హువావే నిషేధానికి ఒత్తిడి


Wed,August 14, 2019 12:39 AM

భారత్ 5జీ ప్రయోగాల నుంచి హువావే కంపెనీని పక్క నపెట్టడం పట్ల చైనా ప్రభుత్వం నిరసన తెలిపినట్టు సమాచారం. భారత్ హువావేని దూరం పెట్టడానికి అమెరికా ఒత్తిడే కారణమని చైనా భావిస్తున్నది. అమెరికా ఒత్తిడికి తలొగ్గితే భారత్‌లో 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టుకోవడం ఆలస్య మౌతుంది. హువావేకి బదులుగా అత్యంత ఖరీదైన పరిజ్ఞానాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. భారత్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాని కి ఈ సమస్య తోడవుతుంది. హువావేకి 20 శాతం గ్లోబల్ పేటెంట్లున్నా యి. యాభై శాతం మార్కెట్ వాటా ఉన్నది. 5జీ ట్రయల్స్ నుంచి హువావేని పక్కనపెడుతున్నట్టు భారత్ ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే భారత్ అమెరికా బాటలో నడుస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దికాలమైన ఈ బాటలోనే నడువాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇదేగనుక జరిగితే భారత్, చైనా సంబంధాలు, అలీనదేశంగా భారత్‌కు ఉన్న పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. హువావేని పక్కన పెట్టిందీ అంటే భారత్ అమెరికా ఒత్తిడికి తలొగ్గడం ఇది నాలుగవ సారిగా చెప్పుకోవచ్చు. మొదటిది-అమెరికా ఆంక్షల మూలంగా భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేసిం ది. రెండవది- ఇరాన్‌లోని చబహర్ రేవును అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని భారత్ పక్కకుపెట్టింది. మూడవది- డేటా లోకలైజేషన్‌కు సంబంధించినది, చాలా ప్రాధాన్యం గలది. లావాదేవీలు ముగిసిన 24 గంటల వరకు అమెరికా కంపెనీలు తమ ఇండియన్ బ్యాంకింగ్ డేటాను తమ సర్వర్లలో పెట్టుకోవచ్చు. తమ రక్షణకు బాగా అవసరమైన ఎస్- 400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి తెప్పించుకోవాలని భారత్ నిర్ణయించింది. దీనికి కూడా అమెరికా అభ్యంతరం చెప్పింది. ఇంకా ఒత్తిడి తెస్తూ నే ఉన్నది. అయితే ఈ విషయంలో మాత్రం భారత్ గట్టిగా నిలబడి ఉన్నది. ఈ సంక్లిష్ట సమస్యల నేపథ్యంలో భారత్ అలీన విధానం బహుళలీన విధానంగా మారిపోతున్నది. అమెరికా ఒత్తిడులకు తలొగ్గుతున్నదనేది ధ్రువపడితే అంతర్జాతీయస్థాయి లో అవమానకర పరిస్థితి ఉంటుంది.


గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి అవసరమైన తోడ్పాటు చైనా నుంచి అత్యంత చౌకగా లభిస్తున్నది. 5జీ సాంతికేక పరిజ్ఞానం కూడా ఇటువంటిదే. చైనా నుంచి 5జీ పరిజ్ఞానం లభిస్తే అన్ని పరికరాలకు త్వరగా చేరుతుంది. స్మార్ట్ సిటీలకు కూడా దీనిని వినియోగించుకోవచ్చుననేది భారత్ ఆలోచన. కానీ అమెరికా ఆగ్రహాన్ని లక్ష్యపెట్టని దేశాలు ఏ కొన్ని మాత్రమే ఉంటాయి. భారత్ వాటి మాదిరిగా అమెరికా ఆగ్రహాన్ని కొనితెచ్చుకోలేదు.


డొక్లామ్ వ్యవహారంలో భారత్, చైనా బాహాబాహికి దిగే పరిస్థితి ఏర్పడిన తరువాత రెండు దేశాలు 2017 నుంచి సామరస్యంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాను సంతృప్తిపరిచేందుకు బౌద్ధ గురువు దలైలామాతో సంబంధాలను తగ్గించింది. భారత్ ఆశ్రయం కల్పించినందు కు కృతజ్ఞతలు తెలిపే టిబెటన్ల కార్యక్రమాలకు హాజరుకావద్దని ప్రభుత్వాధికారులకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించే, మనీ లాండరింగ్ జరిపే కార్యకలాపాలపై నిఘా పెట్టే అంతర్జాతీయ కమిటీ -ఫైనాన్షియల్ ఆక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) నేతృత్వానికి జరిగే పోటీలో చైనా అభ్యర్థిత్వానికి భారత్ మద్దతు ఇచ్చింది. ఇందుకు ప్రతిగా జైష్ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను గ్లోబల్ టెరరిస్టుగా ప్రకటించడానికి అవరోధం కల్పించవద్దన్న భారత్ అభ్యర్థనకు చైనా అంగీకరించింది. అయితే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ముందు చైనా నాలుగు షరతులు పెట్టినట్టు తెలిసింది. ఒకటి- దలైలామా వారసుడి ఎంపిక విషయంలో భారత్ జోక్యం చేసుకోవద్దు. రెండు- పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభించాలె. మూడు- భారత్‌లో 5జీ ట్రయల్స్‌కు హువావేని అనుమతించాలె. భారత్‌లో ఎన్నికల ప్రచారం సాగుతున్నప్పుడు చైనా ఈ షరతులు కోరింది. ఇప్పుడు నరేం ద్ర మోదీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయాలని చైనా కోరుకుంటున్నది. మన దేశంలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలలో ఎటువంటి భద్ర తా భంగం జరుగనందువల్ల 5జీ ట్రయల్స్‌కు అనుమతిస్తామనే స్థూలమైన హామీని హోంశాఖ ఇచ్చింది. అయితే హువావేని అనుమతిస్తే ఆంక్ష లు, జరిమానాలు విధిస్తామని అమెరికా కఠినమైన హెచ్చరికలు చేసింది. దీంతో ఇదేదో తీవ్రమైన అంశంగా మారిందని భారత్ వెనుకడుగు వేసిం ది. మోదీ ప్రభుత్వం నిజంగా అమెరికాను లక్ష్యపెట్టకుండా చైనా వైపు వెళ్ళగలదా? భారత్ ఆర్థిక వ్యవస్థకు అమెరికా తోడ్పాటు భారీగా ఉంటుంది. భారత్‌లోని తొంభై శాతం మంది అమెరికాతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటారు. కానీ భవిష్యత్తు చైనాదే.

మన దేశంలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలలో ఎటువంటి భద్రతా భంగం జరుగనందువల్ల 5జీ ట్రయల్స్‌కు అనుమతిస్తామనే స్థూలమైన హామీని హోంశాఖ ఇచ్చింది. అయితే హువావేని అనుమతిస్తే ఆంక్షలు, జరిమానాలు విధిస్తామని అమెరికా కఠినమైన హెచ్చరికలు చేసింది.


గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి అవసరమైన తోడ్పాటు చైనా నుంచి అత్యంత చౌకగా లభిస్తున్నది. 5జీ సాంతికేక పరిజ్ఞానం కూడా ఇటువంటిదే. చైనా నుంచి 5జీ పరిజ్ఞానం లభిస్తే అన్ని పరికరాలకు త్వరగా చేరుతుంది. స్మార్ట్ సిటీలకు కూడా దీనిని వినియోగించుకోవచ్చుననేది భారత్ ఆలోచన. కానీ అమెరికా ఆగ్రహాన్ని లక్ష్యపెట్టని దేశాలు ఏ కొన్ని మాత్రమే ఉంటాయి. భారత్ వాటి మాదిరిగా అమెరికా ఆగ్రహాన్ని కొనితెచ్చుకోలే టదు. అందువల్ల మోదీ ప్రభుత్వం చైనా కంపెనీ అయిన హువావే వల్ల భద్రతా సమస్యలున్నాయనే వాదన వినిపిస్తున్నది. చైనా వారు అమెరికా సర్వర్లు, కంప్యూటర్ల నుంచి కీలక డేటా తరలించారని భారతీ య మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారతీయ ఆర్థిక వ్యవస్థను చైనా విచ్ఛిన్నం చేయగలదనే భయాందోళనలు తరచు వ్యక్తమవుతున్నాయి. చైనా హామీలు ఇచ్చినప్పటికీ 5జీ ట్రయల్స్‌కు సంబంధించి న కమిటీ సభ్యులు ఒకరు తిరస్కరించినట్టు తెలుస్తున్నది. అయితే హువావేపై నిషేధం విధించాలనేది అత్యధికుల అభిప్రాయం కాదు. ఇంటలిజెన్స్ బ్యూరో కూడా హువావెయిపై నిషేధం విధించాలని సూచించలేదని తెలిసింది. అయినా ఒక మీడియా సంస్థ అన్ని అభిప్రాయాలు ఇవ్వకుండా, పాక్షిక సత్యాలను ప్రచారం చేస్తున్నది. ప్రపంచ వ్యవహారాల భారతీయ మండలి ఏర్పాటుచేసిన గోష్ఠిలో భారత 5జీ నిపుణుడు వి. కామకోటి మాట్లాడుతూ-హువావేకి సంబంధించిన భద్రతా పరమై న ఆందోళనలను వివరించారు. ఇదే గోష్ఠిలో ఉన్న చైనా దౌత్యవేత్త ఇం దుకు అభ్యంతరం చెప్పారు. ఇప్పటివరకు హువావే ద్వారా ఎటువంటి భద్రతా లోపం జరుగలేదని వివరించారు. జర్మనీ, యూకే కూడా హువావే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయని, ఎటువంటి ఇబ్బందుల్లేవని తెలిపారు. చైనా కంపెనీ డేటా చౌర్యం, నిఘాకు పాల్పడిందనడానికి ఎటువంటి ఆధారాల్లేవని కామకోటి కూడా అంగీకరించా రు. అమెరికా హువావేని వ్యతిరేకించడానికి- భద్రతా, నిఘా సంబంధ కారణాల్లేవని, వ్యాపార సంబంధమైన అంశాలే ఇందుకు పురికొల్పుతున్నాయనే అభిప్రా యం ఉన్నది.

గత పదేండ్లలో జడ్‌టీఈ , హువావే వేగంగా వృద్ధి చెందాయి. 5జీ విషయంలో అవరోధాలు లేకపోతే కంపెనీ తిరుగులేని స్థితికి చేరుకుంటుంది. ఇప్పటికే ఈ సంస్థ చాలా స్మార్ట్‌ఫోన్లు అమ్ముతున్నది. శామ్‌సంగ్ కన్నా కొంచెం వెనుకబడి ఉన్నది. టెలికం పరికరాల సరఫరాలో ఎరిక్‌సన్‌ను అధిగమించింది. ఆఫ్రికాలోని టెలికం నెట్‌వర్క్ కు వెన్నెముకను నిర్మించి పెట్టింది హువావే. అమెరికా నిషేధం వల్ల సరఫరాలకు అవాంతరాలు ఎదురై సమస్యలు తలెత్తుతాయి. ట్రంప్ మూలంగా సమస్యలు ఎదురవుతాయని చైనా ముందు పసిగట్టింది. అందువల్ల భారీ ఎత్తున అమెరికా నుంచి సెమికండక్టర్ మైక్రోచిప్స్‌ను, ఇతర విడిభాగాలను ముందే సేకరించి పెట్టుకున్నది. భారత్‌కు హువావే వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అతిచౌకగా లభ్యం కావడం వల్ల పాశ్చాత్య దేశాలను అందుకోవడానికి అనేక దశలను ఒక్కసారిగా దాటి వేయవచ్చు. స్మార్ట్ సిటీలను నిర్మించుకోవచ్చు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చు. వ్యూహాత్మక స్వతంత్రత కూడా లభిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ చివరి వారంలో జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి వెళ్ళారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా హువావెయి అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే ప్రధాని మోదీ అమెరికా ఒత్తిడి మూలంగా తమ అభిప్రాయాలు మార్చుకున్నారా, లేకపోతే తట్టుకున్నారా అనేది తెలువదు. వంద కోట్లకుపైగా జనాభా గల దేశం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే 5జీ టెక్నాలజీలు పరిణామం ఆధారపడి ఉంటుందని మోదీ అన్నారు. 5జీ వ్యవస్థల నిర్మాణానికి ఉభయ దేశాలలోని శక్తి సామర్థ్యాలను క్రోడీకరించుకోవాలని ఇరువురు నాయకులు అంగీకరించారు. పరిశీలకులు మాత్రం ఈ ప్రకటనను హువావే కంపెనీని తిరస్కరించడంగా వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ మాత్రం తమ కంపెనీలు హువావేతో లావాదేవీలు జరుపుకోనిచ్చారు. యూరప్‌లోని దేశాలు, అనేక దక్షిణాది దేశాలు అమెరికా వాదనలను పట్టించుకోవడం లేదు.
sanjay-kumar
అయినా భారత్ మాత్రం భద్రత, నిఘా పేరుతో హువావే ప్రవేశాన్ని తిరస్కరిస్తున్నది. హువావే కంపెనీ తమను దాటేసినందుకు అమెరికాకు ఈర్ష్యగా ఉందనీ, చైనాతో పోరాటంలో ఈ సంస్థను పావుగా వాడుకుంటున్నదని దక్షిణాఫ్రి కా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఎంతో నిజాయితీగా అన్నారు. పేదరికం, అసమానత, నిరుద్యోగం అనే మూడు రుగ్మతలను పారదోలాలంటే నాలుగవ పారిశ్రామిక విప్లవం వైపుగా వేగంగా అడుగులు వేయకతప్పదని, అందుకు 5జీ టెక్నాలజీలను సముపార్జించుకోవలసిందేనని ఆయన వివరించారు. అమెరికా విధానాలు దక్షిణాఫ్రికాకే కాదు, భారత్‌కు కూడా సమస్యే. దక్షిణాఫ్రికా నిఘా పేరుతో హువావేపై ఆంక్షలు పెట్టడం లేదు. కానీ భారత్ అమెరికా ఒత్తిడులకు లోనవుతున్నట్టు కనిపిస్తున్నది. ఇరాన్ ఆంక్షల విషయంలోనూ ఇదే జరిగింది.
(ది వైర్ సౌజన్యంతో...)

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles