వర్తమానంలో చరిత్ర శకలాలు


Tue,September 17, 2019 01:03 AM

కాలం గాయాలను మాన్పుతుంది. చరిత్ర గాయాన్ని కెలుకుతుంది. జ్ఞాపకం ఎంత గొప్పదో మరుపు కూడా అంత గొప్పది. జీవితంలో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటా యి, కొన్ని మరిచిపోవాల్సినవి ఉంటాయి. మరిచిపోవాల్సిన వాటిని పదేపదే గుర్తుచేస్తే ఏ సంసారం సాగదు. కలహాల కాపురం విడాకులకు దారి తీస్తుంది. విచ్ఛిన్నతకు దారితీస్తుంది. భార్యాభర్తలైనా ఉమ్మడి కుటుంబంలోని మూడుతరాల మధ్య సంబంధాలైనా గతం మరిచిపో యి కలిసి జీవించినప్పుడే సమైక్యత, సఖ్యత కొనసాగుతుంది. తరతరాలుగా ఈ విధంగానే సమైక్యత, సఖ్యత కొనసాగుతూ వస్తున్నది. గతానికి, వర్తమానానికి మధ్య నిరంతర సంభాషణే చరిత్ర అని అం టాడు ఈహెచ్.కార్. వర్తమాన అవసరాల రీత్యా చరిత్ర మళ్లీమళ్లీ రాయబడుతుంది, వ్యాఖ్యానించబడుతుంది. 1921 తవ్వకాల్లో సింధు నాగరితకత, హరప్పా, మోహెంజోదారో నాగరికత తవ్వకాల్లో బయటపడింది. ఆ తర్వాత వాటిమీద ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. అంతదా కా ఉన్న చరిత్రను పునర్ వ్యాఖ్యానించారు. 1978లో శాతవాహన సామ్రాజ్యం గురించి కొత్త వెలుగు ప్రసరించిన తర్వాత చరిత్ర రచనల్లో మార్పులు వచ్చాయి. మహా రచయిత ప్రేమ్‌చంద్ చరిత్ర గురించి, తేదీలు, పేర్లు, సంఘటనలు తప్పా అంతా కల్పనే అంటాడు. సాహిత్యంలో తేదీలు, స్థలాలు తప్ప అంతా సామాజిక చరిత్రే అంటాడు. చరిత్రకారులు అడ్వకేట్ల వంటివారు. తాము వాదించదలుచుకున్న దానికి, నిరూపించదలుచుకున్న దానికి అనువుగా సాక్ష్యాధారాలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు చేస్తుంటారు. అందువల్ల చరిత్ర ను చదివేముందు ఆ చరిత్రకారుడి లక్ష్యాలు, పుట్టిన పెరిగిన స్థల, కాలా లు, పరిమితులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ లక్ష్యం కోసం చరిత్రను ముందుకు తెస్తున్నారనేది ప్రధానం. 1948, సెప్టెంబర్ 17 భారత దేశ చరిత్రలో నైజాం రాజ్య చరిత్రలో ఒక మలుపును సూచించే తేదీ. అది ఏ మలుపు ఎలాంటి మలుపు, దాని ప్రాధాన్యం ఏమిటనే అంశాలను ఎవరి లక్ష్యం, కోణం అనుసరించి వారు రాస్తుంటారు. సత్యం ఒకటి, అది తేదీ. సత్యానికి వ్యాఖ్యానాలు అనేకం వెలువడ్డాయి, ఇంకా వెలువడుతాయి.


1948, సెప్టెంబరు 17 నిజాం రాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించిన రోజు అనేది ఒక సత్యం. సెప్టెంబర్ 17 నాడు సాయంత్రం నైజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనం అవుతున్నదని రేడియో ప్రసంగం చేశారు. ఈ రేడియో ప్రసంగాన్ని ఇండియన్ యూనియన్ ప్రతినిధిగా కె.ఎమ్.మన్ష్షీ రాసిచ్చారు. దాన్ని దక్కన్ రేడియోలో నిజాం చదివారు. తొందరగా ప్రకటన చేయడానికి కారణం చాలామందికి తెలియదు. నిజాం అప్పటికే ఐరాస భద్రతా మండలికి ఇండియన్ యూనియన్ గురించి ఫిర్యాదు చేశారు.


అవి అన్నీ సత్య విభిన్న పార్శాలే. ఒక మనిషిని విభిన్న కోణాల్లో ఫొటోలు తీయడం వంటివే ఈ విభిన్న కోణాలు. జాతీయోద్యమ చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి. అన్ని సంఘటనలు గుర్తుచేసుకోవడం లేదు. భగత్‌సింగ్, జలియన్‌వాలాబాగ్ వంటి సంఘటనలు మాత్రమే గుర్తుచేసుకుంటున్నారు. జాతీయోద్యమంలో ఎన్నో సంఘటనలు మరపునకు గురయ్యాయి. గదర్ పార్టీ చరిత్ర మొదలుకొని ఎన్నోరకాల ఉద్యమాలు, గిరిజన తిరుగుబాట్లు చరిత్ర మరుగునపడిపోతున్నాయి. 1947లో పాకిస్థాన్, ఇండియా విభజన సమయంలో జరిగిన సంఘటనలు భయానకమైనవి. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు అత్యధిక క్రూరమైనవి. 19 84లో అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన హత్యాకాండ దాంతో కోపోద్రిక్తులైన సిక్కు సైనికులు తిరుగుబాటు వంటి సంఘటనలు గుర్తు చేసుకోవడం లేదు. ఇందిరాగాంధీ వర్ధంతినే జరుపుకోవడం జరుగుతున్నది. 1947, ఆగస్టు 15 సందర్భంగా, దేశ విభజన సందర్భంగా లక్షలాది మంది ఘోర కృత్యాలకు బలయ్యారు. ఆ దుస్సంఘటనలు మరిచి ఆనందాన్ని పంచుకుంటున్నారు. చనిపోయినప్పుడు ఏడుస్తారు. కాలక్రమం లో వారి జ్ఞాపకాన్ని భక్తీశ్రద్ధలతో గుర్తు చేసుకుంటారు. అలాగే జాతీయోద్యమ కాలంలో, పాకిస్థాన్ విభజనలో ఇందిరాగాంధీ హత్యా సందర్భంలో జరిగిన క్రూర సంఘటనను మరిచిపోతారు. అంతే తప్ప నాటి దుర్మార్గపు క్రూరత్వాలు గుర్తుచేసుకోవడం లేదు. శాంతియుత సహజీవనంతో ప్రశాంతంగా ఉంటున్నారు. ఒక మహిళ సామూహిక లైంగిక దాడి గురించి, పదేపదే ఎవరు గుర్తుచేసినా వారు దుర్మార్గులే తప్ప ఆమె శ్రేయస్సు కోరేవారు కాదు. భార్యాభర్తలు ఎప్పుడో కోట్లాడుకుంటే రోజూ సజావుగా సంసారం చేసుకుంటే నాడు పంచాయితీ చెప్పిన పెద్దమనిషి పదేపదే గుర్తుచేస్తే ఆయన పెద్దమనిషి కాదు. 1948, సెప్టెంబరు 17 నిజాం రాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించిన రోజు అనేది ఒక సత్యం.

1949, ఫిబ్రవరి 14వ తేదీన నిజాం ఇండియన్ యూనియన్ రాజ్యాంగమే నైజాం రాజ్యానికి వర్తిస్తుందని ప్రకటన చేయడం జరిగింది. 1949, నవంబర్ 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలో దేశ సరిహద్దులు నిర్వచించడం పేర్కొనడం జరిగింది. అందువల్ల రాజ్యాంగం గురించి చర్చ జరుగుతుండగానే 565 సంస్థానాలు భారతదేశ సరిహద్దుల్లో కలుపవలసిన అనివార్యత ఏర్పడింది.


సెప్టెంబర్ 17 నాడు సాయంత్రం నైజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనం అవుతున్నదని రేడియో ప్రసంగం చేశారు. ఈ రేడియో ప్రసంగాన్ని ఇండియన్ యూనియన్ ప్రతినిధిగా కె.ఎమ్.మన్ష్షీ రాసిచ్చారు. దాన్ని దక్కన్ రేడియోలో నిజాం చదివారు. తొందరగా ప్రకటన చేయడానికి కారణం చాలామందికి తెలియదు. నిజాం అప్పటికే ఐరాస భద్రతా మండలికి ఇండియన్ యూనియన్ గురించి ఫిర్యాదు చేశారు. అది 14 సెప్టెంబర్ నాడు భద్రతామండలిలో చర్చకు వచ్చింది. భద్రతా మండలిలోని 11 దేశాల్లో 8 దేశాలు నిజాం ఫిర్యాదును సమర్థించాయి. చైనా, రష్యాలు ఏమి చెప్పలేక బయటకువెళ్లాయి. ఏ ఒక్క దేశం కూడా ఇండియాను సమర్థించలేదు. సెప్టెంబర్ 17 సాయంత్రానికి భద్రతామండలి దీనిపై ఇండియాకు వ్యతిరేకంగా నిజాంకు అనుకూలంగా తీర్మానం చేసే సమావేశం ఉండింది. ఆ తీర్మానం కనుక జరిగితే.. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటంలో స్వాతంత్య్రం కోసం తిరుగుబాటు చేసిన రాజు లు, రాజ్యాలు, సంస్థానాలు ఐరాస భద్రతా మండలికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. వాటిని స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకోవచ్చని అప్పటికే ఇం గ్లాండ్ ప్రకటించి ఉండటం వల్ల, ఆ తర్వాత దేశం అనేక రాజ్యాలుగా విడిపోతుందని గమనించి అదే జరిగితే... ఆ పరిస్థితిని ఊహించలేమని, నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నిజాం వేసిన కేసును భద్రతామండలిలో ఉపసంహరించుకొంటున్నదనే ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. అందుకని భద్రతామండలి సమావేశానికి కొద్ది గం టల ముందుగా నిజాం చేత ఆ కేసును, ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్టుగా ఇండియన్ యూనియన్‌లో కలుపడానికి అంగీకరిస్తున్నట్టుగా తెలిపారు. అలా 1948, సెప్టెంబర్ 17 తేదీ భద్రతామండలి నుంచి నిజాం తన కేసును ఉపసంహరించుకున్న రోజుగా చరిత్రలో నమోదైంది. ఆ తర్వాత 1950, జనవరి 26 వరకు నిజాం పేరిటనే నైజాంలో పరిపాలన సాగింది. సైనికాధికారి జె.యన్.చౌదరి బొల్లారం కంటోన్మెంట్ నుంచి కారులో బయల్దేరి నిజాంను దర్శించేవాడు. జీవోలు నిజాం పేరి ట వెలువడ్డాయి.

1950, జనవరి 26 నుంచి మాత్రమే నిజాం రాజు ప్రముఖుడిగా కొనసాగారు. రాజ ప్రముఖ్‌గా గౌరవం పొందారు. 1962 లో ఇండియా, చైనా యుద్ధం సందర్భంలో టన్నుల కొద్దీ తన బంగారా న్ని విరాళంగా అందజేశారు. భారతదేశంలో ని ఢిల్లీతో పాటు ఏ రాష్ట్రం లో లేనివిధంగా నిజాం ఆస్తులు, మిలిటరీ స్థావరాలు, దవాఖానలు, కార్యాలయాలు కేంద్రానికి ఎలాంటి సంఘర్షణ లేకుండా ధారాదత్తం చేశారు. ప్రజలు భారత ప్రజాస్వామ్యంలో కలిసి జీవించాలనుకోవడం తో మొదట ఇష్టం లేకపోయినా 565 సంస్థానాలు కేంద్రం అనేక ఒప్పందాలు చేసుకొన్నారు. ఆ ఒప్పందాలను రాజభరణాలు ప్రీవి పర్సుగా వ్యవహరిస్తారు. వారిలో కొందరిని ఎంపీలుగా గెలిపించారు. ఇందిరా గాంధీ రాజభరణాలు రద్దు చేశారు. అలా 565 సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం నైజాం రాజ్యం. 1949, ఫిబ్రవరి 14వ తేదీన నిజాం ఇండియన్ యూనియన్ రాజ్యాంగమే నైజాం రాజ్యానికి వర్తిస్తుందని ప్రకటన చేయడం జరిగిం ది. 1949, నవంబర్ 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలో దేశ సరిహద్దులు నిర్వచించడం పేర్కొనడం జరిగింది. అందువల్ల రాజ్యాం గం గురించి చర్చ జరుగుతుండగానే 565 సంస్థానాలు భారతదేశ సరిహద్దుల్లో కలుపవలసిన అనివార్యత ఏర్పడింది. ఎంతో రక్తపాతం జరిగిన తర్వాత అశోకుడు బౌద్ధం స్వీకరించాడు. శాంతియుతంగా విశాల సామ్రాజ్యంలో సహజీవనం కొనసాగించాడు. ఆ తర్వాత మళ్లీ ప్రజలు గణతంత్ర రాజ్యం ఏర్పరుచుకొని శాంతియుత సహజీవనం చేస్తున్నా రు. అలా అనేక ఘటనలు మరుగునపడేసి జీవిస్తున్నది సమాజం. 1948, సెప్టెంబరు 17ను పండుగగా జరుపుకునేదైతే జరుపుకోవ చ్చు. అది ఐరాస నుంచి, భద్రతామండలి నుంచి తన ఫిర్యాదును ఉప సంహరించుకొని నిజాం దేశ సమైక్యతకు తోడ్పడినవాడుగా గౌరవించుకుంటూ జరుపుకోవాలి.
BS-Ramulu
కుల, మతాల వివక్ష, అసమానతలు పోయి సమస్త వర్ణ, వర్గ, జాతి, మత భేదాలు తొలిగి అన్ని కుటుంబాలు ఒకే కుటుంబంగా కలిసి జీవిం చే రక్తసంబంధాలు కూడా మార్చుకొనే మానవీయ సమాజం సాకారం కావాలి. విద్వేషాలు మాని ప్రశాంత, శాంతియుత జీవితంతో ప్రపంచానికి మార్గదర్శకమవుదాం. సర్వేజనాః సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు. చారిత్రక శకలాలు కొన్ని మ్యూజియంలో అందంగా ఉంటాయి. చరిత్ర శకలాలను మనసులో కాకుండా సాలార్జంగ్ వంటి మ్యూజియాల్లో భద్రపరుద్దాం.

(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

474
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles