వ్యాధులపై అవగాహన అవసరం


Fri,October 18, 2019 01:28 AM

వానకాలం వచ్చిందంటే సీజనల్‌ వ్యాధులతో పాటు, డెం గ్యూ వంటి జ్వరాలు విజృంభిస్తాయి. సీజనల్‌ వ్యాధులతో ప్రజలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇదే అదనుగా కొందరు వైద్యులు వ్యాపార ధోరణులతో ఆలోచించి జ్వర బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నా రు. డెంగ్యూ జ్వరాన్ని ప్రాణాంతకవ్యాధిగా చెబుతూ ప్రజ లను హడలగొడుతున్నారు. డెంగ్యూ జ్వరానికి సంబంధిం చి ప్రాథమిక లక్షణాలు రోగిలో కనిపిస్తే రక్తంలోని ప్లేట్‌లెట్స్‌లో కొంత తగ్గుదల కన్పించడం సాధారణమే. అయితే సకాలంలో వైద్యుడిని సంప్రదించి సరైన ఆహారం తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్‌లో పెరుగుదల కన్పిస్తుంది. కానీ చాలామంది వైద్యులు డెంగ్యూ నివారణ కోసమంటూ మోతాదుకి మించి యాంటిబయాటిక్స్‌ మందులను జ్వర బాధితులకు ఇస్తున్నారు. దీనివల్ల వారిలో మరికొన్ని ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. యాంటి బయాటి క్స్‌తో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య కూడా పడిపోయే అవకాశం ఉన్న ది. మనిషి ఆరోగ్యం, వయస్సును బట్టి ప్లేట్‌లెట్స్‌ సంఖ్య సుమారు ఒక లక్షా యాభై వేల నుంచి నాలుగు లక్షల యా భై వేల వరకు మన శరీరంలో ఉంటాయి. వైరల్‌ జ్వరాలు వచ్చినప్పుడు కూడా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గుతూ ఉంటుం ది. అయితే యాభై వేల వరకు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోయినప్పటికీ రోగి ప్రాణానికి ముప్పు ఉండదు.


అయితే జ్వర బాధితులు తక్షణమే రక్తపరీక్షలు చేయించుకొని సకాలంలో మందులు వాడాలి. టైఫాయిడ్‌ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరాల వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య పెద్దగా తగ్గిపోదు. ఎక్కువగా వైరల్‌ జ్వరాలలోనే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గుదల కనిపిస్తుంది. వైద్యుని సూచన మేరకు తగిన ఆహారాన్ని తీసుకోవాలి. బొప్పాయి, క్యారెట్‌, బీన్స్‌, తాజా ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటే ప్లేట్‌లెట్స్‌లో గణనీయమైన పెరుగుదల కన్పిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుం టూ దోమ లు కుట్టకుండా, నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. అంతేగాక గోరువెచ్చని నీరు తాగితే చాలారకాల సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. వానకాలంలో వచ్చే ఈ సీజన ల్‌ వ్యాధుల పట్ల ప్రజల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది మరింత చైతన్యం కలిగించాల్సి అవసరం ఉన్నది.
- యం.రాంప్రదీప్‌, సామాజిక కార్యకర్త

122
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles