ప్రపంచీకరణకు ప్రమాదం

Sat,August 17, 2019 11:54 PM

ప్రపంచమంతా కొన్ని ఆర్థిక నియమాల ప్రకారం నడుస్తూ ఉంటుంది. అయితే ఈ నియమాలపై నమ్మకం సడలడం అంటూ మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుంది. చౌక ఇంధనం లభిం చేకాలం ముగిసిన తర్వాత 1970 దశకంలో ఇదే నేర్చుకున్నాం. దేశాలు దివాలా తీస్తాయనేది 1980 దశకంలో అర్థమైంది. అమెరికా తాకట్టులు, గ్లోబల్ బ్యాంక్‌లు కూడా నమ్మదగినవి కాదని మరో దశా బ్దం తర్వాత అవగాహనకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచీకరణపై ఇటువంటి ఆలోచనలే వస్తున్నాయి. అమెరికా మొదలుకొని బ్యూనస్ ఏయిర్స్ వరకు దేశాలన్నీ సరిహద్దుల్లేని వాణిజ్యం పట్ల నమ్మకం పెంచుకున్నాయి. కానీ ఇప్పుడా నమ్మకాలు సడలిపోతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పోర్టిఫోలియో లు మార్చుకుంటున్నారు. వ్యాపారసంస్థలు తమ పెట్టుబడుల విషయ మై పునరాలోచనలో పడ్డాయి. విధానకర్తలు పరిస్థితులను ఎదుర్కొనడానికి తంటాలు పడుతున్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ చివరికి ప్రపంచ ఆర్థికవ్యవస్థను మాంద్యంవైపే తీసుకుపోతున్నాయి. ప్రపంచంలోనే శిష్టవర్గంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణులకు నిలయమైన సెంట్రల్ బ్యాంక్‌లు మాంద్యాన్ని ఎదుర్కొనడానికి తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారని ఇన్వెస్టర్లు ఆశాభావంతో ఉన్నారు. కానీ ఈ సెంట్రల్ బ్యాంక్‌లు పరస్పర పోటీలోనే నిమగ్నమైపోయాయి. 2016లో జాతీయవాదం, జనాకర్షణ విధానాలు ప్రాచుర్యం పొందా యి. యురోపియన్ యూనియన్ నుంచి బయటపడాలని బ్రిటన్లు తీర్పు ఇచ్చారు. అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకున్నారు. అయితే ఈ పరిణామాల పట్ల మొదట వ్యక్తమైన అభిప్రాయాలు వేరుగా ఉన్నా యి. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యం, అదుపులేని వలసల మూలంగా ఏర్పడే ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను ఈ ఆర్థికరంగ శిష్టవర్గం పట్టించుకోకపోవడం వల్ల ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతగా ఈ పరిణామాలను కొందరు అర్థం చేసుకున్నారు.

కానీ జాతీయవాదం అసలు స్వరూ పం ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. ప్రపంచీకరణ వాదుల తప్పిదాలను చక్కదిద్దుతారనిపించింది. కానీ వారిని మించిపోవడమే వీరి లక్ష్యం. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలుగాలనుకోవడం ఇందుకు ఉదాహరణ. వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా బ్రిటన్‌ను బయటికి పంపించాలని ఈయూ భావించింది. కానీ రెండేండ్ల సంప్రదింపుల తర్వాత కూడా జాతీయవాదులు పట్టువీడటం లేదు. కానీ కరడుగట్టిన బ్రెగ్జిట్‌వాది అయిన బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యారు. ఆర్థికరంగంలో నష్టాలు ఎదురైనా సరే, బ్రిటన్‌ను అక్టోబర్ 1వ తేదీలోగా బయటకుతేవాలని దృఢంగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి రాగానే మొదటి దశలో యురోపియన్ మిత్రదేశాల పట్లనే రక్షిత విధానాలను అవలంబించారు. కానీ ఈ పోకడను దేశంలోని, యూరప్‌లోని శక్తులు తిప్పికొట్టాయి. కానీ చైనాతో చర్చలు విఫలమయ్యాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థల మధ్య ఆర్థిక చర్చలకు ఉండవలసిన ప్రాథమిక నిబంధనలకు అనుగుణంగా ఈ చర్చ లు సాగనేలేదు. కనీసం కొత్త నియమావళిని కూడా ఈ రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు రూపొందించుకోలేకపోయాయి. చివరికి తాత్కాలికంగా ఎవరికి చేతనైన చర్యలు అవి తీసుకున్నాయి. మొరటుగా సుంకాలు విధించుకోవడం, కరెన్సీ విలువను తగ్గించుకోవడం, ప్రతి చర్యలకు దిగడం సాగుతున్నది. అయితే ఇటీవల కొంత ఊరట కలిగించే రీతిలో కొంత అవగాహన కుదిరి తదుపరి చర్యలకు దిగలేదు. ఇటలీలలో ఉప ప్రధాని మేటో సాల్విని ఈయూకు, వలసలకు వ్యతిరేకం. ఈయన తమ సొంత ప్రభుత్వాన్నే కూలదోయడానికి యత్నిస్తున్నారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనేది ఆయన ప్రయత్నం. అమెరికా మిత్ర కూటమిలోని జపాన్, దక్షిణకొరియా మధ్యనే వాణిజ్య యుద్ధం సాగుతున్నది. ఈ రెండుదేశాల మధ్య పాత వైరం పెల్లుబుకుతున్నది. అర్జెంటీనాలో మార్కెట్ కుప్పకూలిపోయింది. జనాకర్షణ, వాణి జ్య రక్షిత విధానాలకు పేరుబడిన రాజకీయవాదులు అధికారం చేపట్టడానికి సిద్ధపడుతున్నారు.

బ్రిటన్‌లో బ్రెగ్జిట్ సృష్టించిన అనిశ్చితి వల్ల పెట్టుబడులు నిలిచిపోయాయి. దీంతో ఆర్థికవ్యవస్థ కుంచించుకుపోయింది. జర్మనీ కూడా మాంద్యంలోకి కూరుకుపోయే లక్షణాలు కనిపిస్తున్నాయి. రెండవ త్రైమాసికంలో ఆర్థికరంగం కుంచించుకుపోయింది. అమెరికా, చైనా దేశాల ఎగుమతులు తగ్గిపోయాయి. అభివృద్ధి మందగించింది. ప్రపంచ పరిణామాలకు ఇన్వెస్టర్లు భయాందోళనలు చెందుతుంటే, స్టాక్‌మార్కెట్ ఊగిసలాడుతున్నది. గతేడాది పాటు కాలంలో ప్రపంచంలోని వంద బ్ల్యూచిప్ కంపెనీల లాభాలు మూడు శాతం తగ్గాయి. అయితే అమెరికాపైనే కేంద్రీకరించిన కంపెనీల లాభాలు 5.5 శాతం పెరిగాయి. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచీకరణ ఎదురుదెబ్బలు తిన్నది.


గత రెండేండ్లుగా అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు జాతీయవాదాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ట్రంప్ పన్నులు తగ్గించడం, వాణిజ్య నిబంధనలను సడలించడం ట్రంప్ రక్షితవిధానాల పట్ల వ్యతిరేకత ను కమ్మేసింది. కానీ ఈ విధానాలను ఇంకెంతో కాలం విస్మరించడం సాధ్యం కాదు. అంతర్జాతీయ రంగంలో ఏవైనా వ్యాపార నియమాలు ఇంకా ఉన్నాయా అని వ్యాపార సంస్థలకు, ఇన్వెస్టర్లకు ఆం దోళన మొదలైంది. పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు. బ్రిటన్‌లో బ్రెగ్జిట్ సృష్టించిన అనిశ్చితి వల్ల పెట్టుబడులు నిలిచిపోయాయి. దీంతో ఆర్థికవ్యవస్థ కుం చించుకుపోయింది. జర్మనీ కూడా మాంద్యంలోకి కూరుకుపోయే లక్షణాలు కనిపిస్తున్నాయి. రెండవ త్రైమాసికంలో ఆర్థిక రంగం కుంచించుకుపోయింది. అమెరికా, చైనా దేశాల ఎగుమతులు తగ్గిపోయాయి. అభివృద్ధి మందగించింది. ప్రపంచ పరిణామాలకు ఇన్వెస్టర్లు భయాందోళనలు చెందుతుంటే, స్టాక్‌మార్కెట్ ఊగిసలాడుతున్నది. గతేడాది పాటు కాలంలో ప్రపంచంలోని వంద బ్ల్యూచిప్ కంపెనీల లాభాలు మూడు శాతం తగ్గాయి. అయితే అమెరికాపైనే కేంద్రీకరించిన కంపెనీల లాభాలు 5.5 శాతం పెరిగాయి. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచీకరణ ఎదురుదెబ్బలు తిన్నది. అయితే ఇప్పుడు పరిస్థితి మరోరకంగా ఉన్నది. ఇంతకాలం ప్రపంచీకరణ విధానాలను ప్రోత్సహిస్తూ, ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుకు పునాదులు వేసిన అమెరికా ఇప్పుడు ఆ వ్యవస్థను కూలదోయడానికి యత్నిస్తున్నది. ట్రంప్ జాతీయ భద్రత పేర ఉక్కు, అల్యూమినియం, ఆటో దిగుమతులపై సుంకాలు విధిస్తున్నారు. ఇది 75 ఏండ్లుగా అమెరికా అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమని ప్రముఖ వాణిజ్య ఆర్థికవేత్తలు చాడ్‌బౌన్, డగ్లాస్ ఇర్విన్ ఇటీవల ఫారిన్ అఫైర్స్ పత్రికలో రాశారు. వాణిజ్య అడ్డంకులను నిరోధిస్తున్న డబ్ల్యుటీ వో నియమాలను నిర్వీర్యం చేయడానికి జాతీయ భద్రత వాదన బలమైనది. ఈ విషయంలో అమెరికా రష్యా సరసన నిలుస్తున్నదని వారు వివరించారు. అమెరికా గతంలో మిత్రదేశాలతో ఆర్థిక ఏకీకరణ సాధించడానికి తన ఆర్థిక, సైనిక, నైతికబలాన్ని ఉపయోగించేది. ఉద్రిక్తతలను సడలించేది.
greg-ip
మేం వారి భుజాలపై చేయివేసి చర్చించుకుందాం అంటూ వైరి పక్షాలను సముదాయించేవారం అని రీగన్, బుష్ ప్రభుత్వాలలో ఆర్థిక దౌత్యం నెరిపిన డాన్ ప్రైస్ వివరించారు. కానీ ట్రంప్ వ్యవహారసరళి ఇందుకు భిన్నంగా ఉన్నది. బ్రిటన్ ఈయూ నుంచి విడిపోతుంటే ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నారే కానీ, సర్దుబాటు చేయడానికి ప్రయత్నించలేదు. జపా న్, దక్షిణకొరియా గొడవల పట్ల కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మన సమిష్టి ప్రయోజనాలు కాపాడటానికి ఒకరున్నారనే భావన గతం లో ఉండేది. చెప్పుకోవడానికి మధ్యవర్తి ఉండేది. కానీ అమెరికా స్వయంగా ఏకపక్ష వాణిజ్య విధానాలను అవలంబిస్తున్నదని ప్రైస్ వివరించారు. అయితే ఇప్పటికీ ప్రపంచమంతా మాంద్యం వ్యాపించే లక్షణాలు పూర్తిగా కనిపించడంలేదు. 1970, 80 దశకాల నాటి పరిస్థితి లేదు. అయినప్పటికీ ఏకపక్ష వాణిజ్య విధానాలు అన్ని కరెన్సీలను, ద్రవ్య విధానాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. ట్రంప్ సుంకాలు విధించి బెదిరిస్తుండటంతో, చైనా తమ కరెన్సీ విలువను తగ్గించింది. దీంతో చైనా దిగివచ్చే సూచనలు లేవని తెలిసిపోయిం ది. చైనా సంధి కోరుకోవడం లేదని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఆర్థిక చరిత్రకారుడు బారీ ఈషెన్‌గ్రీన్ అభిప్రాయపడ్డారు. చైనా, కొరియా, వియెత్నాం దేశాల కరెన్సీ విలువలు తగ్గిపోవడం ట్రంప్ సహించలేరు. ఆయన అదనపు సుంకాలు విధించడం ఖాయం. దీంతో ప్రపంచ వాణి జ్యం మీద నమ్మకం సడలుతుంది. సెంట్రల్ బ్యాంకులు కూడా గాయాలకు లేపనం రాయడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు.
(వ్యాసకర్త: కెనడియన్- అమెరికన్ పాత్రికేయులు)
ఫూల్‌ప్రూఫ్: వై సేఫ్టీ కెన్ బి డేంజరస్ అండ్ హౌ డేంజర్ మేక్ అజ్ అన్‌సేఫ్ (2015), నో వే అవుట్? గవర్నమెంట్ ఇంటర్‌వెన్షన్ అండ్ ఫౌనాన్షియల్ క్రైసిస్ (2013), ది లిటిల్ బుక్ ఆఫ్ ఎకనమిక్స్: హౌ ది ఎకానమీ వర్క్స్ ఇన్ ది రియల్ వరల్డ్ (2010) పుస్తకాల రచయిత.

251
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles