ఒకే దేశం, ఒకే రాజ్యాంగం

Thu,August 8, 2019 01:49 AM

one-nation-one-law
ఒకే దేశం-ఒకే రాజ్యాంగం.. అదే బీజేపీ లక్ష్యం. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజా అంటూ ఏక్తా భారత్ నినాదంతో జనసంఘ్ పార్టీ పుట్టింది. కాలక్రమంలో అది భారతీయ జనతా పార్టీ (బీజేపీ)గా ఏర్పడింది. ఆ పార్టీ సిద్ధాంత రూప కర్త రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ఉద్దేశం కూడా అదే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశం-ఒకే చట్టం-ఒకే ఎన్నికలు-ఒకే కార్డు, ఒకే విధమైన రిజర్వేషన్ విధానం- దేశ పౌరులందరికీ (స్త్రీ, పురుషులిద్దరికీ) సమన్యాయం- ఉమ్మడి పౌర స్మృతి-ఒకే పన్ను... విధానాల తో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. ఈ నేపథ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అదే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే రాజ్యాంగంలోని 370, 35(ఏ) ఆర్టికల్స్ రద్దు, జమ్ముకశ్మీర్ విభజన నిర్ణయాలు. భారతదేశ చరిత్రలో 1947 ఆగస్టు 15 తర్వాత గుర్తుంచుకోతగిన రోజు 2019 ఆగస్టు 5. ఆ రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా 103 క్లాజులతో 58 పేజీల జమ్ముకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్-2019ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజన అయ్యాయి. జమ్ము-కశ్మీర్ శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించాయి. ప్రస్తుతం కశ్మీర్ ప్రాంత పరిధిలోని పది జిల్లాలు, జమ్ము ప్రాంతంలోని పది కలిపి 20 జిల్లాలతో రాష్ట్రం ఏర్పడింది. అలాగే లెహ్, కార్గిల్ జిల్లాలతో లఢఖ్ ప్రాం తం చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) కూడా ఈ చట్టం పరిధిలోకి వచ్చింది. ఆ ప్రాంతం మొత్తంపై కేంద్ర అధికార పరిధి పెరిగింది. రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించింది. మరోపక్క అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దుచేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీచేశారు. అన్నీ ఏక కాలంలో జరిగిపోయాయి.

చర్చ జరుగకుండా ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రతిపక్షపార్టీలు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. జమ్ముకశ్మీర్ ప్రాంతంలో శాంతిలేదు. ప్రజలకు భద్రత కరువైంది. ఏడు దశాబ్దాలుగా వారు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్షణ వ్యయం విపరీతంగా పెరిగిపోతున్నది. ఆర్టికల్ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేకాధికారాలను అక్కడి ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. మరో పక్క ఆ ప్రాంతంలో అశాంతిని పెంచడానికి, కల్లోలం సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్న చేష్టలు అందరికీ తెలిసినవే. ఈ పరిస్థితులలో ముందుగా ఈ వ్యూహం బయటపెట్టి, చర్చించిన తర్వాత చర్యలకు దిగితే దేశం లోపల, వెలుపల ఎన్నో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేది.


దాంతో జమ్ము-కశ్మీర్ శాసనసభలో భారత రాజ్యాంగం తక్షణం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ బిల్లును ఆగస్టు 6న లోక్‌సభలో చర్చకు పెట్టారు. బీజేపీకి బలం ఉన్నందున అక్కడ కూడా ఆమోదం పొందింది. ఈ బిల్లు రూపొందించడంలో మోదీ, అమిత్ షాలు ఇద్దరూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఘన విజయం సాధించారు. ఈ ఇద్దరూ హీరోలుగా నిలిచారు. దేశంలో అత్యధిక మంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ, శాంతిభద్రతల విషయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటూ, డ్బ్భై ఏండ్లుగా రావణకాష్టంలా రగులుతున్న సమస్యకు పరిష్కారం చూపించారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. స్థిర, చరాస్తులను వదులుకొని ఎక్కడెక్కడో తలదాసుకుంటున్న కశ్మీరీ పండిట్‌ల ఆనందానికి అవధు ల్లేవు. ఈ చర్యతో మోదీ, అమిత్ షాలు ఇద్దరూ దేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మాదిరిగా గుర్తుండిపోతారు. ఆర్టికల్ 370ని రద్దుచేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రతిపక్షపార్టీలు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. జమ్ముకశ్మీర్ ప్రాంతంలో శాంతిలేదు. ప్రజలకు భద్రత కరువైంది. ఏడు దశాబ్దాలుగా వారు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్షణ వ్యయం విపరీతంగా పెరిగిపోతున్నది. ఆర్టికల్ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేకాధికారాలను అక్కడి ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. మరో పక్క ఆ ప్రాంతంలో అశాంతిని పెంచడానికి, కల్లోలం సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్న చేష్టలు అందరికీ తెలిసినవే. ఈ పరిస్థితులలో ముందుగా ఈ వ్యూహం బయటపెట్టి, చర్చించిన తర్వాత చర్యలకు దిగితే దేశం లోపల, వెలుపల ఎన్నో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేది. అందువల్లనే దురాలోచనతో వారు ఈ ఆలోచనను అత్యంత గోప్యంగా ఉంచి, అవసరమైన ముం దుజాగ్రత్త చర్యలన్నీ తీసుకొని బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమలులోకి రావడం వల్ల ఆ ప్రాంత ప్రజల హక్కులు ఏమీ హరించుకుపోలేదు.
shiramdasu-nagarjuna
వారి గౌరవానికి ఏవిధంమైన భంగం కలుగదు. వారి మత విశ్వాసాలకు, సంస్కృతికి ఎటువంటి హానీ ఉండదు. దేశంలోని ఇతర పౌరులకు ఉన్న అన్ని హక్కులు వారు అనుభవిస్తారు. అన్ని సౌకర్యాలు వారికి ఉంటాయి. అక్కడ శాంతి నెలకొంటే, కేంద్రం శాంతిభద్రతలపై కాకుండా, అభివృద్ధిపై దృష్టిపెట్టడానికి అవకాశం ఉం టుంది. వీటన్నికంటే ముఖ్యంగా దేశ సమైక్యతకు, సమగ్రతకు మేలు జరుగుతుంది. దేశ మొత్తం జనాభాలో ఏకత్వం అనే భావన బలీయంగా నెలకొనడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటివరకు భారత పార్లమెంట్‌లో చేసే ఏ చట్టంలోనైనా జమ్ము-కశ్మీర్ మినహా అని ఉంటుంది. ఇకనుంచి పార్లమెంట్‌లో చేసే ప్రతి చట్టం జమ్ము-కశ్మీర్‌లో అమలవుతుంది. ఇప్పటివరకూ జమ్ముకశ్మీర్‌లో శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడి భూముల విక్రయించే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా అక్కడ భూములను కొని, అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది అంత సామాన్యమైన నిర్ణయం ఏమీ కాదు. ఈ నిర్ణయం వల్ల ఇంటా, బయట ఎదురయ్యే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే వారిద్దరూ రంగంలోకి దిగి ఉంటారు. అందులో అనుమానం ఏమీ లేదు. బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు వారు తీసుకున్న జాగ్రత్తలే ఇందుకు నిదర్శనం. ఇకముందు తలెత్తే అన్నిటిని కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొనగలదని ఆశిద్దాం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)

268
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles