విద్యా సామర్థ్యాలు పెరుగాలె

Wed,August 21, 2019 10:55 PM

ఏ సమాజాభివృద్ధికైనా విద్యావిధానమే మూలం. చదువును రెండు రకాలుగా చూడాలి. ఒకటి చదువు వల్ల అక్షరాస్యత పెరుగడం, తద్వారా ఉపాధి అవకాశాలు పొందడం కాగా, చదువు వల్ల విద్యాధికుడు, జ్ఞానవంతుడు కావడం రెండవది. సామాన్యమైన అవగాహనలో విద్య, అక్షరాస్యతలు రెండూ ఒకటిగానే భావించడం జరుగుతున్నది. కానీ ఆ రెండింటి మధ్య చాలా భేదం ఉన్నది. విద్య బతుకడం కోసం కాదు. జీవితం ఏమిటో అర్థం చేసుకోవడం విద్య. విశ్వాసంతో, వికాసంతో, సంతృప్తితో, సమగ్రంగా, సంపూర్ణంగా, సాధికారికంగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించడమే జీవించడం. సామర్థ్యం అం టే నిపుణత, చతురత, యోగ్యత లేదా ఏదైనా పనిచేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట. Life is a struggle for existane and it is a war for survi valఅంటారు కొందరు. కానీ అది సత్యం కాదు. జీవితం సాధనాపర్వం. అక్షరాలను నేర్వడం అక్షరాస్యత అయితే, అక్షరాంతర్గత భావాన్ని సమన్వయం చేసుకోవడం, విద్య. అది (విస్తృతంగా చదువడం, సంబంధిత జ్ఞానాన్ని అత్యధికంగా పొందడం), బోధ (ఎదుటివారి కోణంలో అర్థం చేసుకోవడం), అవగతం (ప్రామాణిక పరీక్షల ద్వారా నిర్ధారించుకోవడం), ప్రచారం (పదుగురికి ఆ విజ్ఞానాన్ని అందించడం, చర్చించడం లొసుగులు సవరించుకోవడం) వల్ల సార్థకమౌతుంది. ఆ చదువు సత్-అసత్ మధ్య ఉండే భేదాన్ని గుర్తించే వివేకాన్ని, చతురతను ఇస్తుంది. కర్తవ్యమేమిటో అవగతం చేస్తుంది. అలాంటి చదువు విద్యగా పరిగణించబడుతుంది. విద్యా సామర్థ్యాలు అన్నప్పుడు వీటినన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. రెండును రెండుతో గుణిస్తే నాలుగు లేదా రెండుకు రెండు కలిపితే నాలుగు. అదే మూడును మూడుతో గుణిస్తే తొమ్మిది కాని మూడుకు మూడు కలిపితే అది ఆరు మాత్రమే. ఇక్కడ అంకెలు మాత్రమే మారాయి. కానీ కలుపడం లేదా గుణించడం మారలేదు.

విధాన రూపకల్పనలో ప్రాచీన సాంప్రదాయ భారతీయ సాహిత్యంలో చోటుచేసుకున్న అంశాలు నేటి ఆధునిక సాంకేతిక విధానాలకు ఏ విధంగా అనుసంధానించవచ్చునో ఆలోచించవలసిన అవసరం ఉన్నది. 10వ తరగతి చదివే విద్యార్థికి తప్పనిసరిగా కార్యస్థలంలో అనుభవం ఉండాలి.


అయినా భిన్నమైన ఫలితాలు రావడానికి కారణం ఏమిటనేది విద్యార్థి ఆలోచించగలు గాలి. ఆ కోణంలో ఉపాధ్యాయుడు విద్యార్థిలో ఆలోచనను రేకెత్తించగలు గాలి. ఆ ప్రేరణ విద్యార్థి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆలోచించే విధానాన్ని నేర్పుతుంది. సమస్యలను పరిష్కరించే మార్గానికి తెరతీస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆ ఆలోచనాసరళిని జీవితానికి అన్వయించుకో గలుగుతాడు. జీవితాన్ని ఉన్నతీకరించుకుంటాడు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తోటివారికన్నా ఎక్కువ మార్కులు రావాలని, అందరిలో తమ పిల్లలకే మొదటి గ్రేడ్ రావాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి పిల్లలు చదువాలనుకుంటారు. తల్లిదండ్రుల ఆశయాలను, లక్ష్యాలను అధిగమించాలనే తపనతో చేసే ప్రయత్నంలో ఒత్తిడి ఎక్కువై అవసరానుగుణంగా విలువ లను అతిక్రమించడం జరుగుతుంది. పోటీతత్వం మంచిదే. అది పరస్పరాధారిత మార్గంలో ఉంటే ఉత్తమ ఫలితాలనిస్తుంది. అలా కాని నాడు నైతికత దెబ్బతినే అవకాశం ఉన్నది. విద్యార్థిలో ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలు ఉద్భవిస్తే ఆ విద్యార్థిలో ఉత్సుకత పెరుగుతుంది. నేర్చుకోవాలనే ప్రేరణ కలుగుతుంది. అన్వేషణ ఆరంభమవుతుంది. ఉత్సాహంతో ఆరంభమైన ప్రయాణం ఆనందంగా సాగిపోతుంది. ఒత్తిడి ఉండదు. సహజ స్వీకృతి ఆధారంగా, తార్కికంగా సాగే పయనంలో తన సామర్థ్యాన్ని వివి ధ అంశాలపై విస్తరించుకోగలుగుతాడు. చేసేపనిలో నైపుణ్యాన్ని సంతరించుకునేందుకు తోడ్పడేది జిజ్ఞాస. ఆ పని పట్ల ఆసక్తి. నేర్చుకోవాలనే తప న. యాంత్రికంగా పిల్లలకు ఆసక్తిలేని రంగాల్లో, ఆసక్తి కలుగని పద్ధతుల లో బోధిస్తే వారిలో నేర్చుకోవాలనే కుతూహలం లోపిస్తుంది. సామర్థ్యా లు పెరుగవు. పుస్తకస్తమైన విజ్ఞానం బట్టీయం ద్వారా మార్కులు సాధించ వచ్చు, గ్రేడులను పొందవచ్చు, ఉద్యోగాలు రావచ్చు కానీ పిల్లల వైఖరి మారే అవకాశాలు తక్కువ. పరిస్థితులకు అన్వయించుకునే విధానం కొరవడుతుంది. ఉదాహరణకు ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ తన క్లయింట్ వద్ద పనిచేసే ఉద్యోగుల ఆదాయపు పన్నును మదింపు వేసే సమయంలో, ఆ ఉద్యోగి మూలవేతనంతో కలిసే అన్ని అలవెన్స్‌లు కలిపి ఎంత ఆదాయపు పన్ను కట్టగలడో చెప్పగలుగుతాడు.

కానీ వ్యతిరేక దిశలో అంటే ఎంత ఆదాయపు పన్ను కట్టవలెనో చెపితే మూలవేతనం ఎంత ఉండాలన్న గణింపు అతను చేయలేకపోవచ్చు. మొదటిది చదువు వల్ల వస్తుంది. రెం డవది చదువును సమర్థవంతంగా అన్వయించుకోవడం ద్వారా వస్తుంది. రెండూ కలిస్తే అతనిలో విద్యాసామర్థ్యాలు ఉన్నట్లుగా పరిగణించాలి. అక్షరాస్యతా సామర్థ్యం కాదు మనకు విద్యా సామర్థ్యాలు కావాలనుకున్నాం. కాబట్టి ఆ వైపు దృష్టిసారించినా, పాచిపట్టిన ఆలోచనాసరళితో, కాలంచెల్లిన ప్రణాళికా నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక విజ్ఞాన దీప్తిని సమన్వయం చేసుకోలేకపోవడం తో, విద్యారంగంలో ఎన్ని మార్పులు చేసినా, ఎందరు అధికారులను మార్చినా అవన్నీ పైపై పూతలుగా మిగిలిపోయాయే కానీ మూలాలపై ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఆశించిన ఫలితాలు రావడం లేదు. మార్పు కావా లనుకుంటే కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ నిపుణులతో నేటి యువత పోటీ పడవలసిన అవసరం వచ్చిన నేపథ్యంలో అన్నిరంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను పట్టించుకోకుండా, మన ప్రమాణాలు మనవనుకుంటూ ముందుకుసాగితే యువశక్తి ప్రతిభను చాటలేదన్నది నిర్వివాదాంశం. కనీసం వచ్చే 50 ఏండ్ల కాలానికి విద్యా స్వరూపం ఎలా ఉండాలన్న దార్శనికత ఉండేవిధంగా విద్యా ప్రమాణాలతో ప్రణాళికలు రూపొందించ గలుగాలి. విధాన రూపకల్పనలో ప్రాచీన సాంప్రదాయ భారతీయ సాహిత్యంలో చోటుచేసుకున్న అంశాలు నేటి ఆధునిక సాంకేతిక విధానాలకు ఏ విధంగా అనుసంధానించవచ్చునో ఆలోచించవలసిన అవసరం ఉన్న ది. 10వ తరగతి చదివే విద్యార్థికి తప్పనిసరిగా కార్యస్థలంలో అనుభవం ఉండాలి. అక్కడి స్థితిగతులపై కనీస అవగాహన ఉండాలి. అవసరమైతే పాఠశాల పనిరోజులు పెంచైనా ప్రయోగాత్మకమైన, క్రియాశీలకమైన అవగాహన కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందాలి.
p-rama-murthy
విద్యార్థులు తాము నేర్చిన విద్యను నిత్య జీవితంలో ఉపయోగించుకునే విధానంలో శిక్షణ ఇవ్వబడాలి. వ్యవసాయరంగానికి, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక సహకారం అందించే వ్యవస్థ దిశలో విద్యా ప్రణాళికలకు విద్యాలయాలు రూపకల్పన చేయగలిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే రీసెర్చ్ డెవలప్‌మెంట్‌పై కంపెనీలు పెట్టే ఖర్చును తగ్గించవచ్చు. కాకపోతే ఈ రెంటినీ సమన్వయం చేయగలిగిన విధానాల కు రూపకల్పన జరుగాలి.

207
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles