‘డార్ఫ్’ గిరిజనుల ఆరాధ్య దైవం

Tue,June 11, 2019 01:13 AM

అడవి మృగాల కంటే హీనంగా నికృష్టమైన జీవితాలను ఎళ్లదీస్తున్న గిరిజన గూడేలలో వెలుగు దివిటీలు పట్టేందుకు ఆస్ట్రేలియా దేశస్తులైన క్రిస్టోఫ్ ఓస్ కురేర్ హైమన్ డార్ఫ్ ప్రఖ్యాత మానవ శాస్త్రజ్ఞుడు సతీసమేతంగా ఆదిలాబాద్ జిల్లా గిరిజన స్థితిగతులపై జరిపిన పరిశోధనల పర్యవసానమే నేటి గిరిజనాభ్యుదయానికి పునాది. ఇనుపగజ్జల తల్లితో కలిసి జీవిస్తున్న గిరిజనుల స్థితిగతులను చూసి చలించిపోయిన హైమన్‌డార్ఫ్ దంపతులు వారిలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల కోసం పట్టువదలని విక్రమార్కుల వలె కృషిచేశారు. 1909 జూలై వియన్నాలో జన్మించిన హైమన్‌డార్ఫ్ ఆస్ట్రేలియా సూడేటన్ లాండ్ రాష్ట్ర గవర్నర్ కుమారుడు. 1930లో లండన్ విశ్వవిద్యాలయంలో మానవ పరిణామశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొంది నేపాల్, ఫిలిప్పిన్స్, భారతదేశంలోని ఆదివాసుల జీవన విధానాలను అధ్యయనం చేశారు. భారతదేశంలో ఈశాన్య ప్రాంతంలో నాగజాతిపై తన పరిశోధనా కార్యక్రమాన్ని ముగించుకొని ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే బెట్టి బెర్నాండ్ అనే ఇంగ్లీష్ వనితను పెండ్లాడాడు. బెట్టి బెర్నాండ్ జీవిత భాగస్వామియే కాకుండా ఆయన పరిశోధనాయజ్ఞంలో పాలుపంచుకు న్నది. ఆమెతో కలిసి హైమన్‌డార్ఫ్ ప్రపంచ మానవశాస్త్ర సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా నిజాం ప్రభుత్వం రెవెన్యూ, హోంశాఖలకు నిర్వహిస్తున్న నర్ షి మొడోర్ టాస్కర్ అనుకోండానే ఆయనను కలిశారు. నిజాం సంస్థానంలోని గిరిజనులను గూర్చి అధ్యయనం చేయడానికి ఆహ్వానించారు. హైమండార్ఫ్ దంపతులు హైదరాబాద్ చేరుకోగానే రెం డో ప్రపంచయుద్ధ ప్రకటన వెలువడింది.

డార్ఫ్ గిరిజనుల కోసం తన జీవితాన్ని ధారపోశారు. 1980లో జరిగి న ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. హక్కుల కోసం సభ జరుపుకుంటున్న అడవిబిడ్డలు పుడమితల్లి కౌగిలి చేరడంతో గిరిజన సమాజం మరింత చితికిపోయిందని ఆవేదన చెందారు.


వీరు జర్మనీ ఆక్రమణలో ఆస్ట్రి యా దేశస్తులు కావడం వల్ల నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పూచిపై నిజాం పరిపాలనలో ఉన్న గిరిజనులపై పరిశోధనా చేయడానికి అనుమతించారు. దీని పర్యవసానంగా చెంచు, గోండు జాతుల గిరిజనులపై సమగ్ర పరిశోధనా గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. సర్ తియోడర్ టాస్కర్ తర్వాత వచ్చిన గిగ్బన్ కూడా డార్ఫ్‌కు సాయం చేశాడు. తన పరిశోధనల ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించిన డార్ఫ్‌ను నిజాం ప్రభుత్వం వెనుకబడిన గిరిజన జాతులకు సంబంధించిన సలహా దారునిగా నియమించి ఆదిలాబాద్ జిల్లాకు పంపింది. హైమన్‌డార్ఫ్ జైనూర్ మండలంలోని గోండు గిరిజన గ్రామమైన మార్లవాయిలో స్థిరపడ్డాడు. సుమారు పన్నేండ్ల పాటు గిరిజనుల్లో గిరిజనుడై పూరి గుడిసెల లో నివసించారు డార్ఫ్ దంపతులు వారి భాషను నేర్చుకున్నారు. గిరిజనాభివృద్ధి లక్ష్యంగా అనేక సిఫార్సులు చేసారు. గిరిజనుల పాలిట వరాల వంటి ఈ సిఫార్సుల ప్యాకేజీని న్యూడీల్ పాలసీగా పేర్కొంటారు. అడవి బిడ్డల జీవితాల్లో ఇది వెలుగు నింపింది. వ్యవసాయంపై ఆధారపడి న గోండు, నాయక్‌పోడ్ గిరిజన తెగలకు భూ పంపిణీ తగిన పరిష్కారం గా గుర్తించి ప్రత్యేక భూ పంపిణీ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ భూ పంపిణీ కార్యక్రమం కింద 60 వేల ఎకరాలను సాగుకు యోగ్యమైన భూమిని గిరిజనులకు పంపిణీ చేయించారు.

గిరిజన ఆక్రమనలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలిప్పించారు. ఈ పతకం కింద సుమారు 80 శాతం గిరిజనులకు జిల్లాలో ఒక్కొక్క కుటుంబానికి స్వయం సమృద్ధిని కలిగిన 15 ఎకరాల భూమి లభించింది. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్ప డే డార్ఫ్ ఆలోచనలు గిరిజనుల పాలిట రక్షిత కవచాలయ్యాయి. ఆయన రూపకల్పన చేసిన ఈ అభ్యుదయ చట్టాలు తెలంగాణ గిరిజనుల జీవితాలను మలుపు తిప్పాయి. గిరిజనుల చైతన్యానికి, అభ్యున్నతికి చదువు అత్యవసరమని భావించి అక్షరదానం చేయడానికి సంకల్పించారు. గిరిజనులకు మాతృభాషలో బోధనా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇందుకు తగిన ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలను స్థాపించారు. మార్లవాయిలోని ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో గోండుభాషలో చదువు చెప్పడానికి, గిన్నెధరిలోని కేం ద్రంలో తెలుగు లిపిలో శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందిన గోండు ఉపాధ్యాయిలు కె.భీంరావ్, జి.రామారావులు ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రులుగా వ్యవహరించారు. గిరిజనులపై పరిశోధనలను ప్రోత్సహించడానికి వీలుగా ఓయూలో సోషియాలజీ, ఆంత్రోపాలజీ శాఖలను ప్రారంభించేట్టు చేశారు. ప్రభుత్వ ఖజానాకు సమృద్ధిగా కాసులు కురిపించే అడవుల అభివృద్ధి ఎంత ముఖ్య మో గిరిజన సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఈ రెండు అవిభాజ్యమని హైమన్‌డార్ఫ్ ఉద్ఘాటించారు. డార్ఫ్ గిరిజనుల కోసం తన జీవితాన్ని ధారపోశారు. 1980లో జరిగి న ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన ఆయనను తీవ్రంగా కలిచివేసింది. హక్కుల కోసం సభ జరుపుకుంటున్న అడవిబి డ్డలు పుడమితల్లి కౌగిలి చేరడంతో గిరిజన సమాజం మరింత చితికి పోయిందని ఆవేదన చెందారు.

అడవిబిడ్డలంటే అమితమైన అనురాగం గల డార్ఫ్ దంపతులు ఆదిలాబాద్ జిల్లాను తరచుగా సందర్శించడం మాత్రం మానుకోలేదు. 1987 జనవరిలో హైదరాబాద్ లో గిరిజనాభివృద్ధిపై జరిగిన సెమినార్‌లో పాల్గొని గిరిజన సంక్షేమం లో భావి కార్యక్రమ రూపకల్పన లో నిమగ్నమై ఉన్న తరుణంలో ఆయన భార్య బెట్టి ఎలిజబెత్ మరణించారన్న వార్త తెలిసింది. ఆమె కోరిక ప్రకారం ఆమె అస్థికలను మార్లవాయికి తెచ్చి గోండుల సంప్రదాయం ప్రకారం సమాధి కావించారు. మార్లవాయిలో పుట్టిన వారి ఏకైక కుమారునికి లచ్చు పటేల్ అని నామకరణం చేసి గోండు గిరిజనులపై ఉన్న తమ మమకారాన్ని డార్ఫ్ దంపతులు నిరూపించుకున్నారు. హైమన్ డార్ఫ్ గిరిజనులపై చేసిన పరిశోధనల ఫలితంగా ది చెంచూ స్, ది నేకెడ్ నాగాస్, ది రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్, గోండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ట్రైబ్స్ ఆఫ్ ఇండియా వంటి అనేక రచనలు చేసి గిరిజను ల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషిచేశారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఆదిలాబాద్ చేరి గిరిజనుల్లో గిరిజనుడై, ఆదివాసుల గూడేల్లో, గుండెల్లో గూడు కట్టుకున్నాడు. నాగరిక సమాజపు అడ్రస్ తెలువని అడవిబిడ్డలకు అక్షర ప్రదానం చేసి సమాజానికి పరిచ యం చేసిన హైమన్ 1995, జూన్ 11న లండన్‌లో చివరిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న గిరిజనులు కన్నీటి పర్యంతమయ్యారు.
dr-gundi-ram-kumar
గిరిజనులు తమను సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించిన హైమన్‌డార్ఫ్ సమాధిని అతని భార్య సమాధి పక్కనే మార్లవాయిలో ఏర్పాటుచేశారు. ఏటా జూన్ 11న మార్లవాయిలో జరిగే డార్ఫ్ వర్ధంతి కి వేలాది గిరిజనులు హాజరై అశ్రుధారలతో ఘనంగా నివాళులు అర్పిస్తా రు. సంపన్న కుటుంబంలో పుట్టి గిరిజనుల కోసం యావత్ జీవితాన్ని అంకితం చేసిన హైమన్‌డార్ఫ్ దంపతులను ఆరాధ్యవైంగా భావించే తెలంగాణలోని ఆదిలాబాద్ గిరిజనులు ఇప్పటికి వారి పేరు వినగానే వినమ్రులవుతారు.
(నేడు హైమన్‌డార్ఫ్ వర్ధంతి)

380
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles