కరెంటు ఖర్చుపై కాకిలెక్కలు


Tue,May 14, 2019 01:39 AM

తెలంగాణ జేఏసీ గతేడాది ఓ రౌండ్ టేబుల్ సమావేశం లో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు జలాశయం నిర్మా ణం, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం తెలంగాణ ప్రజలకు తీరని ఆర్థిక భారమని చెప్పుకొచ్చింది! దీంతో సామా న్యులు మొదలు సాగునీటి రంగ ప్రాజెక్టులపై కొంత పరిజ్ఞానం ఉన్నవారిలో కూడా గందరగోళం ఏర్పర్చటానికి ప్రయత్నించా రు. అది వాస్తవమేనా? అసలు నిజాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సమావేశంలో జేఏసీ కన్వీనర్ కాకిలెక్కల ద్వారా కాళేశ్వరం నిర్వహణ ఎకరానికి భారం రూ.72 వేలు, రైతులకు వచ్చేది రూ.10 వేలు మాత్రమేనని చెబుతూ, దీనిలో 25 వేల విద్యుత్ ఖర్చు అని చూపించడం విడ్డూరం. మొదట విద్యుత్ ఖర్చు గురించి చర్చిద్దాం. జేఏసీ లెక్కల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు 4,750 మెగావాట్లు అవసరమని, వాస్తవ లెక్కల ప్రకా రం దానికంటే తక్కువే అనే వాదన ఉన్నది. ఉదాహరణకు 4750 మెగావాట్లు అవసరం ఉన్నదనుకుందాం. మేడిగడ్డ బ్యారేజీ నుంచి గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్లించి పంప్‌హౌజ్ ద్వారా 180 టీఎంసీల నీటిని 90 రోజుల్లో ఎత్తిపోసే విధంగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేయబడింది. వానకాలంలో వివిధ ప్రదేశాల నుంచి ఎత్తిపోయడానికి అవసరమయ్యే విద్యుత్తు ప్రభుత్వ ఖజానాకు భారం లేకుం డా ఏ విధంగా తగ్గించగలమో చర్చిద్దాం.


సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వానితో తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం 152 మీటర్ల ఎత్తుకు నిర్మించదలచి చర్చించడానికి వెళ్తే వారు ఒప్పుకోలేదు. 148 మీటర్లు మించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వల్ల విధిలేని పరిస్థితుల్లో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం తలపెట్టవలసి వచ్చింది. సీఎం కేసీఆర్ చాకచక్యంతో పనులు వేగంగా పూర్తిచేయడానికి కేంద్ర జలవనరుల సంఘం నుంచి అన్ని అనుమతులు పొందడం అభినందనీయం.


1.వానకాలంలో 30 శాతం విద్యుత్ అవసరం తగ్గుతుంది. సాధారణంగా ఏటా వానకాలంలో కొన్ని థర్మల్ ప్లాంట్లు నడుపడం మానేస్తారు. కాబట్టి వానకాలంలో థర్మల్ పవర్ ఉత్పత్తి ఆపకుండా కాళేశ్వరం ఎత్తిపోతలకు మళ్లించి మోటార్లు నడుపడం వల్ల ఖర్చు ఆదా అవుతుంది.

2. 90 రోజుల థర్మల్ పవర్ ఉత్పత్తికి కావలసిన బొగ్గు ఖర్చు మాత్రమే భరించాల్సి ఉంటుంది. మిగతా ఖర్చులు ప్లాంట్లు నడుపకున్నా ఉండేవే. కాబట్టి అదనంగా బొగ్గు ఖర్చు 1 మెగావాట్ ఉత్పత్తికి రోజుకు 14.4 టన్నుల చొప్పున 90 రోజులకు 4,750 మెగావాట్ల ఉత్పత్తికి రూ.1500- టన్ను చొప్పున 91.34 కోట్లు మాత్రమే. అంటే ఎకరానికి రూ.510 మాత్ర మే అవసరమవుతాయి. కాబట్టి విద్యుత్ ఖర్చు ఎకరానికి రూ.25 వేలు అనేది రైతులను, ప్రజలను భయపెట్టే ప్రయత్నమే. ఇది ఆంధ్ర ప్రాంతం వాళ్ల వాదన లాగా కనపడుతున్నది. ఎత్తిపోతలు తప్ప మనకు ఏ మార్గం లేదు. 2002లో స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా బెల్లా విస్టాలో గోదావరి ఎత్తిపోతల పథకం గురించి చర్చాగోష్టి జరిగింది. దానిలో ఈ వ్యాసకర్త కూడా పాల్గొనటం జరిగింది. టి.హనుమంతరావు (విశ్రాంత ముఖ్య ఇంజినీర్) మాట్లాడుతూ ఎత్తిపోతలకు ఎకరానికి దాదాపు రూ.3 వేల విద్యుత్ ఖర్చవుతుందన్నా రు. బంగారం విలువ చేసే పంటలు పండిస్తే తప్ప ఎత్తిపోతల పథకం అమలుకు నోచుకోదని చెప్పగానే నేను తీవ్ర అభ్యంతరం తెలిపాను. కాళేశ్వరం ఎలా ఆచరణ సాధ్యమో తెలిపాను. ఎ.ఎం.ఆర్.ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కింద 2లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ పథకం మొదలయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ నిర్దేశించిన టారిఫ్ ఏడాదికి రూ.400హెచ్.పి. ఈ లెక్క ప్రకారం రూ.200లు మాత్రమే ఖర్చయ్యేది.

కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దురుద్దేశంతో ప్రభు త్వం ఒక యూనిట్‌కు రూ.3 చొప్పున రేటు పెంచేసింది. ఇదివరకు ఉన్న రాయితీని తీసేయడం తెలంగాణ రైతులను మోసం చేయడం కాదా? అందుకే ప్రత్యేక తెలంగాణ కోరుతున్నాం. అని వివరించాను. ఆ తర్వాత వారు మళ్లీ ఎప్పుడు కూడా ఎత్తిపోతల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక భారం అని మాట్లాడలేదు. జేఏసీ కన్వీనర్ ఏడాదికి 47వేలు ఇతర నిర్వహణ ఖర్చులు అని వాదించినట్లు తెలుస్తున్నది. ఆయన గారు విద్యుత్ బోర్డులో పనిచేస్తున్నందువల్ల సాగునీటి ప్రాజెక్టు డి.పి.ఆర్. తయారుచేసే విధానం తెలియనట్లున్నది. కేంద్ర జల వనరుల సంఘం 2010లో గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఆ గైడ్ లైన్ల అనుబంధం 17-20 వరకు బెనిఫిట్స్, కాస్ట్ నిష్పత్తి లెక్కకట్టే విధానాన్ని తెలిపింది. 1. నీటి పారుదల లేనప్పుడు వ్యవసాయ భూమిలో పంట ఉత్పత్తి విలువ, నీటి పారుదల తర్వాత వచ్చే పంట ఉత్పత్తి ద్వారా వచ్చే విలువ, ఈ రెండింటి వ్యత్యాసాన్ని లెక్కిస్తున్నది. 2.తాగునీటి వల్ల వచ్చే సంవత్సరం ఆదాయం, పరిశ్రమలకు అందించిన నీటి వల్ల వచ్చే ఆదాయం, చేపల వల్ల, టూరిజం వల్ల వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తుంది.

3.ప్రాజెక్టులో వివిధ కాంపోనెంట్లకు ఒక్కొక్కదానికి సంవత్సర డిప్రీసియేషన్ కట్టవలసి వస్తుంది. ఉదాహరణకు కొన్నింటికి 1 శాతం, 2 శాతం, 3.3 శాతం, 8.33 శాతం మొదలగు లెక్కలతో మొత్తం డిప్రిసియేషన్ కట్టవలసి వస్తుంది.

4. సంవత్సరపు ఆదాయాన్ని, సంవత్సరపు డిప్రిసియేషన్‌తో భాగిస్తే వచ్చేది బెనిఫిట్ కాస్ట్ నిష్పత్తి. దీని విలువ 1 కంటే ఎక్కువ ఉంటే ప్రాజెక్టు ఆమోదం అవుతుంది. ఈ పద్ధతి కాకుండా కన్వీనర్ ఏటా క్యాపిటల్ మీద వడ్డీని లెక్కగట్టి నిర్వహణ ఖర్చులుగా 47 వేలు చూపించడం తప్పుడు లెక్కలు మాత్రమే.

ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనాల విలువ గురించి...

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా విలువ 2007లో 26 వేల కోట్లు ఉండగా, 2009లో 40వేల కోట్లకు పెరిగింది. అంటే రెండేండ్లలో యాభై శాతం పెరిగింది. 2. 2015లో అంటే ఆరేండ్ల తర్వాత పైన తెలిపిన ప్రాతిపదికన 150 శాతం పెరుగవలసింది. ప్రాణహిత-చేవెళ్ళ అంచనాలు 40 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెరుగవలసి ఉంటుంది.3.కాంగ్రెస్ హయాం లో యూనిట్ రేటు చెల్లింపు పద్ధతిని పక్కనబెట్టి కాంట్రాక్టర్‌కు లాభమయ్యేవిధంగా ఈపీసీ విధానం అవలంబించారు.

ఈపీసీ విధానం-పారదర్శకత లేనిది: ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్‌ను నియమించి నాణ్యతను ప్రైవేట్ కంపెనీతో సర్టిఫికెట్ పొంది, ఇచ్చిన బిల్లును అధికారులు చెల్లించవలసిన విధానం వల్ల అవినీతి జరిగింది. మోటర్లను, తాగునీటి కాలువలను తక్కువ కెపాసిటీకి డిజైన్ చేసి పాదర్శకత లేని పద్ధతి వల్ల ఇబ్బడిముబ్బడి చెల్లింపులు జరిగాయి. యూనిట్ రేట్ చెల్లింపు విధానం-పారదర్శకత కలిగినది: తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈపీసీ విధానం రద్దుచేసి 2014 నుంచి పాత పద్ధతిన నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వమే డిజైన్ చేసింది. సరైన అంచనాలు కట్టి యూనిట్ రేటు చెల్లించే పద్ధతిన టెండర్లు నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ ఇంజినీర్లు కొలతలు తీసి బిల్లులు చెల్లించడం వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా అదనంగా 2 బ్యారేజీలు 2 పంప్‌హౌజ్‌లు కలుపుకున్నప్పటికీ 2015లో మొత్తం అంచనాల విలువ 80 వేల కోట్లు మాత్రమే. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు 2015 నాటికి అంచనా లక్ష కోట్లకు చేరేది. దీంతో తెలిసేదేమంటే ప్రభుత్వ ఖజానాకు భారం పడకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లాభదాయకం. గత ప్రభు త్వం హెడ్ వర్క్స్ పనులు చేపట్టక, కేంద్ర జల వనరుల సంఘం నుంచి అనుమతులు పొందక ఏడేండ్ల కాలయాపన వల్ల తెలంగాణ రైతులకు సాగు నీరందలేదు.
d-bheemaiah
దీంతో అప్పుల పాలై వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వానితో తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం 152 మీటర్ల ఎత్తుకు నిర్మించదలచి చర్చించడానికి వెళ్తే వారు ఒప్పుకోలేదు. 148 మీటర్లు మించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వల్ల విధిలేని పరిస్థితుల్లో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం తలపెట్టవలసి వచ్చింది. సీఎం కేసీఆర్ చాకచక్యంతో పనులు వేగంగా పూర్తిచేయడానికి కేంద్ర జలవనరుల సంఘం నుంచి అన్ని అనుమతులు పొం దడం అభినందనీయం. ఎవరూ ఊహించనివిధంగా ప్రాజెక్టులు పూర్తి వుతుంటే.. ప్రతిపక్షాలు, కుహనా మేధావులు కాకి లెక్కలతో గందర గోళం చేస్తున్నారు. ఇప్పటికైనా అన్నిపార్టీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చే విధంగా కృషి చేయాలి.
(వ్యాసకర్త: సాగునీటిరంగ నిపుణులు)

444
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles