రైతుకోసం ఎంతైనా ఖర్చుచేయొచ్చు

Wed,August 7, 2019 01:06 AM

Kaleshwaram-farmers
రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మార్గం లేదని అందరూ అంగీకరిస్తున్నదే. అదే సమయంలో ఎత్తిపోతలకు కరంటు ఖర్చు గురించి గగ్గోలు పెడుతారు. అభూ తకల్పనలతో ప్రజలను, తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తారు. ఎత్తిపోత లు లేకుండా రాష్ట్రం రైతాంగానికి సాగునీరు ఇవ్వలేము. పంపులు నడిస్తే కరంటు కాలుతుంది. రాష్ట్రంలో ఏఎంఆర్‌పీ, నాగార్జునసాగర్ ఎల్‌ఎల్‌సీ (నల్లగొండ), కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, తుమ్మిళ్ళ (మహబూబ్‌నగర్), భక్తరామదాసు (ఖమ్మం), అలీసాగర్, గుత్ప, చౌటు పల్లి హనుమంతరెడ్డి (నిజామాబాద్), గూడెం (మంచిర్యాల్), ఎల్లంపల్లి (కరీంనగర్) పథకాలు విజయవంతంగా రైతాంగానికి సేవలందిస్తున్నా యి. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నది. మరో మూడేండ్లలో పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి, చిన్న కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, చనాఖా కోరాటా ఎత్తిపోతల పథకాలు సాగునీరు అందించడానికి సిద్ధమవుతాయి. వీటన్నింటికి సుమారు 9 వేల మెగావాట్ల కరంటు అవసరం పడుతుందని ఇంజినీర్ల అంచనా. వీటికి ఏటా 10 నుంచి 15 వేల కోట్ల కరంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది. భవిష్యత్తులో ఇది ఏ ప్రభుత్వానికైనా తప్పదు. ఈ ఖర్చుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఒక నెలకే 10 కోట్ల కరంటు బిల్లా అని ఆశ్చర్యపోతున్న మేతావులు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే..

ఈ కరంటు బిల్లుల సంగతి ఇంజినీర్లకు, ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశమే లేదు. తెలంగాణలో ఎత్తిపోతలు లేకుండా రైతాంగానికి నీరు ఇవ్వలేము. ఈ సంగతి కాళేశ్వరం విమర్శకులకు తెలుసు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికే ఈ ప్రచారం. ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల పథకానికి అయినా ఈ కరంటు ఖర్చు ఉండేదే. తుమ్మిడిహట్టి కట్టి ఉంటే కరంటు ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీరు ఎల్లంపల్లికి చేరి ఉండేవనే వారి వాదన తప్పు.


కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1లో ఉన్న కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ వద్ద ఉన్న పంపులు 5, 10 హెచ్‌పీల వ్యవసాయ పంపులు కావు. ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు. అంటే 55 వేల హెచ్‌పీ పంపులన్న మాట. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవి చిన్నవి. లింక్ 2లో ఉన్నవి 125, 139 మెగావాట్ల భారీ పంపులు. ప్రపంచంలోనే అతిపెద్దవి. వీటితో పాటు 85, 105.. ఇట్లా రకరకాల రేటింగ్ కలిన పంపులు కూడా కాళేశ్వ రం ప్రాజెక్టులో బిగిస్తున్నారు. 22 పంప్ హౌజుల్లో మొత్తం 85 పంపులు బిగిస్తారు. ఇవన్నీ నడిచినప్పుడు 4600 మెగావాట్ల కరంటు అవసరమవుతుందని ఒక అంచనా. అయితే అన్ని పంపులు ఒకేసారి నడిచే సందర్భం అసలు ఏర్పడకపోవచ్చు. శ్రీరాంసాగర్‌కు వరద వస్తే గ్రావిటీ ద్వారానే మిడ్‌మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, కింద సుందిళ్ళ, అన్నారం బరాజ్‌లు నిండుతాయి. అప్పుడు లింక్ 1, 2లో పంపులను నడిపే అవసరం రాదు. మిడ్‌మానేరు నుంచే పంపులు తిప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితి ప్రతీ మూడేండ్లకోసారి ఏర్పడే అవకాశం ఉన్నది. శ్రీరాంసాగర్ వద్ద నీరు లేకున్నా ఎల్లంపల్లికి వరద రావచ్చు. అప్పుడు లింక్ 1లో పంపు లు నడుపరు. లింక్ 2లో పంపుల ద్వారా మిడ్ మానేరుకు, అక్కడినుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు, శ్రీరాంసాగర్‌కు నీటికి ఎత్తిపోస్తారు. ఈ రెండు చోట్లలో నీరు లేనప్పుడే మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది.

ఎల్లంపల్లికి వరద వస్తుందని తెలిసిన తర్వాత లింక్ 1లోని అన్ని పంపులను ఆపివేయడం జరిగింది. 15 ఏండ్ల తర్వాత మానేరు వాగు నుంచి వరద అన్నారం బరాజ్‌లోకి చేరింది. ఎంత నీరు వస్తున్నదో అంటే నీరు బయటకు పంపడం జరుగుతున్నది. ప్రకృతిని కొంత మేరకే నియంత్రించడం సాధ్యం. ఆ తర్వాత ప్రకృతి ధర్మాన్ని అనుసరించక తప్పదు. ఇంజినీర్లు అదే పని చేస్తుంటే దీనిపై కూడా పెద్ద నాయకులు అనుకునేవాళ్లు కూడా తిప్పిపోతలు అని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఎగువన నీరు లేనప్పుడు ప్రాణహిత నీటిని పైకి గోదావరిలోకి ఎట్లా ఎదురెక్కించవచ్చునో మన అనుభవంలోనికి వచ్చింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ-ఎల్లంపల్లి లింక్ ఎంత ముఖ్యమైనదో, ఎంతటి ప్రాధాన్యం కలిగినదో ప్రజలకు అర్థమైంది. మరొక విషయమేమంటే మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపులను ఈ సంవత్సరం మొదటిసాటి ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా కరంటు ఎక్కు వ కాలుతుంది. ఒకసారి పంపులు సిం క్రనైజ్ అయిన తర్వాత స్విచ్ ఆన్ చేయగానే పంపింగ్ మొదలవుతుంది. కరంటు తక్కువ కాలుతుంది. పూర్తి సామర్థ్యంతో నీరు పంపు అవుతుంది. ఈ సాంకేతికాంశం తెలియనివారు ఒక టీఎంసీ ఒక కోటి బిల్లా అని ఆశ్చర్యపోతున్నారు. కొత్తగా గృహ ప్రవేశం చేసినరోజు ఎక్కువ కనంటు కాలుతుంది. ఇంట్లో అన్ని లైట్లు, ఫ్యాన్లు, ఫ్లడ్ లైట్లు, డెకరేషన్ లైట్లు వెలుగుతాయి. ఆ తర్వాత కరంటు వినియోగం మామూలుగానే ఉంటుంది. ఇదీ అంతే.
sridhar-rao-deshpande
ఈ కరంటు బిల్లుల సంగతి ఇంజినీర్లకు, ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశమే లేదు. తెలంగాణలో ఎత్తిపోతలు లేకుండా రైతాంగానికి నీరు ఇవ్వలేము. ఈ సంగతి కాళేశ్వరం విమర్శకులకు తెలుసు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికే ఈ ప్రచారం. ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల పథకానికి అయినా ఈ కరంటు ఖర్చు ఉండేదే. తుమ్మిడిహట్టి కట్టి ఉంటే కరంటు ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీరు ఎల్లంపల్లికి చేరి ఉండేవనే వారి వాదన తప్పు. అక్క డ కూడా 40 మీటర్ల లిఫ్ట్ ఉన్న సంగతిని వారు మరిచిపోతున్నారు. లేదా మరుగునపెడుతున్నారు. కరంటు బిల్లుల విషప్రచారాన్ని ప్రజలు ఎంత మాత్రం పట్టించుకునే స్థితిలో లేరు.
(ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లుల సౌజన్యంతో..)

234
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles