యూపీలో కమలానికి కష్టకాలం

Tue,May 14, 2019 01:39 AM

దేశవ్యాప్తంగా దశలవారీగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటింగ్ సర ళి ఏర్పడబోయే ప్రభుత్వ తీరుకు సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికైతే దేశవ్యాప్తంగా ఏ ఒక్క పార్టీ కి అనుకూల పవనాలు కనిపించకపోవటం విశేషం. ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయటమూ, నిర్దేశిస్తుందన్న నానుడి ఉన్నది. ఇప్పటిదాకా యూపీలో ఐదు దశలుగా జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళి చూస్తే బీజేపీకి వ్యతిరేకం గా అంతర్గతంగా ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రకంపనలే బీజేపీకి తీవ్ర నష్టం కలుగజేసే పరిస్థితులున్నాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే.., ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 2014 ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. అప్పుడు 41శాతం ఓట్లతో బీజేపీ 73 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నది. అలాగే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే ఓటు బ్యాంకుతో 325 సీట్లను గెలుచుకున్నది. ఇది అప్పటి మోదీ హవాను తేటతెల్లం చేస్తున్నది. అయితే ఈ ఐదేండ్ల కేంద్ర అధికారం, రాష్ట్రంలో రెండేండ్లు అధికారంలో ఉన్న తర్వా త ఓటర్లలో మునుపటి స్థితి కానరావటం లేదు. ఓట్లు, సీట్ల రూపంలో బీజేపీకి అనుకూల పరిస్థితి ఏమీ కనిపించటం లేదు. యూపీలో జరిగిన ఐదు దశల పోలింగ్ పరిస్థితిని ఒక్కోస్థానం వారీగా అధ్యయనం చేసినా పరిస్థితేమీ భిన్నంగా లేదు. బీజేపీకి అనుకూల పరిస్థితులు కనిపించటం లేదు. ఈ క్రమంలో మా అధ్యయనం, పరిశీలన ప్రకారం.. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి 40 నుంచి 55 సీట్లను గెలుచుకోవచ్చు. అదే క్రమంలో బీజేపీ మాత్రం 15 నుంచి 25 సీట్లకే పరిమితం కావచ్చు. ఏ విధంగా బీజేపీకి కలిసివచ్చినా 30 సీట్లకు మించే పరిస్థితులు కనిపించ టం లేదు. ఈ నేపథ్యంలోంచి చూస్తే కాంగ్రెస్ 5 నుంచి 9 సీట్లకు పరిమితం కావచ్చు. నిజాయితీగా మాట్లాడుకుంటే బీజేపీ ఓట్ల శాతం 3 నుంచి 5 శాతం తగ్గిపోతున్న స్థితి ఉన్నది. ఎన్నికల్లో ఓటింగ్ సరళి అనేక అంశాలపై ఆధారపడుతున్నది.

యూపీలో ఏ మూలన పరిశీలించిన ఓటర్ల మనోభావాలు గతంతో పోలిస్తే విభిన్నంగానూ, ఊహించని విధంగానూ ఉన్నట్లు గోచరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే నేను అయోద్య పర్యటించాను. అక్కడి ఓటర్ల మనోభావాలను పరిశీలిస్తే.. వారంతా ఒకటే అడుతున్నారు. బీజేపీ కేంద్రంలో ఐదేండ్లు, రాష్ట్రంలో రెండేండ్లు అధికారంలో ఉన్నది. అయినప్పుడు రామమందిర నిర్మాణంలో ఎందుకు పురోగతి సాధించలేదు? అన్నది అందరి నుంచి వస్తున్న ప్రశ్న! దీనికి బీజేపీ వర్గాల నుంచి సరైన, ప్రజలను మెప్పించే సమాధానం ఉన్న స్థితి లేదన్నది వాస్తవం.


ఒక్కో సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఒక ప్రత్యేక అంశంపై ఆధారపడి నిర్ణ యం తీసుకుంటున్నారు. ముఖ్యంగా సామాజికవర్గం, కులం, మతం, ప్రాంతం, భావజాలం తదితర అంశాలు ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. వాటికి అనుగుణంగానే ప్రజలు స్పందించి ఓటును ప్రయోగిస్తున్నారు. అలాగే పార్టీల పరిస్థితి, వారి విధానం, భావజాలం కూడా ప్రధాన అంశంగా ఉంటున్నది. బీజేపీ తనదైన ప్రత్యేక భావజాలంతో ప్రత్యేక వర్గం మద్దతును కూడగట్టుకుంటున్నది. ముఖ్యం గా నరేంద్ర మోదీని తిరుగులేని నేతగా ఆమోదించే వర్గం మద్దతుతో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది. వారు నరేంద్రమోదీని దేశంలోనే అం దరికన్నా మిన్న అయిన నేతగా భావిస్తారు. మరోవైపు మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వర్గాల మద్దతును కూడగట్టేందుకు మోదీ ఆకర్షణా శక్తిని వినియోగిస్తున్నారు. ఈ అన్నిరకాల అంశాల ప్రభావంతోనైనా బీజేపీ ఈసారి నష్టపోతున్న దానికన్నా లాభం పొందుతున్నది తక్కువగానే ఉంటున్నది. ఈ నేపథ్యంలోంచే బీజేపీ ఓబీసీలను, యాదవేతరులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా వారిపైనే ఆధారపడుతున్నది. అంతేకాకుండా ఈ వర్గాల నుంచి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లను వీడి బయటకు వచ్చిన వారిని తమ అభ్యర్థులుగా ప్రకటించి ప్రజా సమూహాల నుంచి ఓట్లను పొందేందుకు పావులు కదుపుతున్నది. యాదవులు, జాతవులు అధికారంలో ఉండి వివిధవర్గాలకు అధికారం లో వాటా దక్కటం లేదన్న దానితో అసంతృప్తిగా ఉన్న వర్గాలను కూడగట్టి తమ వైపు బీజేపీ తిప్పుకుంటున్నది. ఇప్పటికే రాష్ట్రంలో స్పష్టమైన రాజకీయ సమీకరణాలకు సామాజికవర్గాలను భూమికగా చేసుకొని బీజే పీ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నది. దేశంలో ఇందిరాగాంధీ తర్వాత కేంద్రీకృత అధికారాన్ని చెలాయిస్తు న్న వారు నరేంద్రమోదీ మాత్రమే. ఈ క్రమంలో పార్లమెంట్ సభ్యులకు ఢిల్లీలో చాలా పరిమితమైన అధికారం మాత్రమే ఉంటున్నదన్న వాదనలూ ఉన్నాయి.

2014 ఎన్నికల్లో సమాజంలోని అన్నివర్గాల నుంచి అన్ని కులమతాలకు అతీతంగా బీజేపీకి మద్దతుగా నిలిచారు. మోదీ నాడు దేశ ప్రజలందరికీ ఆర్థికపరమైన మంచి రోజులొస్తాయని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా విశ్వసించారు. కానీ ప్రజలు ఊహించినదానికి భిన్నంగా పెద్దనోట్ల రద్దుతో ఆయనపై పెద్ద పిడుగు పడింది. చిన్న వ్యాపారస్తులు మొదలు సాధారణ కుటుంబాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ సాధారణ ప్రజలు తమ పూరిగుడిసెల్లో దాచుకున్న సొమ్ము విలువ లేనిదిగా మారిపోయింది. దీంతో దైనందిన నిత్యావసరాలకు కూడా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.


యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. అయితే యోగీ ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత బీసీల్లో మద్ద తు పెరుగటం ఆశ్చర్యం. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతూ, ఠాకూర్ల ప్రభావం అధికం అవుతున్నది. వాస్తవమో కాదో కానీ బ్రహ్మణవర్గాల ఓట్లు కూడా బీజేపీకి దూరమైనట్లు తెలుస్తు న్నది. మరోవైపు చివరి ఎత్తుగడగా బీజేపీ సిట్టింగ్ అభ్యర్థులను మార్చ టం కూడా పెద్దగా ఉపయోగపడుతున్న స్థితి కనిపించటం లేదు. అలా గే.. కుర్మీలు, కుశావహులు కూడా ఈసారి బీజేపికి అనుకూలంగా ఉన్న ట్లు కనిపించటం లేదు. మారిన పరిస్థితుల్లో ఈ వర్గాలు ఎస్పీ-బీఎస్పీ కూటమి వైపు మొగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈసారి నిషాదులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. యూపీలో ఏ మూలన పరిశీలించిన ఓటర్ల మనోభావాలు గతంతో పోలిస్తే విభిన్నంగానూ, ఊహించని విధంగానూ ఉన్నట్లు గోచరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే నేను అయోద్య పర్యటించాను. అక్కడి ఓటర్ల మనోభావాలను పరిశీలిస్తే.. వారంతా ఒకటే అడుతున్నారు. బీజేపీ కేంద్రంలో ఐదేండ్లు, రాష్ట్రంలో రెండేండ్లు అధికారంలో ఉన్నది. అయినప్పుడు రామమందిర నిర్మాణంలో ఎందుకు పురోగతి సాధించలేదు? అన్నది అందరి నుంచి వస్తున్న ప్రశ్న! దీనికి బీజేపీ వర్గాల నుంచి సరైన, ప్రజల ను మెప్పించే సమాధానం ఉన్న స్థితి లేదన్నది వాస్తవం. అన్నింటికన్నా ముఖ్యమైన పరిణామం ఏమంటే.. గత ఎన్నికల్లో మహిళా ఓటర్లంతా బీజేపీ వైపు నిలిచారు. వారిప్పుడు పూర్తిగా దూరమైన దాఖలాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో సమాజంలోని అన్నివర్గాల నుంచి అన్ని కులమతాలకు అతీతంగా బీజేపీకి మద్దతుగా నిలిచారు. మోదీ నాడు దేశ ప్రజలందరికీ ఆర్థికపరమైన మంచి రోజులొస్తాయని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా విశ్వసించారు.
narendra-nag
కానీ ప్రజలు ఊహించినదానికి భిన్నంగా పెద్దనోట్ల రద్దుతో ఆయనపై పెద్ద పిడుగు పడింది. చిన్న వ్యాపారస్తులు మొదలు సాధారణ కుటుంబాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ సాధారణ ప్రజలు తమ పూరి గుడిసెల్లో దాచుకున్న సొమ్ము విలువ లేనిదిగా మారిపోయింది. దీంతో దైనందిన నిత్యావసరాలకు కూడా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక గోరక్షణ పేరుతో గ్రామీణ భారతానికి అయిన గాయం ఉండనే ఉన్నది. మహిళలకు, పేదలకు ఉద్దేశించి ప్రవేశపెట్టిన పథకాలు గ్రామీణ ప్రజలకు చేరలేదు. ఈ అన్నిరకాల ప్రభావాల కారణంగానే ఈవేళ సామాజిక సమూహాలన్నీ బీజేపీకి దూరమైన స్థితి ఉన్నది. ఈ సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోంచే సామాజిక శ్రేణుల్లో బీజేపీ వ్యతిరేక ప్రకంపనలు అంతర్లీనంగా ప్రవహిస్తున్నాయి. సహజ, సాధారణ పరిస్థితుల కారణంగానే ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా నిలుచున్నారు. దళితులు, యాదవులు కలిసికట్టుగా బీజేపీకి వ్యతిరేక కూటమి వైపు నిలుచున్న స్థితి ఉన్నది. ఈ అన్ని పరిస్థితుల్లోంచి చూస్తే బీఎస్పీ-ఎస్పీ కూటమి విజయం వైపు దూసుకుపోతున్న స్థితి విస్పష్టంగా కనిపిస్తున్నది.ఇది తూర్పు యూపీలో మరింత స్పష్టంగా బీజేపీ వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ అధ్యయనంతో వచ్చిన అభిప్రాయం ఒక శాస్త్రీయ సామాజిక అధ్యయనంతో ఏర్పర్చుకున్నదే. ప్రతీ నియోజకవర్గంలో సామాజిక సమూహాలన్నింటినీ అధ్యయనం చేసి అంచనాకు వచ్చిన ఫలితం ఇది. అయితే ఈ అన్ని సామాజికార్థిక మూలాలను కాదనే ప్రభావితం చేసే ప్రచండమైన మరో కారణమేదైనా వస్తే తప్ప, ఇందులో అద్భుతాలేమీ ఉండదన్నది మా ప్రగాఢ విశ్వాసం.
(ది వైర్ సౌజన్యంతో..)

392
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles