అనితర సాధ్యం ఆ మార్గం

Fri,August 9, 2019 01:27 AM

jaipal-reddy-politics
నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అని శ్రీశ్రీ అంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అలాంటిదే. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తాను నమ్మిన సిద్ధాంతాలకు, విలువలకు రాజీపడకుండా పోరాటం చేసిన ధీశాలి. 1996లో రాజకీయ పరిణామాలు ప్రతికూలంగా మారినప్పుడు మహబూబ్‌నగర్ నుంచి నామినేషన్ వేసి చివరి క్షణంలో పోటీ నుంచి విరమించుకున్నాడు. జనతాదళ్ పార్టీ హైకమాండ్ లక్ష్మీపార్వతి పార్టీ వైపు మొగ్గుచూపింది. ఆ పార్టీకి ప్రజ ల్లో బలం లేదు. అప్పుడు చంద్రబాబు ఆయనతో మీరు ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే నేను మద్దతిస్తానన్న ప్రతిపాదనతో ముందుకువచ్చినప్పు డు, ఒక పార్టీలో చేరడానికి కానీ, నిష్ర్కమించడానికి కానీ ఒక సిద్ధాంత నేపథ్యం కావాలని చెప్పి ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు ఆయన పోటీ చేయలేని నిస్సహాయతను చూసి ప్రముఖ పాత్రికేయుడు ఎ.బి.కె.ప్రసాద్ ఒక పత్రికలో ఒక వ్యాసం రాశారు. ఆయనను బ్రిటిష్ పార్లమెంట్‌ను తన వాగ్ధాటితోనే కాక పరిపాలనాదక్షతతో మలుపుతిప్పిన అలీవర్ క్రామ్‌వెల్‌తోను నాడు టోరీ పార్టీలో సాంఘిక సమానత్వాన్ని ప్రేమించి ప్రచారం చేసిన రాజకీయవేత్త రాబ్ బట్లర్‌తో పోల్చాడు. బట్లర్ భావకుడిగా, రాజకీయ మేధావిగా నాటి రాజకీయాల్లో పేరుగాంచిన వ్యక్తి. ఆయన భావాలు తన పార్టీలో నచ్చకపోయినా బట్లర్ ధోరణిలో మార్పు ఉండేది కాదు. ప్రగతిశీల విధానాలకు పేరుగాంచిన బట్లర్ భావాలకు నాటి లేబర్ పార్టీ నాయకుడు గైట్‌స్కెల్ భావాలకు పెద్ద తేడా ఉండేది కాదు. అందువల్ల రాజకీయవేత్తగా రెండు పార్టీల ప్రయోజనాలు సంఘర్షిస్తున్నప్పుడు వాటిని సాగదీయనీయకుండా మంచి సమన్వయకర్తగా వ్యవహరించేవాడు. అట్టి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిఘంటువుల్లోకి ఒక కొత్త పదం వచ్చి చేరింది. దాని పేరు బట్‌స్కెలిజం. అంతపెద్ద మేధావి కూడా చివరికి అత్యున్నత స్థానానికి చేరుకోలేకపోయాడు.

వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా జైపాల్‌రెడ్డి ఉదార లౌకిక ప్రజాస్వామ్యవాది. మత విషయాల్లో నిరీశ్వరవాది. తాత్త్విక దృక్పథంలో ఆజ్ఞేయవాది. ఆర్థిక విషయాల్లో మొదట సామ్యవాదిగా ఉన్నా మారిన ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఆయన సంక్షేమ ఆర్థిక వేత్తలైన అమర్త్యసేన్ వైపు మొగ్గుచూపాడు. రాజకీయాల్లో ఎంత తీరికలేకుండా ఉన్నా ఆయన అధ్యయనాన్ని ఎన్నడూ మానుకోలేదు. సమకాలీన రాజకీయవేత్తల్లో అంత అధ్యయనశీలత కలిగినవారు చాలా తక్కువ.


జైపాల్‌రెడ్డి కూడా తనదైన శైలితో, వాగ్ధాటితో వక్రోక్తులు, వ్యంగ్యోక్తులు దట్టిస్తూ అనర్గళమైన తన ఆంగ్ల పాండిత్యంతో ప్రసంగాలు చేస్తూ రాజకీయాలను రెండు దశాబ్దాల పాటు ప్రభావితం చేశాడు. నాటి ఢిల్లీ రాజకీయాల్లో ఆయన పాత్రను, వచోవైభవ శైలిని దృష్టిలో ఉంచుకొని ఒక పదం రాజకీయ సంభాషణల్లో ప్రాచుర్యం పొందింది. దానిపేరు జైపాలీజ్. ఆయన మిత్రులు ఆ పదాన్ని ఆయనను టీజ్ చేయడానికి వాడేవారని ప్రచారంలో ఉన్నది. ఆయన అసెంబ్లీలో ఉన్నా, పార్లమెంట్‌లో ఉన్నా తెలుగులో, ఆంగ్లంలో కొత్త కొత్త పదబంధాలను సృష్టించి ప్రసంగాలను రసమయం చేసేవాడు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంభీరంగా ఉన్న అసెంబ్లీ వాతావరణాన్ని అంజయ్య నల్లన, జుట్టు తెల్లన, కడుపు చల్లన అన్న పద కవితతో వాతావరణాన్ని చల్లబరిచాడని చెపుతారు. పార్లమెంట్‌లో కూడా ఘాట్ ఒప్పందాన్ని గాటోక్రసిగా (డెమోక్రసిలాగా), గ్లోబలైజేషన్‌ను కుంభకోణాలకు దారితీసే ఘోటాలైజేషన్ లాంటి కొత్త పదాలను సృష్టించి సన్నివేశాన్ని రసమయం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. గుజ్రాల్ మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు ఆయన ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయనతో నీవెంతో గౌరవనీయమైన ప్రముఖ వ్యక్తివి, నిన్ను మంత్రివర్గంలో తీసుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందని తెలుసు. అందుకే నీతోపాటు ఎవ్వరినీ మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదు అని ప్రధానమంత్రి జైపాల్ రెడ్డితో అన్నట్లు అప్పటి ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చింది. ఒక ప్రధాని తన సహచరుని గురించి అంత గొప్పగా మాట్లాడటం ఆ వ్యక్తి రాజకీయ జీవితంలో అంతకంటే గొప్ప పురస్కారం ఇంకొకటి ఉండదు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికంటే ముందు విలేకర్లతో మాట్లాడుతూ My Political Virginity is on the verge of being violated అని ఒక చలోక్తి విసురుతాడు. తన మనసులో చెలరేగిన భావాలను ఆ రకంగా వ్యక్తీకరించాడు. మంత్రివర్గంలో చేరిన వెంటనే ప్రసారభారతి బిల్లును ప్రవేశపెట్టి ప్రభుత్వ చెర నుంచి ప్రసార, ముద్రణ మాధ్యమాన్ని విడిపించడం జరిగింది.

జైపాల్‌రెడ్డి పదవుల కోసం తన సిద్ధాంతాలను, నైతిక విలువలను ఎప్పుడూ పణంగా పెట్టలేదు. 1971లో పీవీ తన మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేరమన్నప్పుడు తాను బ్రహ్మానందరెడ్డి గ్రూపునకు చెందినవాడినని ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో చేరటానికి అవకాశం ఉన్నా నైతికంగా అది సరైనది కాదని మానుకున్నాడు.


ప్రపంచంలో ఎక్కడా ప్రసార శాఖకు మంత్రి లేడు. మన దేశంలో కూడా ఇప్పటినుంచి అవసరం ఉండదని చెప్పాడు. వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా జైపాల్‌రెడ్డి ఉదార లౌకిక ప్రజాస్వామ్యవాది. మత విషయాల్లో నిరీశ్వరవాది. తాత్త్విక దృక్పథంలో ఆజ్ఞేయవాది. ఆర్థిక విషయాల్లో మొదట సామ్యవాదిగా ఉన్నా మారిన ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఆయన సంక్షేమ ఆర్థిక వేత్తలైన అమర్థ్య సేన్ వైపు మొగ్గుచూపాడు. రాజకీయాల్లో ఎంత తీరికలేకుండా ఉన్నా ఆయన అధ్యయనాన్ని ఎన్నడూ మానుకోలేదు. సమకాలీన రాజకీయవేత్తల్లో అంత అధ్యయనశీలత కలిగినవారు చాలా తక్కువ. హిస్టరీ నుంచి మిస్టరీ వరకు, సోక్రటీస్ నుంచి రామానుజాచార్యుల వరకు ఏ విషయమైనా సాధికారికంగా మాట్లాడగలడు. ఆయన రాసిన పుస్తకం టెన్ అయిడియాలోజీస్ సుదూర మానవ గమనంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసి న పది భావజాలాలను, వాటి పరిమితులను సోదాహరణంగా వివరించాడు. జైపాల్‌రెడ్డి పదవుల కోసం తన సిద్ధాంతాలను, నైతిక విలువలను ఎప్పుడూ పణంగా పెట్టలేదు. 1971లో పీవీ తన మంత్రివర్గంలో సహా య మంత్రిగా చేరమన్నప్పుడు తాను బ్రహ్మానందరెడ్డి గ్రూపునకు చెందినవాడినని ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో చేరటానికి అవకాశం ఉన్నా నైతికంగా అది సరైనది కాదని మానుకున్నాడు. వాజపేయి స్పీకర్ పదవిని ఇవ్వజూపినప్పుడు కూడా ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి తన నైతిక సైద్ధాంతిక నిబద్ధతను చాటుకున్నాడు. జార్జ్ ఫెర్జాండెజ్, మురళీ మనోహర్ జోషి లాంటి నాయకులు స్పీకర్ పదవి పార్టీలకు అతీతమైనదని నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ తన వైఖరి మార్చుకోలేదు. రాజకీయాల్లో ఎప్పుడూ సానుకూల పరిస్థితులు ఉండవు. రెండు పార్టీల మధ్య, రెండు సిద్ధాంతాల మధ్యనే కాకుండా అప్పుడప్పుడు రెండురకాల పరిస్థితుల మధ్య పోటీ వస్తుంది.

అప్పుడు మనం ఏ వైపు ఉన్నామనేది చాలా ముఖ్యమని ఆయన అంటాడు. ఉదాహరణకు ప్రధాని ఎంపిక విషయం వచ్చినప్పుడు సోనియా గాంధీతో పరిచయం లేనప్పటికీ లౌకికవాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె అభిప్రాయానికి అనుకూలంగా రాష్ట్రపతికి లేఖ రాయడం గమనార్హం. ఆ తర్వాత కూడా తన ఓటును వాజపేయికి వ్యతిరేకంగా వేసి ఆ ప్రభుత్వం పడిపోవడానికి కారణమయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా తన రాజకీయ జీవితంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరటం మేధావులకే కాకుండా మిత్రులకు కూడా నచ్చలేదు. బోఫోర్స్ విషయంలో కాంగ్రెస్‌తో తీవ్రంగా పోరాడి రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండి చివరికి కాంగ్రెస్ లో చేరటాన్ని ఎవరూ హర్షించలేదు. కానీ నాటి దేశ యవనికపై థర్డ్ ఫ్రంట్ అదృశ్యమైపోయింది. రాజకీయాలు ద్వైపాక్షిక ధృవీకరణ దిశగా పరిణామం చెందినవి. చంద్రబాబు బీజేపీ ఫ్రంట్‌లోకి వెళ్లాడు. తనకు ఎన్టీఆర్ లాగా ప్రజాకర్షణ శక్తి లేదు. తనకు మిగిలిన మార్గం కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదా రాజకీయాల నుంచి విరమించుకోవటం. రాజకీయాల నుంచి విరమించుకోవటమంటే యుద్ధరంగం నుంచి పలాయనం చేసినట్లవుతుంది. అప్పుడు జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటానికి ఇచ్చిన వివరణను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక సామాజిక మాధ్యమం ద్వారా గుర్తుచేశారు. దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం ఏర్పడినప్పుడు దేశంలో విచ్ఛిన్నకరశక్తులు పేట్రేగిపోతున్నప్పుడు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి ప్రమాదం ఏర్పడినప్పుడు చరిత్ర నా ముందు రెండు ప్రశ్నలు వేసింది. నీ అహంతో రాజకీయంగా వ్యవహరిస్తావా? లేదా చరిత్ర ఇచ్చే పిలుపునకు స్పందిస్తావా అని నన్నడిగితే చరిత్ర ఇచ్చే పిలుపునకు స్పందించి కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకొన్నాను అని చెప్పాడట. చరిత్ర మీద, రాజకీయ తాత్త్వికత మీద ఎంతో లోతైన అవగాహన లేకపోతే అటువంటి వివరణ ఇవ్వడం సాధ్యం కాదు.
manmadha-reddy
చివరికి రాజకీయ చరమాంకంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి తన వంతు పాత్ర నిర్వహించారు. కానీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎలక్షన్‌లో ఓడిపోయినందుకు కూడా ఆయన బాధపడలేదు. గెలుపోటములు సహజం అనుకున్నాడు. కానీ రాజకీయాల్లో నైతిక విలువ ల పతనం పట్ల, సిద్ధాంతరహిత రాజకీయాల పట్ల ఆందోళన వ్యక్తం చేసేవా డు. దురదృష్టవశాత్తు ఆయన ఆకస్మిక మరణం చెందినప్పుడు అన్ని రాజకీయపార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు విషణ్ణ వదనాలతో సం తాపం తెలియజేయడాన్ని ఆయనలోని విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నది. ముఖ్యంగా కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్‌కుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నైతిక విలువలకు, పరిపాలనాదక్షతకు పేరుగాంచిన కాకి మాధవరావు లాంటివారు విలపించిన సన్నివేశం అందరినీ కలిచివేసింది. రాజ్యసభలో వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటిస్తూ శోకతప్త హృదయం తో కన్నీళ్లను ఆపుకోలేని దృశ్యాన్ని చూస్తే ఎవరి గుండె అయినా బరువెక్కుతుంది. సిద్ధాంతాలు వేరైనా, పార్టీలు వేరైనా మనుషుల మధ్య ఆత్మీయత ను ఎలా పెంచుకోవాలో యావత్ దేశం వాళ్లను చూసి నేర్చుకోవాలి. ఆయ న విలువల్లో కొన్నయినా మనం పాటించడమే ఆయనకు నిజమైన నివాళి.

245
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles