ఫెడరలిజంపై తాజా చర్చ


Thu,August 15, 2019 01:02 AM

సమాజంలో గాని,రాజకీయాలలో గాని ఎప్పుడైనా దీర్ఘకాలికమైన, లోతైన పరిణామక్రమాలు ఒక స్థాయిలో జరుగుతుంటాయి. స్వల్పకాలికమైన, వర్తమానానికి పరిమితమైన పరిణామాలు మరొక స్థాయిలో సంభవిస్తుంటాయి. ఈ రెండు విధాలైన వాటికి సంబంధం ఎంతో కొంత ఉంటుంది. వాటి మధ్య పరస్పర ప్రభావాలు ఉంటాయి. అది కొన్ని విషయాలలో ఎక్కువ ఉండవచ్చు, కొన్ని విషయాలలో తక్కువ కావచ్చు. అది ఆయా విషయాలపై, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇపుడు మనం భారతదేశపు దీర్ఘకాలికమైన, లోతైన ఫెడరలిస్టు క్రమాన్ని, జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కేంద్రప్రభు త్వం తీసుకున్న చర్యలను, ఈ రెండింటి ప్రాముఖ్యాలను, పరస్పర ప్రభావాలను ఈ వెలుగులో పరిశీలించవలసి ఉంటుంది. అపుడు గాని కశ్మీర్ చర్యలు ఫెడరలిజాన్ని కుంచింపజేస్తాయనే భావన నిజమా కాదా అన్నది అర్థం కాదు. ప్రభుత్వం కశ్మీర్ విషయమై తీసుకున్న చర్యలు ఆ రాష్ట్ర ఫెడరల్ హక్కు లు, అధికారాలను కుంచింపజేసే మాట నిజం. అక్కడి ప్రజలకు ఇంతకాలం ఉండిన పూర్తిస్థాయి రాష్ట్ర అధికారాలు ఇక ఉండవు. ఇది తాత్కాలికమైన మార్పు అని, పరిస్థితి చక్కబడితే మళ్లీ పూర్తిస్థాయి రాష్ట్రం (లద్ధాఖ్ మినహా) కాగలదని కేంద్రం చెప్తున్నది. కాని, పరిస్థితి చక్కబడ టం అంటే ఏమిటో అది ఎప్పటికి జరుగుతుందో మనకు తెలియదు గనుక, కనీసం సమీప భవిష్యత్తులో పూర్వపుస్థితి రాగల అవకాశం లేదు. కనుక అక్కడి ఫెడరల్ అధికారాలు పరిమితంగా మారాయి. అయితే, మొత్తం దేశంలో కశ్మీర్‌ది ఒక ప్రత్యేక పరిస్థితి అన్నది గుర్తించవలసిన విషయం. అటువంటి పరిస్థితులే ఈశాన్యభారతంలోనూ పూర్తిగా కాకున్నా కొంత మేర ఉన్నాయి. అందువల్ల, ఒక్క కశ్మీర్‌ను ప్రామాణికంగా తీసుకుని దేశమంతటా గల ఫెడరలిజానికి ఆపాదించలేము. ఇక్కడ గుర్తించవలసిన రెండవ విషయం ఏమంటే, కశ్మీర్‌ను ఆవరించుకుని ఉన్న వివిధ అంతర్గత, బాహ్య పరిస్థితుల దృష్ట్యా, వాటి ప్రత్యేకతలను బట్టి, తక్కిన దేశంలోని సాధారణ జనాభిప్రాయం అక్కడి ఫెడరల్ అధికారాలను కుంచింపచేయడానికి అనుకూలంగా మారింది.


కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ విషయంలో తీసుకున్న చర్యల దరిమిలా ఫెడరలిజంపై తిరిగి చర్చ జరుగుతున్నది. ఈ చర్యలు కేంద్రీకరణను మరింతగా పెంచి రాష్ర్టాల ఫెడరల్ అధికారాలను తగ్గించగలవన్నది ఒక అభిప్రాయం. ఫెడరలిజాన్ని సాధారణ రూపంలో బలపరుస్తూ వస్తున్న ప్రజలు ఈ పరిణామాలతో కేంద్రీకరణవైపు మొగ్గుచూపుతున్నారన్నది మరొక అంచనా. ఇవి స్థూల దృష్టితో కూడిన అభిప్రాయాలా, లేక సమాజంలోని లోతైన పరిణామక్రమాలను(డీప్ ప్రాసెసెస్) గమనించిన మీదట ఏర్పరచుకున్నవా అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన సీరియస్ విషయం.


ఇది సరైనదా కాదా? అక్కడ అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావటానికి వెనుక గల కారణాలేమిటి? బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా వివిధపార్టీల బాధ్యత ఎంత? పాకిస్థాన్ పాత్ర ఏమిటి? అక్కడి సాధారణ ప్రజలు కూడా దీనంతటికి బాధ్యులా? ఆ సమస్యకు ఈ తరహా చర్యల వల్ల పరిష్కారం నిజంగా లభిస్తుందా? అన్న చర్చలు మనం ఎంతైనా చేయవచ్చు గాక. ఆ చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కూడా. ఇవేవీ ఇప్పటికిప్పుడు తేలవు గనుక వాటిని అట్లుంచితే, ఈ రోజున దేశంలో నెలకొన్న పరిస్థితి మాత్రం సాధారణ ప్రజలు కశ్మీర్ లో ఫెడరల్ అధికారాలను పరిమితం చేసేందుకు అనుకూలంగా మారటం. కశ్మీర్‌లో జరిగింది తక్కిన రాష్ర్టాల విషయంలోనూ జరుగవచ్చును అనే మాట యథాతథంగా అసంబద్ధంగా తోస్తుంది. అదే సమయంలో అట్లా జరిగితే జరుగవచ్చుకూడా అనే భయసందేహాలు ఒక మేరకు తలెత్తిన మాట నిజం. కశ్మీర్‌కు, ఇతర రాష్ర్టాలకు పోలిక లేదు అనే వాదన చేస్తూ ఈ సందేహాలను వెంటనే కొట్టివేయటం కూడా తేలిక కాదన్నది మనం గుర్తించవలసిన కీలకమైన విషయం.అట్లా కొట్టివేయబూనటం అనాలోచితం, తొందరపాటు కాగలదు. ఎందువల్ల? ఒకోసారి లక్ష్యం ఒకటే కావచ్చు. కాని అనుసరించే పద్ధతులలో తేడాలు ఉండవచ్చు. ఇందులో లక్ష్యమన్నది సిద్ధాంత సంబంధమైనది. అనుసరించే పద్ధతులు పరిస్థితులను బట్టి ఉంటాయి. పద్ధతులు కశ్మీర్ విషయంలో బాహాటంగా, ప్రగల్భంగా కనిపించి, ఇతర రాష్ర్టాల విషయంలో నెమ్మదిగా, ప్రచ్ఛన్నంగా ఉన్నంత మాత్రాన లక్ష్యాలు వేరనగలమా? వాస్తవానికి భారతదేశ వైవిధ్యతకు అనుగుణంగా మనది సహకార ఫెడరలిస్టు రాజ్యాంగంగా రూపుదిద్దుకున్నప్పటికీ, కేంద్రీకరణ(సెంట్రలిస్టు) శక్తులు రాష్ర్టాల హక్కులలోకి చొరబడటం మొదటి నుంచీ ఉంది. ప్రాంతీయ, ఆర్థిక, రాజకీయ, సామాజికశక్తులు క్రమంగా బలపడినా కొద్దీ స్వీయ అస్తిత్వం కోసం, స్వీయాభివృద్ధి కోసం, తాము కూడా వ్యవహారాలలో తగు పాత్ర వహించటం కోసం, తమ పాలనను తమ చేతిలోకి తీసుకోవటంకోసం, కేంద్రీకరణ శక్తులను ప్రతిఘటించటం మొదలైంది.

కశ్మీర్‌కు సంబంధించి ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఉన్నట్లుండి భారీ మార్పులు తేవటం కొట్టవచ్చినట్లు కన్పించి సంచలనాన్ని సృష్టించిందిగాని, ఇతరత్రా కశ్మీర్‌కు గల ప్రత్యేక రక్షణ నిబంధనలను, హక్కులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కాలక్రమంలో, నెమ్మదినెమ్మదిగానే అనేకాన్ని ఇప్పటికే తొలిగించి వేశాయి. ఇది మొదటిది కాగా రెండవ విషయం, ప్రస్తుత కేంద్రప్రభుత్వం తన ఉధృతి వల్ల కొంత, భావజాలం వల్ల కొంత, కేంద్రీకరణ చర్యలను కాంగ్రెస్ కాలంలోకన్న వేగవంతం చేసినట్లు కన్పిస్తున్నది. ఇప్పటికే చర్చలోకి వచ్చిన ఇటీవలి కొన్ని బిల్లులు అందుకు ఉదాహరణ.


ఈ ఫెడరల్ ధోరణులను కాంగ్రెస్ అనంతరం కొద్దికాలం పాలించిన జనతా, నేషనల్ ఫ్రంట్ గౌరవించాయి గాని, అవి పతనమైన తర్వా త యథా పూర్వస్థితి రావటం మొదలైంది. అంతిమంగా కాంగ్రెస్, బీజేపీ అనే జాతీయపార్టీలు రెండూ కేంద్రీకరణ లక్ష్యాలతో కొనసాగాయి. తమతమ బలాలూ, బలహీనతలను బట్టి ఫెడరల్ పార్టీలు ముందువెనుకల కు ఊగిసలాడుతూ, ఇవే కేంద్రీకరణ పార్టీలలో ఒకసారి మైత్రి, ఒకసారి ప్రత్యర్థిత్వం అన్న విధంగా ప్రయాణం సాగిస్తూ వస్తున్నాయి. కేంద్రీకరణకు, ఫెడరలిజానికి మధ్య నెహ్రూ కాలంలోనే మొదలైన తాడులాగుడు క్రీడ ఆయన అనంతరం ఈ రెండు శక్తులూ తమతమ పరిధులలో బలపడటంతో ,వ్యాయామ కర్కశ స్థిరకాయుల యుద్ధము భయానకంబయ్యె అనే విధంగా పరిణమించింది. మరికొంతకాలం గడిచేసరికి కేంద్రీకరణశక్తులు, ఫెడరల్‌శక్తులు రెండు కూడా తమ బలాలూ, బలహీనతలు రెండింటినీ బయటపెట్టుకున్నా యి. ఒకసారి గెలవటం, ఒకసారి గాయాలపాలై చిత్తవటం అన్నట్లుగా సాగుతూ వస్తున్నది వీరి ఘర్షణల చరిత్ర. ఈ జనరల్ పరిస్థితి మధ్య కశ్మీర్ అంశం ఒక ప్రత్యేక కేసుగా ముందుకు వచ్చింది. ఆ ప్రత్యేకత కారణంగానే ఫెడరలిస్టులలోని కొందరితోపాటు, సాధారణ ప్రజానీకంలో అనేకులతో పాటు వివిధవర్గాలు ఆ విధమైన వైఖరులను తీసుకున్నాయి. కేంద్రప్రభుత్వంలో ఉన్నవారి లక్ష్యం ఇతరత్రా చూసినపుడు కేంద్రీకరణ అయినప్పటికీ అందుకోసం అనుకరించే విధానం కశ్మీర్ తరహాలో కావాలనుకున్నా సాధ్యమయ్యేదికాదు. ఎందువల్లనో వివరించనక్కరలేదు. ఎవరైనా ఊహించగలరు. అదే సమయంలో ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. కశ్మీర్‌కు సంబంధించి ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఉన్నట్లుండి భారీ మార్పులు తేవటం కొట్టవచ్చినట్లు కన్పించి సంచలనాన్ని సృష్టించిందిగాని, ఇతరత్రా కశ్మీర్‌కు గల ప్రత్యేక రక్షణ నిబంధనలను, హక్కులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కాలక్రమంలో, నెమ్మదినెమ్మదిగానే అనేకాన్ని ఇప్పటికే తొలిగించి వేశాయి.
t-Ashok
ఇది మొదటిది కాగా రెండవ విషయం, ప్రస్తుత కేంద్రప్రభుత్వం తన ఉధృతి వల్ల కొంత, భావజాలం వల్ల కొంత, కేంద్రీకరణ చర్యలను కాంగ్రెస్ కాలంలోకన్న వేగవంతం చేసినట్లు కన్పిస్తున్నది. ఇప్పటికే చర్చలోకి వచ్చిన ఇటీవలి కొన్ని బిల్లులు అందుకు ఉదాహరణ. ఇందుకు సంబంధించి ఒక మౌలిక విషయంలోకి వెళితే, సాధారణ ప్రజలు అయినా, ప్రాంతీయ, ఆర్థిక-రాజకీయశక్తులు అయినా ఒక వైపు ఫెడరలిజం, మరొకవైపు కేంద్రీకరణ అనే అరేంజ్మెంట్ బండికి రెండు చక్రాల వలె సాగాలనే కోరుకుంటారు. ఈ ధోరణి క్రీస్తుపూర్వపు జనపదాలు- మహా జనపదాలు, తొలిదశ రాజ్యాల కాలం నుంచే ఉంటూ వస్తున్నది. స్థానిక శక్తులు, కేంద్ర శక్తులు రెండింటి సహజీవనంతో సమతులనం, స్థిరత్వ సాధనకు అది ఒక తప్పనిసరి ఒప్పందపు ఏర్పాటువంటిది. అనుభవంలో రూపుదిద్దుకున్నది. ఈ ఏర్పాటును ఇద్దరిలో ఎవరు ఎందుకు భంగపరచజూసినా ఘర్షణ స్థితి, అస్థిరత్వాలు ఏర్పడతాయి. చారిత్రకమైన డీప్ ప్రాసెసెస్ ఇవే. వీటిని ఏదో కొంత సవరించటం మినహా, మితిమీరిన కేంద్రీకరణతో భంగపరచగల దుస్సాహసం ఎవరూ చేయబోరని భావించాలి. అటువంటి దుస్సాహసాన్ని ఫెడరల్ శక్తులు ఆమోదించలేవు కూడా.

326
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles