టీఎస్పీస్సీకి అభినందనలు


Wed,October 16, 2019 01:27 AM

ఉమ్మడి పాలనలో నీళ్లు, నిధులు, నియా మకాల విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్ర దోపిడీ, అణిచివేతలకు గుర య్యారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్య మం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను పూరిస్తూ వస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఇటీవల ఎస్జీటీ తెలుగు మీడియం ఫలితాలు విడుద ల చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమి షన్ చరిత్ర సృష్టించింది. కొందరు కోర్టు లో వేసిన కేసులను, అడ్డంకులను అధిగ మించి నియామకాలు చేపట్టడం హర్షణీ యం. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవ హరించిన టీఎస్పీఎస్సీకి అభినందనలు. అట్లాగే పీఈటీ,ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం ఫలితాలు కూడా ప్రకటించాలి.
- జీడిపల్లి లింగారావు, రామకృష్ణకాలనీ, కరీంనగర్


బీజేపీ ఒంటెద్దు పోకడలు

25 వేల మంది హోంగార్డులను తొలిగిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడం బాధాకరం. నిరుద్యోగాన్ని రూపుమాపుతామని ఎన్ని కల మ్యానిఫెస్టో ప్రకటించి తీరా అధికారంలోకి వచ్చినంక ఉన్న ఉద్యోగా లను ఊడగొట్టడం బీజేపీ కుటిల నీతికి నిదర్శనం. కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందాన వ్యవహరిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికే విరుద్ధం.
-బోనగిరి వేదేశ్వర్, భువనగిరి , యాదాద్రి భువనగిరి జిల్లా

చర్చల ద్వారా పరిష్కరించుకోవాలె

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి, సమ్మెకాలపు వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించి, ఆర్టీసీ నాయకులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కరించు కోవాలని సూచించింది. పండుగలు, విద్యార్థులకు సెలువులు ఉన్నకాలం లో సమ్మెకు దిగడం ఎంత వరకు సమంజసమంటూ ప్రశ్నించింది. ఇకనై నా ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవాలి.
- కొత్వాల్ ప్రవీణ్‌కుమార్, బేగంపేట, హైదరాబాద్

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles