రిజర్వేషన్ల రద్దుకు కుట్ర

Tue,September 10, 2019 11:07 PM

దేశంలో రిజర్వేషన్ల అంశంపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ భారీ ఆధిక్యం సాధించి రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీ అనుబంధ సంఘాల వారు విచ్చలవిడిగా ప్రకటనలు చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. దేశంలో పౌరులకు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను కాలరాసేవిధంగా ఆయా నేతలు మాట్లాడుతున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లను సమీక్షించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దూమారం లేపా యి. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న అణగారిన వర్గాలు ఒక్కసారి గా ఉలిక్కిపడినాయి. దేశంలో 91 శాతం మందికి లబ్ధి చేకూరే రిజర్వేషన్ల అంశాన్ని సంఘ్‌పరివార్, బీజేపీ నేతలు మాట్లాడటంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఆయా వర్గాలకు చెందిన రాజకీ య నాయకులు కూడా మోహన్ భగవత్ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖం డించారు. రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీఎస్పీ అధినాయకురా లు మాయావతి బీజేపీ నేతలకు అల్టిమేటం జారీచేశారు. దేశంలో రిజర్వేషన్ల అంశంపై ఆయావర్గాలు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రధాని మోదీ, బీజేపీ అధిష్ఠానం భగవత్ వ్యాఖ్యలపై ఎలాంటి ఖండన చేయకపోవడం అనుమానాలకు దారి తీస్తున్నది. రిజర్వేషన్లపై భగవత్ చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ అగ్రనాయకత్వం ఉందని తెలుస్తున్నది. ఇదే పద్ధతి లో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి అణగారినవర్గాల్లో బీజేపీ భయాందోళనలకు గురిచేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు బీజే పీ ప్రభుత్వం ప్రణాళికను రచిస్తున్నట్లు అనుమానాలు వ్యకమవుతున్నా యి. మనుధర్మ శాస్ర్తాన్ని అమలుచేసేందుకు ఆ పార్టీ అడుగులు వేస్తున్నది. దీంట్లో భాగంగానే ఆయా సంస్థల నేతలు వాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి రిజర్వేషన్లను సమీక్షించేముందు ఈ దేశంలోని వనరులు, సంపద ఎవరి చేతుల్లో కేంద్రీకృతమైందో కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది.

రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా అమలుచేయకుండా అయా రాష్ర్టాల్లోని పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఎన్డీయే హయాంలో గడిచిన ఐదున్నరేండ్లలో దళిత, గిరిజన, ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఉత్తరాది రాష్ర్టాల్లో ఉన్నావ్ వంటి సంఘటనలు కోకొల్లలు. దళితులు దైవంగా ఆరాధించే గురువు సంత్ రవిదాస్ గుడిని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూల్చివేసింది. తమకు ఇష్టమైన ఆహారం తినడంలోనూ ఎన్డీయే ప్రభుత్వం దళిత, గిరిజన, మైనార్టీలపై ఆంక్షలు విధించింది. ఎద్దు మాంసం షాపుల్లో పనిచేసే కార్మికులను కూడా సంఘ్ పరివార్, విశ్వహింద్ పరిషత్, బజరంగ్‌దళ్ కార్యకర్తలు కొట్టిచంపారు. అయినప్పటికీ ఆయా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలకు నోచుకోలేదు.


డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం ఫలితంగా రిజర్వేషన్లు బడుగు, బలహీన, అణగారిన వర్గాలు పొందుతున్నాయి. విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 7.5 శాతం లబ్ధి పొందుతున్నాయి. ఇప్పటివరకూ ఆయా వర్గాలకు జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లను పాలకులు కేటాయించడం లేదు. ఈ విషయంలో బీసీలకు మరింత అన్యాయం జరిగింది. దేశంలో 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కట్టబెట్టింది. వీటిలో ఇప్పటివరకూ బీసీలు కేవలం 11 శాతం లబ్ధి పొందినట్లు కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి దేశంలోని సంపద, వనరులు 9 శాతం ఉన్న కొన్ని వర్గాల చేతుల్లో కేంద్రీకృతమైంది. రాజకీయ, వాణిజ్యరంగాల్లో బడుగు, బలహీన, అణగారిన వర్గా లు ఒక్క శాతం కూడా లేకపోవడం దురదృష్టకరం. ఈ దుస్థితికి కారణాలను బీజే పీ, సంఘ్‌పరివార్ నేతలు సమీక్షించాల్సి ఉన్నది. రిజర్వేషన్లను పదేండ్ల వరకే అమలుచేయాలని అంబేద్కర్ సూచించిన విషయం వాస్తవమే. ఈ విషయంపై బీజేపీ, దాని అనుబంధ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ఆరున్నర దశాబ్దాల భారతవనిలో రిజర్వేషన్లు పక్కాగా అమలుచేస్తే ఆయా వర్గాలకు వీటి అవసరం ఉండేదా? అంబేద్కర్ సూచించిన అంశా ల్లో వేటిని కూడా పాలకులు అమలుచేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు బడుగు, బలహీన, అణగారినవర్గాలను వాడుకుంటున్నా రు. దీంతో ఆయావర్గాల్లో ఇప్పటికీ సామాజిక వివక్ష, ఆర్థిక దోపిడీ ఇంకా కొసాగుతున్నది. వీటిపై కూడా సమీక్షించాల్సి ఉన్నది. వీటిపై మాట్లాడకుండా బాధ్యతాయుత పదవుల్లో ఉండి విచ్చలవిడిగా ప్రకటనలు చేయడంలో ఆంతర్యమేమిటి? సామాజికంగా వివక్షకు అణిచివేత, ఆర్థిక దోపిడీ, పీడనకు గురవుతున్న వర్గాలకు రక్షణ కల్పించాలని రాజ్యాంగంలో ఆర్టికల్-46 పొందుపర్చా రు. దీని ఆధారంగానే ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ను అందించాలని ఆర్టికల్-15 (4) ద్వారా రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపర్చారు. వీటిని జనాభా దామాషా ప్రకారం కేటాయించాలని రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు.

రిజర్వేషన్ల డిమాండ్ స్వాతంత్య్రానికి ముందు కూడా ఉన్నది. 882లో భారత్‌లో పర్యటించిన హంటర్ కమిషన్‌ను అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించాలని మహాత్మా జ్యోతిరావు పూలే డిమాండ్ చేశారు. అప్పటినుంచి 1891 వరకూ రిజర్వేషన్లను కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశంలో ఆయా ప్రాంతాల్లోని వర్గాలు డిమాండ్లు చేశాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలోనే మహారాష్ట్రలోని కొల్హాపూర్ సంస్థానంలో 1902లో చత్రపతి సాహు మహారాజ్ బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేశా రు. రిజర్వేషన్లను అమలుచేసిన తొలివ్యక్తిగా సాహు మహారాజ్ చరిత్రలో లిఖించబడినారు. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం 1909లో మార్లే-మిం టో సంస్కరణల ద్వారా భారత దేశంలోని ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రాతినిధ్యం కల్పించి తొలిసారిగా దేశంలో రిజర్వేషన్లకు అధికా ర ఉత్తర్వులను జారీచేసింది. తర్వాత అంబేద్కర్ పోరాట ఫలితంగా 19 32లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దీనిద్వారా ముస్లింలు, సిక్కులు, ఇండియన్ క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాతినిధ్య నియోజకవర్గాలను కేటాయించింది. కానీ మహాత్మాగాంధీ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా పుణేలోని ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో దీన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాతినిధ్య నియోజకవర్గాలకు అప్పటి అగ్రవర్ణ నాయకులు గండికొట్టారు. అప్పటి నుంచి రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ నేతృత్వంలో ఆయావర్గాలు పోరా టం చేసి సాధించుకున్నాయి. స్వాతంత్య్రం అనంతరం ముందుగా ఎస్సీ, ఎస్టీలకు అమలుకాగా, బీపీ మండల్ సిఫార్సుల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను భారత ప్రభుత్వం అమలుచేసింది. ఈ పరిణామ క్రమంలో ఆయా వర్గాలు ఎన్నోరకాల పోరాటాలు చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా అమలు చేయకుండా అయా రాష్ర్టాల్లోని పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
Durgam-Srinivas
ఎన్డీయే హయాం లో గడిచిన ఐదున్నరేండ్లలో దళిత, గిరిజన, ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఉత్తరాది రాష్ర్టాల్లో ఉన్నావ్ వంటి సంఘటనలు కోకొ ల్లలు. దళితులు దైవంగా ఆరాధించే గురువు సంత్ రవిదాస్ గుడిని ఢిల్లీలో కేంద్ర ప్రభు త్వం కూల్చివేసింది. తమకు ఇష్టమైన ఆహారం తినడంలో నూ ఎన్డీయే ప్రభుత్వం దళిత, గిరిజన, మైనార్టీలపై ఆంక్షలు విధించింది. ఎద్దు మాంసం షాపుల్లో పనిచేసే కార్మికులను కూడా సంఘ్ పరివార్, విశ్వహింద్ పరిషత్, బజరంగ్‌దళ్ కార్యకర్తలు కొట్టిచంపారు. అయినప్పటికీ ఆయా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలకు నోచుకోలేదు. వీటన్నింటికీ ఆజ్యం పోసినట్లుగా, బీజేపీ, అనుబంధ సంస్థల నాయకులు దళిత, గిరిజన హక్కులను కాలరాచేందుకు పూనుకున్నట్లు తెలుస్తున్నది. దీంట్లో భాగంగానే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది.

(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)

308
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles