ఇప్పుడిక ‘భూ’తల స్వర్గమే..!


Wed,August 14, 2019 12:38 AM

స్వాగతించవలసిందే మనమంతా. భరత ఖండం చక్కని పాడిఆవు దాన్నెవరూ ముట్టుకోవాలని చూసినా అలా చూసే ముష్కరులను చూసి ఊరుకోకూడదు. అక్కడ త్రివర్ణ పతా క ఎగురాల్సిందే. ఎవరైనా జాతి పతాకకు శిరస్సెత్తి మొక్కాల్సిందే. నెత్తుటి మడుగుల్లో పెరిగే బాల్యం కత్తుల వంతెన మీద కవాతు చేయడం ఆపాల్సిందే. దారి మళ్లించాల్సిందే. వద్దన్నవాడు మూర్ఖుడే. అవును మూర్ఖుడే. 370 ఆర్టికల్ అంటే వస్తువు కాదు, ఇత్తడో పుత్తడో కాదు, అదొక అసమా న్య సౌకర్యం. అది ఉన్నన్నినాళ్లు అక్కడ వికాసం విధ్వంసమే. అందుకే దాన్నిలేకుండా చేస్తేనే విలసిల్లుతుంది కశ్మీరం. అదినువ్వో నేనో అనుకుం టే కాదు సుమీ. వాళ్లు అనుకోవాలి. వాళ్లంటే మనమే కదా! మనం అనుకుంటున్నాం. ఇంతకీ వాళ్లేమనుకుంటున్నారో.. ఆహా..! ఎంత సంబురం గా ఉంది. దేశమంతా సంబురంగా ఉంది. ఏ బంధంలేని వెర్రి మాలోకం ఒకటి ఒకటే పలువరిస్తున్నది. పారాడుతున్నది. అక్కడేదో అన్యాయం జరిగిందని తలపోస్తున్నది. వలపోస్తున్నది. అక్కడెలా ఉందో! వలపోతలున్న యా.. తలపోతలున్నాయా? ఎమో ఎవరికి ఎరుక. అక్కడికి పోయినోళ్లం కాకపోతిమి. అక్కడ తిరిగినోళ్లం కాకపోతిమి. నువ్వనుకున్న. నువ్వు తలపోసిన నీ స్వప్నం నెరవేరిందిగా. నువ్వేదైతే కలగన్నావో అదే నిజమైంది. అవును..! కశ్మీర్ అదేనోయ్. ఈ దేశపు భాగ్యవిధాత. ఏ ఛీ కాదు సోదరా భరతమాత నుదుట అచ్చం తిలకం దిద్దినట్టే! ఎంత అందమైన మొహం.. మోహంతో మోకరిల్లవలె దేశం. మోకరిల్ల వలె కుంకుమ పూల సుగంధపు సువాసలనకు. మైమరిచిపోవలె కశ్మీర దర్శనం చూసి. నాయిని కృష్ణకుమారి కశ్మీర దర్శనం. ఆహా ఎంత బాగా ఉంది. పడవల్లో ప్రయాణం. పడకల కడవల్లో హిమకడలి తరంగం. హాయిహాయిగా.. షికారు చేద్దా మా! నువ్వొక వెర్రి మాలోకం. ఇప్పుడు నువ్వక్కడ కొనొచ్చు. అమ్మొచ్చు. అమ్ముడూ పోనూ వచ్చు. నాలుగైదు రోజులుగా ఒకటే బెడద. సామాజికమైన సార్వజనీనమైన ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి.


ఇదే కదా! కశ్మీర సమీరం కలలుగన్నది. అందుకే దేశమంతా వారి పక్షాన నిలబడింది. వారికి పూల పరిమళంతో స్వాగతం పలుకుతున్నది. ఇకనుంచి స్వేచ్ఛగా బతుకండీ అంటూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్నది. కానీ అక్కడివాళ్లకు ఇదేమీ పట్టదా! వాళ్లుత్త వెర్రిబాగులోల్ల వలె ఉన్నరు. ఇండ్లల్లో కిటికీలు.. తలుపులు పెట్టుకొని నడింట్లో సంబురాలు చేసుకుంటున్నరు. వాళ్లకు తెలియటం లేదు. బయట వారి కోసం, వారి స్వేచ్ఛకోసం సాయుధ బలగం గస్తీ తిరుగుతున్నది.


నువ్వు గమనించలేదా? అయితే నువ్వొక అవుట్‌డేటేడ్ సరుకువి. హిమశిఖర పాదాల చెంత సరుకు అమ్ముడుపోతుందిరా అంటే వినవు నువ్వొక వెర్రి మాలో కం. వేస్ట్ మాలోకం. అవును సోదరా! కశ్మీరం కుంకుమ పువ్వు. చలిని తట్టుకునే నులువెచ్చని దుప్పటికీ ఎంతటి గిరాకీ? దేశమంతా ఓర్నీ.. దేశమంటావేందిరా ప్రపంచం అంతా క్యూకట్టి నిలబడుతారు. ఇప్పుడు కశ్మీర దర్శనం కోసం కాదు సుమీ కశ్మీర మార్కెట్ కోసం. 70 ఏండ్లుగా ఎదురుచూసి ఎదురుచూసి ఎండ వేడిమిని ఎరుగని మనుషులకు ఇప్పుడు హిమశిఖరం కరిగి చల్లదనాన్నిస్తుంది. మనుషులూ మ్రానులూ ఎంతటి హాయిని పొందవచ్చునో కదా! ఆహా..ఏ అచ్ఛాదనలేని అహింసావాది నన్ను చూసి నేర్చుకోండిరా అని ఆహ్వానిస్తుంటే నువ్వేందిరబై నులక మంచం మీద పడుకొ ని లడక్..లడక్ అంటూ తలపోస్తవ్. అది నులక మంచం కాదహే నూటొ క్క కలల కశ్మీరం. నిన్నమాంతం భూలోక స్వర్గానికి ఎత్తుకెళ్లే పుష్పక విమానం. నిన్ను స్వర్గానికి తోలుకెళ్లే మహాస్వప్న. ఇంకా స్వప్నమెంటిరా నాయినా స్వప్నలోకపు సార్వభౌముడు సమున్నత నీ శిఖరాన్ని తన శిర స్సు మీదేసుకొని నిన్ను మున్నూటా పదహారు లోకాలు తిప్పిచూపాలని తలపోస్తున్నడు. ఆహా..! ఎంతటి త్యాగమూర్తి. ఎంతటి ధన్యజీవి, అతనెంతటి స్వాప్నికుడు. అంతేనా ప్రగతి కాముకుడు. ప్రతీప శక్తుల పాలిట పరశురాముడు. అతనిచేతిలో ఇప్పుడు గండ్రగొడ్డలి లేదు. కానీ గాండ్రిం పు ఉన్నది. అంతేనా అంతకంటే ఎక్కువగా హీనపక్షం హీనాతిహీనమైన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. అందుకే ఇప్పుడు కశ్మీరం కలల తీరం సమీరం వలె ఓలలాడుతున్నది. ఇదే కదా! కశ్మీర సమీరం కలలుగన్నది. అందుకే దేశమంతా వారి పక్షాన నిలబడింది. వారికి పూల పరిమళంతో స్వాగతం పలుకుతున్నది. ఇకనుంచి స్వేచ్ఛగా బతుకండీ అంటూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్నది. కానీ అక్కడివాళ్లకు ఇదేమీ పట్టదా! వాళ్లుత్త వెర్రిబాగులోల్ల వలె ఉన్నరు. ఇండ్లల్లో కిటికీలు.. తలుపులు పెట్టుకొని నడింట్లో సంబురాలు చేసుకుంటున్నరు. వాళ్లకు తెలియటం లేదు.

బయట వారి కోసం, వారి స్వేచ్ఛకోసం సాయుధ బలగం గస్తీ తిరుగుతున్నది. వారు నిరభ్యంతరంగా బయటికిరావచ్చు. కానీ రావటం లేదు. రావొచ్చు కదా! అక్కడ ఇంతకాలం రావద్దని చెప్పిన 370 లేదు. దానివల్ల వాళ్లకు ఎంత నష్టం వాటిల్లింది. బడులకు పోని పిల్లలు. అయినా సరే మంచి ఆంగ్ల నైపుణ్యం తెలిసినవాళ్లు. ఇదేమి కాంట్రాస్ట్. విద్య లేకున్నా ఆంగ్లభాష ధారాపాతంగా ఎలా వచ్చును అదేకదా మొన్న జాతినుద్దేశించి చెప్పిన పలుకులు చెవినపడలేదా! అదీ కాంట్రాస్ట్. 70 ఏండ్లు కిందట ఎకరానికి కేవలం మూడువేలేనట. దేశమంతా భూమి లక్షలు.. కోట్ల చొప్పున విలువ పలుకుతుం టే అక్కడ కేవలం ఏ ముప్ఫైవేలో నలభై వేలోనట. ఎంతదారుణం. ఆ బెంగపోయింది. అక్కడ మనం సైతం బడిపెట్టవచ్చు. కాలేజీ కట్టుకోవచ్చు. అక్కడసలే ఎండ అంటే తెలియదు. చల్లని హిమపొరల మాటున విద్యాబోధన ఎంత చక్కటి మనసుకు ఆహ్లాదకరమైన ప్రకటనలు మనకు సమీప భవిష్యత్‌లో దృశ్యమానం కాబోతున్నాయి. సరస్సుల్లో సరసమైన ధరలకు బోటింగ్ కాంప్లెక్సుల నిర్మాణం జరుగబోతున్నది. అక్కడొక్క ప్లాట్‌ను సరసమైన ధరలకు కొనవచ్చు. అమ్మవచ్చు. కనీసం లీజుకైనా తీసుకోవచ్చు. మారుబ్యారం చేయవచ్చు. కేవలం వాళ్లేకాదు మనమూ ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇన్నాళ్లు 370 పుణ్యమాని అది లేకుండాపోయింది. అవును ఇప్పుడు కశ్మీర్ భూతల స్వర్గం. ఇవన్నీ ఎందుకు భయ్యా. అక్కడివాళ్లతో మనకు సంబంధం లేదు. డ్బ్భై ఏండ్లుగా ఉన్న అడ్డుకట్ట, అభివృద్ధి నిరోధక కట్ట తొలిగిపోయింది. అక్కడి మనుషులతో మనకేం సంబంధం. వాళ్లిప్పుడు కశ్మీరులు మాత్రమే కాదు, భారతీయులు కూడా. కశ్మీరులు అంటే మనుషులు. కానీ కశ్మీర్ అంటే భూమి కదా! అక్కడ ఆది యందు భూమి ఉండెను. రియల్ లేకుండెను. ఇప్పుడక్కడ రియల్ భూమ్ ఉండును. ప్లెబీసైట్లు.. ప్రజాభిప్రాయాలు, రాజకీయాభిప్రాయాలతో పనిలేదు. దేశరక్షణ, జాతి నిర్మాణంలో భాగంగా తీసుకున్న వజ్ర సంకల్ప నిర్ణయం నిజమే.
Noora-Srinivas
కానీ ఒక్కసారి వాళ్లతో మాట్లాడితే బావుండు. కదా! అవును నిజ మే వాళ్లు ఏడు దశాబ్దాలుగా ఏమీ చేయలేదు. మరి మనమేం చేశాం. సం ప్రదింపులు చేస్తే సంప్రదింపులే కదా మిగిలేది. అమెరికాలోని మాజీ చైనా రాయబారి ఏమన్నాడో తెలుసా? ఒక సైనికుడిని తమ దేశానికి పంపకుండా చైనాను మొత్తం ఆక్రమణ చేసింది భారత్. బౌద్ధంతో చైనా జీవితాలను పావనం చేసింది అన్నడట హుషి. గట్లనే కశ్మీర్‌కు పంపితే బాగుండు. 70 ఏండ్ల కింద పంపిస్తే ఇవ్వాళ 370 ఉండేది కాదు. తెలిసి మాట్లాడుతున్నవా? తెలియక మాట్లాడుతున్నవా? కశ్మీర్‌లో హిందూ, బౌద్ధమతాల వాళ్లున్న వాళ్లు పాలించారు. అయిననూ మారలేదు కశ్మీరం. బెంగలేదులే. ఇప్పుడా భయం వద్దు. 370 పోయిందిగా.. ఇప్పుడక్కడ విలసిల్లును ప్రగతి. విలవిల్లాడును విధ్వంసకారులు. ప్రజలు మాత్రం ఎప్పుడు కర్ఫ్యూ నీడ నుంచి బయటపడుతారో...!

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles