ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

Thu,August 8, 2019 12:04 AM

arun-dongre
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ భారీ నీటిపారుదల పథకం అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నది. ఎత్తిపోతలకు విద్యుత్ అవసరాలు, ఇతర ఖర్చులు ఎక్కువస్థాయిలో అవసరం కావటం ఇందుకు కారణం. అందువల్ల ప్రాజెక్టును ఆమోదించేందుకు ఫడ్నవీస్ ఇంతకాలం వెనుకాడుతూ వచ్చారు. అటువంటిది, అంతకుమించిన విద్యుత్ వినియోగం, ఖర్చుతో తెలంగాణ చేపట్టిన కాళేశ్వరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానంపై సం దర్శించిన ఆయన ఆలోచనలు ఆ వెంటనే మారిపోయాయి. తిరిగివెళ్లిన వెంటనే తమ పథకానికి తల ఊపారు. ఈ విషయం తెలియజేసిన అధికారుల ఆనందానికి అవధులు లేకుండా వుంది. మహారాష్ట్రలోని మిగులుజలాల నది అయిన వైన్‌గంగ నుంచి తరుగు నది అయిన నల్‌గంగకు 2,721 మిలియన్ మీటర్ క్యూబిక్కుల నీటిని తరలించాలన్నది పథకం. ఇందుకోసం నీటిని మూడు దశల్లో ఎత్తిపోయవలసి ఉంటుంది. అందుకు అవసరమైన విద్యుత్తు 224 మెగావా ట్లు. ప్రాజెక్టు మొత్తం వ్యయం 2007-08 నాటి ధరల ప్రాతిపదికన రూ.8,294 కోట్ల చిల్లర కాగా, అందులో విద్యుత్ భారం రూ.1033 కోట్ల చిల్లర. ఇందులో గోసీ ఖుర్ద్ పేరిట వైన్‌గంగ పథకం ఇప్పటికే నిర్మాణంలో ఉన్నది. ఇతరత్రా బహుళ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా నల్‌గంగ నదికి కలిపి పశ్చిమ విదర్భకు సాగునీటిని అందించాలన్నది ఆలోచన. ఆ ప్రాంతపు నైసర్గిక స్వరూపం కారణంగా గ్రావిటీ పద్ధతిలో నీరు వెళ్లే అవకాశం లేదు గనుక ఎత్తిపోతలు తప్పనిసరి. ఎత్తిపోతలు మూడు దశలలో అవసరమవుతా యి. అందుకు 288 మెగావాట్లు, లేదా సంవత్సరానికి 556 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమని అంచనా.

ఒకరి మంచిపని మరొకరికి ప్రేరణగా మారటం సహజం. ఆ మంచిపని కాళేశ్వరం ఎత్తిపోతల కావటం, అది మహారాష్ట్రలోని వైన్‌గంగ-నల్‌గంగ ఎత్తిపోతలకు ప్రేరణగా మారటం మాత్రం మనకు ప్రత్యేకంగా సంతోషాన్ని కలిగించే విషయం. కాళేశ్వరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆ ప్రేరణతో తమ రాష్టంలో చిరకాలంగా పెండింగ్‌లో గల వైన్‌గంగ-నల్‌గంగ ఎత్తిపోతలకు పచ్చజెండా ఊపారన్నది తాజా పరిణామం. దీనితో కరువు కాటకాలు, ఆత్మహత్యల విదర్భ ప్రాంతం పంటల మయం కానున్నది.


పైన పేర్కొన్న ఖర్చు అంచనాలు 2007-08 నాటి ధరల ప్రకారం వేసినవి అయినందున తాజా లెక్కల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.14,938 కోట్లుకాగా, విద్యుత్ వ్యయం రూ.1643 కోట్లు అయింది. అయినప్పటికీ ఇదంతా తెలిసికూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి తన కాళేశ్వరం సందర్శన తర్వాత అన్ని సంకోచాలను పక్కనబెట్టి, ఇంతకాలం పెండింగ్‌లో గల ఎత్తిపోతలకు ఆమోదం తెలుపటమన్నది మనం గుర్తించవలసిన విశేషం. వైన్‌గంగ, నల్‌గంగ నదులు రెండూ విదర్భ ప్రాంతంలోనివే. సంవత్సరం పొడవునా ప్రవహించే సజీవ నది అయిన వైన్‌గంగ తూర్పు విదర్భలో, నదీ ప్రవాహం ఎప్పుడూ సరిగా ఉండని నల్‌గంగ పశ్చిమ విదర్భలో ఉన్నాయి. రెండింటిని కలుపుతూ 300 కిలోమీటర్ల కాలువ తవ్వుతారు. ఎత్తిపోతలు అవసరమైంది ఈ కాలువలో నీటిని పోసేందుకు. నల్‌గంగ నుంచి నీరు లభించేది కరువు కాటకాల మయమైన పశ్చిమ విదర్భ ప్రాంతానికి. ముఖ్యంగా అమరావతి డివిజన్‌కు. పశ్చిమ విదర్భలోని ఆరు జిల్లాల్లో అయిదు అమరావతి డివిజన్‌లో ఉన్నాయి. ఇవన్నీ వర్షాధారిత భూములే. ప్రాజెక్టులు లేవు. సజీవ నదులు ఎక్కువ దూరం లో లేనప్పటికీ ఆ నీటిని ఇంతకాలం అటువంటి ప్రాంతానికి తరలించలేదు. అందుకు కారణం వ్యయభారం, విద్యుత్ వినియోగ భారం వం టివి ఏవైనా కావచ్చు. కానీ నీరు మాత్రం రాలేదు. పశ్చిమ విదర్భప్రాం త రైతులు విస్తారంగా పత్తి, సోయాబీన్ సాగు చేస్తారు. ఇందుకు కావలసిన వనరులు, పంట అమ్మకపు మార్కెట్లు మోసాలతో కూడినవి, జాతీ య-అంతర్జాతీయ మార్కెట్లతో ముడిబడినవి కావటంతో, అందుకు తగినట్లు నీటి సదుపాయం లేకపోవటంతో అప్పుల పాలై, పంటకు గిట్టుబాటు ధరలు లేక, పేదరికంలో మగ్గుతూ గత ఇరువయ్యేళ్లుగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే. ఈ ఆత్మహత్యలు మొత్తం దేశంలోనే విదర్భలో అధికం కావటం కూడా తెలిసిందే.

వైన్‌గంగ, నల్‌గంగ నదులు రెండూ విదర్భ ప్రాంతంలోనివే. సంవత్సరం పొడవునా ప్రవహించే సజీవ నది అయిన వైన్‌గంగ తూర్పు విదర్భలో, నదీ ప్రవాహం ఎప్పుడూ సరిగా ఉండని నల్‌గంగ పశ్చిమ విదర్భలో ఉన్నాయి. రెండింటిని కలుపుతూ 300 కిలోమీటర్ల కాలువ తవ్వుతారు. ఎత్తిపోతలు అవసరమైంది ఈ కాలువలో నీటిని పోసేందుకు. నల్‌గంగ నుంచి నీరు లభించేది కరువు కాటకాల మయమైన పశ్చిమ విదర్భ ప్రాంతానికి. ముఖ్యంగా అమరావతి డివిజన్‌కు. పశ్చిమ విదర్భలోని ఆరు జిల్లాల్లో అయిదు అమరావతి డివిజన్‌లో ఉన్నాయి. ఇవన్నీ వర్షాధారిత భూములే. ప్రాజెక్టులు లేవు.


దీనిపై రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా హామీలు ఇవ్వటం, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా విమర్శలు చేయటం మినహా రైతుల కోసం నికరంగా జరిగిందేమీ లేదు. అటువంటిది ఇపుడు మొదటిసారిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వ్యయప్రయాసలకోర్చి వైన్‌గంగ నీటిని ఎత్తిపోతల ద్వారా విదర్భకు తీసుకుపోయేందుకు సంకల్పించింది. నీటిని ఎత్తిపోయటం అవసరమని పథకంలో ఉన్నదే. కానీ అందుకయే ఖర్చుకు జంకటం వల్ల ఇంతకాలం పెండింగ్‌లో ఉండిపోయిన ఆ పథకాన్ని ముందుకుతీసుకుపోయేందుకు ఇప్పుడు ప్రేరణ అవుతున్నది కాళేశ్వర ఎత్తిపోతల పథకం కావటం గమనార్హం. కాళేశ్వరం అసలు మొత్తానికే మహారాష్ట్ర పథకాలకు పరోక్ష ప్రేర ణ అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఆ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం గల భూములు 18 శాతం మాత్రమే. ఇది జాతీయ సగటు కన్నా తక్కువ. అనేక నీటి పారుదల పథకాలు కాగితాలపై ఉండిపోయాయి. కొన్ని నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణ ఉదాహరణతో తమ ప్రాజెక్టులను వేగవంతం చేసుకోదలచినట్లు, ప్రభుత్వం అదే ఆలోచనతో ఉన్నట్లు నాం దేడ్ అధికారులు ఈ రచయితతో అన్నారు. వైన్‌గంగ నది వార్ధా నదితో కలిసిన తర్వాత ప్రాణహిత నదిగా మారుతుంది. అది చివరకి తెలంగాణ లో గోదావరిని చేరటం విశేషం. ఈవిధంగా, దక్కన్ పీఠభూమిలోని భాగాలై, నదులున్నప్పటికీ పథకాలకు నోచుకోక, అనేక సమస్యల్లో వర్షాధారిత స్థితి కూడా ఒకటి అయి, ఇంతకాలం కడగండ్ల పాలైన తెలంగా ణ, విదర్భలు రెండూ క్రమంగా జల సంపన్నం కానుండటం ఎంత గొప్ప విషయమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాళేశ్వరం వల్ల తెలంగాణ ఇప్పటికే ఆ దశను చేరుతుండగా, వైన్‌గంగ-నల్‌గంగ ద్వారా విద ర్భ రానున్నకాలంలో కరువు నుంచి విముక్తి చెందేందుకు మార్గం సుగ మం అవుతున్నది.
t-Ashok
ఇవే ప్రేరణలు కలిగిస్తున్న ఉత్సాహంతో అన్నట్లుగా, మహారాష్ట్ర ప్రభుత్వం లెండి ప్రాజెక్టు నిర్మాణాన్ని తిరిగి కొనసాగించేందుకు నిర్ణయించింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గోదావరి నదిపై చేపట్టిన లెండి ప్రాజెక్టు అక్కడి భూములతో పాటు, తెలంగాణ భూములకు నీరందించనున్న అంతరాష్ట్ర పథకం. తెలంగాణలో 22,000 ఎకరాలు, నాం దేడ్‌లో 27,000 ఎకరాలు సాగవుతాయి. కొన్ని కారణాల వల్ల కొంతకాలంగా నిలిచిపోయిన నిర్మాణాన్ని అతిత్వరలో, బహుశా ఇదే ఆగస్టు నెలలో తిరిగి ప్రారంభించనున్నట్లు నాందేడ్ అధికారులు ప్రకటించారు. సహకార ఫెడరలిజం అన్నది కేవలం రాజకీయం కాదు. కేవలం కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయం కాదు. రాష్ర్టాల మధ్య పరస్పర సహకారాలు కూడా ఈ పరిధిలోనివే అని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్రాష్ట్ర దౌత్యనీతి ఇదే మార్గంలో సాగుతున్నది.

239
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles