క్లిష్టస్థితిలోనూ వ్యవ‘సాయం’

Mon,September 9, 2019 10:47 PM

టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019-20 పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిం ది. ప్రస్తుతం దేశమంతా ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనూ బడ్జెట్‌లో వ్యవసాయరంగ అభివృద్ధికి ఏ మాత్రం లోటు రానివ్వలేదు. రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మరో సారి చాటింది. చిన్న, సన్నకారు రైతులకే రైతుబంధు పథకాన్ని పరి మి తం చేస్తారనే ఊహగానాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెరదించింది. గతం లో మాదిరిగానే రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకాన్ని కొన సాగిస్తామని ప్రకటించింది. అట్లనే రైతు కుటుంబాలకు భరోసాగా నిలు స్తున్న రైతుబీమా పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ముఖ్య మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకుగాను రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి రూ.1137 కోట్లు ప్రతిపాదించింది. కొత్తగా ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించేందుకు అవసరమయ్యే విద్యుత్ బిల్లుల భారం ఎవ్వరిమీద వేయకుండా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనికి అవసరమయ్యే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం బడ్జెట్‌లో రూ.8,000 కోట్లు కేటాయించింది. ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీ కోసం బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణే ధ్యేయంగా సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం కొనసా గుతుందని ఈ బడ్జెట్‌లో భరోసా ఇచ్చింది. వివిధ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నది. వ్యవసాయరంగంలో తనదైన పథ కాలు, సంస్కరణలతో దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో రైతుల ఆదాయాలు పెంచగలిగింది. వ్యవసాయరంగంలో దేశ వృద్ధిరేటు 4 శాతానికి కూడా చేరుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రం గంలో 8.1 శాతం వృద్ధి రేటును సాధించగలిగింది.

అతివృష్టి, అనావృష్టిలతో వ్యవసాయం జూదంగా మారింది. ఇవి రైతులను తీవ్రంగా నష్టంలోకి నెట్టివేస్తున్నాయి. దశాబ్దాలుగా ఈ దుస్థితి నెలకొన్నది. దీంతో అప్పులుచేసి సాగుచేసిన రైతు సంక్షోభంలోకి కూరు కుపోయినా పట్టించుకునేవారు లేకుండే. అప్పుల భారంతో రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు లేరు. రైతు కుటుంబాలు ఎదు ర్కొం టున్న ఈ అనేక సమస్యలను తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో అర్థం చేసుకున్నది.


ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 సంవత్సరాలలో తెలంగాణలో వ్యవసాయం, వాటి అను బంధ రంగాలలో వృద్ధిరేటు 1.8 శాతం మాత్రమే ఉండేది. సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగానికి రైతుబంధు, రైతు బీమాలతో పాటు, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతో ఊతమిచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్‌లలో వ్యవసాయం, సాగునీటి రంగాలకు సింహభాగం నిధు లు కేటాయిస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నా రు. వీరికి పంట సమయంలో పెట్టుబడి అనేది పెద్ద సమస్యగా ఉండేది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దీన్ని గుర్తించి వారికి అన్నివిధాలుగా అండగా నిలు వడానికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సహాయ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకే ఈ పథకం ఆర్థికవేత్తలతో పాటు ఐక్యరాజ్యసమితి మన్ననలు పొందింది. ఈ పథకం స్ఫూర్తితో వివిధ రాష్ర్టాలు రైతుబంధుతో పాటు పంటల రుణమాఫీ చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం కూడా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో దేశమంతటా అమలుచేస్తున్నది. అయితే పంటలు సాగుచేసే రైతుల పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. కుటుంబ ఖర్చులు తీరడం లేదు. వీటికితోడు గిట్టుబాటు ధరలు సరిగ్గా అందడం లేదు. దీం తో సాగు చేయడం తలకు మించిన భారంగా తయారైంది. ఈ నేపథ్యం లో రైతులందరికీ రైతుబం ధు పథకాన్ని వర్తింపజేసింది. అయితే కేంద్రం అమలుచేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో పలు నిబంధనలు విధించింది. ఐదెకరాల లోపు సాగుభూమి ఉన్న రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. దీనివల్ల అప్పుల్లో ఉన్న లక్షలాదిమంది రైతులకు చేయూతను ఇవ్వలేకపోయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ బడ్జెట్‌లో ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి పది వేలు ప్రకటించిం ది. బడ్జెట్‌లో ఇందుకు గాను రైతుబంధు పథకాని కి రూ.12 వేల కోట్లు కేటాయించింది.

పంట సాగు గిట్టుబాటు కావాలంటే పండించిన పంటకు పెట్టుబడి ఖర్చులుపోను నికర లాభం ఉండాలి. లేదా సాగు ఖర్చులు తగ్గాలి. ఈ దిశగా ప్రభుత్వం కృషిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. స్థానిక వాతావరణం, నేలల స్వభావానికి సరిపోయే అనుకూల పంటలు సాగుచేస్తే సాగు ఖర్చులు తగ్గుతాయి. ఉత్పాదకత పెరుగుతుంది. చీడపీడల సమస్యలు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు చేతికి అందుతాయి. దీనికితోడు సాగు విస్తీర్ణం లెక్కలు పక్కాగా తెలుస్తాయి. ఈ ఆలోచనతో ప్రభుత్వం పంట కాలనీలపై కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి సాగు ప్రాంతాలను పంటల కాలనీలుగా విభజించి శాస్త్రీయ, ఆధునిక సాగును ప్రోత్సహిస్తుంది.


ఈ పథకం రైతులకు ఇప్పటికే ఎంతో మేలు చేసింది. దీనివల్ల రైతులు సాగు పెట్టుబడి కోసం, ఎరువుల కోసం ఎవరి దగ్గరా అప్పు చేయాల్సిన అవ సరం ఉండదు. తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇది. అతివృష్టి, అనావృష్టిలతో వ్యవసాయం జూదంగా మారింది. ఇవి రైతులను తీవ్రంగా నష్టంలోకి నెట్టివేస్తున్నాయి. దశాబ్దాలుగా ఈ దుస్థితి నెలకొన్నది. దీంతో అప్పులుచేసి సాగుచేసిన రైతు సంక్షోభంలోకి కూరు కుపోయినా పట్టించుకునేవారు లేకుండే. అప్పుల భారంతో రైతు చనిపో తే ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు లేరు. రైతు కుటుంబాలు ఎదు ర్కొం టున్న ఈ అనేక సమస్యలను తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణం లో అర్థం చేసుకున్నది. చనిపోయిన రైతు కుటుంబం రోడ్డున పడకూడ దని భావించింది. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుం బానికి భరోసా ఇవ్వడానికి రైతుబీమా పథకం ద్వారా 5 లక్షల రూపా యలను అందిస్తున్నది. అలాగే రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికి అనుగుణంగా నే బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నది. పెండింగ్ ప్రాజె క్టులతో పాటు భారీ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను కూడా త్వరితగతిన పూర్తిచేయడానికి అహర్నిశలు కృషిచేస్తున్నది. సాగునీటి రంగంలో దశా బ్దాలుగా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గడిచిన ఐదున్న రేండ్లలోనే సరిదిద్దే ప్రయత్నం చేసింది. వాటి ఫలితాలు ఇవాళ రైతులకు అందుతున్నాయి. పంట సాగు గిట్టుబాటు కావాలంటే పండించిన పంటకు పెట్టుబడి ఖర్చులు పోను నికర లాభం ఉండాలి. లేదా సాగు ఖర్చులు తగ్గాలి. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కనిపిస్తున్నది. స్థానిక వాతావరణం, నేలల స్వభావానికి సరిపోయే అనుకూల పంటలు సాగుచేస్తే సాగు ఖర్చులు తగ్గుతాయి.
pidigum-saidaiah
ఉత్పాదకత పెరుగుతుంది. చీడపీడల సమస్యలు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు చేతికి అందుతాయి. దీనికితోడు సాగు విస్తీ ర్ణం లెక్కలు పక్కాగా తెలుస్తాయి. ఈ ఆలోచనతో ప్రభుత్వం పంట కాల నీలపై కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి సాగు ప్రాంతాలను పంటల కాలనీలుగా విభజించి శాస్త్రీయ, ఆధునిక సాగును ప్రోత్సహిస్తుంది. వీటి ద్వారా వచ్చే ఉత్పత్తులకు ఆహారశుద్ధి పరిశ్రమల ద్వారా అదనపు విలువ ను జోడించి రాష్ట్ర అవసరాలకు వాడుకోవచ్చు. ఎగుమతి చేయవచ్చు. దీంతో రైతులకు పంటల గిట్టుబాటు ధరలతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ సిఫా ర్సులను క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రైతు లకు అన్నివిధాలుగా అండగా ఉండేలా వ్యవసాయ అనుకూల విధానా లు అమలుచేస్తున్నది. అందుకే దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్ట పరి స్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలోనూ వ్యవసాయరంగానికి భరోసా ఇచ్చేవిధంగా తగిన కేటాయింపులు చేయడం ముదావహం.

(వ్యాసకర్త: శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)

386
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles