హూవర్ డ్యాం తెచ్చిన మార్పు

Wed,June 12, 2019 01:11 AM

సాగునీటి శాఖలో ఇంజినీర్‌గా ప్రపంచంలో గొప్ప సివిల్ ఇంజినీరింగ్ నిర్మాణాలుగా పేరు గడించిన మూడు డ్యాములు చూడాలని కోరిక చాలాకాలంగా నాలో ఉన్న ది. ఒకటి ఈజిప్ట్‌లో నైలు నదిపై నిర్మించిన ఆస్వాన్ డ్యాం, రెండోది అమెరికాలో కొలరాడో నదిపై నిర్మించిన హూవర్ డ్యాం, మూడోది చైనాలో యాంగ్జి నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యాం. మొదటి రెండు డ్యాముల గురించి 1981-84 మధ్య హైదరాబాద్‌లో ముప్ఫఖంఝా ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకునే కాలంలోనే విన్నాను. త్రీగార్జేస్ డ్యాం గురించి మాత్రం 1990వ దశకంలో సాగునీటి శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా చేరిన తర్వాత విన్నాను. అది దేశంలో పెద్ద డ్యాముల కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న కాలం. మధ్యప్రదేశ్‌లో నర్మ దా నదిపై తలపెట్టిన ఇందిరాసాగర్, సర్దార్ సరోవర్ డ్యాం, ఉత్తరప్రదేశ్‌లో భాగీరథి నదిపై తలపెట్టిన తెహ్రీ జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం జరుగుతున్న కాలం. పెద్ద డ్యాముల వల్ల పర్యావరణానికి, అటవీ సంపదకు వాటిల్లే నష్టాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న కాలం. పర్యావరణవాదులు పెద్ద డ్యాములకు ప్రత్యామ్నాయంగా చిన్న వాటర్‌షెడ్స్, చెరువులు, కాంటూర్ బండ్స్, చెక్ డ్యాములను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఆ చర్చలలో ప్రముఖ ఇంజినీర్, ఐరాసకు సలహాదారుగా ఉన్న కీ.శే.టి.హనుమంతరావు కూడా పాల్గొన్నారు. పెద్ద డ్యాముల ఆవశ్యకతను నొక్కిచెపుతూ అనేక వ్యాసాలు రాశారు. చిన్న నీటి పథకాలు పెద్ద డ్యాములకు ప్రత్యామ్నాయం కాజాలవని వాదిస్తూ, 1986లో దేశంలో సంభవించిన కరువును ఎదుర్కొని దేశంలో ఆహార సంక్షోభాన్ని నివారించినవి భాక్రానం గల్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు లాంటి పెద్ద డ్యాములేనని గణాంకాలతో వివరించారు.

హూవర్ డ్యాం ఎత్తు 726 అడుగులు, పొడవు 1,2 44 అడుగులు, డ్యాం అడుగున వెడల్పు 660 అడుగులు, పైన వెడల్పు 45 అడుగులు. 1931లో డ్యాం నిర్మాణం ప్రారంభమయ్యే నాటికి కొలరాడో ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన హెర్బర్ట్ హూవర్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఆయన ప్రోత్సాహంతో డ్యాం నిర్మాణం 1935లో పూర్తయ్యింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసి డ్యామును అనుకున్న సమయానికన్నా రెండేండ్ల ముందుగానే పూర్తిచేయగలిగారు.


ఈ చర్చ చేస్తున్న సందర్భం గా ఈజిప్టులో నైలు నదిపై నిర్మిచిన ఆస్వాన్ డ్యాం ఈజిప్ట్ ఆర్థిక ప్రగతికి ఎట్లా దోహదం చేసింది, ఆఫ్రికా ఖండమంతా కరువు కోరల్లో చిక్కుకొని ప్రజలు ఆకలిచావులకు బలవుతుంటే ఈజిప్ట్ దేశాన్ని కరువు నుంచి, వరదల నుంచి కాపాడింది ఆస్వాం డ్యామేనని వివరించారు. ఆ కాలం లో చైనాలో నిర్మాణమవుతున్న త్రీగార్జేస్ డ్యాం కూడా చైనా ఆర్ధిక ప్రగతికి దోహదం చేయనున్నదని జోస్యం చెప్పారు. 2018 ఏప్రిల్‌లో త్రీ గార్జెస్ డ్యామును సందర్శించే అవకాశం వచ్చిం ది. ఇప్పుడు వ్యక్తిగత సెలవుపై అమెరికా వచ్చిన తర్వాత హూవర్ డ్యామును జూన్ 8న సందర్శించాను. కొలరాడో నది ఉత్తర అమెరికా ఖండం నైరుతీ ప్రాంతంలోప్రవహించే పెద్ద నదుల్లో ఒకటి. హూవర్ డ్యామును నిర్మించకముందు కొలరాడో బేసిన్‌లోని దిగువ రాష్ర్టాలైన కాలిఫోర్నియా, ఆరిజోనా, నెవెడా రాష్ర్టాలు వరదలతో అతలాకుతల మయ్యేవి. 1905లో కొలరాడో నదికి వచ్చిన వరదల్లో కాలిఫోర్నియా రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరద నష్టాల నుంచి రైతులను కాపాడటానికి, పునరావాసానికి అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టవలసి వచ్చిందని రికార్డులు చెబుతున్నాయి. ప్రభుత్వం కొలరాడో నది నుంచి వృథాగా సముద్రానికి తరలిపోతున్ననీటిని నిల్వ చేసుకొని వరదలను నియంత్రించడమే కాకుండా వ్యవసాయాభివృద్ధికి వినియోగించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదట గా కొలరాడో నదిపై కొన్ని చిన్న డ్యాముల నిర్మాణం జరిగింది. 1920 నాటికి నదిలో లభ్యమయ్యే జలరాశిని నిల్వ చేయగలిగే ఒక పెద్ద జలాశయాన్ని నిర్మిస్తే తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరయని కాలిఫోర్ని యా, నెవెడా, ఆరిజోనా రాష్ర్టాల ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తా యి. దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న లాస్ ఏంజిల్స్, నెవెడా రాష్ట్రంలో లాస్‌వేగస్, ఆరిజోన రాష్ట్రంలో ఫీనిక్స్ నగరాలు, ఇత ర పట్టణాల్లో గృహ, పారిశ్రామిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి కూడా పెద్ద డ్యాం అవసరమనే భావన బలపడింది.

ఈజిప్ట్‌లో ఆస్వాన్ డ్యాం (అబ్దుల్ నాజర్) అయినా, చైనాలో త్రీ గార్జెస్ డ్యాం (లీపెంగ్) అయినా, అమెరికాలో హూవర్ డ్యాం (హెర్బర్ట్ హూవర్) అయినా ఆయా దేశాల పాలకుల రాజకీయ సంకల్ప బలంతోనే సాధ్యమైనాయి. అన్ని అడ్డంకులను, సవాళ్లను ఎదుర్కొని, నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తిచేశారు. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేండ్లలోనే నీటిని ఎత్తిపోయడానికి సిద్ధవుతున్నది. నిస్సందేహంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అదేరకంగా దోహదం చేయనున్నది. 80,500 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నది.


అయితే డ్యాం నిర్మా ణం జరిగితే కాలిఫోర్నియా రాష్ట్రం అధికంగా ప్రయోజనాలను పొందనున్నదన్న అనుమానం బేసిన్‌లో ఉన్న ఇతర రాష్ర్టాలు వ్యక్తం చేశాయి. దీంతో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం పురమాయింపుతో వాణిజ్య కార్యదర్శిగా ఉన్న హెర్బర్ట్ హూవర్ నేతృత్వంలో కొలరాడో రివర్ బేసిన్లో ఉన్న ఏడు రాష్ర్టాల మధ్య నీటి పంపకాల చర్చలు మొదలయ్యాయి. 1922లో రాష్ర్టాల మధ్య ఒప్పందం కుదిరింది. డ్యాం నిర్మాణానికి నాలుగు లక్ష్యాలను చట్టంలో పేర్కొన్నారు. 1.వరద నియంత్రణ 2.వ్యవసాయానికి, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం 3.విద్యు త్ ఉత్పత్తి 4.దేశీయ జల రవాణా అభివృద్ధి. అమెరికా బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ ఇంజినీర్లకు గతంలో డ్యాముల నిర్మాణంలో అనుభవం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో డ్యాం నిర్మాణానికి పూనుకోవడం ఇదే మొదటిసారి. ఆ నాటికి బౌల్డర్ కాన్యాన్ డ్యాం ప్రపంచలోనే అతి ఎత్తయిన డ్యాం. ఈ డ్యాం వల్ల ఏర్పడే జలాశయం ప్రపంచంలో అతిపెద్దది. పెద్ద డ్యాముల నిర్మాణం సందర్భంగా వచ్చే ప్రశ్నలు, సవాళ్లు బౌల్డర్ డ్యాం మీద కూడా వచ్చాయి. అన్ని సవాళ్లను అధిగమిం చి బ్యూరో ఇంజినీర్లు తమ మేధస్సును ధారపోసి డ్యాం డిజైన్లను రూపొందించారు. హూవర్ డ్యాం ఎత్తు 726 అడుగులు, పొడవు 1,2 44 అడుగులు, డ్యాం అడుగున వెడల్పు 660 అడుగులు, పైన వెడల్పు 45 అడుగులు. 1931లో డ్యాం నిర్మాణం ప్రారంభమయ్యే నాటికి కొలరాడో ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన హెర్బర్ట్ హూవర్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఆయన ప్రోత్సాహంతో డ్యాం నిర్మాణం 193 5లో పూర్తయ్యింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసి డ్యామును అనుకున్న సమయానికన్నా రెండేండ్ల ముందుగానే పూర్తిచేయగలిగారు. డ్యాంలో ఏర్పాటుచేసిన ఒక్కొక్క స్పిల్ వే నుంచి నీటిని వదిలితే నయాగారా జలపాతం నుంచి పారే నీటి పరిమాణంతో సమానం. డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత అది తన లక్ష్యాలను నెరవేర్చడంలో సఫ లమైందని పరిశోధకులు విశ్లేషించారు.

అరిజోన, కాలిఫోర్నియా రాష్ర్టా ల్లో తరచుగా సంభవించే వరదల పీడ పోయింది. ఎడారి ప్రాంతాలైన ఆరిజోనా, నెవెడా, కాలిఫోర్నియా రాష్ర్టాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. ఆరిజొనా రాష్ట్రంలో ఫీనిక్స్, నెవెడా రాష్ట్రంలో లాస్ వేగాస్, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏంజిల్స్ వంటి నగరాలు, అనేక పట్టణాల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తున్నది. విద్యు త్‌ను అందిస్తున్నది. హూవర్ డ్యాం నిర్మాణం తర్వాతనే ఎడారి ప్రాం తంలో ఉన్న లాస్‌వేగస్ నగరం ఇవ్వాళ్ల ప్రపంచ పర్యాటక స్థలంగా అభి వృద్ధి చెందింది. ఈ డ్యాం నిర్మాణం ద్వారా వచ్చిన అనుభవంతో అమెరికాలో అన్ని ప్రధాన నదులపై అనేక డ్యాముల నిర్మాణం చేపట్టారు. 1942లో కొలంబియా నదిపై గ్రాండ్ కూలీ డ్యాం నిర్మాణం పూర్తయింది. 1940-80 మధ్యకాలంలో కొనసాగిన వందలాది డ్యాముల నిర్మాణంతో 1940 తర్వాత అమెరికాలో వ్యవసాయ విస్తరణ వేగంగా కొనసాగింది. అమెరికాలో వ్యవసాభివృద్ధిని అంచనా వేయడానికి హూవర్ డ్యాముకు ముందు, తర్వాత అన్న అంశం విశ్లేషకులకు ప్రామాణికంగా మారింది. 1940కి ముందు అమెరికాలో డ్యాముల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. అది 1978 నాటికి 1742 టీఎంసీలకు పెరిగింది. 1940 తర్వాత దేశవ్యాప్తంగా బ్యూరో నిర్మించిన డ్యాముల వల్ల సాగునీరు అందుబాటులోకి వచ్చింది. దీనిఫలితంగా సాగునీరు అందే ఆయకట్టు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 1940 తర్వాత అమెరికా ఫెడరల్ ప్రభు త్వం కల్పించిన వసతుల కారణంగా సాగు విస్తీర్ణం, వ్యవసాయోత్పత్తుల విలువ గణనీయంగా పెరిగిందని పరిశోధకులు విశ్లేషించారు. ఇవికాకుం డా హూవర్ డ్యాం రూపకర్తలు ఊహించని విధంగా పర్యాటకం ద్వారా ఏటా మిలియన్ల డాలర్ల ఆదాయం సమకూరుతున్నది.
sridhar-rao-deshpande
ఈజిప్ట్‌లో ఆస్వాన్ డ్యాం (అబ్దుల్ నాజర్) అయినా, చైనాలో త్రీ గార్జెస్ డ్యాం (లీపెంగ్) అయినా, అమెరికాలో హూవర్ డ్యాం (హెర్బర్ట్ హూవర్) అయినా ఆయా దేశాల పాలకుల రాజకీయ సంకల్ప బలంతోనే సాధ్యమైనాయి. అన్ని అడ్డంకులను, సవాళ్లను ఎదుర్కొని, నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తిచేశారు. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేండ్లలోనే నీటిని ఎత్తిపోయడానికి సిద్ధవుతున్న ది. నిస్సందేహంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అదేరకంగా దోహదం చేయనున్నది. 80,500 కోట్ల భారీ పెట్టుబడి తో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నది. 40 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు, హైదరాబాద్ నగరానికి తాగు నీరు, పరిశ్రమలకు నీరందుతుంది. జలాశయాల్లో, చెరువుల్లో సుమారు 500 టీఎంసీల నీటి నిల్వ సాధ్యమవుతుంది. 150 కి.మీ. పొడవున గోదావరి నది సజీవం కాబోతున్నది. మంచినీటి చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. దేశీయ జల రవాణా అభివృద్ధి కానున్నది. ప్రాజెక్ట్ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, టెంపుల్ టూరిజం ద్వారా రాష్ర్టానికి అదనపు ఆదాయం సమకూరనున్నది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నవి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతిరథంగా మారనున్నది.
(వ్యాసకర్త: ఓఎస్డీ టు సీఎం, అమెరికా నుంచి..)

415
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles