విద్యాకాంతులు

Wed,May 15, 2019 01:10 AM

రాష్ట్ర అవతరణ తర్వాత సమస్త రంగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుతూ దూసుకుపోతున్న తెలంగాణ విద్యారంగంలోనూ గుణాత్మక మార్పును సాధించింది. పదో తరగతి ఫలితాల్లో మున్నెన్నడూ లేనివిధంగా 92.43శాతం ఉత్తీర్ణతతో ప్రత్యేకతను చాటడం ముదావహం. ఎప్పటిలాగే పదో తరగతి ఉత్తీర్ణతా శాతంలో బాలికలే పై చేయి సాధించారు. మొత్తంగా చూస్తే పదో తరగతి ఫలితాలు గతేడాదితో పోలిస్తే ఈసారి 8.65 శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదై విద్యాప్రగతిని చాటిచెప్పాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,374 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదై ప్రభు త్వ రంగంలో విద్యావికాసానికి తార్కాణంగా నిలిచాయి. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 99.73 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లా వరుస గా మూడోసారి అగ్రస్థానంలో నిలువగా, హైదరాబాద్ అట్టడు గున ఉండటం గమనార్హం. పాఠశాల విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిచ్చి అన్నివర్గాల విద్యార్థులకు ఉన్న త ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నది. దీనిలో భాగంగానే బడుగు బలహీనవర్గాల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం ప్రత్యేక వసతి గృహ పాఠశాలలు, మైనారిటీ వర్గాల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాల లు స్థాపించి సమస్త వర్గాల్లో విద్యాభివృద్ధికి చేసిన కృషికి నిదర్శనంగా పదో తరగతి ఫలితాలను చెప్పుకోవచ్చు. విద్యాభివృద్ధి రాశిలోనే కాదు వాసిలోనూ స్పష్టంగా కనిపిస్తున్నది. కేవలం బట్టీ చదువులు కాకుండా నూతనంగా ప్రవేశపెట్టిన సీసీఈ పద్ధతిలో అత్యధిక జీపీఏ పాయింట్లు సాధించడం పాఠశాల విద్యలో వచ్చిన గుణాత్మక మార్పునకు నిదర్శనం. గత ఏడాది పదో తరగతిలో 4,768 మంది మాత్రమే పది జీపీఏ సాధిస్తే, ఈ ఏడాది 8,676 మంది ఈ ఘనతను సాధించారంటే విద్యలో వచ్చిన గుణాత్మక మార్పును అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువ మందికి తెలియని విషయమేమంటే రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయ్యేది కేవలం దస్తావేజులు మాత్రమే. స్థిరాస్తి హక్కుల టైటిల్‌ను నమోదు చేసే అధికారం రిజిస్ట్రార్లకు లేదు.రాష్ట్ర ప్రభుత్వం గత యాభై ఏండ్లలో లేని విధంగా ఈ ఐదేండ్లలో రెట్టింపు సంక్షేమ హాస్టళ్లు, వివిధ వర్గాలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి బడి ఈడు పిల్లలంతా తరగతి గదిలోనే ఉండేట్లు చర్యలు తీసుకున్నది. దీంతో రాష్ట్రంలో ఇది వరకు బడికిపోని సమస్తవర్గాల పిల్లలంతా విద్యాబుద్ధులు నేరుస్తున్నారు. తెలంగాణ సమాజ సమగ్రాభివృద్ధికి పునాదిగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యతో వేసిన తొలి అడుగులు విజయవంతమయ్యాయనటంలో ఎటువంటి సందేహం లేదు. పాఠశాల విద్య పదో తరగతి ఫలితాలతో ప్రారంభమైన ఈ విద్యాకాంతులు తెలంగాణ సమాజాన్ని తేజోవంతం చేస్తాయి.


సమాజాభివృద్ధి కొలమానాలలో అక్షరాస్యతకున్న ప్రాధాన్యం విస్మరించలేనిది. అయినా స్వాతంత్య్రానంతర కాలంలో ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ అనేక ప్రాంతాలు విద్యావ్యాప్తిలో ఎంతో వెనుకబడి ఉండటం విషాదకరం. విద్యాభివృద్ధి కోసం ప్రణాళికల్లో కేటాయింపులు కూడా కంటితుడుపుగానే ఉం టున్నాయన్న విమర్శ కూడా ఉన్నది. అయితే మిగతా సామాజికాభివృద్ధిని పట్టించుకోకుండా విద్యారంగ అభివృద్ధి మాత్రమే సాధ్యం కాదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోపాటు పాఠశాల విద్య లో విప్లవాత్మక మార్పును సాధిస్తున్నది. ఐదేం డ్ల కాలంలో విద్యావికాసం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి. గతంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అంటే కనీస సౌకర్యాలు లేకుం డా ఉండే హాస్టల్ భవనాలతో పాటు, నీళ్ల చారు, పురుగుల అన్నం అన్నట్లుగా ఉండేవి. ప్రతి విద్యార్థికి అన్నం కూరలు కొలిచి పెట్టేవారు. దీంతో విద్యార్థులు సగం కడుపునకు తిని ఆకలితో అలమటించేవారు. ఈ కడు హీనమైన పరిస్థితుల నేపథ్యంలో ఎంతోమంది విద్యార్థులు హాస్టళ్లలో ఉంటూ చదువులు కొనసాగించలేక ఇంటికి పారిపోయి బాలకార్మికులుగా మారిన దుస్థితి ఉండేది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సన్న బియ్యంతో విద్యార్థికి కడుపునిండా భోజనం పెట్టడానికి చర్యలు తీసుకున్నది. నిర్దిష్టమైన మెనూతో పౌష్టికాహారం అందిస్తూ విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దృఢం గా, ఆరోగ్యకరంగా ఉండేట్లు విద్యార్థులను తీర్చిదిద్దే కార్యక్రమం ఓ మహా యజ్ఞంలా సాగుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం గత యాభై ఏండ్లలో లేని విధంగా ఈ ఐదేండ్లలో రెట్టింపు సంక్షేమ హాస్టళ్లు, వివిధ వర్గాలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి బడి ఈడు పిల్లలంతా తరగతి గదిలోనే ఉండేట్లు చర్యలు తీసుకున్నది. దీంతో రాష్ట్రంలో ఇది వరకు బడికిపోని సమస్తవర్గాల పిల్లలంతా విద్యాబుద్ధులు నేరుస్తున్నారు. తెలంగాణ సమాజ సమగ్రాభివృద్ధికి పునాదిగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యతో వేసిన తొలి అడుగులు విజయవంతమయ్యాయనటంలో ఎటువంటి సందేహం లేదు. పాఠశాల విద్య పదో తరగతి ఫలితాలతో ప్రారంభమైన ఈ విద్యాకాంతులు తెలంగాణ సమాజాన్ని తేజోవంతం చేస్తాయి. పదవ తరగతి పరీక్షా ఫలితాలు రాగానే అత్యధిక మార్కులకు ప్రాధాన్యమిచ్చిన వార్తలు వెలువడటం సాధారణమే. ఇందులో తప్పేమీ లేనప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు అత్యధిక మార్కులనే విద్యార్థి ప్రతిభకు గీటురాయిగా ప్రచారం చేయడం ద్వారా వికృత పోడకలకు దారులు తెరిచా యి. ఈ అత్యధిక మార్కుల ప్రచారం పాఠశాల విద్యారంగాన్ని పరీక్షల చుట్టూ తిప్పే ప్రమాదం ఉన్నది. ఇది చేప పిల్లలకు చెట్టు ఎక్కడంలో పోటీ పెట్టినట్టుగా మారకూడదు. ఒక్కో విద్యార్థిలో ఒక్కో విధమైన కౌశలం, జ్ఞానం ఉంటుంది. విద్యా బోధన వాటిని వెలికితీసేదిగా ఉండాలె. వ్యక్తిత్వ నిర్మాణం, విలువలకు ప్రాధాన్యం ఇచ్చేదిగా మన విద్యావిధానం వృద్ధి చెందాలె.

213
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles