క్విట్ ఇండియా

Sat,August 10, 2019 01:07 AM

గాంధీజీ దక్షిణాఫ్రికా పోరాట నేపథ్యం గురించి ఆయన ప్రవచిస్తున్న సత్యం, అహింస, సత్యాగ్రహం సిద్ధాంతాల గురించి విన్నవారు, తెలిసినవారు కొందరు, ముఖ్యంగా మోతీలాల్‌నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి పెద్ద నాయకులు మొదట ఈయన వల్ల, ఈయన శాంతియుత విధానాల వల్ల ఏమవుతుంది! అని పెదవి విరిచి తర్వాత కొంతకాలానికి వాళ్లే గాంధీజీ ప్రధాన అనుచరులైనారు. 1917 నుంచి 25 ఏండ్లు ఉద్యమాలు నిర్వహించిన గాంధీజీ ఓరిమిని కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు. గాంధీజీ ఇక అంతిమ సమరానికి నడుం బిగించి క్విట్ ఇండియా పిలుపు ఇవ్వడానికి చొరవ తీసుకొని నడుం బిగించారు. 1942 జూలై 14న వార్ధాలో సమావేశమై భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.

Prabhakarraoo
డెబ్భై ఏడేండ్ల కిందటి నిన్నటి రోజు ఆగస్టు 9 భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించవలసిన ఉజ్వల ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా (భారత్ ఛోడో) నినాదంతో గాంధీజీ బ్రిటిష్ పాలకులకు భారత ప్రజల శాంతియుత సమర అంతిమ శంఖారావాన్ని వినిపించిన చరిత్రాత్మకమైన రోజది. మూడేండ్లు లండన్ ఉన్నత విద్యార్జన జరిపి, బారిస్టర్‌గా స్వదేశం తిరి గివచ్చి, 1893లో న్యాయవాదిగా దక్షిణాఫ్రికా వెళ్లి, అక్కడే అనేక సంవత్సరాల నుంచి స్థిరపడిన భారతీయుల, ఇతర నల్లజాతీయుల ప్రాథమి క హక్కుల కోసం అపూర్వరీతిలో శాంతియుత సత్యాగ్రహ ఉద్యమాలు నిర్వహిస్తున్న గాంధీజీ స్వదేశం తిరిగివచ్చి భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించాలని అప్పటికే అఖిల భారత ఉద్యమ నాయకులుగా ప్రసిద్ధి పొందిన లోక్‌మాన్య బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే అభ్యర్థించారు.

తమను దిక్కులేనివారుగా చేసి గాంధీజీ స్వదేశం వెళ్లవద్దని దక్షిణాఫ్రికా ఉద్యమకారులు ఒత్తిడి తెచ్చారు. దక్షిణాఫ్రికాలో 22 ఏండ్లు విరామరహిత జీవితం గడిపిన, తన శాంతియుత సమర విధానాలకు దక్షిణాఫ్రికాను ఒక ప్రయోగశాలగా మార్చిన గాంధీజీ దక్షిణాఫ్రికా ఉద్యమాల పట్ల ఎంతటి సానుభూతి ఉన్నప్పటికీ అగ్రజులు తిలక్, గోఖలే అభ్యర్థనను, వారి మాటను తృణీకరించలేకపోయారు. వారి మాటను గౌరవించి గాంధీజీ 1915 జనవరి 9న బొంబయిలో నౌక దిగి స్వదేశం నేలపై అడుగుపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో అతివాదులకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌మాన్య బాలగంగాధరతిలక్, మితవాదులకు నాయకత్వం వహిస్తున్న గోపాలకృష్ణ గోఖలే తమ సైద్ధాం తిక, విధానపర విభేదాలకు అతీతంగా, నాటి క్లిష్ట పరిస్థితిలో గాంధీజీ సారథ్యం, నేతృత్వం భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాలకు అత్యావశ్యకం, అనివార్యం అనుకున్నారు.

దక్షిణాఫ్రికాలో తాడితుల, పీడితు ల, జాతి విద్వేష బాధితుల కనీస ప్రాథమిక హక్కుల కోసం అవమానాలను, అక్రమాలను, దౌర్జన్యాలను, అమానుష చర్యలను, పాలకుల అధికార దుర్వినియోగాన్ని సహిస్తూ నిర్విరామ ఉద్యమాలు నిర్వహిస్తున్న గాంధీజీ స్వదేశంతో సంబంధాలు తెంచుకోలేదు, భారత జాతీయ కాం గ్రెస్‌తో సంబంధాలు కొనసాగించారు. కలకత్తా కాంగ్రెస్ మహాసభలో స్వయంగా పాల్గొని గాంధీజీ దక్షిణాఫ్రికా భారతీయుల పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాశ్వతంగా స్వదేశం తిరిగివచ్చిన గాంధీజీకి ఆయన రాజకీయ గురువు గోఖలే ఏడాది పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతటా పర్యటించి, అట్టడుగు ప్రజల మధ్యకు వెళ్లి ఇక్కడి పరిస్థితులను గమనించం డని సలహా ఇచ్చారు.

మోకాళ్ల మీదికి ముతక ధోతి కట్టి, అంగి కూడా లేని భుజాలపై ఒక పంచె కప్పుకొని, మూడవ తరగతి రైలు పెట్టెలలో ప్రయాణిస్తూ, కాలినడకన తిరుగుతూ దరిద్ర నారాయణ రూపంతో గాం ధీజీ దేశమంతటా, మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించి ఇక్కడి దుర్భర పేదరికాన్ని, దారిద్య్రాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అపరిశుభ్రతను, కులమత వ్యత్యాసాలను, వైషమ్యాలను, స్పర్ధలను గమనించి అమితాందోళనకు గురైనారు. కానీ ఆయన ఎంతమాత్రం అధైర్యపడలే దు. దక్షిణాఫ్రికా పోరాటాల్లో ఎన్నో కష్టాలు అనుభవించిన గాంధీజీ ముందు రెండు మార్గాలు కన్పించాయి; ఒకటి తోడో మార్గం, రెండవది జోడో మార్గం. గాంధీజీ తన సహజ స్వభావంతో, తన విశ్వాసాలకు అనుగుణంగా జోడో మార్గాన్ని అనుసరించాలనుకున్నారు. అతివా దం, మితవాదం ఘర్షణలతో ఛిద్రమవుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌ను జుడాయించడం, తద్వారా భారత స్వాతంత్య్ర ఉద్యమానికి సమర్థవంత నాయకత్వం అందివ్వడం మొదటి కర్తవ్యమని, స్వాతంత్య్ర సమరంలో క్రియాశీల భాగస్వాములు కావడానికి సమాజంలోని అన్ని వర్గాల, అన్ని విశ్వాసాల ప్రజలను ఏకం చేయడం రెండవ కర్తవ్యమని గాంధీజీ భావించారు.

బ్రిటిష్ పాలనను అంతం చేసి, భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం, దాదాపు రెండు వందల ఏండ్ల బానిస బంధనాలను బద్దలు చేయ డం పరమ లక్ష్యాలుగా లేస్తూ పడుతూ, పడుతూ లేస్తూ కొనసాగుతున్న స్వాతంత్య్ర సమరానికి గాంధీజీ సమన్వయవాద దృక్పథంతో నాయక త్వ బాధ్యతను స్వీకరించారు. గాంధీజీ దక్షిణాఫ్రికా పోరాట నేపథ్యం గురించి ఆయన ప్రవచిస్తున్న సత్యం, అహింస, సత్యాగ్రహం సిద్ధాంతా ల గురించి విన్నవారు, తెలిసినవారు కొందరు, ముఖ్యంగా మోతీలాల్‌నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి పెద్ద నాయకులు మొదట ఈయన వల్ల, ఈయన శాంతియుత విధానాల వల్ల ఏమవుతుంది! అని పెదవి విరిచి తర్వాత కొంతకాలానికి వాళ్లే గాంధీజీ ప్రధాన అనుచరులైనారు.

ఆయన వల్లనే అవుతుందని క్రమంగా గ్రహించారు. సాయుధ పోరాటంలో నమ్మకం ఉన్న తీవ్రవాదులు, విప్లవకారులు, సామ్యవాద భావాలచే ప్రభావితులైన సోషలిస్టులు, కమ్యూనిస్టులు-రాజులు, మహారాజులు, రాణులు, శ్రీమంతులు, నిరుపేదలు, పారిశ్రామిక-వాణిజ్య అధిపతు లు, అన్నివర్గాలు, వృత్తులవారు గాంధీజీ నాయకత్వ ఛత్రం కిందికి వచ్చా రు. ఉద్యమ విధానంలో గాంధీజీతో తీవ్రంగా విభేదించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహామేధావి సి.రాజగోపాలచారి వంటివారు కూడా గాంధీజీ నాయకత్వంలో, ఆయన నీడలో నడిచారు. మొదటి నుంచి గాంధీజీ తన ఉద్యమాల్లో, నిర్మాణ కార్యక్రమాల్లో గ్రామీణ భారతానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చి, ఇక్కడి స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం చేపట్టిన తర్వాత గాంధీజీ నిర్వహించిన మొదటి ఉద్యమ కార్యక్రమం చంపారన్ సత్యాగ్రహం 1917 ఏప్రిల్ 19న ప్రారంభమైంది. బీహార్‌లోని పక్కా గ్రామీణ ప్రాంతం చం పారన్. గాంధీజీ సత్యాగ్రహంలో చంపారన్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది.

పాట్నాలో ప్రముఖ న్యాయవాది బాబూ రాజేంద్రప్రసాద్ తన ధనార్జన వృత్తిని వదిలిపెట్టి గాంధీజీ అనుచరుడిగా మారింది చంపారన్ సత్యాగ్ర హం రోజుల్లోనే. మహాత్ముడు గాంధీజీ అహింసా ప్రవక్త, శాంతిదూత. ఆయన అంతేగాక, సాటిలేని మేటి ఉద్యమ వ్యూహకర్త అని, పదిమంది చాణక్యులను మించిన రాజనీతిజ్ఞుడని, రాజకీయ చతురుడని, తన సిద్ధాంతాల విషయంలో ఎన్నడూ ఎక్కడా ఎవరితోను రాజీపడని మహా నాయకుడని, ప్రత్యర్థుల (బ్రిటిష్ పాలకుల) కీలెరిగి వాతపెట్టడం లో గాంధీజీని మించిన దక్షులు ప్రపంచంలో ఇంకెవరూ లేరని ఆయన ఉద్యమాల చరిత్ర వెల్లడిస్తున్నది. గాంధీజీ 25 ఏండ్లు విడువకుండా నిర్వహించిన సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన శాంతియుత సత్యాగ్రహ ఉద్యమాలతో బానిస భారతదేశంలో బ్రిటిష్ పాలన తీవ్రంగా బలహీనపడింది. వైష్ణవ జనతో గీతం ఆయనకు చాలా ఇష్టమైనప్పటికీ గాంధీజీ కులమతాల కుళ్లుకు అతీతుడైన మహోన్నత మానవతావాది. చంపారన్ తర్వాత గాంధీజీ నేతృత్వంలో సైమన్ కమిషన్ బహిష్కరణ (1929), దండి ఉప్పు సత్యాగ్రహం (1930 మార్చి) బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించాయి. భారతదేశంలో ఇక తమ పాలన పునాదులు కూలిపోతున్నాయని బ్రిటిష్ పాలకులు భయపడ్డారు. భయపడ్డారు గాని బ్రిటిష్ పాలకులు తప్పులు చేయకుండా ఉండలేదు.

రెండవ ప్రపంచయుద్ధం 1939 సెప్టెంబర్‌లో ప్రారంభమైన తర్వాత (ఈ యుద్ధంలో బ్రిటన్, అమెరికా-యూఎస్‌ఏ, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ తదితర మిత్రదేశాలది ఒక కూటమి. ఈ కూటమికి వ్యతిరేకంగా నాజీ, ఫాసిస్టు దేశాల జర్మనీ, ఇటలీ, జపాన్ కూటమి నిలిచింది). బ్రిటిష్ పాలకుల వైఖరిలో మార్పు వస్తుందని, భారత దేశానికి స్వాతంత్య్రం లభిస్తుందని భావించినవారికి ఆశాభంగం తప్పలేదు. వినాశ కాలానికి విపరీత బుద్ధి అంటారు. బ్రిటన్ తన విపరీత బుద్ధిని ప్రదర్శించింది. భారత స్వాతంత్య్రానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తే రెండవ ప్రపంచయుద్ధంలో తమ సహకారం బ్రిటన్‌కు లభిస్తుందని భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని బిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ తిరస్కరించాడు. 1941 నాటికి జర్మనీ అధినేత హిట్లర్ నాయకత్వంలో ఫాసిస్టు, నాజీ శక్తులు హఠాత్తుగా విజృంభించి ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాలను ఆక్రమించాయి. అటు జపాన్ యూఎస్‌ఏలోని పెర్ల్ హార్బర్‌ను బాంబుల వర్షంతో ధ్వం సం చేసి ఇటు బర్మా వరకు చొచ్చుకవచ్చింది.

ప్రపంచయుద్ధంలో ఫాసిస్టు, నాజీ శక్తుల విజృంభణను చూసి ఆందోళన చెందిన అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్, అప్పటి చైనా అధ్యక్షుడు చాంగ్‌కైషేక్, కొందరు ట్రిటన్ లేబర్ పార్టీ నాయకులు బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మీద ఒత్తిడి తెచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్‌తో రాజీపడి ప్రపంచ యుద్ధంలో ఫాసిస్టు దేశాలకు వ్యతిరేకంగా భారతదేశం సహకారం పొందాలని, ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్రధాని చర్చిల్ భారతదేశం పంపిన స్టాఫర్డ్‌క్రిప్స్ కేబినెట్ మిషన్ తన ప్రయత్నాల్లో విఫలమైంది. క్రిప్స్ ప్రతిపాదించిన డొమినియన్ స్థాయికి భారత జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. ఆ క్లిష్ట పరిస్థితిలో 1942 జూన్ ప్రారంభంలో ప్రఖ్యాత పాత్రికేయుడు, రచయిత లూయిస్ ఫిషర్ జరిపిన ఒక ఇంటర్వ్యూ లో గాంధీజీ అన్నారు-I have become impatient..
1917 నుంచి 25 ఏండ్లు ఉద్యమాలు నిర్వహించిన గాంధీజీ ఓరిమి ని కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు. గాంధీజీ ఇక అంతిమ సమరానికి నడుం బిగించి క్విట్ ఇండియా పిలుపు ఇవ్వడానికి చొరవ తీసుకొని నడుం బిగించారు. 1942 జూలై 14న వార్ధాలో సమావేశమై భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఏఐసీసీ 1942 ఆగస్టు 8 అర్ధరాత్రి బొంబైలో సమావేశమై ఈ తీర్మానాన్ని ఆమోదించింది వేలాది ప్రజల హర్షధ్వానాల మధ్య. బొంబై సమావేశంలో గాంధీజీ తమ చరిత్రాత్మక ప్రసంగంలో ఇచ్చిన ఈ పిలుపు మహత్తరమైనది... ...NOTHING LESS THAN FREEDO -M...I give you a MANTRA-DO OR DIE....ఈరోజు గాంధీజీ లేరు. ఆయన సిద్ధాంతాలను అసహన జ్వాలల్లో ఆహుతి చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి.

205
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles