తెలంగాణ కమ్యూనిస్టుల మార్గం


Wed,October 9, 2019 10:49 PM

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ను బలపరిచేందుకు నిర్ణయించిన సీపీఐ సరైన వైఖరి తీసుకున్నది. తమ పోటీకి అవకాశం లేకుండాపోయిన సీపీఎం కూడా బయటకు ప్రకటించినా, ప్రకటించకున్నా ఇదే వైఖరి తీసుకోవటం మంచిదవుతుంది. ఇది కేవలం టీఆర్‌ఎస్‌ గెలుపు ఓటముల ప్రశ్న కాదు. తమ సిట్టింగ్‌ స్థానం కానిచోట ఒకవేళ ఓడినా టీఆర్‌ఎస్‌కు కలిగే నికరమైన నష్టం ఏమీ లేదు. కానీ తెలంగాణ బయటగల బీజేపీ ఉధృతి ఇక్కడ వ్యాపించకుండా నిలువరించే శక్తి కాంగ్రెస్‌కు లేనప్పుడు, టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపి ఆ పని చేయటమే వామపక్షాల కర్తవ్యమవుతుంది.


దేశంలో రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు సం బంధం లేదని వామపక్షాలు అనలేవు. ఇంకా చెప్పాలం టే దేశ రాజకీయాలతో దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్ర రాజకీయానికి సంబంధం ఉంటుంది. ఈ మాట ఇతర పార్టీలకన్న వామపక్షాలకు ఎక్కువ తెలుసు. మన దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ, లెఫ్ట్‌ జాతీయ పార్టీలు కాగా, తక్కినవి అన్నీ ప్రాంతీయ పార్టీలు. తక్కిన వాటిలో రెండు మూడు తమనుతాము జాతీయపార్టీలుగా చెప్పుకున్నప్పటికీ వాటికి నిజమైన విధంగా జాతీయవ్యాప్తి లేదు. ఇక మూడు జాతీ య పార్టీలకు సంబంధించి అవి అన్ని రాష్ర్టాలలో వీలైంతనగా వ్యాపించి వీలైనన్ని సీట్లు గెలిచే రాజకీయ వ్యూహంతో మొదటినుంచి పనిచేస్తూ వస్తున్నాయి. ఇది కొంతకాలం సజావుగానే సాగింది. కాని ఒక దశ తర్వాత స్వీయ వైఫల్యాల వల్ల కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు క్షీణదశ ఆరంభమైంది. కాంగ్రెస్‌వి మౌలిక వైఫల్యాలు అయినందున పునాదులు, వాటిపైని నిర్మాణం కూడా బలహీనపడసాగింది. మరొక ప్రత్యామ్నా యం స్థిరమైన రూపంలో ఏర్పడలేదు గనుక జయాపజయాలు కొంతకాలం పాటు పెండ్యులం వలె ఊగిసలాడినా, మౌలిక బలహీనతను ఆపలేకపోయాయి. అటువంటిస్థితిలో బీజేపీ ఉధృతి మొదలైన తర్వాత కాం గ్రెస్‌కు ఇక రక్షణ లేకుండాపోయింది. ఇది వర్తమాన దశ. ఆ పార్టీ విధానాలను, నాయకత్వపు తీరుతెన్నులను, పార్టీ యంత్రాంగపు బలహీనతలను గమనించినప్పుడు, వారు బీజేపీని ఎదుర్కొనగల అవకాశం సమీ ప భవిష్యత్తులో కన్పించటం లేదు.

వామపక్షాల విషయానికి వస్తే, అవి జాతీయపక్షాలు కావటం నిజమే అయినా కాంగ్రెస్‌, బీజేపీలతో పోల్చినప్పుడు వారి వ్యాప్తి, బలం ఎప్పు డూ పరిమితమైనవే. అంతకుమించి వ్యాపించలేకపోవటానికి, బలం పెంచుకోలేకపోవటానికి పూర్తిగా వారి వైఫల్యాలే కారణం. దేశంలోని ఆర్థిక-సామాజిక-రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూసినప్పుడు, సరైన విధంగా వ్యవహరించి ఉన్నట్లయితే వారు ఎంతగానో వ్యాపించి బలపడవలసింది. కానీ అది జరుగుకపోగా క్షీణతలు మొదలయ్యాయి. తమ పరిమితులు తమకు బాగానే తెలిసివచ్చాయి. ఆ పరిస్థితుల్లో రకరకాల అయోమయాలకు గురైన కమ్యూనిస్టులు, దేశంలో బీజేపీ ఉధృతి అనదగ్గది ఇంకా మొదలుకాకముందే కాంగ్రెస్‌కు, వివిధ ప్రాంతీయ పార్టీల కు మధ్య చిత్రవిచిత్రమైన రాజకీయ విన్యాసాలను సాగించారు. సొంత సిద్ధాంతాలు, కార్యక్రమాల ఆధారంగా పెంచుకొనలేకపోయిన బలం ఈ విన్యాసాల ద్వారా లభించవచ్చునని ఆశలు పెట్టుకున్నారు. ఆ మార్గంలో లభించిన సోకాల్డ్‌ విజయాలు, లేదా గెలిచిన రెండో, నాలుగో సీట్లు తమ నిజమైన విజయమని భ్రమపడ్డారు. ఓడినప్పుడు కుంగిపోయారు తప్ప ఆత్మవిమర్శలతో దిద్దుబాట్లు ఏమీ చేసుకోలేదు. తమకు తాము చెప్పుకున్నవి కుంటిసాకులయ్యాయి. కనీసం ఆ కుంటిసాకులు కూడా కొత్త మార్పులను తేలేదు. స్వయంగా తమ పునాదులు బలహీనపడుతుండిన స్థితిలో ఇతర పార్టీలతో జరిపిన విన్యాసాలు కూడా నిరుపయోగంగా మారుతుండగా వీరికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. పులి మీద పుట్ర వలె బీజేపీ ఉధృతి మొదలైంది.

వర్తమాన దృశ్యం కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు అనే రెండు జాతీయపక్షాలకు సంబంధించి కూడా ఒకే విధంగా ఉంది. ఇరువురూ ఎడారి మధ్యన నిలుచొని ఉన్నారు. దానినుంచి బయటపడే మార్గాలు లేకపోలేదు గాని అది ప్రస్తుత చర్చలోకి రాగల విషయం కాదు గనుక వదిలివేద్దాము. ఈ రెండు జాతీయపార్టీల పరిస్థితి ఈ విధంగా ఉండగా, వారు ఇరువురూ వేర్వేరు దశలలో అప్పటి తమ ఎన్నికల ఎత్తుగడలను బట్టి ప్రేమించిన లేదా ద్వేషించిన ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏమిటి? విషయానికి నేరుగా రావాలంటే, ఆ పార్టీల ఒకప్పటి ‘స్వర్ణయుగం’ అంతరించింది. ఇప్పటికీ వారు కొన్ని రాష్ర్టాలలో అధికారంలో ఉన్నారు. వారి లో కొందరు జాతీయపార్టీలు అన్నింటిని, ప్రస్తుత బీజేపీ ఉధృతిని కూడా తట్టుకోగలిగినంత బలంగానే ఉన్నారు. అదివేరు. కానీ భారతదేశంలో ఫిలసాఫికల్‌గా వారికి ఒకప్పుడు ఉండిన ‘స్వర్ణయుగం’ ఇప్పుడు లేదు. అందుకు కారణం వారి వైఫల్యాలే. స్వీయ వైఫల్యాల వల్ల కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు బలహీనపడినట్లుగానే ప్రాంతీయ పార్టీలలో నూ అనేకం బలహీనపడ్డాయి. ఈ మూడు శక్తులకు సంబంధించిన ఈ క్రమం ఇంకా కొనసాగుతున్నది. అనగా కమ్యూనిస్టులకు ఒకవైపు కాం గ్రెస్‌ ఆధారం, మరొకవైపు ప్రాంతీయ పార్టీల ఆధారం రెండూ బలహీనపడ్డాయి, పడుతున్నాయి. తమ సొంతకాళ్ల బలం ఎట్లాగూ తమను నిలబెట్టడం లేదు.
ఇటువంటి సుదీర్ఘమైన గతకాలపు, వర్తమానపు నేపథ్యంలో తెలంగాణ కమ్యూనిస్టులు ఉన్నారు.

తెలంగాణలో ఒక బలమైన ప్రాంతీయపార్టీ టీఆర్‌ఎస్‌ రూపంలో ఉన్నది. అదికొన్ని తడబాట్లు ఉన్నప్పటికీ నానాటికి ప్రజాదరణను పెంచుకుంటున్నది. పలు విధాలుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని మౌలికమైన విధంగా సాధిస్తున్నది. సెక్యులరిజం భద్రంగా ఉన్నది. ఆ కారణంగా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు బలపడలేకపోతున్నాయి. మరొక ప్రాంతీయ పార్టీకి అవకాశమే కన్పించటం లేదు. మొత్తం దేశాన్ని ఒకసారి తేరిపార జూస్తే ఈ స్థాయిలో నిలదొక్కుకుని కొనసాగుతున్న ఫెడరల్‌ పార్టీలు అరుదుగా తప్ప లేవు. అటువంటప్పుడు, ఇన్ని పరిణామాల నేపథ్యం నుంచి ప్రస్తుత దశకు చేరిన తెలంగాణ వామపక్షాలు ఎంచుకోవలసిన మార్గం ఏమిటి?

వారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతర స్థితికి వస్తే, ఇది ఇటీవలి చరిత్ర గనుక అందరి కీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు అదేవిధంగా కొనసాగితే పరిస్థితులు చివరికి రాష్ట్ర విభజనకు దారితీయవచ్చునని 1969 ఉద్యమకాలంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఉండిన చండ్ర రాజేశ్వరరావు తమ అధికార పత్రిక న్యూ ఏజ్‌లో బహిరంగంగా హెచ్చరించారు. అయినప్పటికీ సీపీఐ ఆ తర్వాత సుమారు 40 సంవత్సరాలకు గాని ప్రత్యేక రాష్ర్టాన్ని బలపరుచలేదు. ఇక సీపీఎం అయితే స్టాలిన్‌ వంటి సిద్ధాంతకర్త స్వయంగా తిరస్కరించిన లింగ్విస్టిక్‌ డిటర్మిని జం (భాషనే నిర్ణయాత్మక పాత్ర) సిద్ధాంతాన్ని సీమాంధ్ర ధనికవర్గాల ప్రయోజనం కోసం భుజాన వేసుకొని తెలంగాణ ప్రజలకే గాన తనకు తాను కూడా తీరని హాని చేసుకున్నది. దానిని వదులుకునేందుకు నేటికీ సిద్ధపడటం లేదు. సమస్యలు-పోరాటాలు అంటూ చమత్కారపు ఎత్తుగడలు వేసి, తమ తెలంగాణ వ్యతిరేకతా దోషాన్ని దాని మాటున కప్పిపుచ్చుకునేందుకు యాతనలు పడుతున్నది. తమ ఎత్తుగడలతో ప్రజలు తమ తెలంగాణ వ్యతిరేకతను నిజంగానే మరిచిపోతున్నారంటూ భ్రమపడి ఆ మేరకు నల్లగొండలో ఒక తీర్మానాన్నే చేసింది. ఇది కమ్యూనిస్టు లు అయినవారు పాల్పడగూడని ఆత్మవంచన, పరవంచన అని ఆ పార్టీ నాయకత్వపు సంకుచిత దృష్టికి తోచలేదు.
ashok
వామపక్షాల విషయంలో ఇవేవీ పనిచేయటం లేదని 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సీపీఐ కొంతకాలం కాంగ్రెస్‌ తదితరులతో కలిసిచేసిన ప్రయోగాలు ఫలితాలనివ్వలేదు. స్వయంగా కాంగ్రెసే నానాటికి తీసికట్టు అవుతున్నది. ఇక వామపక్షాలు అన్నీ కలసి ప్రత్యామ్నాయంగా ఎదుగాలంటూ 2014 చివరలో చెప్పుకున్న సంకల్పం ఈ ఐదేండ్ల తర్వాత చీలికలు పేలికలుగా మారిపోయింది. వారికి ఇతరులతో పొత్తులు కుదురుతాయిగాని తమ లో తమకు సరిపడకపోవటం ఒక విచిత్రం.

మొత్తానికి వారికి సంబంధించిన పరిస్థితులు ఈ విధంగా ఉండగా, తెలంగాణలో ఒక బలమైన ప్రాంతీయపార్టీ టీఆర్‌ఎస్‌ రూపంలో ఉన్న ది. అదికొన్ని తడబాట్లు ఉన్నప్పటికీ నానాటికి ప్రజాదరణను పెంచుకుంటున్నది. పలు విధాలుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని మౌలికమైన విధంగా సాధిస్తున్నది. సెక్యులరిజం భద్రంగా ఉన్నది. ఆ కారణంగా రెం డు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు బలపడలేకపోతున్నాయి. మరొక ప్రాంతీయ పార్టీకి అవకాశమే కన్పించటం లేదు. మొత్తం దేశాన్ని ఒకసారి తేరిపార జూస్తే ఈ స్థాయిలో నిలదొక్కుకుని కొనసాగుతున్న ఫెడరల్‌ పార్టీలు అరుదుగా తప్పలేవు. అటువంటప్పుడు, ఇన్ని పరిణామాల నేపథ్యం నుంచి ప్రస్తుత దశకు చేరిన తెలంగాణ వామపక్షాలు ఎంచుకోవలసిన మార్గం ఏమిటి? ఈ మాట అంటున్నది కేవలం హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఎన్నికకు పరిమితమై కాదు.

425
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles