ఆహారశుద్ధికి చిరునామా

Fri,August 16, 2019 12:53 AM

దేశంలో వ్యవసాయరంగానిది విచిత్ర పరిస్థితి. అనావృష్టి వస్తే పంటలు పండవు, ధరలు బాగుంటాయి. వానలు బాగా పడితే పంటలు పండుతాయి, ధరలు పడిపోతాయి. వీటిని అధిగమించేందుకు ఉన్న అవకాశాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రధానమైనదని ముఖ్యమంత్రి గుర్తించాడు. త్వరగా చెడిపోయే గుణమున్న ఆహారపదార్థాలతోను ఎక్కువకాలం నిల్వ ఉంచుకొని ఉపయోగించుకోవచ్చు. మిగతా అన్నిరంగాలతో పోలిస్తే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. పొలాల్లో పంట కోత అనంతరం నుంచి మార్కెట్‌కు చేరే లోపు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలలో 30-50 శాతం, పప్పుధాన్యాలలో 20-30 శాతం, ఆహారధాన్యాలలో 5-10 శాతంపైనే నష్టం జరుగుతుంది. ఫుడ్‌ప్రాసెసింగ్ ద్వారా ఈ నష్టానికి అడ్డుకట్ట వేయవచ్చు. దీంతోపాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ తరహా ఉత్పత్తులలో మ్తొతం ఆహార పదార్థాలలో 35 శాతం వాటా ఉన్నది. కానీ దేశవ్యాప్తంగా అందులో రెండు శాతం కూడా ప్రాసెసింగ్ చేయడం లేదు.

pidigum-saidaiah
రాష్ట్రంలోని ప్రజలకు కల్తీ లేని ఆహారాన్ని అందించటం తో పాటు రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే మన రాష్ట్రం విత్తనరంగంలో అగ్రగామిగా ఉన్నది. త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్‌కు చిరునామా కాబోతున్నది. ఈ దిశగా ఎదుగడానికి కావలసిన ముడిసరుకులతో పాటు జాతీ య, అంతర్జాతీయ రవాణా సదుపాయాలు, శీతల గిడ్డంగులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంతో విలువల జోడింపు కూడా సాధ్యం. అలాగే పంటల వైవిధ్యీకరణ, రైతులకు గిట్టుబాటు ధర, ఉపాధి, గ్రామీ ణ ప్రాంతాల్లో వ్యవసాయ పారిశ్రామికీకరణ సాధ్యమవుతుంది. దీంతో పాటు ఆహారభద్రతకు ఊతమివ్వటంతో పాటు ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

దేశంలో వ్యవసాయరంగానిది విచిత్ర పరిస్థితి. అనావృష్టి వస్తే పంట లు పండవు, ధరలు బాగుంటాయి. వానలు బాగా పడితే పంటలు పం డుతాయి, ధరలు పడిపోతాయి. వీటిని అధిగమించేందుకు ఉన్న అవకాశాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రధానమైనదని ముఖ్యమంత్రి గుర్తించాడు. త్వరగా చెడిపోయే గుణమున్న ఆహారపదార్థాలతోను ఎక్కువకాలం నిల్వ ఉంచుకొని ఉపయోగించుకోవచ్చు. మిగతా అన్నిరంగాలతో పోలి స్తే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, పౌల్ట్రీ, ఉత్పత్తుల్లో తెలంగాణది ప్రత్యేక స్థానం. పసుపు, బత్తాయి, నిమ్మ ఉత్పత్తులలో తెలంగాణకు ప్రత్యేకత ఉన్నది. ఎండు మిరప, మక్కజొన్న ఉత్పత్తులలో రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నది. కోడి గుడ్ల ఉత్పత్తిలోనూ రాష్ర్టానిది 3వ స్థానం. ప్రత్యేకించి ఉద్యాన పంటలలో దేశంలో ఏ రాష్ర్టానికి లేని అనుకూల వాతావరణం తెలంగాణలో ఉన్నది. అందుకే మొత్తం పండ్ల ఉత్పత్తిలో పదో స్థానంలో ఉండగా, విస్తీర్ణం పరంగా మూడవ స్థానం మనది. మాంసం ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం ఐదవ స్థానంలో ఉన్నది.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు కొన్ని పంటలకు ప్రత్యేక సాగు, ఉత్పత్తి క్లస్టర్లుగా ఉన్నాయి. నల్గొండ, సూర్యపేట, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు వరి; వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, జనగాం, పెద్దపల్లి మక్కజొన్న; సంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్ జిల్లాలు మామిడి; నల్ల గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు బత్తాయి, నిమ్మ పంటలకు అనుకూలమైనవి. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పాల ఉత్పత్తులు; మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో గుడ్లు, కోడి మాంసం బాగా ఉత్పత్తవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు ప్రాసెసింగ్‌కు అనుకూలం. వీటితోపాటు రంగారెడ్డి, వికారాబాద్, జిల్లాల్లో అపరాలు; వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో వం టనూనె ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఖమ్మం, నల్గొండ నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ప్యాకేజ్‌డ్ ఫుడ్ ప్రాసెసింగ్; రంగారెడ్డి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలలో-డైరీ ప్రాసెసింగ్‌కు; హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో స్నాక్స్, బేకరీ ఫుడ్లకు మేజర్ ప్రాసెసింగ్ క్లస్టర్లున్నాయి. ఆయా ప్రాంతాలు, జిల్లాల్లో ముడిసరుకులు, వ్యవసాయోత్పత్తులు తక్కువ ధరతో కావాల్సిన మొత్తంలో ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లాలు వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి, కొత్త పరిశ్రమల స్థాపన కు దోహదపడుతాయి.

వ్యవసాయం పట్ల ఇష్టం, రైతు ఉన్నతి, వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రూపకల్పన చేసిన పలు పథకాలు రైతుల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఈ పథకాలు పలు దేశాలకు, రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవకాశాలు పెరిగాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందుతున్నది. సాగునీటి కింద ఉన్న విస్తీర్ణం రెం డింతలయ్యింది. ఫలితంగా వ్యవసాయ-ఉద్యాన ఉత్పత్తులు పెరిగాయి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంతో కోటి ఎకరాల మాగాణి సాగు సాకారం కానున్నది. దీంతో అన్ని పంటలలో ఉత్పాదకత పెరిగింది. అయితే ఇప్పుడు పెరిగిన ఉత్పాదకతతో ధరలు పడిపోకుండా చూడాలి. రైతుల నుంచి గిట్టుబాటు ధరలకు సేకరించాలి. ఇందుకు పరిష్కారం ఫుడ్ ప్రాసెసింగ్. ఈ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగే సత్తా తెలంగాణ రాష్ర్టానికి ఉన్నది.

2022 నాటికి రాష్ట్రంలో రైతుల ఆదాయాలు భారీగా పెరుగుతాయి. రెట్టింపునకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీతో 15.8 శాతం పైనే పెరుగనున్నా యి. నిల్వ మౌలిక సదుపాయాల కల్పన (2.5 శాతం), లైవ్‌స్టాక్ మద్దతు(6.6 శాతం), నీలి విప్లవం (6.6 శాతం), మార్కెట్ సంస్కరణలు (9.1 శాతం), క్షీర విప్లవం (10.41 శాతం), సాగునీటి ప్రాజెక్టుల (15.81) ఆదాయ పెరుగుదలకు దోహదపడుతాయి. సహజంగా పెరిగే ఆదాయాలు 37.5 శాతం మేర ఉంటాయి. వీటన్నింటిలో ప్రాసెసింగ్‌కు మహర్దశ రానుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఉన్నాయి. 151 మార్కెట్ యార్డులు, 44 ఈ-నామ్ మార్కెట్‌లు, రెండు మిలియన్ టన్నుల మేర హౌజింగ్ సామర్థ్యం, రెండు లక్షల టన్నుల శీతల గిడ్డంగుల సామర్థ్యం, అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా లక్షల టన్నుల కార్గ్ కెపాసిటీ, 8500 టన్నుల సాలీనా త్వరగా చెడిపోయే ఆహార ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో పలు ఆహార పదార్థాల విలువ జోడింపునకు అపార అవకాశాలున్నాయి. చిరుధాన్యాలకు ఆదరణ పెరుగుతున్నది. కార్న్‌ఫ్లేక్స్, మూసెల్లీ, రైస్‌ఫ్లేక్స్ రూపంలో విలువల జోడింపు అవకాశాలున్నాయి. దేశంలో మన రాష్ట్రం పసుపు ఉత్పత్తిలో మొదటిస్థానం, ఎండుమిరపలో రెండవస్థానంలోఉన్నది. దీంతో పసుపు, మిరప పొడుల వ్యాపారానికి అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మక్కజొన్న స్టార్చ్ కు మార్కెట్ విలువ పెరుగుతున్నది. దేశంలో దీని వినియోగ రేటు 6 శాతం పైనే. డెక్ట్స్రోజ్, సార్బిటాల్, గ్లూకోజ్ స్టార్చ్ ఉత్పత్తులు, వాటి ఆధారిత ఉత్పత్తులను ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా తయారుచేసుకోవచ్చు. సజ్జ, జొన్న, రాగి, కొర్ర, సామల వంటి చిరుధాన్యాలు రాష్ట్రంలో పుష్కలంగా ఉత్పత్తవుతున్నాయి. వీటితో పాస్తా, వెర్మిసెల్లి, నూడిల్స్‌లకు మార్కెట్ డిమాండ్ పెరుగుతుంది. పండ్లు, కూరగాయలతో చేసే ప్యాకేజ్‌డ్ పండ్ల రసాలు, డీహైడ్రేటెడ్ ఉత్పత్తులకు డిమాండు ఉన్నది. మొత్తం ప్రాసెస్‌డ్ ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో ఇవి 28 శాతం. కాబట్టి ప్రాసెస్‌డ్ ఉత్పత్తులకు ముడిసరుకుతో పాటు మంచి మార్కెటింగ్ అవకాశాలు రాష్ట్రం లో ఉన్నాయి.

దేశంలోనే గొర్రెల మాంసం అత్యధికంగా అందుబాటులో ఉన్న రాష్ట్రం తెలంగాణ. 75 శాతం సబ్సిడీపై పాలిచ్చే బర్రెలను ప్రభుత్వమే రైతులకు అందిస్తున్నది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని చెరువుల్లో 40 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. హరితగృహాల సంఖ్యను 95 శాతం సబ్సిడీ అందిస్తూ వాటి సంఖ్యను గణనీయంగా పెంచింది. ఫలితంగా కూరగాయల, పూల ఉత్పత్తి పెరిగిం ది. ఫలితంగా గిట్టుబాటు ధరలు రావాలంటే కొత్త మార్కెట్‌లు అందిపుచ్చుకోవాలి. లేదా విలువల జోడింపు ప్రాసెసింగ్ ద్వారా కొత్త మార్కెట్‌ను సంపాదించుకోవాలి. పొలాల్లో పంట కోత అనంతరం మార్కెట్‌కు చేరే లోపు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలలో 30-50 శాతం, పప్పు ధాన్యాలలో 20-30 శాతం, ఆహారధాన్యాలలో 5-10 శాతంపైనే నష్టం జరుగుతుంది. ఫుడ్‌ప్రాసెసింగ్ ద్వారా ఈ నష్టానికి అడ్డుకట్ట వేయవచ్చు. దీంతోపాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. కానీ దేశ వ్యాప్తంగా అందులో రెండు శాతం కూడా ప్రాసెసింగ్ చేయడం లేదు. అదే మలేషియాలో 83 శాతం, ఫిలిప్పిన్స్‌లో 78 శాతం, చైనాలో 23 శాతం పైగా ప్రాసెసింగ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఈ రంగాలలో ప్రాసెస్‌డ్ ఆహారానికి మన దేశంలో మంచి భవిష్యత్ ఉన్నది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొచ్చింది. సీఎం అన్నట్టు ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పితే, ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు మార్కెటింగ్ సౌకర్యం లభి స్తుంది. తద్వారా ఉపాధి పెరుగుతుంది. ప్రాసెసింగ్‌కు అన్నిరకాల పంటలు అనుకూలం కాదు. కాబట్టి ప్రాసెసింగ్‌కు సరిపోయే పంట రకాలపై పరిశోధనలు జరుగాలి. అదేవిధంగా రైతులను ఐక్యం చేయాలి. వారితోనే స్టార్ట ప్‌లు ఏర్పాటుకు కృషిచేయాలి. పంటల క్లస్టర్లు ఏర్పాటుచేసి, వీటిని పం టల కాలనీతో అనుసంధానం చేయాలి. అప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్‌తో రాష్ట్రంలోని రైతులకు అదనపు ఆదాయమార్గం లభిస్తుంది.
(వ్యాసకర్త: శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles