బరువు కాదు బాధ్యత

Sat,August 17, 2019 11:55 PM

ఆకలిచావులు, ఆత్మహత్యలు, కరు వు, కన్నీళ్లు, సాగునీరు కనీసం తాగునీరు లేని దుస్థితి నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం. కరువుతో అల్లాడుతూ బోరుబావుల మీద ఆధారపడి బతుకులీడుస్తున్న తెలంగాణ రైతాంగం మీద మోపిన కరంటు భారం చూసి వ్యతిరేకించి కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అనేక అవరోధాలను, అవమానాలను ఎదుర్కొని 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ర్టా న్ని సాధించి ఉద్యమనేతగా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 14 ఏండ్ల ఉద్యమంలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు దగ్గరగా చూసిన అనుభవం, ఉద్యమ సమయంలో రోజుల తరబడి తెలంగాణ రాష్ర్టానికి ఏం కావాలన్న మేధోమథన చర్చలు చేశారు. ఆ అవగాహనతో అధికారంలోకి వచ్చినవెంటనే అనేక వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యమైనవి. సాగునీటి కోసం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తూనే గోదావరి మీద కాళేశ్వరం, కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పథకం లాంటివాటిని చెప్పుకోవచ్చు. తెలంగాణ విద్యార్థుల ఉన్నత భవిష్యత్ కోసం నూతన గురుకులాలు ఏర్పాటుచేశారు. హాస్టళ్లు, పాఠశాలల్లో సన్నబి య్యం అన్నం పెడుతున్నారు. వ్యవసాయం దండుగ అన్న సీమాంధ్ర పాలకుల విధానాలతో విసిగిపోయి ఆత్మవిశ్వాసం కోల్పోయిన రాష్ట్ర రైతాంగం గుండెల నిండుగా ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వ్యవసాయం పండుగ అనిపించేలా రైతుల కు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి రెండు విడుతలుగా మొత్తం పదివేల నగదు సాయం అందిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన గ్రామీణ పేదల జీవితాలలో వెలుగులు నింపాలన్న ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎవరూ ఊహించనివి. ఈ దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రంలో అమలుచేయనివి.

ప్రారంభించిన మూడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టు గోదావరి నదికి నడకలు నేర్పుతున్నది. ఇన్నాళ్లూ నీళ్లు లేకుండా చేసిన వలస పాలకుల ప్రచారానికి కాళేశ్వర నిర్మాణం చెంపపెట్టు. ఈ ప్రాజెక్టు ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్న తరుణంలోనూ విపక్షాలు ప్రాజెక్టు మీద విషం కక్కడం మానడం లేదు. అరువై ఏండ్లు అన్యాయమైన తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సాధించిన ఫలితాలు వీలైనంత త్వరగా అందించాలన్న కేసీఆర్ పట్టుదల మూలంగానే కాళేశ్వరం శరవేగంగా నిర్మాణమై కళ్లముందు నిలబడింది.


ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతవరకు రైతాంగానికి ఇంతలా అండగా నిలిచిన ప్రభుత్వం లేదంటే కేసీఆర్ ఆలోచనలు ఎం త ఉన్నతమైనవో, ఆదర్శవంతమైనవో తెలుస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం ఏర్పడి ఐదేండ్లు పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిరాటంకంగా ముందుకుసాగుతున్నాయి. కేసీఆర్ ఆదర్శవంతమైన పాలనను చూసి వరుసగా రెండోసారి తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ప్రజలు ఎన్నికలలో తీర్పు ఇచ్చి హెచ్చరించినా తెలంగాణలోని ప్రతిపక్షాలు మాత్రం ఇంకా తీరు మార్చుకోలేదు. అదే పాత, మూస ధోర ణితో గత ఐదేండ్లుగా చేసిన, చేస్తున్న ఆరోపణలతోనే ప్రభు త్వం మీద బురదజల్లి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మన ఇంట్లో పెళ్లి చేయాలంటేనే, మనం ఒక ఇల్లు కొనుక్కోవాలంటేనే అనేకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం. అందినచోటల్లా అవసరానికి అప్పుచేసి తిరిగి వీలును బట్టి తీరుస్తూ ఉంటాం. ఒక ఇంటికి సంబంధించిన విషయంలోనే ఇన్ని ఇబ్బందులున్నప్పుడు ఒక ప్రభుత్వాన్ని నడుపడంలో అనేక సమస్యలు ఇమిడి ఉంటాయి. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా అన్నిపథకాలను అవరోధాల్లేకుండా ముందుకుతీసుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటిరోజుల్లో కడుపు కట్టుకుని పనిచేస్తాం.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషిచేస్తాం అని చెప్పినట్లు అదే మాటకు కట్టుబడి ముందుకువెళ్తున్నారు. కానీ విపక్షాలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం పథకాల మీద ప్రజలకు తప్పు డు సమాచారం చేరవేసి లబ్ధి పొందాలనే ధోరణితోనే వ్యవహ రిస్తున్నాయి. ప్రజలు ఎన్నికలలో వీరి ఆరోపణలను తిప్పికొట్టినా తీరు మార్చుకోవడం లేదు. భూమినే నమ్ముకొని బతుకీడ్చే పేదరైతు కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకువచ్చారు. గత సీమాంధ్ర పాలనలో రైతు మరణిస్తే పట్టించుకున్నవారు లేరు. కరంటు షాక్‌తో మరణిస్తే రూ.20 వేలు చెల్లించి చేతులు దులుపుకునేవారు. అదీ కార్యాలయం చుట్టూ తిరిగితిరిగి బతిమిలాడితే ఎప్పుడోగాని వచ్చేవి కాదు.

ఇక స్థానిక ప్రజాప్రతినిధి గట్టిగా తిరిగి ఆపద్బంధు పథకం అమలుచేయి స్తే రూ.50 వేలు ఎన్నటికో గానీ వచ్చేవి కావు. దానికి సవాలక్ష మంది పైరవీకారులు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు నేరుగా చేతికి అందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం తను ప్రవేశపెట్టిన పథకాలను బరువుగా కాకుండా తెలంగాణ సమాజం పట్ల ఒక బాధ్యతగా స్వీకరించి అమలుచేస్తుండటం మూలంగానే ఈ రోజు ఇంతమంది బక్కరైతుల కుటుంబాలకు న్యాయం జరిగింది. ఈ ఏడాది కూడా బీమాను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయాన్ని భారంగా భావించిన రైతులు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలే కారణం. ప్రారంభించిన మూడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టు గోదావరి నదికి నడకలు నేర్పుతున్నది. ఇన్నాళ్లూ లేకుండా చేసిన వలస పాలకుల ప్రచారానికి కాళేశ్వర నిర్మాణం చెంపపెట్టు. ఈ ప్రాజెక్టు ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్న తరుణంలోనూ విపక్షాలు ప్రాజెక్టు మీద విషం కక్కడం మానడం లేదు. అరువై ఏండ్లు అన్యాయమైన తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సాధించిన ఫలితాలు వీలైనంత త్వరగా అందించాలన్న కేసీఆర్ పట్టుదల మూలంగానే కాళేశ్వరం శరవేగంగా నిర్మాణమై కళ్లముందు నిలబడింది. దీన్ని బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకొని ప్రణాళికతో పూర్తిచేయడమే దీనికి కారణం. కానీ కరంటు బిల్లును బూచీగా చూపి ఈ ప్రాజెక్టు గొప్పతనం మీద మరకలు రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నేం డ్లు బోరుబావులతో కన్నీరు కార్చిన తెలంగాణ రైతాంగానికి తెలియదా కరంటు ఖర్చెంత? అది కట్టలేదని పాలకులు లాక్కెళ్లిన స్టార్టర్ల విలువెంతనో? ఈ ఐదేండ్లలోనే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల తాగునీటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని మిషన్ భగీరథ పథకాన్ని మొదలుపెట్టి పూర్తిచేసింది.
sandeep-reddy-k
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ పల్లె ప్రజలకు తాగునీరు అందిస్తున్నది. మిషన్ కాకతీయ పథకంతో తెలంగాణ చెరువులు పునర్నిర్మా ణం అవుతున్నాయి. అందులో ఉచితంగా చేపపిల్లలను విడిచి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలబడింది. సీమాంధ్ర పాలనలో కాలువ పక్క న ఉన్న రైతులు మోటార్లు పెట్టుకుని సాగునీరు తీసుకుంటే కేసులు పెట్టేవారు. చెరువులు నింపడా న్ని నిషేధించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కింద ఉన్న అన్ని చెరువులు నింపేందుకు అనుమతులు ఇచ్చింది. కాలువల పొడవునా రైతులు మోటా ర్లు వేసుకొని ఆరుతడి పంటలు పండించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఉచిత కరంటు అన్నీ ప్రజ ల పట్ల బాధ్యతతో చేస్తున్నవే. దేన్నీ ప్రభు త్వం బరువుగా భావించడం లేదు. ప్రతిపక్షాలు ఈ విష యాన్ని గుర్తెరిగి మసులుకుంటేనే మనుగడ ఉంటది. బురదజల్లడం మూలంగా ఏ విధమైన ప్రయోజనం ఉండదు.

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles