ఆగిచూడు

Mon,August 5, 2019 01:02 AM

AASHARAJU
ఇది నిద్రపోని ఎడారి
పగలైనా రేయైనా
కనిపించని మాయదారి
ఎక్కడికని వెళుతావు!
ఎంతనడిచినా
ఒయాసిస్సురాదు
ఒంటరిగా ఏదిక్కుకని నడుస్తావు!
ఇవన్నీ
లైలా అడుగులు
ఇంకా చెరిగిపోలేదు
వచ్చేవన్నీ
మజ్ను తుఫాన్లు
ఏ మూలన దాగినా
ఆ దాడి ఆగదు
రజియాసుల్తానా ఖడ్గం వొకటి
ఇసుకలో దిగబడింది
అడుగుతీసి అడుగువేసినపుడు
అందుకే భూమి వొణుకుతోంది
ఇలా అరుణ్ పాట
ఎటుతిరిగినా
వదిలిన బాణంలా వెంబడిస్తుంది
ఒక్కడివి ఎందుకు వెళుతావు
చందమామ వచ్చేదాకా ఆగిచూడు
బుపేన్ హజారికా తోడు వస్తాడేమో
ఉరుములాంటి రాగం వినిపించేదాకా
దారిలోనే ఎదురుచూడు
రుడాలి కపాడియా
ఈ మార్గాన్నే వస్తుందనుకుంటాను
వర్షం జల్లు లాంటి కురులు చూసి
ఎక్కడైనా ఆమెను గుర్తుపట్టొచ్చు
ఓపిక చేసుకొని ఇక్కడే ఆగిచూడు
ఇంతచెప్పినా మాటవినకుండా
ఏకాకిగా ముందుకు నడవకు !
ఖాయస్ అనుకొని
ఎదురొచ్చినవాళ్ళు
రాళ్ళతో కొడుతారు
- ఆశారాజు, 93923 02245

87
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles