కలాం జీవితం ఆదర్శం


Mon,October 14, 2019 10:30 PM

abdul-kalam
కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విద్యార్థులకు ఎప్పుడూ చెపుతూ ఉండేవారు. శాస్త్రవేత్తగా విద్యావేత్తగా, అధ్యాపకునిగా, రాష్ట్ర పతిగాఆయన దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవి. కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. కలాం చదవులో సాధారణ విద్యార్థిగా ఉన్నా కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కనబర్చేవారు. రామనాథపురంలో సెకండరీ విద్యను పూర్తిచేసుకొన్న ఆయన భౌతిక శాస్త్రంలో 1954లో డిగ్రీ పట్టా పొందారు. ఇంజినీరింగ్‌ను చదువాలనే తాపత్రయంతో 1955లో ఆయన మద్రాసు వెళ్ళారు. 1960లో ది మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొంది డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరారు. ఆ తర్వాత ఇస్రోలో సేవలందించారు. 60వ దశకంలో భారత్ పాకిస్థాన్, చైనా వంటి దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడే భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం వున్నదని కలాం గుర్తించారు.


ఆయన ఇస్రోలో పనిచేసినప్పు డు పీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎల్‌వీ-3 వంటి ప్రాజెక్టుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. 1970వ దశకంలో బాలిస్టిక్ క్షిపణులు తయారీలలలో ప్రము ఖపాత్ర పోషించారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. 1998లో భారత్ రెండవ దఫా నిర్వహించిన అణు పరీక్షల్లో చురుకైన పాత్ర పోషించారు. రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారు. బ్రహ్మోస్ వంటి సూపర్‌సోనిక్ మిసైల్‌ను భారత్ తయారు చేయగలిగిందంటే క్షిపణి రంగంలో కలాం వేసిన గట్టి పునాదులే కారణం. అందుకే ఆయనను భారత క్షిపణి పితామహుడిగా పిలుస్తారు.
-యం. రాంప్రదీప్
(నేడు అబ్దుల్ కలాం జయంతి)

139
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles