ప్రజల సౌకర్యమే ముఖ్యం


Mon,October 7, 2019 11:07 PM

మాపని అనుకొని అంకి తభావంతో పనిచేసే అతి కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వ్యాసం వర్తించదు! మాకు జీతాలు పెంచాలి, ఇం క్రిమెంట్లు కావాలి, పీఆర్‌సీలు కావాలి, ఫిట్‌మెంట్లు కావాలి, అలవెన్సులూ కావా లనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ రంగానికి దీటుగా మీ ప్రభుత్వరంగం ఎందుకు పనిచేయదనే దానికి సమాధానం చెప్పాలి. సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేట్‌రంగానికి దీటుగా లాభాలు ఎందుకు తేలేకపోతున్నారు? వారి ని ప్రశ్నించొద్దు. అలా ప్రశ్నిస్తే బస్సులకు బ్రేకులు వేస్తారు. ప్రైవేట్‌రంగంలో పది నుంచి ఇరువై వేల సగటు జీతం తీసుకొని వందకు వంద మార్కులు స్టేట్ ఫస్ట్ తెప్పిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయుల కంటే ఎన్నో రెట్ల జీతాలు తీసుకొని పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కనీస పోటీ ఇయ్యలేకపోతున్నారనేది జగమెరిగిన సత్యం. అయినా వారికి అన్ని కావాలి. లేకుంటే ప్రభుత్వంపై లేనిపోని నిందారోపణలు చేస్తారు. పెట్టిన్నాడు పాలభిషేకాలు చేస్తారు. చేయనినాడు కాలనాగులై కాటేస్తారు. ఇక రెవెన్యూ రంగంలో ఎన్ని అవకతవకలు జరిగినా వారిని ఏం అనొద్దు. ఒక రైతు ఏండ్లకొద్ది, చెప్పులరిగేలా తిరిగినా ఆ రైతు పని కాదు. అయినా రెవె న్యూ ఉద్యోగులకు జేజేలు కొట్టాలి. పీజీ చదువుకున్న రైతు తన భూమికి సంబంధించిన వివరాలు అతని పాస్ పుస్తకంలో ముద్రించేలా చేసుకోవాలంటే రెవెన్యూ ఉద్యోగుల కాళ్లు, గడ్డాలు పట్టుకోవాలి. అదీచాలకుంటే ఎంతోకొంత ముడుపులు అప్పజెప్పా లి. ఇలా అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా అందరి జేబులూ తడుపాలి. అప్పుడు గాని ఫైల్ ముందుకు కదులదు. ఈ లోపు సదరు ఉద్యోగికి కోపం వస్తే ఆ రైతు పొలం రాత్రికిరాత్రే ఏ మల్లయ్య పాస్‌బుక్‌లనో, ఏ పుల్లయ్య పాస్‌బుక్‌లనో ఎక్కుతుంది.
t-s-rama-sharma
అయినా వారిని అందలం ఎక్కియ్యాలి. లేకుంటే ప్రభుత్వ అధినేత కర్కోటకుడు, కాలకూట విషం చిమ్మినవాడి కిం దే లెక్క. ఇలా.. ఒక ఆర్టీసీ, ఒక రెవెన్యూ, ఒక విద్యారంగం ఒక రవాణా రంగం కాదేదీ ప్రక్షాళనకు అనర్హం. అయినా వారిని పనిచేయమనొద్దు, చేయనివారికి శిక్ష లు పడేలా, గాడినపెట్టేలా చట్టాలు తేవొద్దు. చర్యలు తీసుకోవద్దు. అలాచేస్తే అది నేరం, ఘోరం, అమానవీయం, కర్కశత్వం, అప్రజాస్వామికం. అలాచేసే నాయకుడు, ప్రజల ఇబ్బందులను తొలి గిద్దాం అనుకొని నడుం బిగించే నాయకుడు ఆ ప్రభు త్వ ఉద్యోగుల దృష్టిలో ఒక నియంత. అయినా ఏం ఫర్వాలేదు. లక్షల్లో ఉండే ఉద్యోగులను పనిచేసే దిశగా తీసుకుపోవాలి. కఠినమైన చర్యలు తీసుకుంటే ఉద్యోగులకు కోపం వచ్చి కన్నెర్ర చేసినా సరే, కఠిన చట్టాలు తెచ్చి వారిని గాడిలో పెట్టా లి. వారిని సక్రమంగా పనిచేయించిన నాయకునికి, ఆ ప్రభుత్వరంగ ఉద్యోగుల వల్ల ఇబ్బందులు పడుతున్న కోట్లాది మంది సామాన్య ప్రజల మద్దతు ఎప్పుడూ ఉండనే ఉంటుంది! ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు, ప్రభుత్వ రం గ ఉద్యోగులు శాశ్వతం కాదు. అంతిమంగా సామా న్య ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ఆ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడే ప్రజా నాయకుడు అవుతాడు. ఆ నాయకుడే ప్రజల మద్దతు చూరగొంటాడు.

415
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles