ఎంతో కష్టం.. మరెన్నో లాభాలు

Thu,May 16, 2019 12:02 AM

భూమి హక్కుకు ప్రభుత్వ హామీ-2

farmers
ప్రస్తుతం ఉన్న ప్రిజంప్టివ్ టైటిల్ స్థానంలో కంక్లూజివ్ టైటిల్‌ను ప్రవేశపెట్టడం రెండు దశల్లో సమాంతరంగా చేయవలసి ఉంటుంది. మొదటి దశలో ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్న స్థిరాస్తి ప్రిజంప్టివ్ టైటిల్‌ను కంక్లూజివ్ టైటిల్‌గా మార్చడం. రెండవ దశలో ఆ తర్వాత జరిగే భూ యాజమాన్య హక్కులు బదలాయింపులకు కంక్లూజివ్ టైటిల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అనువర్తింపజేయడం. ప్రజలకు ఇబ్బం ది లేకుండా ఉండాలంటే ఈ రెండు దశల్లోని మార్పులను ఒకదాని తర్వాత మరొకటి కాకుండా సమాంతరంగా చేయవలసి ఉంటుంది. మొదటిది కష్టసాధ్యమైనది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్థిరాస్తి రికార్డులు సక్రమంగా, సమగ్రంగా లేవు. వివిధ శాఖల రికార్డుల మధ్య వ్యత్యాసాలున్నాయి. ఏ శాఖ పరిధిలోకి రాకుండా నోటరీ ద్వారా, సాదాబైనామాల ద్వారా జరిగిన లావాదేవీలున్నాయి. కొన్ని ఆస్తుల రికార్డుల్లోని వ్యక్తులు, వాస్తవంగా స్వాధీనంలో ఉన్న వ్యక్తులు వేర్వేరుగా ఉం టారు. రికార్డుల ప్రకారం ఉన్న విస్తీర్ణం, హద్దులు క్షేత్రస్థాయిలో అధీనంలో ఉన్న వివరాలు భిన్నంగా ఉండవచ్చు. న్యాయ వివాదంలో ఉన్న కొన్ని స్థిరాస్తుల వివరాలు సంబంధిత శాఖకు తెలియకపోవచ్చు. అయితే మొత్తం రికార్డుల్లో వీటి సంఖ్య చాలా పరిమితంగా అంటే పది శాతానికి లోబడి ఉండవచ్చు. వివిధ శాఖల మధ్య ఉన్న భూ రికార్డులను సమన్వయపరిచి, సరిచేసినట్లయితే కొంతవరకు సమస్య పరిష్కారమవుంతుంది. భూ రికార్డుల ప్రక్షాళన ఇదివరకే మొదలైంది కనుక మరింత సులువుగా జరిగే అవకాశం ఉన్నది. అట్లాగే గ్రామస్థాయిలో గ్రామసభ లు, పట్టణాల్లో వార్డుస్థాయి, బస్తీ స్థాయిల్లో సభలను రెవెన్యూ పంచాయతీ, మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించి హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య హక్కులకు సంబంధించి స్వల్ప వివాదాలను, సమస్యలను చట్టపరిధిలో పరస్పర అంగీకారంతో తీర్మానాలతో పరిష్కరించవచ్చు.

కంక్లూజివ్ టైటిల్ విధానం అమలవుతున్న దేశాలు, రాష్ర్టాల్లో ఈ విధానం ఎట్లా పనిచేస్తున్నదీ, దాన్ని మన రాష్ట్రంలో అమలుచేయడంలోని సాధకబాధకాలు ఏమిటి, మన రాష్ట్ర స్థితిగతులకు అనుగుణంగా ఈ విధానంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి మొదలైన అంశాల పరిశీలనకు ఆయా దేశాలు, రాష్ర్టాలను అధికారులు, నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.


ఈ రకంగా వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని ప్రక్షాళన చేసి సమన్వయపరిచి, సరిచేసి ఆ సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి, నిర్ణీత గడువులో అభ్యంతరాలను స్వీకరిం చి పరిష్కరించాలి. తర్వాత వివాదాలకు తావులేని భూ రికార్డులకు కం క్లూజివ్ టైటిల్ ఇవ్వవచ్చు. ఒక్కసారి కంక్లూజివ్ టైటిల్‌ను ఇచ్చిన స్థిరాస్తు ల యాజమాన్యపు హక్కుల తదుపరి బదలాయింపులను కంక్లూ జివ్ టైటిల్ రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా మాత్రమే కొనసాగించాలి. ఇప్పుడై నా దస్తావేజు రిజిస్ట్రేషన్ లేదా రికార్డింగ్ పద్ధతిని రద్దుపరిచి దాని స్థానం లో టైటిల్ రిజిస్టరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి సూరజ్‌ఖాన్ (వర్సెస్) ఫైనాన్షియల్ కమిషనర్ ఇతరులు (2007) (6) (186) దావా విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెవెన్యూ రికార్డులు శిస్తులకు ఉద్దేశించబడినవి తప్ప ఆ ఎంట్రీల వల్ల ఎటువంటి యాజమాన్యపు హక్కులు సంక్రమించవు. యాజమాన్యపు హక్కులను కేవలం అధీకృత (Competent) సివిల్ కోర్టు మాత్రమే నిర్ణయిస్తుంది. అందుచేత ప్రిజంప్టివ్ టైటిల్‌ను కంక్లూజివ్ టైటిల్‌గా మార్చే క్రమంలో వాటికి చట్టబద్ధత కలిగించేలా సివిల్ చట్టాలను ఎవిడెన్స్ చట్టాలను మార్చవలసి ఉంటుంది. అట్లాగే కంక్లూజివ్ టైటిల్ రిజిస్ట్రేషన్ పద్ధతికి టైటిల్ రిజిస్టరింగ్ అధికారుల నియామకానికి అనుగుణంగా చట్టాలను సవరించాలి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ జిల్లాకో రెవెన్యూ కోర్టు ఉండాలని అభిలషించారు. ఆ రెవెన్యూ కోర్టు లేదా సివిల్ కోర్టు స్థాయిలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ కోర్టులను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి వాటిద్వారా ప్రిజంప్టివ్ కంక్లూజివ్ టైటిల్ హెూదా కల్పించవచ్చు. వివాదాస్పదమైన లేదా వ్యత్యాసాలతో కూడిన స్థిరాస్తి రికార్డుల విషయంలో కొంత నింపాదిగా, జాగ్రతగా, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది.

ప్రస్తుతం లోపభూయిష్టమైన స్థిరాస్తి రికార్డులు ఉన్నవారికి ఈ క్రమంలోమెరుగైన కంక్లూజివ్ టైటిల్ రావడం వల్ల వాటిద్వారా రుణాలు పొందడానికి, అవసరమైనప్పుడు నాణ్యమైన, న్యాయమైన విలువలకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. న్యాయపరమైన చిక్కులు తొలిగి, స్పష్టమైన హక్కులున్న ఎక్కువ భూములు అందుబాటులోకి రావడం వల్ల భూములు ధరల్లో స్థిరీకరణ వస్తుంది. ఇప్పటిలాగా భూములు ధరల్లో అకస్మాతుగా చోటుచేసుకునే ఎగుడు దిగుడులు ఉండవు.


ఆ వివాదాలు లేదా రికార్డులను జిల్లా స్థాయిలోని రెవెన్యూ కోర్టు లేదా ల్యాండ్ ట్రైట్లింగ్ ట్రిబ్యునల్ నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించి కంక్లూజివ్ టైటిల్ ఇచ్చే విధంగా చర్యలకు పూనుకోవాలి. ఆ తర్వాత కూడా ఏవైనా వివాదాలు అపరిష్కృతంగా ఉండి ఎవరై న కంక్లూజివ్ టైటిల్ వల్ల నష్టపోయినట్లు భావించినా తర్వాతి విచారణ కోసం రాష్ట్రస్థాయిలో లేదా జోనల్ స్థాయిలో అప్పీల్ నిమిత్తం లాండ్ టైట్లింగ్ అప్పలేట్ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయవచ్చు. ఆ పైన హైకోర్టు, సుప్రీంకోర్టు ఎట్లాగూ ఉండనే ఉన్నాయి. మొదటి దశ చాలా వ్యయప్రయాసలతో, న్యాయపరమైన అంశాలతో కూడుకున్నది. ఒక్కసారి కంక్లూజివ్ టైటిల్ ఇచ్చిన తర్వాత పాత ప్రిజంప్టివ్ టైటిల్ రికార్డులు చెల్లుబాటు కావు. కాబట్టి ఇబ్బడిముబ్బడిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి విస్తృమైన ప్రచారం కలిగించాలి. చట్టాల పట్ల సరైన అవగాహన ఉండే అవకాశం లేనివారు, సరైన పత్రాల్లేకుండా అధీనంలో ఉండే సన్న, చిన్నకారు రైతులు; బస్తీలలో, మురికి వాడలలో నోటరీలు, సాదాబైనామాలతో రికార్డుల్లో లేని స్వల్ప విస్తీర్ణతలు గల ఇళ్లను కొనుగోలు చేసినవారు ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. వారికి సరైన ప్రచారం, అవగాహన, న్యాయ సహాయం సకాలంలో అందించాలి. కంక్లూజివ్ టైట్లింగ్ చట్టం రాష్ట్రస్థాయిలో రూపొందించినట్లయితే భారత ప్రభుత్వం అనుమతిని పొందవలసి ఉంటుంది. అట్లాగే ఆస్తి బద లాయింపు చట్టం (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్), రిజిస్ట్రేషన్ చట్టం, భారత స్టాంపుల చట్టం, ఎవిడెన్స్ యాక్ట్‌లో అవసరమైన సవరణలు పొందుపరిచే చర్యలు చేపట్టాలి. రికార్డులను ఆధునీకరించడం, కంప్యూటరీకరించడం ప్రజలకు అం దుబాటులో ఉంచడం అత్యవసరం. ఇందుకోసం ఉద్దేశింపబడినదే కేం ద్ర ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టిన జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ పథకం (NLRMP).

మొదటి దశ చాలా వ్యయప్రయాసలతో, న్యాయపరమైన అంశాలతో కూడుకున్నది. ఒక్కసారి కంక్లూజివ్ టైటిల్ ఇచ్చిన తర్వాత పాత ప్రిజంప్టివ్ టైటిల్ రికార్డులు చెల్లుబాటు కావు. కాబట్టి ఇబ్బడిముబ్బడిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి విస్తృమైన ప్రచారం కలిగించాలి. చట్టాల పట్ల సరైన అవగాహన ఉండే అవకాశం లేనివారు, సరైన పత్రాల్లేకుండా అధీనంలో ఉండే సన్న, చిన్నకారు రైతులు; బస్తీలలో, మురికి వాడలలో నోటరీలు, సాదాబైనామాలతో రికార్డుల్లో లేని స్వల్ప విస్తీర్ణతలు గల ఇళ్లను కొనుగోలు చేసినవారు ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. వారికి సరైన ప్రచారం, అవగాహన, న్యాయ సహాయం సకాలంలో అందించాలి.


కొద్దిపాటి మార్పుచేర్పులతో దీన్ని ఇప్పుడు డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ పథకం (DILRMP)గా అమలు చేస్తున్నారు. దీన్ని త్వరితగతిన మన రాష్ట్రంలో పూర్తిచేయాలి. కంప్యూటరీకరణ ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందనేది అపోహ మాత్రమే. సరైన ల్యాండ్ రికార్డులను పొందుపరుచడం ముఖ్యమైన అం శం. తప్పుడు రికార్డులను ఫీడ్ చేస్తే తప్పుడు సమాచారమే వస్తుంది. అం దుకే చిత్తశుద్ధి, నిజాయితీ, అంకితభావం, సమయపాలన, సానుకూల దృక్పథం ఉన్న అధికారయంత్రాంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇవన్నీ జరిగే సమయంలోనే సమగ్ర భూ సర్వేను నిర్వహించి ప్రతి స్థిరాస్తి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కేడస్టల్ మ్యాప్ (cade -stral maps)ను తయారుచేయవలసి ఉంటుంది. కెడస్టల్ మ్యాప్‌లో ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో (సర్వే నంబర్, సబ్ డివిజన్ నెంబర్ మొదలైనవాటితో కూడిన సంఖ్య) యజమాని పేరు, విస్తీ ర్ణం, హద్దులు, నైసర్గిక స్వరూపం వ్యవసాయ యోగ్యత, దారులతో అనుసంధానత రెవెన్యూ రిజిస్ట్రేషన్ దస్తావేజుల వివరాలు, న్యాయ వివాదాలు మొదలగునవి ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలం అయితే యాజమాని పేరు, విస్తీర్ణంతోపాటు రిజిస్ట్రేషన్ దస్తావేజులు, మున్సిపల్ పంచాయతీ రికార్డుల వివరాలు, న్యాయవివాదాల లాంటివి ఉంటాయి. భవన నిర్మాణాల విషయంలో వీటితోపాటు భవన విస్తీర్ణాన్ని కూడా జతపరుచాలి. సమగ్ర భూ సర్వేను ఒక తంతులా కాకుండా చిత్తశుద్ధితో జిఐయస్ వంటి అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని వినియోగిస్తూ ఉపగ్రహ ఛాయాచిత్రాల సహకారంతో కొనసాగించాలి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రతి స్థిరాస్తిని భౌతికంగా పరిశీలిస్తూ శాస్త్రీయంగా క్రమ పద్ధతిలో చేయవలసి ఉంటుంది.

లిటిగేషన్లు లేని భూములు అందుబాటులో రావడం వల్ల రియాల్టీ రంగం మరింత వృద్ధి చెందుతుంది. దేశీ, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. భూ ఆక్రమణలు, లాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మోసాలు, నేరాలు, తగ్గుతాయి. బినామీ లావాదేవీలు, నల్లధనం తగ్గిపోతాయి. ఆ మేరకు ప్రభుత్వ ఇమేజ్ పెరుగుతుంది. సమాజంలో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయి.


మొదటి దశ అంటే ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్న ప్రిజంప్టివ్ రికార్డుల ను ప్రక్షాళనచేసి, పరిష్కరించి, కంక్లూజివ్ టైటిల్ ఇచ్చిన తర్వాత రెండవ దశ అనగా తదనంతరం జరిగే స్థిరాస్తి యాజమాన్య బదలాయింపులకు కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం కష్టమేమీ కాదు. స్వచ్ఛందంగా జరిగే బదలాయింపులు మ్యుటేషన్లు సునాయాసంగా జరిగిపోతాయి. కోర్టు డిగ్రీ లు, న్యాయపరమైన అంశాలతో కూడి ఉన్న బదలాయింపుల్లో నిర్ణీత పద్ధతి, పరిశీలన తర్వాత కంక్లూజివ్ టైటిల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ పరివర్తన ఎటువంటి అవరోధాల్లేకుండా చివరివరకూ సాగిపోవడానికి అవసరమైన రాజకీయ దృఢ సంకల్పం మన తెలంగాణలో ఉన్న ది. అయితే ఇందులో ఉద్యోగ యంత్రాంగం పాత్ర గణనీయంగా ఉం టుంది. సహజంగా అధికార యంత్రాంగంలో జడత్వం ఉటుంది. మార్పును అంత త్వరగా స్వాగతించరు. దీనికి కారణాలు అనేకం. వాటి ని ఇక్కడ విశ్లేషించదలుకుకోలేదు. తగు ప్రేరణ, శిక్షణ, ప్రోత్సాహకాల తో ఉద్యోగుల సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందింపజేయాలి. ఇప్పటికే కంక్లూజివ్ టైటిల్ విధానం అమలవుతున్న దేశాలు, రాష్ర్టా ల్లో ఈ విధానం ఎట్లా పనిచేస్తున్నదీ, దాన్ని మన రాష్ట్రంలో అమలు చేయడంలోని సాధకబాధకాలు ఏమిటి, మన రాష్ట్ర స్థితిగతులకు అనుగుణంగా ఈ విధానంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి మొదలైన అంశాల పరిశీలనకు ఆయా దేశాలు, రాష్ర్టాలను అధికారులు, నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొత్తం కార్యాచరణకు ఆయ్యే వ్యయం వందల కోట్లలో ఉంటుం ది. కంక్లూజివ్ టైటిల్ ఇచ్చిన తర్వాత ఏదైన కారణం చేత టైటిల్‌దారుడు నష్టపోతే ప్రభుత్వం చెల్లించవలసిన పరిహారం సంగతి కూడా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఈ వ్యయం కూడా తోడైతే భారంగా పరిణమించవచ్చు. నిజానికి స్థిరాస్తి నేడు ఎంతో విలువైనది.

కుంక్లూజివ్ టైటిల్ దాని విలువను మరింత పెంచుతుంది. కాబట్టి స్థిరాస్తి ఉన్నవారికి భద్రత, బీమా కలిగించే మరిం త మెరుగైన కంక్లూజివ్ టైటిల్ ఇస్తున్నందుకుగాను అందుకు అవసరమై న డబ్బు ఆస్తి యాజమానులే చెల్లించడం సమంజసం, న్యాయం. వ్యవసాయ భూములకు సంబంధించి సన్న, చిన్నకారు రైతులు నివాస గృహా లు; ప్లాట్లయితే పేదవారు నివసించే స్వల్ప విస్తీర్ణం (ఉదాహరణకు 100 గజాల్లోపు), మురికివాడలు మొదలైన వాటిని మినహాయించి, మిగతావారికి కంక్లూజివ్ టైటిల్ ఇస్తున్నందుకుగాను ప్రభుత్వ మార్కెట్ మార్గదర్శక విలువలను అనుసరించి విలువ ఆధారితంగా స్వల్పశాతం (ఒక శాతం లేదా అంతకన్నా తక్కువ) రుసుంను విధించినా సరిపోతుంది. ప్రిజంప్టివ్ టైటిల్ నుంచి కంక్లూజివ్ టైటిల్ పరివర్తనకూ, టైటిల్ రిజిస్ట్రే షన్ వ్యవస్థ నిర్వహణకు, నష్టపరిహరం చెల్లింపుల సమస్యలను ఎదు ర్కోవడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయి. ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవచ్చు లేదా ఏవైనా పేరు ప్రఖ్యాతలున్న బీమా సంస్థలతో అనుసంధానం చేయవచ్చు. కంక్లూజివ్ టైటిల్ వల్ల ప్రయోజనాలు: మొదటగా స్థిరాస్తి యజమానికి భద్రత, భరోసా, నిశ్చింత. కొనుగోలుదారులకు, తనఖాదారులకు టైటిల్ పరిశీలన సులువు. సుదీర్ఘమైన కాలపరిమితి లేని లింక్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులను పరిశీలించే అవసరం ఉండదు. ప్రస్తుతం లోపభూయిష్టమైన స్థిరాస్తి రికార్డులు ఉన్నవారికి ఈ క్రమంలోమెరుగైన కంక్లూజివ్ టైటిల్ రావడం వల్ల వాటిద్వారా రుణాలు పొం దడానికి, అవసరమైనప్పుడు నాణ్యమైన, న్యాయమైన విలువలకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. న్యాయపరమైన చిక్కులు తొలి గి, స్పష్టమైన హక్కులున్న ఎక్కువ భూములు అందుబాటులోకి రావ డం వల్ల భూములు ధరల్లో స్థిరీకరణ వస్తుంది. ఇప్పటిలాగా భూములు ధరల్లో అకస్మాతుగా చోటుచేసుకునే ఎగుడు దిగుడులు ఉండవు. అన్ని స్థిరాస్తులు రికార్డులోకి రావడం వల్ల ఆస్తిపన్నుల పరిధి విస్తరిస్తుంది.
g-madhusudana-reddy
తద్వారా స్థానిక సంస్థలకు అధిక నిధుల సమకూరి మెరుగైన పౌరసేవలను అందించగలుగుతారు. పన్నులు చెల్లించిన ప్రజలు వేడుకోలు ద్వారా కాకుండా డిమాండ్ చేసి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. లిటిగేషన్లు లేని భూములు అందుబాటులో రావడం వల్ల రియాల్టీ రంగం మరింత వృద్ధి చెందుతుంది. దేశీ, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. భూ ఆక్రమణలు, లాండ్ మాఫియా, రియల్‌ఎస్టేట్ మోసాలు, నేరాలు, తగ్గుతా యి. బినామీ లావాదేవీలు, నల్లధనం తగ్గిపోతాయి. ఆ మేరకు ప్రభుత్వ ఇమేజ్ పెరుగుతుంది. సమాజంలో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయి. ప్రస్తుత సివిల్ దావాలలో మూడింట రెండువంతులు భూములకు సంబంధించిన తగాదాలే. వీటన్నింటికీ చాలామేరకు అడ్డుకట్ట పడుతుం ది. రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథక ఫలాలను అర్హులైన వారికి సకాలంలో అందజేయవచ్చు. లీకేజీలను అరికట్టవచ్చు. స్థిరాస్తి వివరాలు ప్రభుత్వానికి సమగ్రంగా అందుబాటులోకి రావ డం వల్ల భూ పరిపాలన గాడిలో పడుతుంది. ప్రాధాన్యరంగాలు నిర్దేశించుకోవచ్చు. వ్యవసాయ, గృహనిర్మాణ రంగాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించవచ్చు. చివరి మాట: దాదాపు మూడు దశాబ్దాల ముందు నుంచే మన దేశం లో కంక్లూజివ్ టైగ్లింగ్ పద్ధతి పట్ల ఆలోచన మొదలైనా ఈ దిశలో ఎక్క డా గట్టి ప్రయత్నం జరుగలేదు. ప్రారబ్దార్ధములుజ్జగింపని మేరునగధీ రత్వం, కార్యదక్షత ఉన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం ద్రశేఖర్‌రావు దార్శనికత, సారథ్యంతోనే కంక్లూజివ్ టైట్టింగ్ చట్టం సుసాధ్యం అవుతున్నది. రైతుబంధు, రైతుబీమా వలె ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ఎన్నో రంగాల వలె ఇందులో కూడా తెలంగాణ ప్రభుత్వం దేశం లోని మిగతా రాష్ర్టాలకు తలమానికంగా నిలువాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆర్ అండ్ ఎస్)గా పనిచేస్తున్నారు.
[email protected]

401
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles