రాజకీయాల్లో రాహుల్ రాణిస్తాడా?

Sat,May 11, 2019 11:29 PM

మోదీపై వ్యతిరేకత ఉన్నవాళ్ళంతా జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీ నాయకత్వంపై ఆశ లు పెట్టుకున్నారు. గత ఐదేండ్లలో పరిణామాలు లౌకికవాదులను, మైనార్టీలను, వామపక్షవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆర్థిక, సంక్షేమ, విద్య, దేశభద్రత, విదేశీ వ్యవహారాలలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. మోదీ తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై కాకుండా చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చర్యలపై చర్చ జరుపుతున్నరు. మోదీ ప్రభుత్వ కుంభకోణాలపై, వైఫల్యాలపై జాతి దృష్టిని మరల్చలేని నిస్సాహయస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రాఫెల్ విమానాల కొనుగోలు, బ్యాంకులను మోసం చేసిన వారిని దేశ సరిహద్దులను దాటించడం, వేల కోట్ల రుణాలను బాడా వ్యాపారవేత్తలకు మాఫీ చేయడం, మతఘర్షణలు, హమీలను అమలుపర్చడంలో విఫలమవడం లాంటి విషయాలపై చర్చను తప్పించడంలో మోదీ సఫలమయ్యాడు. ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ర్టాలలో మోదీని నిలువరిస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌పార్టీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. అందుకే రాహుల్‌గాంధీ నాయకత్వం కాంగ్రెస్‌పార్టీకి చిరకాలం ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. 120 కోట్ల ప్రజలకు నాయకత్వం వహించే లక్షణాలు రాహుల్ గాంధీలో ఉన్నాయా అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. 2004 లోక్‌సభ ఎన్నికలలో 145 స్థానాలు గెల్చుకొని మిత్రపక్షాల సహయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గంలో చేరి అనుభవం సంపాదించే అవకాశాన్ని రాహుల్ గాంధీ జార విడుచుకున్నారు.

ఇందిరా, రాజీవ్‌ల హత్యలు రాహుల్ గాంధీని తీవ్రంగా కలిచివేసి రాజకీయాల పట్ల, పదవుల పట్ల అనాసక్తిని పెంచాయనే భావన ప్రచారంలో ఉన్నది. కలిసిన వారు అతని వ్యక్తిత్వాన్ని ఎంతగా ప్రశంసిస్తారో అంతగానే అతని రాజకీయ నాయకత్వం పట్ల అనుమానం వ్యక్తం చేస్తారు. కలుషితమైన రాజకీయాలలో నెగ్గుకొని రాలేడనేది ప్రధాన వాదన. మోదీస్థాయికి దిగడానికి ఇష్టపడని వాడు మోదీతో పోటీ నుంచి విరమించుకోవడం మంచిదని ప్రముఖ జాతీయ వ్యాసకర్త ఒకరు అభిప్రాయపడ్డాడు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. కానీ సాధారణ ప్రజలను కదిలించలేకపోతున్నారు.


2009 ఎన్నికలలో 206 లోక్‌సభ స్థానాలు పొంది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చేరకుండా రెండవసారి అవకాశాన్ని వదులుకున్నాడు. పార్టీలో జరిగిన అంతర్గత చర్చల ప్రకా రం మన్మోహన్ సింగ్ ఒక సంవత్సరం పదవిలో ఉండి రాహుల్ గాంధీకి ట్రైనింగ్ ఇచ్చి రిటైర్ కావాలి. కాని ట్రైనింగ్ కోసమైనా రాహుల్‌గాంధీ మంత్రి పదవిలో చేరాల్సి ఉండె. సంవత్సరం గడువు సమీపించగానే 2010లో మన్మోహన్ సింగ్ పదవి త్యజించాల్సింది పోయి అన్‌ఫినిష్డ్ అజెండా ఉన్నది. అంతవరకు పదవిలో కొనసాగుతాను ఒత్తిడి తెస్తే ప్రజలలోకి వెళ్తాను అని సంకేతాలు ఇచ్చాడు. మొహమాట పడే సోనియా గాంధీ ఏమి అనలేకపోయింది. దేశ సంక్షోభానికి మార్గాలను సూచించే కోర్ కమిటీ సభ్యులు కూడా రాహుల్‌గాంధీకి అనుకూలంగా చర్యలను సూచించలేకపోయారు. వాస్తవంగా 2009 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం రాహుల్ గాంధీ నాయకత్వంపై యవత పెట్టుకున్న ఆశలను ప్రతిబింబిస్తా యి. ఉత్తరప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలు కూడా ఇవ్వనని ములాయం అంటే రాష్ట్రమంతా పర్యటించి ఒంటరిగా 21 సీట్ల ను రాహుల్‌గాంధీ గెలిపించాడు. డిప్యూటి ప్రధానిగా అయినా 2010లో మన్మోహన్ మంత్రివర్గంలో చేరి ఉంటే ఇప్పుడు రాహు ల్ ఇమేజ్ వేరేగా ఉండేది. కానీ నిర్మాణాత్మకంగా వ్యవహరించక పార్టీలోనే ప్రతిపక్షపాత్ర పోషించి, జీవోలను బహిరంగంగా చించివేయడం, కొన్ని విధానాలను బహిరంగ సభలపై వ్యతిరేకించడం లాంటి పనుల వల్ల ఎలాంటి మేలు జరుగలేదు. మన్మోహనుడు మౌనంగా సీబీఐ ఎంక్వైరీలతో కాంగ్రెస్ పార్టీ పునాదులను కదిలించాడు.

యూపీఏ-1లో లేని కుంభకోణాలు యూపీఏ-2లో తలెత్తాయి. ప్రతి విషయంపై పత్రికలకు లీకులివ్వడం తర్వాత సీబీఐ ఎంక్వైరీ వేయడం పరిపాటయింది. నిజానిజాలపై అంతర్గత పరిశీలన కంటే పార్టీని భ్రష్టు పట్టించడం పైననే శ్రద్ధ పెట్టాడు. 2జి స్కావ్‌ు మీద సీబీఐ ఎంక్వైరీ వేసి రాజాని, కనిమోళిని జైలులో పెట్టారు. 2017లో కోర్టు వారిని నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. రక్షణరంగంలో 80 వేల కోట్ల అవినీతి జరిగిందని అభిషేక్ వర్మ, అంకా వర్మపై సీబీఐ కేసులు పెడితే 2017లో కోర్టు వారిని నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. కామన్ వెల్త్ గేవ్‌‌సు స్కాం, బొగ్గుగనుల కుంభకోణం అని రకరకాల కేసులతో మన్మోహన్ నాయకులకు నిద్ర లేకుండా చేశారు. తాను తప్ప అంతా అవినీతిపరులే అనే విషయాన్ని చెప్పి తన పదవిని కాపాడుకున్నాడు. సందెట్లో సడేమియా లాగా ఒక కేంద్రమంత్రి ఇదే మంచి అవకాశమని ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజకీయపార్టీకి ప్రయోజనం చేకూర్చడానికి రాజశేఖరరెడ్డి మంత్రివర్గ నిర్ణయాలపై సీబీఐ ఎంక్వైరీ వేయించి ఐఏయస్ అధికారులను, మాజీ మంత్రులను, జగన్ మోహన్‌రెడ్డిని జైలులో వేయించాడు. హస్యాస్పద విషయమేమిటంటే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన వ్యక్తిని వదలి ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెల్పుతున్నారని అనుమానించి ఇద్ద రు మహిళా మంత్రులను కూడా కేసులో ఇరికించారు. సీబీఐ ప్రతిష్ఠ దిగజార్చే అనేకచర్యలు తీసుకున్నారు. గమనించాల్సిన విషయమేటంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కేసులు పెడితే మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోర్టులు కేసులు కొట్టి వేశాయి. అంటే ప్రభుత్వం తమ మంత్రివర్గ సభ్యులపై కోర్టులో నిలబడలేని బలహీనమైన కేసులను పెట్టినట్లేగా! కాంగ్రెస్‌పార్టీ ప్రతిష్ఠ దిగజారి 2014 ఎన్నికలలో 44 లోక్‌సభ స్థానాలు మాత్రమే గెల్చుకుంది.

కర్ణుణి చావు కు కృష్ణుడు ఎంతవరకు కారణమయ్యోడో కానీ కాంగ్రెస్‌పార్టీని బలహీనపర్చడంలో మన్మోహన్ సింగ్ విజయం సాధించాడు. రాహుల్‌గాంధీ కార్యాలయం అరాచకుల నిలయం. క్రమశిక్ష ణ, నిబద్ధత, పరిపక్వతలేని వారందరు సమూహంగా చేరారు. వాళ్ళ అహంకారం రాహుల్‌గాంధీ అధికారంలో ఉన్నట్లుగానే ఉంటుంది. అమెరికా నుంచి ఒకరు 2008లో రాజకీయ శిక్షణ సంస్థను స్థాపించాలని ఢిల్లీ వెళ్ళి ఒక్క వారం తిరక్కుండానే విసిగి వేసారి సొనియాగాంధీకి కైంప్లెంట్ ఇచ్చి అమెరికా వచ్చేశాడు. ఆమె తన కార్యాలయం ద్వారా ఎంక్వైరీ చేసి కార్యాలయాన్ని చక్కదిద్దుకొమని సూచించింది. కానీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. రాజీవ్‌గాంధీ కాలం నుంచి పనిచేస్తున్న సీనియర్లకు అపాయింట్‌మెంట్ దొరుకడమే కష్టం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య ఉన్న భేదాభిప్రాయలు అందరికీ తెల్సినవే. ఇప్పటికీ ఆంధ్ర ప్రాంత నాయకుల సలహాలపైననే తెలంగాణలో వ్యవహారాలు నడుస్తున్నాయంటే ఈప్రాంతం పట్ల ఆయనకు అవగాహనే లేదు. సొంత రాష్ట్రంలో అడ్రస్ లేని వారు ఇతర రాష్ర్టాలలో ఇన్‌చార్జిలుగా వచ్చి చెసే హంగామా అంతా ఇంతా కాదు. బీజేపీ, సీపీఎం పార్టీలు కూడా వివిధ రాష్ర్టాలలో అధికారంలో ఉన్నా ఆ పార్టీల ఇన్‌చార్జుల పర్యటన అంతర్గత వ్యవహారంగా ఉంటుంది. కాని ఆర్భాటం ఎక్కడా కన్పించదు. రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్షుడైన తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన యువకుడు సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రాజస్థాన్‌లో పార్టీని అధికారంలోకి తెచ్చాడు. దేశ వ్యాప్తంగా ఓబీసీ యువతలో ఆకర్షణ కల్గిన వ్యక్తి. అతనిని కాదని 68 సంవత్సరాల అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేశారు.

అలాగే మధ్యప్రదేశ్‌లో యువకుడైన జ్యోతిరాదిత్య సింధియాను కాదని 72 సంవత్సరాల కమల్‌నాథ్‌కు పట్టం కట్టారు. ఈ చర్య లు యవతకు పార్టీలో భవిష్యత్తు లేదని, ఢిల్లీలో పైరవీలు చేసుకునే వారికి మాత్రమే అవకాశాలు లభిస్తాయని స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. గత ఎన్నికలలో యువత నరేంద్ర మోదీకి ఎందుకు మద్దతు ఇచ్చారో ఇంకా సమీక్ష జరుపుకున్నట్లు లేదు. 2004లో సోనియా గాంధీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటాను అని సుష్మ స్వరాజ్ బ్లాక్ మెయిల్ చేస్తే, 2010లో మన్మోహన్ సింగ్ గద్దె దిగకుండా రాహుల్ గాంధీకి ప్రధాని పదవిని దక్కకుండా చేశాడు. తల్లి కొడుకులు అన్నీ అర్హతలు ఉండి, పార్టీ ని గెలుపించుకొని కుట్రలకు బలై ప్రధాని పదవి పొందలేక పోయారు. ఇందిరా, రాజీవ్‌ల హత్యలు రాహుల్ గాంధీని తీవ్రం గా కలిచివేసి రాజకీయాల పట్ల, పదవుల పట్ల అనాసక్తిని పెంచా యనే భావన ప్రచారంలో ఉన్నది. కలిసిన వారు అతని వ్యక్తిత్వాన్ని ఎంతగా ప్రశంసిస్తారో అంతగానే అతని రాజకీయ నాయకత్వం పట్ల అనుమానం వ్యక్తం చేస్తారు. కలుషితమైన రాజకీయాలలో నెగ్గుకొని రాలేడనేది ప్రధాన వాదన. మోదీస్థాయికి దిగడానికి ఇష్టపడని వాడు మోదీతో పోటీ నుంచి విరమించుకోవడం మంచిదని ప్రముఖ జాతీయ వ్యాసకర్త ఒకరు అభిప్రాయపడ్డా డు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. కానీ సాధారణ ప్రజలను కదిలించలేకపోతున్నారు. నెహ్రూ కుటుంబం చరిత్ర చెప్పి ప్రజలను సమీకరించే రోజులు పోయా యి. రాహుల్‌గాంధీ టీంలో దూరదృష్టి కలిగిన రాజకీయ వ్యూహ కర్తలు లేరు.
nagender-madavaram
ఓబీసీ సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి పై అనేక అనుమానాలున్నాయి. రాష్ట్రపతి పదవికి ఓబీసీ అభ్యర్థిని ఇంతవరకు ప్రతిపాదించకపోవడం రాజకీయ తప్పిదం. పార్టీలో అవినీతిని కట్టడి చేయకుండా దేశంలో అవినీతిని ప్రక్షాళన చేయడం అసాధ్యం. కొంతమంది పాత తరం నాయకులను చూసి ప్రజలు పార్టీకి ఓటు వెయ్యడంలేదు. మమతా బెనర్జీ కూడా ఇలాంటి నాయకులతో విభేదించి పార్టీని వదిలారు. రాజకీయాలలో అనాసక్తి, పదవిపై కాంక్ష లేనప్పుడు సమర్థులైన యువకులకు పార్టీ బాధ్యతలను ఇచ్చి, సలహాదారుగా పెద్దరికం నిలుపుకోవడం శ్రేయస్కరం.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, వాషింగ్టన్, డిసి.)

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles