వేడిగాలులు, వరదలు

Tue,August 13, 2019 01:09 AM

ఎండాకాలమంతటా వేడి గాలులలో అల్లాడిపోయిన బాధలు మరుపునకు రాకముందే ఇప్పు డు పలు రాష్ర్టాలు వరదల బారినపడి విలవిలలాడుతున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాలను వరదలు ముంచెత్తడంతో దాదాపు రెండు వందల మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళలోనే వంద మందికి పైగా మరణించడమో, గల్లంతవడమో జరిగింది. కర్టాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాలలో దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండున్నర లక్షల మంది, కర్ణాటకలో నాలుగు లక్షల మంది సహాయ శిబిరాలలో ఉన్నారు. సైనికదళాలు రంగంలోకి దిగి సహాయచర్యలు చేపడుతున్నాయి. పలు చోట్ల సాధారణం కన్నా అనేక రెట్లు ఎక్కువ వానలు పడటం గమనించవలసిన విషయం. కేరళలోని కొజికోడ్‌లో 21 సెంటీమీటర్ల, త్రిచూర్‌లో 19.9 సెంటీమీటర్ల వాన పడ్డది. ఈ అతివృ ష్టి, అనావృష్టి వలయంలో మనం చిక్కుకుపోయాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంగతి సరేసరి, మన దేశంతో సహా ప్రపంచమంతటా కొందరు పెద్దలు వాతావరణ మార్పు అనే ప్రచారం వట్టిదేనని ఇంకా వాదిస్తున్నారు. చాలా ప్రభుత్వాలు ప్రపంచానికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. కానీ ప్రతిదేశమూ వాతావరణ మార్పు ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నది. ఇటీవల తొలకరి ఆలస్యమై సుదీర్ఘమైన వేడి గాలులను చవి చూసిన మన దేశంలోని పలు రాష్ర్టాలు ఇప్పుడు వరద బారిన పడ్డాయి.

వాతావరణ మార్పు వల్ల అనేక ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయనేది నిజమే. కానీ దానిని కారణంగా చూపి ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదు. వాతావరణ మార్పును అరికట్టడానికి ప్రాంతీయంగా తమ వంతు చర్యలు తీసుకోవాలె. మరోవైపు వైపరీత్యాలను తక్షణం ఎదుర్కొనడానికి తగిన వ్యూహాలను రచించుకొని ఆచరించాలె. ఈ చర్యలేవీ తీసుకోకుండా వాతావరణ మార్పుపైనే మొత్తం నెట్టేయడం కనిపిస్తున్నది. పరిస్థితి విషమంగా మారిందని అనుభవపూర్వకంగా తెలిసిన తరువాత కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవడం లేదు.


ఈ అంచనాకు అతీతమైన వైపరీత్యాలకు వాతావర ణ మార్పు కారణమని మరొకసారి వాతావరణవేత్తలు గుర్తుచేయవలసి వస్తున్నది. రుతుపవనాల గతి మారుతున్నదని, వైపరీత్యాల తీవ్రత పెరుగుతున్నదని ఇది స్పష్టంగా వాతావరణ మార్పు ఫలితమేనని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ స్పష్టంగా చెబుతున్నది. వాతావరణ మార్పునకు సంబంధించిన ప్యానె ల్ (ఐపీసీసీ) గత బుధవారం నాడు వాతావరణ మార్పు భూమి అనే తమ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. ప్రకృతి వ్యవస్థ గతంలో ఏనాడూ లేనంత ఒత్తిడికి గురవుతున్న వైనాన్ని ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల భూసారం దెబ్బతిన పంటలు పండించలేని పరిస్థితి ఎదురవుతుంది. తీవ్రమైన ఆహార సంక్షోభం పొంచి ఉన్నది. దీనిని ఏ ఒక్క చర్య ద్వారా పరిష్కరించలేము. ప్రభుత్వ విధానాలలో, ప్రజల జీవన సరళిలో భారీ మార్పులు రావలసి ఉన్నది. పునరుత్పాదక ఇంధనాలు మాత్రమే వాడాలె. వ్యవసాయరంగంలో కూడా మౌలిక మార్పు లు తీసుకరావాలె. భారత్‌లో 7,500 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉన్నది. హిమాలయ ప్రాంతంలో చిన్నపెద్ద హిమనదులు పదివేల వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా భిన్న భౌగోళిక ప్రాంతాలున్నాయి. అందువల్ల భారత్‌పై వాతావరణ మార్పు ప్రభావం పరిపరివిధాల ఉం టుంది. ఇప్పుడు వివిధ రాష్ర్టాలలో వరదల వల్లనైనా అప్రమత్తం కావాలె. వాతావరణ మార్పు వల్ల అనేక ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయనేది నిజమే. కానీ దానిని కారణంగా చూపి ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదు.

వాతావరణ మార్పును అరికట్టడానికి ప్రాంతీయంగా తమ వంతు చర్యలు తీసుకోవాలె. మరోవైపు వైపరీత్యాలను తక్షణం ఎదుర్కొనడానికి తగిన వ్యూహాలను రచించుకొని ఆచరించాలె. ఈ చర్యలేవీ తీసుకోకుండా వాతావరణ మార్పుపైనే మొత్తం నెట్టేయడం కనిపిస్తున్నది. పరిస్థితి విషమంగా మారిందని అనుభవపూర్వకంగా తెలిసిన తరువాత కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవడం లేదు. గతే డాది కేరళలో వరదలు ముంచెత్తి వందలాది మంది మరణించారు. దీనికి పశ్చిమ కనుమల పరిరక్షణ చేపట్టకపోవడం కారణం. ఇప్పటికీ అడ్డగోలుగా రాతి తవ్వకాలు సాగుతున్నాయి. పర్యాటక అభివృద్ధి పేర భారీ నిర్మాణాలు సాగాయి. పశ్చిమ కనుమల పరిరక్షణకు చర్యలు తీసుకోవ డం లేదనే విమర్శలున్నాయి. దీర్ఘకాలికంగా పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటు వైపరీత్యాలను వెంటనే ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండటం లేదు. వరదలను ఎదుర్కొనడానికి ముందు ఏర్పాట్లు చేసుకోవడం లేదు. వరద నీరు జనావాసాలపైకి రాకుండా ఉపయోగకరంగా మార్చుకోగలుగాలె. పలు రాష్ర్టాలలో నగర పరిపాలన ఇంకా పాత పద్ధతిలోనే సాగుతున్నది. నగరాల లో కబ్జాల వల్ల వరద నీరు పోయే మార్గాలు మూసుకుపోయి ఉన్నాయి. చెత్తచెదారం అంతా నాలాలలోకి వదులుతుంటారు. నిర్మాణాలకు వాడిన ఇసుక, కంకర అన్నీ రోడ్లపై పడి ఆ తరువాత నాలాలలోకి చేరి ప్రవాహాన్ని అడ్డగిస్తాయి. వైపరీత్యాలు తప్పవని తెలిసిన తరువాత కూడా నిష్క్రియాపరత్వం తగదు. ఉత్తమ పరిపాలన అందించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు, ప్రజల సంరక్షణకు చర్యలు తీసుకోవాలె.

186
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles