసాల సంకెళ్ల నుంచి విముక్తి కలిగించే పుస్తకం హేతువాద, శాస్త్రీయ, ప్రగతిశీల చైతన్యాన్ని అందిస్తాయి. పుస్తక పఠనం ఒక వ్యాపకంగా, ఒక అలవాటుగా బాల్యంలోనే విత్తుకోవాలి. పుస్తకం ఒక అమ్మ, నాన్నలా ఆదరిస్తుంది. గురువులా మార్గం చూపిస్తుంది. ఒంటరితనంలో స్నేహితునిలా చేర్చుకుంటుంది. బాధలో ఉండేవారికి ఓదార్పునిస్తుంది. అలసిన మనసులకు సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం మంచి నేస్తంగా, సమర్థంగా అన్ని తరాల వారిని అలరిస్తుంది. పుస్తకాలను ఎంపిక చేసుకునేటప్పుడు సమకాలీన సమస్యలకు పరిష్కారం చూపుతున్న వాటిని ఎంపిక చేసుకొని ఆనందమయ జీవితానికి బాటలు వేసుకోవాలి.

పుస్తకమంటే విజ్ఞాన భాండాగారం లాంటిది. కందుకూరి వీరేశలింగం పంతులు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. కానీ నేడు సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నకొద్దీ ఇంటర్నెట్, వాట్సప్, ఫేస్‌బుక్ లతో చాలామంది విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. కానీ ఎవరూ మంచి పుస్తకం చదవడానికి మక్కువ చూపడం లేదు. మనల్ని మనం తెలుసుకోవడానికై పుస్తకాన్ని చదవాలి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ పుస్తకాలు చదివే వారు భారతీయులేనని, సగటున వారు 10గంటల పాటు సమయం కేటాయిస్తారని తెలిసింది. మన చేతిలో పుస్తకం ఆభరణం లాంటిది. అందుకే అంటారు పుస్తకం హస్తభూషణంఅని. పుస్తకాలను చదవండి.చదివించండి.
-సునీత బండారు, మహబూబ్ నగర్
(నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం )

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles