డ్రాగన్‌తో జర జాగ్రత్త!


Wed,October 16, 2019 01:30 AM

modi-Xi-Jinping
ఒకవైపు డోక్లాం వివాదంతో, మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్‌కు మద్దతునిస్తూ ఇటీవలికాలంలో భారత్‌పై గుర్రుగా ఉన్న చైనా ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు మనదేశానికి స్నేహహస్తం అందిస్తున్నది. తనతో సమానంగా అత్యంతవేగం గా అభివృద్ధి చెందుతున్న మన దేశం పట్ల చైనా వైఖరి ప్రపంచానికి తెలియంది కాదు. దశాబ్దాల కాలం నాటినుంచి మనదేశ ఎదుగుదలను హర్షించలేక, పరోక్షంగా పాకిస్థాన్‌కు మద్దతునిస్తున్న చైనా వైఖరిలో ఇంత మార్పునకు కారణం మన దేశ సుస్థిర మార్కెట్ మాత్రమే. ఒకప్పుడు ఒకదేశం మరో దేశంపై ఆధిపత్యం కోసం యుద్ధం చేయా ల్సి వచ్చేది. కానీ ప్రపంచీకరణ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఒకదేశం ఇంకొక దేశంపై ఆధిపత్యం కోసం ఆ దేశానికి చెందిన వస్తువుల దిగుమతిపై సుంకం పెంచుతున్నది. వాటినే వాణిజ్యయుద్ధం గా పేర్కొంటున్నది. ఇలా గత సంవత్సర కాలంగా అమెరికా-చైనా వాణి జ్యయుద్ధంతో చైనా దేశ ఆర్థికవ్యవస్థ నానాటికీ దిగజారుతున్నది. అందు కే గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద వినిమయ మార్కెట్ కలిగిన మనదేశంతో కయ్యం కన్నా వియ్యం నయమన్న చందంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన సాగింది. చైనా ఉత్పతులకు మనదేశంలో మార్కెట్ పెంచుకోవడం కోసమే ఇలా చైనా వైఖరి మార్చుకున్నది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా ఆ దేశ ఆర్థిక సుస్థిరత కోసం మనదేశంతో సత్సంబంధాలు పెంచుకోవడమే లక్ష్యంగా చైనా అడుగులు వేస్తున్నట్లుగా ఉన్నది. చైనా నిన్నటివరకు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తూ భారత్‌ను అనేకరకాలుగా ఇరుకున పెట్టే ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఆర్టికల్ 370పై పాకిస్థాన్‌కు అంతర్జాతీయ వేదికల్లో వంతపాడుతున్నది. కశ్మీర్ సమస్యకు యూ.ఎన్.చార్టర్ ద్వారానే పరిష్కారం చూపాలన్నది.


చైనా నిన్నటివరకు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తూ భారత్‌ను అనేకరకాలుగా ఇరుకున పెట్టే ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఆర్టికల్ 370పై పాకిస్థాన్‌కు అంతర్జాతీయ వేదికల్లో వంతపాడుతున్నది. కశ్మీర్ సమస్యకు యూ.ఎన్.చార్టర్ ద్వారానే పరిష్కారం చూపాలన్నది. ఇప్పుడు మాత్రం కశ్మీర్ అంశం భారత్, పాకిస్థాన్ దేశాల ద్వైపాక్షిక అంశంగా పేర్కొంటున్నది. స్వయానా పాకిస్థాన్ దేశ ప్రధాని చైనా పర్యటనలో ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఇప్పుడు మాత్రం కశ్మీర్ అంశం భారత్, పాకిస్థాన్ దేశాల ద్వైపాక్షిక అంశంగా పేర్కొంటు న్నది. స్వయానా పాకిస్థాన్ దేశ ప్రధాని చైనా పర్యటనలో ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చైనా స్వరం మారడానికి రెం డు కారణాలున్నాయి. మొదటిది చైనా ఆర్థికసంక్షోభం. వాస్తవానికి కొం తకాలంగా చైనా ఆర్థికవ్యవస్థ ఒడిదొడుకులకు లోనవుతున్నది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 6.4 శాతం వృద్ధిరేటు నమోదు కాగా రెం డవ త్రైమాసికంలో అది 6.2 శాతానికి పడిపోయింది. మొదటి ఆరు నెల ల్లో విదేశీ ఎగుమతులు 0.1 శాతం మాత్రమే పెరిగాయి. అంతేకాదు చైనాలో సైతం మొదటి అర్ధభాగంలో వాహనాల అమ్మకాలు 12.4 శాతం తగ్గాయని ఆ దేశ వాహన తయారీదారుల అసోసియేషన్ చెబుతున్నది. ఫలితంగా అక్కడి పట్టణ నిరుద్యోగం మే నెలలో 5 శాతం ఉం డగా జూన్‌లో 5.1 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఆ దేశ జీడీపీ 28 సం వత్సరాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2019 సంవత్సరం తొలి 8 నెలల కాలంలో చైనా వాణిజ్య మిగులు 1.6 శాతానికి క్షీణించింది. విదేశీ వర్తకంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామైన అమెరికాతో వాణిజ్యయుద్ధం ఈ పరిస్థితికి కారణం. చైనా మొత్తం ఎగుమతుల్లో అమెరికా 479.7 బిలియన్ డాలర్లతో, 19.2 శాతంతో మొదటిస్థానంలో ఉన్నది. అయితే వాణిజ్యయుద్ధం కారణంగా ఎగుమతులు ప్రభావితమవుతున్నాయి. అందుకే భవిష్యత్తులో అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుర య్యే నష్టాలను పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా మన దేశంవైపు చూస్తున్నది. చైనా ఉత్పతులకు మనదేశంలో మార్కెట్ పెంచుకోవడం కోసమే ఇలా చైనా స్నేహహస్తం చూపుతున్నది. ఇక రెండవది బలపడుతున్న అమెరికా, భారత్ బంధం. భవిష్యత్తులో సూపర్ పవర్‌గా ఎదుగాలనుకుంటున్న చైనాకు చెక్‌పెట్టే ఉద్దేశంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై వాణిజ్యపరంగా దూకుడు పెంచుతున్నాడు. దానికోసం అమెరికా భారత్‌కు దగ్గరవ్వడం, ఇటీవల హౌదీ మోదీ పేరిట జరిగిన సభ ద్వారా అమెరికా, భారత్ సంబంధం మరింత మెరుగవ్వడం. అంతేకాక రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు తిరిగి అమెరికన్లు పట్టం కట్టవచ్చు అనే ఊహాగానాలు పెరిగా యి.

చైనాతో మైత్రి బంధం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీకి తెలియంది కాదు. గడిచిన నలభై ఐదేండ్లలో ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు వ్యతిరేకంగా చైనా తన వీటో అధికారాన్ని సుమారు పదిసార్లు వినియోగించుకున్నది. అంతేకాక ముంబయిపై 2011లో ఉగ్రవాద దాడికి సూత్రధారుడైన జమాతే ఉద్ దవా సంస్థపై ఉగ్రజాబితాలో చేర్చకుండా అడ్డుకున్నది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి తీవ్రవాద సంస్థలపై భద్రతామండలిలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది. తీవ్రవాది జాకీ-ఉర్-రెహ్మాన్ లఖవ్‌ను జైలు నుంచి పాకిస్థాన్ విడుదలపై భద్రతామండలిలో చర్చకు రానీయకుండా చైనా వ్యవహరించింది. ఇలా ఐరాస లోపలా, బయటా మనదేశానికి వ్యతిరేకం గా కుట్రలు పన్నుతున్న చైనాను గుడ్డిగా నమ్మకూడదు.


ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడితే అది భవిష్యత్తులో చైనా విదేశీ వర్తకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాబట్టి చైనా ఇప్పుడు మన దేశానికి స్నేహహస్తం అందిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్యబంధం బలపరుచుకుంటే అమెరికా వల్ల ఏర్పడుతున్న నష్టాలను దీటుగా ఎదురుకోవచ్చు అనేది చైనా వ్యూహంగా కనిపిస్తున్నది. అంతేకాదు వేగంగా అభివృద్ధి చెందుతూ చైనాకు సరిసమానంగా ఎదుగుతున్న మనదేశం ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగం గా అమెరికా, జపాన్ దేశాలతో మైత్రిని బలపరుచుకుంటూ చైనాకు కళ్లెం వేయాలని భావిస్తున్నది. ఇటీవలికాలంలో చైనాతో విరోధంగా ఉన్న మలేషియా, వియెత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో భారత్ వ్యూహాత్మకంగా సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నది. అలాగే అంతర్జాతీయం గా భారత్ ఇమేజ్ పెరుగడం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ప్రపంచదేశాలను ఒక తాటిమీదికి తెస్తున్నది. ముఖ్యంగా ప్రపంచ వినియోగ మార్కెట్లో భారత్ అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తున్న ప్రపంచ దేశాలు మనదేశంలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలికాలం లో తదనుగుణంగా భారత ప్రభుత్వం కార్పొరేట్ పన్ను తగ్గించడం, బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకులు పటిష్ఠపరుచడం వంటి నిర్ణయా లు తీసుకుంటున్నది. ఈ గడ్డు పరిస్థితుల్లో పాక్‌తో సంబంధం కన్నా భారత్‌తో సంబంధమే ముఖ్యమనే నిర్ణయానికి చైనా వచ్చినట్లున్నది. చైనాతో మైత్రి బంధం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీకి తెలియంది కాదు. గడిచిన నలభై ఐదేండ్లలో ఐక్యరాజ్య సమితి లో భారత్‌కు వ్యతిరేకంగా చైనా తన వీటో అధికారాన్ని సుమారు పదిసార్లు వినియోగించుకున్నది. అంతేకాక ముంబయిపై 2011లో ఉగ్రవాద దాడికి సూత్రధారుడైన జమాతే ఉద్ దవా సంస్థపై ఉగ్రజాబితాలో చేర్చకుండా అడ్డుకున్నది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి తీవ్రవాద సంస్థలపై భద్రతామండలిలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది.
professor-venakateswarlu
తీవ్రవాది జాకీ-ఉర్-రెహ్మాన్ లఖవ్‌ను జైలు నుంచి పాకిస్థాన్ విడుదలపై భద్రతామండలిలో చర్చకు రానీయకుండా చైనా వ్యవహరించింది. ఇలా ఐరాస లోపలా, బయటా మనదేశానికి వ్యతిరేకంగా కుట్ర లు పన్నుతున్న చైనాను గుడ్డిగా నమ్మకూడదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మైత్రి తలుపు కొడుతున్న చైనాతో బంధం మనదేశానికి అనుకూలంగా మలుచుకోవాలి. ఎందుకంటే మొదటిగా అమెరికా, చైనా అం డతో కశ్మీర్ అంశంపై బుసలు కొడుతున్న పాకిస్థాన్‌కు అటు అమెరికాతో ఇటు చైనాతో బంధం బలపరుచుకోవడం ద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయవచ్చు. ఇక రెండవది చైనాతో వాణిజ్యపరంగా మనదేశానికి వాణి జ్యలోటు సుమారు 52 బిలియన్ డాలర్లు. భారత్‌కు విదేశీ వ్యాపారం లో ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశం చైనా కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో చైనా కొడుతున్న మైత్రి తలుపులు తెరిచి తద్వారా మన వాణిజ్యా న్ని బలోపేతం చేసే దిశగా అడుగులు మోపాలి. ద్విముఖ వ్యూహంతో అటు అమెరికా, చైనాతో దోస్తీకి సై అంటున్న మోదీ మునుముందు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
(వ్యాసకర్త: ఇండియన్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు)

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles