ప్రజాస్వామ్య పతనానికి కుట్రలు

Sun,August 11, 2019 05:12 AM

హిట్లర్ ఆధ్వర్యంలో గోబె ల్స్ ప్రచారం గురించి చదువుకోవడమే కానీ, అదెట్లా సాగుతుందో మన అనుభవం లో లేదు. కానీ ఇటీవల వాట్సాప్ ద్వారా ప్రజాస్వామ్య భావజాలంపై ఒక పద్ధతి ప్రకారం విషం చిమ్మడం చూస్తుంటే, మన దేశానికి పెద్ద ప్రమా దం ముంచుకొస్తున్నదనిపిస్తున్నది. ఈ ప్రచారం ఎంత దురుసుగా సాగుతున్న దీ అంటే, ప్రజాస్వామ్య భావజాలం ఏయే రూపాల్లో ఉందో పసిగట్టి, ధ్వం సం చేయడం కోసమే అబద్ధాలు అల్లి పెడుతున్నారు. అవి చదివేవారికి ప్రజా ప్రతినిధులపై నమ్మకం పోతుంది. లౌకికవాద, బహుళత్వ భావన నశించిపోతుంది. మన దేశం ప్రజాస్వామ్య బాటను ఎంచుకోవడానికి, సుస్థిరపడటానికి కీలక పాత్ర పోషించిన నెహ్రూ వంటి నాయకుల ఔన్నత్యాన్ని కట్టుకథలతో దెబ్బకొట్టాలనే కుట్రలు సాగుతున్నయి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర యోధుల ను విలన్లుగా, ఆనాడు విభజించి పాలించే బ్రిటిష్ అజెండాలో పాత్రధారులైన వారిని దేశభక్తులుగా చిత్రీకరించే కుట్ర ఇది. స్వాతంత్య్రోద్యమంలో అగ్రశ్రేణి పాత్ర పోషించిన వారిలో ఎంతోమంది రాజనీతి కోవిదులు ఉన్నారు. సామాజ్యవాదంపై పోరాటం చేసిన వీరు ఆనాటి కమ్యూనిస్టు వ్యవస్థలను కూడా కండ్లచూశారు. అన్నిటిపై అవగాహనతో మన దేశానికి ప్రజాస్వామ్య విధానమే మంచిదని నిర్ణయించారు. విదేశీ పెట్టుబడులపై ఆధారపడకుండా మన దేశం స్వావలంబన సాధించేందుకు కృషిచేశారు. ప్రజాస్వామ్య వ్యవ స్థ పాదుకునేందుకు గట్టి పునాదులు వేశారు. సామ్రాజ్యవాదులకు పక్కలో బల్లెం మాదిరిగా కమ్యూనిస్టులు చెలరేగిపోతున్న కాలమది. సోవియెట్ యూనియ న్, చైనా తదితర దేశాలు సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు ఇచ్చేవి. ఈ కాలమంతా సామ్రాజ్యవాదశక్తులు నంగినంగి ఉన్నయి. సోవియెట్ యూనియ న్ కూలిపోయి, చైనా పెట్టుబడిశక్తులకు సాష్టాంగపడటంతో-ఈ సామ్రాజ్యవాద శక్తులకు మళ్ళా ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని వనరులపై కన్నుపడ్డది. భారత్ వంటి దేశాలలో ప్రజాస్వామ్యాన్ని కూలదోయాలంటే మొదట ఇక్కడి ప్రజలకు ప్రజాస్వామిక వ్యవస్థ మీద ద్వేష భావం కలిగించాలనే వ్యూహం అమలవుతున్నది.

సంస్కరణోద్యమానికి ఐదు వందల ఏండ్లు నిండిన సందర్భంగా 2017 అక్టోబర్‌లో ఇరు మత శాఖలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. జరిగిన విషాదానికి వారిలో ఎంతో పశ్చాత్తాపం కనిపించింది. గతం ఎట్లాగూ మారదు కనుక, ఆ అనుభవాలను తమ మధ్య ఉన్న వైరుధ్యాలను అధిగమించే ఆకాంక్షలుగా మార్చుకుందామని వారు తమ ఉమ్మడి ప్రకటనలో అభిలషించారు. ఇప్పటికీ తమలో విభేదాలున్నాయనీ, కానీ వాటికన్నా ఏకత్వం మరింత ఉందని గ్రహించారు. ఎంత గొప్ప పరివర్తన!


సామ్రాజ్యవాదులకు నెహ్రూ మీదా, నెహ్రూ భావజాలం మీద ఎంత కసి ఉన్నదో ఈ వాట్సాప్ సందేశాలను గమనిస్తే తెలుస్తుంది. నెహ్రూ కుటుంబీకులు మొఘల్ దర్బారులోని ఒక ప్రముఖుడి వారసులని, వారు రహస్యంగా హిందు పేర్లు పెట్టుకొని మన దేశాన్ని నాశనం చేస్తున్నారనేది ఒక వాట్సాప్ కథనం! వాళ్ళ పేర్లన్నీ ఖాన్ అని ఉంటాయట! సర్దార్ వల్లభాయి పటేల్ ప్రధాని కావలసి ఉండగా గాంధీ అడ్డుకొని నెహ్రూను చేశారనేది మరో కథనం. ఇం దుకు పీసీసీ అధ్యక్షులంతా పటేల్ వైపు మొగ్గారనే కథనాన్ని ప్రచారంలో పెడుతున్నారు. వాస్తవానికి పీసీసీ అధ్యక్షులు ప్రధానిని ఎన్నుకోరు. నెహ్రూ ప్రధాని అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జె.బి.కృపలానీ. 1929లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నాటినుంచి నెహ్రూ దేశవ్యాప్తంగా గాంధీ తరువాత మళ్ళా అంతటిస్థాయిలో పేరుపొంది ఉన్నారు. ప్రధానిగా దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయి నెహ్రూకే ఉన్నట్టు చరిత్ర నిరూపించింది. ఇప్పుడు కొందరు ప్రచారం చేస్తున్నట్టు- పటేల్ ఏనాడూ కొన్ని మత సంస్థలకు అనుకూలంగా లేడు. రెండు ప్రపంచయుద్ధాల తరువాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల పట్ల, ఆక్రమణల పట్ల ఆనాడు అంతర్జాతీయ ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో వందలాది రాజ్యాలను మన దేశంలో విలీనం చేసుకోవడం అసాధారణం.పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ముస్లిం జనాభా అధికంగా గల కశ్మీర్‌ను మనవైపు ఆకర్షించడం కూడా నెహ్రూ, ఆయన నిర్మించుకున్న బృందం ఘనత. కానీ నాటి చరిత్రను వక్రీకరించి నెహ్రూపై బురద జల్లే ప్రయత్నం సాగుతున్నది. అమెరికా అణ్వస్త్ర సహాయం చేస్తామంటే నెహ్రూ తన శాంతి విధానం మూలంగా వద్దన్నాడనేది మరో వాట్సాప్ ప్రచారం. నిజానికి భారత అణ్వస్త్ర పరిశోధన 1944 లోనే జరిగింది. ఇంకా ముందే హోమీభాభా తన పరిశోధనలకు ముందు నెహ్రూతో చర్చలు జరిపారు. ఆ తరువాతే 1945లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చి స్థాపన జరిగింది. స్వాతంత్య్రం రావడానికి ముందే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్థాపన జరిగింది. ఆనాడు విదేశాలలో చదువు ముగియక ముందే పరిశోధకులతో నెహ్రూ స్వయంగా మాట్లాడుతూ దేశానికి పిలిపించుకునేవారు.

వారితో వ్యక్తిగత పరిచయం పెట్టుకొని ప్రోత్సహించారు. అణు విజ్ఞానం మొదలుకొని అంతరిక్షం వరకు అన్నిరంగాలలో భారత్ వెలిగిపోవడానికి కారణం నెహ్రూ వేసిన బాట లే. ఐఐటీలు పెట్టింది కూడా నెహ్రూ కాలంలోనే. శాస్త్ర విజ్ఞానంలో, రక్షణరంగంలో భారత్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది అమెరికా కాగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించింది సోవియెట్ యూనియన్. భారత్‌ను అస్థిరత్వం పాలు చేయడానికి పాశ్చాత్య దేశాలు పన్నిన కుట్రలు అనే కం. మన పొరుగునే ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ప్రభుత్వాలను కూలగొట్టి సైనిక పాలన నెలకొల్పి, అక్క డి వనరులను కొల్లగొట్టిన ఘనత పాశ్చాత్య దేశాలది. సౌదీ అరేబియా వంటి అర బ్బు దేశాలలో తన సైన్యాన్ని పెట్టి ప్రజాస్వామ్యం నెలకొనకుండా రాచరికాలను కాపాడుతున్నది అమెరికా కూటమి. జాతులు, మతాల పేర ప్రజలను విడదీసి రక్తపుటేరులను పారిస్తూ, తమ పెత్తనాన్ని కాపాడుకోవడం సామ్రాజ్యవాదుల నైజం. ఇన్ని అంతర్జాతీయ కుట్రల మధ్య దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుతూ, స్వావలంబన సాధించి, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడిన ఘనత నెహ్రూకు, ఇతర నాయకులకు దక్కుతుంది. ప్రజా ప్రతినిధులను కించపరిచే భావజాలం కూడా ఈ మధ్య ప్రచారమవుతున్నది. ప్రజా ప్రతినిధికి ఇచ్చే జీతభత్యాలు తగ్గించాలని, పింఛన్లు ఇవ్వవద్దనేది వాట్సాప్‌లో ప్రచారం. బ్యూరోక్రాట్ల కన్నా, మేధావివర్గం కన్నా ప్రజాప్రతినిధే తన సహజాతం కొద్దీ ప్రజల గురించి ఎక్కువ పట్టించుకుంటాడనేది స్పష్టం. ఎంత దిగజారిపోయి ఉన్నా, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదు. మనకు దేశ భక్తి ఉంటే ఈ ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థను మరింత మెరుగుపరుచుకోవాలె. కానీ ప్రజాప్రతినిధ్య వ్యవస్థనే బలహీనపరుచడం సరికాదు. ఒక నిజాయితీపరుడైన ప్రజాప్రతినిధికి అయ్యే ఖర్చు లెక్కగట్టడం కష్టం. వారికి ఉండే ఈ మాత్రం వేతనా లు లేకుండా చేస్తే, ఇక రాజకీయాలలోకి ఎవరు వస్తారు?

మత విద్వేషాలను రెచ్చగొట్టే వాట్సాప్ కథనాలు కూడా ప్రచారమవుతున్నయి. ఈ నేపథ్యంలో యూరప్ అనుభవాల మనం పాఠాలు నేర్చుకోవాలె. యూరప్ సమాజం 1524 నుంచి పదిహేడవ శతాబ్దం ప్రథమార్ధం వరకు దాదాపు 125 ఏం డ్లు మత యుద్ధాలతో రగిలిపోయింది. ఎంతో రక్తపాతం సాగింది. ఆ తరువాత కాలంలో హింసా ద్వేషాలు సమాజానికి మేలు చేయవని వారికి అర్థమైంది. ఎన్నో నిరంకుశాలను, జాత్యహంకారాలను యూరప్ ప్రజలు అనుభవించారు. వాటి నుం చి బయటపడే క్రమంలోనే ప్రజాస్వామ్యం వికసించింది. మత విద్వేషాల స్థానంలో సామరస్యం చోటుచేసుకున్నది. జాతులు, మతాలు, భావజాలాలు వేరైనా పరస్ప రం గౌరవించుకోవాలనే భావన బలపడ్డది. మతాన్ని రాజకీయాల నుంచి విడదీసి లౌకికపాలన నెలకొల్పుకున్నారు. నీవు చెప్పే విషయంతో నేను ఏకీభవించక పోవ చ్చు, కానీ చెప్పడానికి నీకుండే హక్కు కోసం ప్రాణమిచ్చి పోరాడుతా అనే వాల్టేర్ మాటలు ప్రజాస్వామ్య భావనకు పునాది. మార్టిన్ లూథర్ ప్రతిపాదనల మూలంగా యూరప్‌లో ప్రొటెస్టెంట్ ఉద్యమం మొదలై కాథలిక్ చర్చితో విభేదించిన తరువా త ఎన్నో యుద్ధాలు సాగిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణోద్యమానికి ఐదు వందల ఏండ్లు నిండిన సందర్భంగా 2017 అక్టోబర్‌లో ఇరు మత శాఖలు ఒక సం యుక్త ప్రకటన విడుదల చేశాయి. జరిగిన విషాదానికి వారిలో ఎంతో పశ్చాత్తాపం కనిపించింది. గతం ఎట్లాగూ మారదు కనుక, ఆ అనుభవాలను తమ మధ్య ఉన్న వైరుధ్యాలను అధిగమించే ఆకాంక్షలుగా మార్చుకుందామని వారు తమ ఉమ్మడి ప్రకటనలో అభిలషించారు. ఇప్పటికీ తమలో విభేదాలున్నాయనీ, కానీ వాటికన్నా ఏకత్వం మరింత ఉందని గ్రహించారు. ఎంత గొప్ప పరివర్తన! ఏ దేశంలోనైనా లౌకికత్వం వెలుగులోనే శాస్ర్తాభివృద్ధి జరిగింది. మతం బలపడగానే శాస్త్రవిజ్ఞానం పలుచనై సమాజం బానిసత్వంలోకి పోయింది. భారత్‌లో గణి తం, వైద్యం, ఖగోళం వంటి శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందింది. మహమ్మద్ ప్రవక్త తన ఉద్యమాన్ని ప్రారంభించిన తరువాత అరబ్బు సమాజం ఇటు భారత్ నుంచి, అటు యూరప్ నుంచి అనేక పుస్తకాలను తెప్పించుకొని, ఒక ఉద్యమంగా తమభాషలోకి అనువాదం చేసుకొన్నది.
p-venkatesham
ఎనిమిదవ శతాబ్దం మొదలుకొని కొన్ని వందల ఏండ్లు అరబ్బులకు అది స్వర్ణయుగం. ఇప్పుడు అరబ్బు ప్రపంచం ఎట్లున్నదో చూస్తూనే ఉన్నాం. శాస్త్రవిజ్ఞానమే యూరప్ సమాజాన్ని ప్రపంచ నాయకత్వంలో నిలబెట్టింది. ఏ దేశాన్నయినా బానిసత్వంలోకి నెట్టాలంటే విద్వేష రాజకీయాలను పెంచిపోషించడం సరైనమార్గమని పెత్తందారీ దేశాలు, కార్పొరేట్ సంస్థలకు తెలుసు. స్మార్ట్‌ఫోన్లు తప్ప సమాజం, రాజనీతి గురించి ఏ మాత్రం తెలువని కొత్తతరం పిల్లలకు కట్టుకథలు చెప్పి మన నాయకుల మీద, ప్రజాస్వామిక వ్యవస్థ మీద ఆగ్రహాన్ని నూరిపోస్తున్నారు. మన దేశాన్ని, సామాజిక సామరస్యాన్ని నాశనం చేసి, సామ్రాజ్యవాదుల కాళ్ళ దగ్గర పెట్టే కథనాలను ప్రసారం చేయడం దేశభక్తి కింద చెలామణి కావడం ఇంకా దారుణం.

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles