సంచారజాతులకు జాతీయ కమిషన్

Wed,September 4, 2019 12:23 AM

vidharta
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అయినా సంచార జాతుల వారు సంక్షేమ ఫలాలకు నోచుకోవడం లేదు. వాళ్లు వెనుకబాటుతనానికి చిరునామాగా మారిపోయారు. సామాజిక వివక్షకు గురవుతున్నారు. అయినా వీళ్లు మానవీయ విలువలను తమ కళారూపాల ద్వారా నేటికి సమాజానికి అందిస్తున్నారు. తమగురించి ఏనాడూ ఆలోచించని నిస్వార్థ సమాజ సేవకులు సంచారజాతులవారు. ధర్మ జాగరణ చేస్తూ ప్రజల్లో దేశభక్తిని నింపి వారిలో చైతన్యం తీసుకొ ని వస్తున్నారన్న భయంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1871లో ఈ జాతుల ను క్రిమినల్ ట్రైబ్స్‌గా నోటిఫై చేసింది. వారు చేస్తున్న పనితో సంబంధం లేకుండా నేరస్తులుగా ముద్రవేసింది. వారిని అనేకరకాలుగా అణగదొక్కి సమాజం నుంచి వారిని వేరుచేసే ప్రయత్నం చేసింది. స్వాతంత్య్రానంత రం 1952లో క్రిమినల్ ట్రైబ్స్‌గా నోటిఫై చేయబడిన సంచారజాతులను తిరిగి డీనోటిఫై చేశారు. అయితే వారికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు నేటికీ సఫలం కాలేదు. దేశంలో సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. అయితే దేశంలో దాదాపు 10 శాతానికి పైగా ఉన్న సంచారజాతుల సామాజిక వెనుకబాటుతనాన్ని ఇప్పటికీ శాస్త్రీయ పద్ధతిలో నిర్వచించలేదు. ఈ కారణంగానే సంచారజాతులకు ప్రత్యేక రిజర్వేషన్లు గాని, పథకాలు గాని లేవు. సంచార జాతులన్నీ ఒకే కేటగిరిలోకి రావు. ఈ జాతుల్లోని కొన్ని కులాలు ఎస్సీలలో, మరికొన్ని ఎస్టీలలో, బీసీలలో, మైనార్టీలలో ఉన్నాయి. ఒకే రకరమైన సామాజిక వెనుకబాటుతనం ఉన్న ఒకే కులం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేటగిరిలో చేర్చారు. రాష్ర్టాలవారీగా ఈ గందరగోళ పరిస్థితి ఉన్నది. అలా గే సంజారజాతులకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయరంగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదు.

సంచార జాతుల స్థితిగతులపై గతంలో నియమించిన బాలకృష్ణ కమిషన్‌తో పాటు, ఎన్డీయే ప్రభుత్వం నియమించిన బీకూ రాంజీ ఇదాతె కమిషన్ ఇచ్చిన సిఫార్సులను అమలుచేయాలి. దీంతోపాటు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో సంచారజాతులకు సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయరంగాల్లో సమానావకాశాలు కల్పించాలి. ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ జాతులకు సంక్షేమ ఫలాలు అందేలా కృషిచేయాలి.


నిరంతరం సంచార జీవులుగా ఉంటూ చిన్నచిన్న సమూహాలుగా జీవిస్తున్న వీరి జనాభాకు సంబంధించి ఇప్పటికీ కచ్చితమైన గణాంకాలు లేవు. కొన్ని రాష్ర్టాల్లో వేల సంఖ్యల్లో నివసిస్తున్నప్పటికీ వారిని గుర్తించడం లేదు. అందరినీ అభివృద్ధి వైపు నడిపించాలనే ఆకాంక్షతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం సంచార జాతుల జీవన ప్రమాణాలను పూర్తిస్థాయిలో మెరుగుపరుచలేదు. అయినప్పటికీ ఈ జాతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందకు ప్రయత్నం చేసింది. 2015లో దేశంలోని సంచార జాతుల సామాజిక, ఆర్థిక, ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించాల్సిన విధానాలను సూచించేందుకు సంచారజాతులకే చెందిన సామాజిక నాయకు డు బీకూ రాంజీ ఇదాతె నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి 2017లో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. బీకూ రాంజీ ఇదాతె కమిషన్ చేసిన సిఫార్సుల్లో ముఖ్యమైనవి-శాశ్వత ప్రాతిపదికన జాతీయ సంచార జాతుల కమిషన్ ఏర్పాటుచేయాలి. సం చార జాతుల జనాభా గణనీయంగా ఉన్న రాష్ర్టాల్లో ప్రత్యేక సంక్షేమ శాఖను ఏర్పాటుచేయాలి. సంచారజాతులకు హేతుబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి. 2011 జనాభా లెక్కల ఆధారంగా సంచార జాతుల జనాభాను ప్రకటించాలి. ఇకపై జరుగబోయే జనాభా గణనలో సంచార జాతుల జనాభాను కులాలవారీగా చేపట్టాలి. సంచారజాతులకు రాజ్యసభలో, రాష్ర్టాల శాసనమండలిలో ప్రాతినిధ్యం లభించేలా చూడాలి. అట్రాసిటీ చట్టాన్ని సంచార జాతులకు వర్తింపజేస్తూ న్యాయపరమైన రక్షణ కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలలోని సంచార జాతులకు ప్రత్యేకమైన సబ్ కోటాను కేటాయించాలి. సంచార జాతులకు ఒకే కుల సర్టిఫికెట్‌ను ఇవ్వాలి (ఉదా: ఎస్సీ-డీఎన్‌టీ, ఎస్టీ-డీఎన్‌టీ, ఓబీసీ-డీఎన్‌టీ).
dr-kanupa-bala-raju
సంచారజా తుల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్‌ను ఏర్పాటుచేయాలి. వారి విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సంచా రజాతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు, ఇతరులకు అవగాహన కల్పించాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లలోనూ, జాతీ య మహిళా కమిషన్‌లో ప్రత్యేక సెల్స్‌ను ఏర్పాటుచేయాలి. సంచారజా తుల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకాలు చేపట్టాలి. వారికి ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక విధానాలు అమలుచేయాలి. సంచార జాతుల విశిష్ట సంస్కృతి, కళారూపాలు, సంప్రదాయాలు రక్షించడానికి ప్రత్యేక అకాడమీని ఏర్పాటుచేయాలి. సంచార జాతుల స్థితిగతులపై గతంలో నియమించిన బాలకృష్ణ కమిషన్‌తో పాటు, ఎన్డీయే ప్రభుత్వం నియమించిన బీకూ రాంజీ ఇదాతె కమిషన్ ఇచ్చిన సిఫార్సులను అమలుచేయాలి. దీంతోపాటు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో సంచారజాతులకు సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయరంగాల్లో సమానావకాశాలు కల్పించాలి. ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ జాతులకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి. అప్పుడే వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయగలం.

(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ)

412
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles