తెలంగాణకు వరప్రదాయిని

Wed,August 21, 2019 12:38 AM

kaleshwaram farmers
గోదావరి నదీజలాలను తెలంగాణ బీడు భూములకు మళ్ళించే బృహత్తర సాగునీటి పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది తెలంగాణకు వరప్రదాయిని, అక్షయ భాండం తప్ప గుదిబండ కానే కాదు. ఇటీవల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజ్‌ల నిర్మాణం పూర్తికావడంతో సంబంధిత పంపుహౌజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోసే మొదటి దశ పూర్తయ్యింది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉభయ తెలుగు రాష్ర్టాల గవర్నర్ సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపడం తెలంగాణ రైతాంగానికి పర్వదినం. కానీ ఈమధ్య కొందరు విమర్శకులు, విశ్లేషకులు తమతమ కొన్ని అభ్యంతరాలు సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానళ్లలో వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరాలను పరిశీలిస్తే..

ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద పరిశ్రమ పెట్టి లక్ష కోట్ల పెట్టుబడితో లక్ష ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాం. కానీ వ్యవసాయరంగంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో 27 లక్షల ఎకరాలు సాగులోకి వస్తే దాదాపు 10 లక్షల మంది రైతులు స్వయం ఉపాధి సంపాదించగలరు. వారిమీద ఆధారపడే మరో 10 లక్షల మంది రైతు కూలీలకు జీవనోపాధి లభిస్తుంది. లక్ష కోట్ల పెట్టుబడి ఏవిధంగా చూసినా భారం కాదు.


1.విద్యుత్‌ఛార్జీలు తెలంగాణకు మోయలేని భారమా?:

ప్రాజెక్టు డీపీ ఆర్ తయారీలో 2016లో వ్యవసాయం కోసం ప్రత్యేక విద్యుత్ టారిఫ్ తెలంగాణలో లేదు. 2001లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరిగేష న్ కోసం రూ.400/హెచ్‌పీ/ఏడాదికి టారిఫ్ ఉండేది. అట్టి టారిఫ్‌ను కుట్రపూరితంగా ఎత్తిపోతల పథకాలను నిరుత్సాపరిచే ఉద్దేశంతో 2001 లో రద్దుచేశారు. కాబట్టి 2016లో యూనిట్ రేటు రూ. 5.30 చొప్పున విద్యుత్ ఛార్జీలు డీపీఆర్‌లో పొందుపర్చబడినది.

తెలంగాణ రైతాంగం పరిసరాల నుంచి కృష్ణా, గోదావరి నదులు ప్రవ హిస్తుండగా దశాబ్దాల తరబడి సాగునీటికి నోచుకోలేదు. బోరు బావులు తవ్వి చాలీచాలని నీటితో, నాణ్యతలేని విద్యుత్ సరఫరాతో మోటార్లు కాలిపోయాయి. పంటలు సగం పండి, సగం ఎండి రైతులు అప్పుల పాలైనారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక పెద్ద అవసరం.


ఎ) కేంద్ర జలవనరుల సంఘం 2010లో డీపీఆర్ తయారుచేయడానికి గైడ్ లైన్స్ విడుదల చేసింది. అట్టి మార్గదర్శకాల్లో ఎత్తిపోతల పథకానికి బెనిఫిట్ కాస్టు నిష్పత్తి లెక్కగట్టడానికి అనెక్సర్-18(బీ)లో నమూనా పొందుపర్చబడినది. మహారాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టు నమూనా లో విద్యుత్తు రేటు రూ.600/- హెచ్.పి./ సంవత్సరం లెక్కన బెనిఫిట్ కాస్టు నిష్పత్తి లెక్కగట్టబడింది.

బి)ఎక్కడా కూడా గైడ్ లైన్స్‌లో యూనిట్ రేటు ప్రస్తావన రాలేదు. రూ.5.30/ యూనిట్ విద్యుత్తు ఛార్జీలు వ్యాపార సంస్థలకు ఉంటుంది. కానీ వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తుకు అట్టి రేటు వాడకూడదు. కాబట్టి యూనిట్ రేటు ప్రకారంగా ఎకరానికి అయ్యే విదుత్తు ఖర్చు పెద్దమొత్తం లో కనబడుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన రూ. 600/ హెచ్.పి./సంవత్సరం చొప్పున కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌లో విద్యుత్తు ఖర్చులు కట్టవలసి ఉన్నది. మొత్తం 5 వేల మెగావాట్లను హార్స్ పవర్ (హెచ్.పి)లోకి మార్చినట్లయితే మొత్తం 66 లక్షల 66 వేలు హెచ్.పి.తో సమానం. పైన తెలిపిన రూ.600/ హెచ్.పి./ సంవత్సరం చొప్పున విద్యుత్తు ఖర్చు ఏడాది మొత్తానికి రూ.400 కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని 27 లక్షల ఎకరాలకు (18 లక్షలు కొత్తది+ 9 లక్షలు పాతది) పంచినట్లయితే ఎకరానికి అయ్యే విద్యుత్ ఖర్చు రూ.1500 మాత్రమే ఎకరానికి పండే పంట ఉత్పత్తి విలువ సరాసరి రూ. 50,000 ఉంటుం ది. ఆ విద్యుత్ ఖర్చు పంట ఉత్పత్తి విలువలో 3 శాతం మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం 2001లో ఉన్న ఇరిగేషన్ టారిఫ్ రూ.400 /హెచ్.పి./ సంవత్సరం నుంచి 600కు /హెచ్.పి./ సంవత్సరం పెంచినట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన టారిఫ్‌తో కలిసి వస్తది.

సి) తెలంగాణ ఖజనా మీద భారం పడకుండా మరొక పద్ధతి అవలంబించినట్లయితే విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. 2020 సంవత్సరం వర కు తెలంగాణలో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. ప్రతి సంవత్సరం వానకాలంలో 30 శాతం నుంచి 35 శాతం విద్యుత్ డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి థర్మల్ పవర్ స్టేషన్లు కొన్ని ఆపివేయబడతాయి. థర్మల్ స్టేషన్లను ఆపకుండా ఉత్పత్తి వాన కాలంలో చేసినట్లయితే దానికి కావలసిన బొగ్గు ఖర్చు భరించవలసి వస్త ది. మిగతా ఖర్చులు ఆపివేసినా, నడిపించినా ఉండేవే. 35 శాతం థర్మ ల్ స్టేషన్లను నడిపినట్లయితే 7 వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తుం ది. కానీ మనకు కావల్సింది 5 వేల మెగావాట్లు, వందరోజులు మాత్రమే నడుపవలసి ఉంటుంది. ఈ వంద రోజులకు అయ్యే బొగ్గు ఖర్చు రూ. 400 కోట్లు మాత్రమే. పైన తెలిపిన రూ.600/హెచ్.పి./ సంవత్సరం లెక్కన అయ్యే ఖర్చు మొత్తం రూ.400 కోట్లు. కాబట్టి ఈ రెండు విధానాల ప్రకారం ఎకరానికి అయ్యే విద్యుత్ ఖర్చు రూ.1500 మాత్రమే. కానీ 40 వేలు ఎకరానికి ఖర్చు అనే దుష్ప్ర చారం తప్పు. ఎకరానికి అయ్యే ఖర్చు రూ.1500 మాత్రమే. కాబట్టి ఈ విషయంలో ఏమైనా అనుమానాలుంటే ఎక్కడ చర్చించడాకైనా సిద్ధం.

2) కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నిర్మాణ పెట్టుబడి ఖర్చు తెలంగాణకు మోయలేని భారమా?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం లక్ష కోట్లకు పైబడి ఉంటుంది. ఇది తెలంగాణకు మేయలేని భారమా..!
ఎ) ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద పరిశ్రమ పెట్టి లక్ష కోట్ల పెట్టుబడితో లక్ష ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాం. కానీ వ్యవసాయ రంగంలో కాళేశ్వ రం ప్రాజెక్టుతో 27లక్షల ఎకరాలు సాగులోకి వస్తే దాదాపు 10లక్షల మంది రైతులు స్వయం ఉపాధి సంపాదించగలరు. వారిమీద ఆధారపడే మరో 10 లక్షల మంది రైతు కూలీలకు జీవనోపాధి లభిస్తుంది. లక్ష కోట్ల పెట్టుబడి ఏవిధంగా చూసినా భారం కాదు.

బి) 27 లక్షల ఎకరాలు పండించే నీటి కాల్వల వల్ల చుట్టుముట్టు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి ఇదివరకు చాలీచాలనీ నీటి వలన సగం పంట చేతికివచ్చే పరిస్థితి ఉండదు. పరిసర ప్రాంతాల్లో మరో 5 లక్షల ఎకరాల దాకా బోరు బావుల వలన పూర్తి పంట పండించుకునే అవకాశం లభిస్తుంది. 27 లక్షల ఎకరాల సరాసరి పంట ఉత్పత్తి విలువ 50,000 లెక్కలోకి తీసుకున్నట్లయితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పండే పంట 13,500 కోట్లు, అదనంగా 5లక్షల ఎకరాలలో వచ్చే పం ట విలువ మరో 1250 కోట్లు మొత్తం 15 వేల కోట్ల పంట ఉత్పత్తి అవుతుంది. 2వ పంటలో మరో 10 వేల కోట్లు పంట ఉత్పత్తి లెక్కలోకి తీసుకుంటే మొత్తం 25 వేల కోట్ల పంట ఉత్పత్తి సంవత్సరానికి వస్తుంది. ఈ ఉత్పత్తి రాష్ట్ర జీడీపీకి, దేశం జీడీపీకి దోహదపడుతుంది. కాబట్టి ప్రాజెక్టు వ్యయం భారం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పండే పలురకాల పంటలను ఉపయోగించి వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి, పాడి, పరిశ్రమ అభివృద్ధికి ఎంతగా నో దోహదపడుతాయి.

d-bheemaiah
దీనివల్ల వేల కోట్ల ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి అందుతుంది. గోదావరి రిజర్వాయర్ దాదాపు 120 కిలో మీట ర్లు పొడవు ఉండటం వల్ల 19 ఇతర రిజర్వాయర్ల వల్ల మత్స్య పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. పర్యాటకరంగం రవాణా రంగం అభివృ ద్ధి చెందుతుంది. తాగునీటి సౌకర్యం వల్ల పట్టణాలు విలసిల్లడం వలన నిర్మాణరంగం అభివృద్ధి చెందుతుంది. పైన తెలిపిన రంగాలలో దాదాపు లక్ష ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది. తెలంగాణ రైతాంగం పరిసరాల నుంచి కృష్ణా, గోదావరి నదులు ప్రవ హిస్తుండగా దశాబ్దాల తరబడి సాగునీటికి నోచుకోలేదు. బోరు బావులు తవ్వి చాలీచాలని నీటితో, నాణ్యతలేని విద్యుత్ సరఫరాతో మోటార్లు కాలిపోయాయి. పంటలు సగం పండి, సగం ఎండి రైతులు అప్పుల పాలైనారు. వేల ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణం ఒక పెద్ద అవసరం. ఇన్ని లాభాలు ఇచ్చే కాళేశ్వరం ప్రాజె క్టు ఏవిధంగా భారమవుతుందో విజ్ఞులు, విమర్శకులు, విశ్లేషకులు పునరాలోచించవలసిన ఆవశ్యకత ఉన్నది.

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles