వృద్ధిచెందినవాడే వృద్ధుడు

Mon,August 12, 2019 01:28 AM

gopi-n
వృద్ధాప్యం ఒక ఆషామాషీ వ్యవహారమూ, విషయమూ, స్థితీ కాదు. దాదాపు పది, పదిహేనేండ్ల కిందట జాతీయ వారపత్రి క ఇండియా టుడే తెలుగులో వృద్ధ భారతం అనీ, ఇంగ్లి ష్‌లో గ్రేయింగ్ ఇండియా అన్న మకుటంతోనూ ఒక విలువైన ప్రత్యేక సంచికను వెలువరించింది. నేనైతే అది చదివి బాధాతప్త ఉద్విగ్నతతో చలించిపోయాను. ఒక వృద్ధ బిచ్చగత్తె, ఒక వరిష్ఠ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సకల సంపదలూ ఉండీ తమ పిల్లల చేత అత్యంత నిరాదరణకు గురై డస్ట్‌బిన్‌లో వేస్ట్ పేపర్ వలె ఒక విలాసవంతమైన భవనంలోని అబాండెండ్ గదిలో పాత సామాన్లలో ఒక పనికిరాని వస్తువుగా విసిరేయబడిన మనిషిగా జీవిస్తున్న ఒక వృద్ధ మాత, ప్రయోజకులైన ఇద్దరు పిల్లలున్నా ఢిల్లీ లాంటి మహానగరంలో ఒకప్పుడు ఒక పెద్ద పబ్లిక్ స్కూల్‌కు ప్రిన్స్‌పాల్‌గా పనిచేసి పదవీ విరమణానంతరం ఒక ఉన్నత విద్యావంతురాలైన మాతృమూర్తి కారణాలేవైనా ఒక పార్క్ పక్కరోడ్డు పైననే చెట్టుకింద అభాగ్యగా జీవిస్తుండటం.. వంటి అనేక ఘటనలను పాత్రికేయులు అక్షరబద్ధం చేసిన సందర్భాలను చదివినపుడు కొడిగడుతున్న దీపశిఖలా విలవిల్లాడిపోయాను. వీళ్ళందరినీ సమీకృతపరిచి సారాంశాన్ని వడగట్టినపుడు అందరూ ముక్తకంఠంతో చెప్పిన ఒకేఒక్క వేదనాభరిత వాక్యమేమిటంటే అయ్యా.. మమ్మల్ని కూడా ఒకప్పటి ప్రయోజకులైన పౌరులుగా గుర్తించి రవ్వంత ప్రేమనూ, ఆత్మీయతనూ పంచండి.. పూర్తిగా పనికిరాని పాత సామానుగా భావించి మమ్మల్ని ప్రాణముండగానే చంపేయకం డి.. నిరాదరణకు గురిచేసి విస్మరించకండి ప్లీజ్.. అన్న దయనీయ విన్నపం. అప్పటి నుంచి మదర్‌థెరిసా చెప్పిన బి కైండ్ అన్న ఏక పద బోధ నిరంతర తేజశ్చక్రమైనా మనోఫలకంపై జ్వలిస్తూనే ఉన్నది. ఎన్.గోపి గారు ఇప్పుడు తన ఇరువై ఐదవ సంపుటిగా వెలువరించిన వృద్ధోపనిషత్ అనే ఈ కావ్యం ఒక కొత్త కిటి కీని తెరిచి ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురయ్యే అతి కీలక జీవన పార్శ్వాలను హృదయంతో విశ్లేషిస్తూ ఎంతో ఆశావహమైన ఆశంసతో అందించారు.

ఎన్.గోపి గారు ఇప్పుడు తన ఇరువై ఐదవ సంపుటిగా వెలువరించిన వృద్ధోపనిషత్ అనే ఈ కావ్యం ఒక కొత్త కిటి కీని తెరిచి ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురయ్యే అతి కీలక జీవన పార్శ్వాలను హృదయంతో విశ్లేషిస్తూ ఎంతో ఆశావహమైన ఆశంసతో అందించారు. ఒక వస్తువునూ, సందర్భాన్నీ, ఘటననూ, ప్రత్యేకించి మానవజీవితాన్ని బహుముఖమైన కోణాల్లో, పార్శ్వాల్లో, సమగ్రంగా, విపులంగా ఒక సమ్యక్ దృష్టితో చూడగలగడం (చూపుతో కాదు) ఒక విలక్షణమైన ప్రతిభ.


ఒక వస్తువునూ, సందర్భాన్నీ, ఘటననూ, ప్రత్యేకించి మానవ జీవితాన్ని బహుముఖమైన కోణాల్లో, పార్శ్వాల్లో, సమగ్రంగా, విపులంగా ఒక సమ్యక్ దృష్టితో చూడగలగడం (చూపుతో కాదు) ఒక విలక్షణమైన ప్రతిభ. ఈ విషయాన్నే మా ఇంజినీరింగ్ విద్యాబోధనలో ఆర్థోగ్రాఫిక్ వ్యూయింగ్ అంటారు. ఈ నిశిత దృష్టి, ప్రజ్ఞా గోపిగారిలో నిండుగా ఉండటంవల్లనే ఆయన జలగీతం, వాన కడిగిన చీకటి, రాతి కెరటాలు వంటి సార్వజనీనత కలిగిన మానవీయ సంవేదనలను ప్రతిఫలించగల కావ్యాలను అందించారు. నాకు తెలిసి వృద్ధాప్యాన్ని ఇంత ఆర్ధ్రమైన, ప్రేమమయమైన, సహానుభూతితో ప్రపంచంలో ఏ కవీ ఇన్ని కవితలను ఒక సంపుటిగా వెలువరించలేదు. దీన్నికూడా అనేక భాషల్లోకి అనువదింపజేసి ఒక విశ్వవ్యాప్త కావ్యంగా అందరికీ అందించడాన్ని బాధ్యతగా స్వీకరించాలని అర్థిస్తూ నా సలహా. గోపిగారే అన్నట్టు, వృద్ధాప్యం ఒక జీవన సారాంశ దశ. జీవితంలో మిగిలిన విలువైన కొద్దికాలాన్ని నిరాశను చెంతకు రానీకుండా మృత్యువును అత్యంత సహజ క్రియగా స్వీకరిస్తూ ఆ స్థితిని ఒక తాత్త్విక సందర్భంగానే భావిస్తూ పెరిగే వయసును ఒక అనుభవాల సంపుటిగా విలువైన సజీవ గ్రంథంగా గౌరవించాలి. ఏ మనిషైనా పెరుగుతున్న తన వయసునూ, తద్వారా సంక్రమించే హుందాతనాన్నీ గౌరవిస్తూ, తదనుగుణంగా ప్రవర్తిస్తే అది గొప్ప వ్యక్తిత్వాన్ని కూరుస్తూ అలంకారం గా భాసిస్తుంది. ఈ సున్నితమైన విషయాన్ని కవి ఈ పుస్తకం లో ఎన్నోచోట్ల అతి సున్నితమైన, తనదైన సరళసుందర కవి త్వ శైలిలో వ్యక్తీకరించారు. వృద్ధుడు మన ఇంటిలో/ ఒక వరంలాంటి వాడు/ అనుభవాల దారంతో/ త్రికాలాలకు వేసిన ముడి లాంటివాడు ( పుట: 15), పోస్టాఫీసు దగ్గరా అదే దృశ్యం!/ ఎఫ్.డి.ల కోసం / కిటికీ ఊచలకు చూపులను బిగించి/ పడిపోకుండా నిల్చుంటారు (పుట: 16), వృద్ధాప్యం/ ఒక ఒడువని ఆత్మకథ (పుట: 18). బయట ఎవరూ లేరు/ లోపలినుండి చొరబడిం ది వృద్ధాప్యం/ దీనితో పేచీ పడొద్దు/ స్నేహంగా ఆహ్వానిద్దాం (పుట: 20 ), ఒంటరి తనమంటే/ తన శరీరమే తనతో/కొత్తగా మాట్లాడటం/ పిల్లలు జారుడుబండ మీంచి జారుతున్న ట్టు/ మనస్సు మాటిమాటికి/ గతంలోకి జారిపోవడం,/రంగులన్నీ వెలిసిపోయి/ ఒకానొక తెల్లటి శూన్యం ఆవరించడం (పుట: 24), వాహనం ముందుకువెళ్తూంటే/ రోడ్డు వెనక్కి వెళ్తున్నట్టు/ జీవితం లోంచి/ యౌవ్వనం జారిపోయింది (పుట: 30 ). ఆ ముఖం ఎంతో అందంగా/ కలల రాశిలా వుండేది/ ఆడవాళ్ళు/ ఆరాధనగా చూచేవాళ్ళు.. ఇప్పుడు తెల్ల ని వెంట్రుకల నడుమ/ ఒక్క నల్లని మెరుపూ మిగల్లేదు/ దంత రాహిత్యంతో/ నోరు గుహలా మారింది (పుట: 34 ).

వృద్ధాప్య శూన్యంలో కొట్టుమిట్టాడుతున్న హృదయవేదన ఈ వృద్ధోపనిషత్. వృద్ధుల్ని పునరుత్తేజితుల్ని చేయడానికీ, వాళ్ళ సేవలను తిరిగి జాతి నిర్మాణానికి మళ్ళీ ఉపయోగించుకోవడానికి విదేశాల్లో ప్రయత్నాలున్నాయి. సమాజ పెద్దలుగా, అనుభవజ్ఞులుగా.. జాతి ఉన్నతి కోసం జ్ఞానవంతమూ, చైతన్యవంతమూ చేయగల మానవ వనరుగా పునరుపయోగిస్తా రు. ఈ నిర్మాణాత్మక దిశలో ఆలోచించమని కూడా ఈ వృద్ధోపనిషత్ అప్రత్యక్షంగా సూచిస్తున్నది.


ఒకానొక పునః చేతనను పుంజుకున్న క్షణంలో కవి పొందే పునరుత్సాహం చూడండి.. బాల్యంలోని పేదరికం/ అసలు పేదరికమే కాదు/ కౌమారం/ కలతల కాసారం/ యౌవ్వ నం/ ప్రణయ సుధారససారం/ నడివయస్సొక చౌరాస్తా/ కనుచూపు మేరలో/ ఎదురొచ్చే గుల్‌దస్తా/ డెబ్బయి సంవత్సరాలు/ నా యాత్రను కావ్యంగా మలిచిన/జీవన పత్రాలు.. అహో!/ డెబ్బయి సంవత్సరాలు శుభ్రసుందర వాటికలు/ విరబూసిన వైశ్విక పుష్పాలు.. ఇటువంటివి ఎన్నో. మధురమైన పాత జ్ఞాపకాల నెమరు వేతకు సంబంధించిన ఆంటిక్ వంటి కవిత ఒకటుంది ఇందులో. అది ప్రతి వృద్ధసుందరునికీ అపారానందాన్ని కలిగిస్తుంది. ఆ కవిత పేరు పాత ప్రేయసి అంటాడు.. మిత్రులారా!/ మనమే కాదు/ ప్రియురాండ్రు కూడా ముసలివాళ్లవుతారు/ జ్ఞాపకాలు పచ్చగానే ఉంటాయి/ వాస్తవాలకే మసక/ పెట్టె అడుగున ప్రేమలేఖలు/ చీకట్లో ప్రకాశిస్తాయి.. ఇట్లా కొనసాగి చివర్లో ప్రియురాలి చేతులిప్పుడు/ తామరతూడులు కావు/ ముఖంలో చం ద్రబింబం లేదు/ నడకలోంచి/ రాజహంసలు తొలగిపొయ్యా యి/.. కాని ఆనాటి మన చిరునవ్వులు/ ఎప్పటికీ వాడని పువ్వులు/ అప్పటి మన ఆత్మలు/ అఖండంగా వెలిగే దీపా లు.. ఇదీ వాస్త సంగ్రహణ అంటే. ఇలాంటి చాలా కవితలు ముసలివాళ్లకు మృత్యువును జయించే ధైర్యాన్నిస్తాయి, ైస్థెర్యం తో ముందుకు నడిపిస్తాయి. వృద్ధాప్య శూన్యంలో కొట్టుమిట్టాడుతున్న హృదయవేదన ఈ వృద్ధోపనిషత్. వృద్ధుల్ని పునరుత్తేజితుల్ని చేయడానికీ, వాళ్ళ సేవలను తిరిగి జాతి నిర్మాణానికి మళ్ళీ ఉపయోగించుకోవడానికి విదేశాల్లో ప్రయత్నాలున్నాయి. సమాజ పెద్దలుగా, అనుభవజ్ఞులుగా.. జాతి ఉన్నతి కోసం జ్ఞానవంతమూ, చైతన్యవంతమూ చేయగల మానవ వనరుగా పునరుపయోగిస్తా రు. ఈ నిర్మాణాత్మక దిశలో ఆలోచించమని కూడా ఈ వృద్ధోపనిషత్ అప్రత్యక్షంగా సూచిస్తున్నది. నిస్సందేహంగా వృద్ధులంటే జ్ఞానపరంగా వృద్ధిచెందినవారే. పుస్తకంలో ప్రతి కవిత కూ రమణజీవి అందించిన అర్థవంతమైన రేఖాచిత్రాలు మరింత అందాన్నీ, అర్థాన్నీ చేకూర్చిపెట్టాయి. గోపీ గారి కలా నికీ, రమణజీవి రేఖకు అభివాదాలు.

- రామా చంద్రమౌళి, 93901 09993

108
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles