జయజయహో కాళేశ్వరమా..!

Wed,August 21, 2019 12:37 AM

kaleshwaram-reservior
నిండుకుండ పొంగిపొరలే
గుండె నిండ రైతు సాగె
కాళేశ్వరమే సుజల నిధి
గలగల నురగలను పారె!
ఎండు కున్న రైతు స్వరం
నిండించే కాళేశ్వరం..
పసిడి పంట రాశులతో
వసి వాడని సాగు వరం!
హాలికులకు కలల పంట
జలముతోను సస్యమంట
తెలంగాణ ముంగిటిలో
పచ్చల తోరణాలంట!
వాయనమే నీకు తల్లి
ఆయువేను మాకు మళ్ళి
దీవించు సదా మమ్ముల
రైతుపాలి కల్పవల్లి!
జయహో కాళేశ్వరమా
తెలంగాణ సుస్వరమా
గోదావరి తాండవ లీల
ఎద పొంగె జలశయమా!
-డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి, 8555899493

153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles