సోదరభావానికి ప్రతీక ‘రాఖీ’

Wed,August 14, 2019 12:37 AM

rakshabandhan-2019
చిన్ననాటి జ్ఞాపకాల
చిరువెలుగుల పర్వమే రాఖీ
సోదర ప్రేమకు సొబగులద్దుతూ
పుట్టింటికి మార్గమయ్యేది రాఖీ
ఏడాదికొకసారైనా పుట్టింటి
మమకారాన్ని ఆస్వాదిస్తూ
అన్నదమ్ముల ఆత్మీయతలకు
నిలువెల్లా పులకిస్తూ
నా వాళ్లున్నారని
ధీమా కలిగించేదీ రాఖీ
రానున్న రోజులకు రందిలేదని
కష్టసుఖాల్లో తోడయ్యేది
సిరివిరి నవ్వులకు నీడయ్యేది
అక్కాచెల్లెళ్లను అక్కునచేర్చుకునేది
అనురాగాలతో అలరించేదే రాఖీ
- బిళ్ల నవ్యశ్రీ
(రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా...)

100
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles