గైడెడ్ డెమొక్రసి...


Sat,October 12, 2019 01:23 AM

ప్రధాని మోదీజీ, భారత విదేశాంగ మంత్రి, ఇత ర మంత్రులు, ఉన్నతాధికారులు విదేశాల్లో, ఆయా దేశాల అధినేతల వద్ద, అంతర్జాతీయ వేదికలపై, ఢిల్లీకి వచ్చిన విదేశీ అతిథులకు, అధినే తలకు కశ్మీర్ ఘనకార్యం (370వ ఆర్టికల్ రద్దు) గురించి వివరించక తప్పడం లేదు. ఒకవంక ఇది మా అంతర్గత సమస్య అని అంటూనే అమెరికా హౌడీ మోదీ కార్యక్రమంలో, ఐరాసలో, బ్రిటన్‌లో, ఫ్రాన్స్‌లో, రష్యాలో, చైనాలో, జర్మనీలో, అనేక దేశాల్లో కశ్మీర్ ప్రస్తావనకే మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. ఆగస్టు 5 నుంచి శ్రీనగర్‌లోని హరిసింగ్ ప్యాలెస్‌లో నిర్బంధంలో ఉన్న ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఓ రోజు రాష్ర్టానికి బీజేపీ వైరస్‌ను తెచ్చింది మీరంటే మీరని కీచులాడారట! ఎవరు తెచ్చినా, ఆ వైరస్ వచ్చిన క్షణం నుంచే జమ్ముకశ్మీర్ పరిస్థితి విషమ స్వరూపం ధరించింది.

Devulapalliprabakar
పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకుంటుం దట! 2019, ఆగస్టు 5న స్వతంత్ర భారత పార్లమెంట్‌లో మూడు గంటల స్వల్పవ్యవధిలో ఏం జరిగిందో, హఠాత్తుగా రాష్ట్రపతి కార్యాలయం, పార్లమెంట్ ఏ ఘనకార్యానికి ఆమోదముద్ర వేశాయో (అంతకుముందే రెండు మూడురోజుల్లో భారత స్థల సైనిక దళాలను, సీఆర్‌పీఎఫ్ దళాలను, సరిహద్దు భద్రతాదళాలను, స్థానిక పోలీస్ దళాలను, ఇంటెలిజెన్స్ సిబ్బందిని పెద్దఎత్తున మోహరించిన పిదప కర్ఫ్యూను మించిన కర్ఫ్యూను అనధికారికంగా ప్రవేశపెట్టి, కమ్యూనికేషన్ సదుపాయాలన్నిటికి కత్తెర పెట్టారు. కార్యాలయాలకు, వర్తక వ్యాపారాలకు, రవాణా సదుపాయాలకు, విద్యాసంస్థలకు, దవా ఖానలకు, పత్రికలకు, ప్రజాప్రాతినిధ్య సంస్థలకు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తాళాలువేసి, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను, వారి సహ చరులను, అనుచరులను, అభిమానులను నిర్బంధం చేసి సాధారణ జన జీవితాన్ని కనీవినీ ఎరుగనిరీతిలో స్తంభింపజేసిన తర్వాత ఈ ఆమోద ముద్రల తతంగం జరిగింది). ప్రపంచమంతటా కొన్ని నిమిషాల్లో తెలి సింది. ఈ దేశంలో గాని, ఇతర దేశాల్లో గాని ఈ సంగతి ఎవరికీ తెలి యదని ప్రభుత్వ అధినేతలు భ్రమపడుతున్నారు.

కశ్మీర్‌లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి, ప్రజలకు మేలు చేయడానికి ఈ ఘనకా ర్యం చేయవలసి వచ్చిందని అధినేతలు అంటున్నారు. కనీస మానవ, పౌర హక్కులను, ప్రజాస్వామ్యాన్ని శ్రీనగర్ (కశ్మీర్) లాల్ చౌక్‌లో పాతరపెట్టడం వల్లనే ప్రజల ప్రాణరక్షణ సాధ్యమవుతుందన్న మాట! ఇదీ ఘనకార్యం. ఆగస్టు 5 నుంచి 2 నెలలు గడిచినా, ఇండియన్ రిపబ్లిక్‌లోని ఒక ముఖ్యభాగం, అందులోనూ కీలకమైన సరిహద్దు రాష్ట్ర జమ్మూకశ్మీర్‌లో ప్రజల సాధారణ, ప్రజాస్వామ్య, ప్రశాంత జీవనానికి అవకాశం లభించడం లేదు. నామమాత్రంగానైనా, లాంఛనప్రాయంగా నైనా కశ్మీరీలతో మాట్లాడకుండా, కనీసం సమాచారమైనా ఇవ్వకుండా, ఏం జరుగడం లేదని మభ్యపెట్టి రాష్ర్టాన్ని నిర్దాక్షిణ్యంగా మూడుము క్కలు చేశారు. ఎక్కువ అధికారాలు, అటానమీ అడుగుతారా బిడ్డా, మీ సంగతి చూస్తాం అంటూ అసలు అధికారాలే ఉండని మూడు కేంద్ర పాలిత రాష్ర్టాలుగా మార్చారు.

ఈ ఘనకార్యంపై విచారణకు ఎన్ని పిటి షన్లు చేరినా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు రెండున్నర నెల లవుతున్నా ఇంకా ముహూర్తం కుదరడం లేదు. 2015లో ఎన్నికైన జమ్ముకశ్మీర్ రాష్ట్ర శాసనసభ 2018 డిసెంబర్‌లో ఒక పథకం ప్రకారం రద్దయింది; ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేక గవ ర్నర్ పాలన (అనగా కేంద్ర ప్రభుత్వ పాలన, అనగా మోదీజీ పాలన) వచ్చింది. కనుక, ఇక రాష్ట్ర ప్రజలతో, లేని రాష్ట్ర శాస నసభతో సంప్ర దించవలసిన అవసరం లేదన్నారు. కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వంగా వ్యవ హరిస్తున్నది గనుక రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చని వాదించారు. ఇదే వాదనను మున్ముందు దేశంలోని ఇంకే రాష్ర్టానికైనా వర్తింపజేసే ప్రమా దముందని భయపడుతున్న వారున్నారు. రెండు నెలల కిందట కొరడా పట్టి చండ శాసనుల వలె వ్యవహరించిన కేంద్ర అధినేతలు జమ్ముకశ్మీరు భవిష్యత్ పరిణామాలన్నిటికి బాధ్యత వహించవలసి ఉంటుంది. మన్మోహన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమాచార సేకరణ చట్టం కింద కొందరు జమ్ము కశ్మీరులో గత రెండు నెలల్లో ఎవరిని నిర్బంధించారు? ఎక్కడ నిర్బం ధించారు? అంటూ మోదీజీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కశ్మీరు నిర్బం ధాల గురించి మాకేమీ తెలియదు బాబూ అని మోదీజీ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందట! ఇది పలాయన మంత్రం, బాధ్యతా రాహిత్యం, అబద్ధాలకు పరాకాష్ట. గనీమత్‌హై! 370, 35 (ఏ) ఆర్టికల్స్ రద్దు గురించి కూడా మాకేమీ తెలియదు అని అనడం లేదు. ఆ విధంగా అన డం, చేతులు దులుపడం, చేతులెత్తడం సులభం కాదు.

గత రెండు నెలల కశ్మీర్ కఠోర సత్యాలను దాచిపెట్టడం ఈ దేశంలో సాధ్యమవుతున్నదేమో కానీ ఇతర దేశాల్లో, అంతర్జాతీయరంగంలో సాధ్యం కావడం లేదు. ప్రధాని మోదీజీ, భారత విదేశాంగ మంత్రి, ఇత ర మంత్రులు, ఉన్నతాధికారులు విదేశాల్లో, ఆయా దేశాల అధినేతల వద్ద, అంతర్జాతీయ వేదికలపై, ఢిల్లీకి వచ్చిన విదేశీ అతిథులకు, అధినే తలకు కశ్మీర్ ఘనకార్యం (370వ ఆర్టికల్ రద్దు) గురించి వివరించక తప్పడం లేదు. ఒకవంక ఇది మా అంతర్గత సమస్య అని అంటూనే అమెరికా హౌడీ మోదీ కార్యక్రమంలో, ఐరాసలో, బ్రిటన్‌లో, ఫ్రాన్స్ లో, రష్యాలో, చైనాలో, జర్మనీలో, అనేక దేశాల్లో కశ్మీర్ ప్రస్తావనకే మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. అమెరికా, బ్రిటన్ మీడియాలో కశ్మీర్ పరిస్థి తి, అక్కడి మానవహక్కుల ఉల్లంఘన, అక్కడి ఆంక్షలు, నిర్బంధాలు, సాయుధ బలగాల అరాచకచర్యలు, నిరసన ప్రదర్శనలు, ప్రతిఘటన లు, దాడులు, కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు సెన్సేషనల్ స్టోరీలుగా, విశేషా లుగా ప్రాధాన్యం పొందుతున్నాయి. హ్యూస్టన్ మోదీ వేదికపై భారత ప్రధాని మోదీజీ గంభీర గళంతో ఔరేక్ బార్ ట్రంప్ సర్కార్ నినాదం ఇచ్చినప్పటికీ అమెరికా విదేశాంగశాఖ మాత్రం కశ్మీర్ పరిస్థితి పట్ల ఆం దోళన వ్యక్తపరిచింది.

కశ్మీర్ పరిస్థితిని గమనిస్తున్నామని, కశ్మీర్ వివా దంలో తమ మద్దతు పాకిస్థాన్‌కు ఉంటుందని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటనకు ముందు ప్రకటించడం అసాధారణ విషయం. మన రెండుదేశాల మధ్య 3 వేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది గనుక చైనా వైఖరిని ఉపేక్షించలేం. 72 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో జమ్ము కశ్మీర్‌లో తొలిసారి మోదీజీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిం ది. అదీ 2015 రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత మెహబూబా ముఫ్తీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత) అండదండలతో. ఆగస్టు 5 నుంచి శ్రీనగర్‌లోని హరిసింగ్ ప్యాలెస్‌లో నిర్బంధంలో ఉన్న ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఓ రోజు రాష్ర్టానికి బీజేపీ వైరస్‌ను తెచ్చింది మీరంటే మీరని కీచులాడారట! ఎవ రు తెచ్చినా, ఆ వైరస్ వచ్చిన క్షణం నుంచే జమ్ముకశ్మీర్ పరిస్థితి విషమ స్వరూపం ధరించింది. మతోన్మాద టెర్రరిస్టులు మరింత విజృంభించా రు.

చివరికి, 370వ ఆర్టికల్ రద్దు వరకు, కశ్మీర్ ప్రజల జీవనం స్తంభించే దాక పరిస్థితి విషమించింది. అధినేతలు ఇది మా అంతర్గత సమస్య అని సమయానుకూలంగా అంటున్నప్పటికీ కశ్మీర్ ఈరోజు అంతర్జాతీ య చర్చనీయాంశమైంది. గత 72 ఏండ్ల స్వాతంత్య్రంలో భారతదేశం, భారత సైన్యం ఎన్నడూ అప్రతిష్టపాలు కాలేదు. అప్రతిష్ట పాలయ్యే కళం కిత పరిణామాలు ఇప్పుడు సంభవిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఒకామె ఇటీవల సుప్రీంకోర్టు అనుమతితో శ్రీనగర్ వెళ్లివచ్చి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు బీబీసీలో, అం తర్జాతీయ మీడియాలో బహుళ ప్రచారం పొందాయి. కశ్మీర్‌లో గల్లీగల్లీ లో మోహరించిన సాయుధ బలగాల వారు ఇండ్లలోకి చొరబడి స్త్రీలను, విశేషించి పడుచుపిల్లలను అవమానిస్తున్నారని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. కశ్మీర్‌ను ప్రస్తుతం పాలిస్తున్న కేంద్రం మొక్కుబడిగా విద్యాసం స్థలను తెరిచినా అక్కడ కాపలా కాస్తున్న సాయుధ బలగాలను చూసి విద్యార్థులు పాఠశాలలకు రావడానికి భయపడుతున్నారన్నారు.

ఇటీవలి మరో సువార్త-రెండునెలల నుంచి నిర్బంధంలో ఉన్న నేష నల్ కాన్ఫరెన్స్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాను, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను కలిసి మాట్లాడటా నికి (ఇంటెలిజెన్స్ అధికారుల సమక్షంలో!) వారి పార్టీ నేతలు కొందరికి, మెహబూబా ముఫ్తీతో మాట్లాడడానికి ఆమె పార్టీ నేతలు కొందరికి మోదీజీ ప్రభుత్వం ఎంతో దయతో, ఔదార్యంతో అనుమతి ఇచ్చిందట. అధినేతలు గీచిన లక్ష్మణరేఖను దాటకుండా, అధినేతల అనుమతితో ఒక పరిమితితో పార్టీల కార్యకలాపాలు నిర్వహించుకోవాలె-ఇది గైడెడ్ డెమొక్రసి. ఇది డెమొక్రసి బై డిక్టేషన్. ఇదే ఒకే పార్టీ, ఒకే నేత డెమొక్ర సి-పర్యవేక్షిత ప్రజాస్వామ్యం. ఇటువంటి ప్రజాస్వామ్యం 7వ నిజాం పాలనలో, పాకిస్థాన్‌లో జనరల్ ఆయూబ్‌ఖాన్, జనరల్ యాహ్యాఖాన్ పాలనలో ఉండేది; జనరల్ జియా ఉల్‌హక్ ఇదే ప్రజాస్వామ్యాన్ని ప్రవే శపెట్టి తన లక్ష్మణరేఖను అతిక్రమిస్తున్న జుల్‌ఫీ భుట్టోను ఉరికంబం ఎక్కించాడు, చివరికి తానూ ఒక విమాన ప్రమాదంలో మరణించాడు. అందువల్లనే పోతన మహాకవి కారే రాజులు రాజ్యముల్ కలుగవే అని అన్నాడు.

కశ్మీర్ వివాదాన్ని యూఎన్‌కు తీసుకెళ్లి నెహ్రూ హిమాలయ పర్వతమంత తప్పుచేశాడని ఈ మధ్య ఒక తురుబ్‌ఖాన్ అన్నాడు. మతోన్మాదులు మూర్ఖత్వ హద్దులు దాటి గాంధీజీని 1948, జనవరి 30న సాయంత్రం హత్య చేయడానికి ముందు జనవరి 4వ తేదీన ప్రార్థ నా సమావేశంలో ఆయన (గాంధీజీ) అన్న మాటలివి... ఇవ్వాళ ఎక్కడ చూసినా యుద్ధం మాట వినిపిస్తున్నది. అదేగనుక జరిగితే భారత్‌కు, పాకిస్థాన్‌కు రెండింటికీ వినాశనమే. ఎక్కడ ఘర్షణ భయం ఏర్పడినా ఐక్యరాజ్యసమితి పరిష్కారం చేయాలని, యుద్ధం ఆపాలని కోరుతాం. భారత్ కూడా ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. భారత్ స్వతంత్ర దేశంగా ఉండాలంటే ఈ పరిణామాలను నిరోధించాలి.... 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ సమా వేశానికి అప్పటి భారత విదేశాంగమంత్రి స్వర్గీయ సుష్మాస్వరాజ్‌ను ఆహ్వానించారు. ఆమె ప్రసంగం తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. చివరికి సమావేశంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా ఒక తీర్మానాన్ని ఆమో దించారు. ఈ రోజు ఐరాసలోని సభ్యత్వ దేశాల సంఖ్య దాదాపు 200. ఇందులో నాలుగో వంతు, అనగా 50 కంటే ఎక్కువ దేశాలు ఇస్లామిక్ దేశాలు. సుష్మాజీ అనుభవాన్ని గమనించినప్పుడు ఈ ఇస్లామిక్ దేశాల వైఖరి చివరికి ఎవరిపక్షాన ఉంటుందో ఊహించడం కష్టం కాదు. అంతే కాదు, గాంధీజీ 72 ఏండ్ల కిందట హెచ్చరించినట్లు యుద్ధమే జరిగితే అది రెండు దేశాలకు వినాశకరమైనది-ఆటంబాంబులు పేలినప్పుడు అవి ఏ మతం వారు ఎవరో గమనించవు. అన్ని మతాలవారు ఆ వినా శకర విధ్వంసంలో బలికాక తప్పదు.

489
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles