ఆధార్‌ కార్డ్‌


Mon,September 30, 2019 12:39 AM

జీవించడానికి ఉన్న
అన్ని ఆధారాలను లేకుండా చేశాక
నీకు ఆధార్‌కార్డ్‌ జారీ చేయబడును
ఆసరా పింఛన్‌ కావాలన్నా
బ్యాంకు ఖాతా తెరువాలన్నా
ఆధార్‌కార్డ్‌ తప్పనిసరి
కేవైసి వివరాలు పూరించాల్సిందే
లేకుంటే ఏటీఎం కార్డ్‌ బ్లాక్‌ అవుతుంది
అందుకైనా నీకు ఆధార్‌కార్డ్‌
అప్పుడు ఆధారం అవుతుంది
జాగా కొనుక్కోవాలన్నా
విమానంలో ప్రయాణించాలన్నా
చౌక దుకాణంలో రేషన్‌ తీసుకోవాలన్నా
విద్యాలయాల్లో ప్రవేశం కావాలన్నా
ఉపకార వేతనం పొందాలన్నా
వెంట ఆధార్‌ కార్డ్‌ను మోసుకుపోవాల్సిందే
అన్నీ లభించినట్టు
కార్డ్‌తో అన్నం ముద్ద దొరకదనే
కటిక నిజం తెలుసుకునేసరికి
నువ్వు కాందీశీకునిగా
లెక్కల్లోకి చేరిపోతావు!
- జూకంటి జగన్నాథం

75
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles