గ్రామరాజ్యానికి కొత్త బాట


Sun,November 3, 2019 01:07 AM

గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బందిని విలేజ్ లెవల్ అధికారులు అంటారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ సిబ్బందే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలకు సంబంధించిన సిబ్బంది కూడా పనిచేస్తారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 శాఖలకు సంబంధించిన సిబ్బందిని గ్రామ పంచాయతీకి కేటాయించబడాలి. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు అయి తే 15 శాఖలకు సంబంధించిన 29 మంది సిబ్బంది, మైనర్ గ్రామ పంచాయతీలో 10 శాఖలకు సంబంధించిన 22 మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించకపోగా ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఆ శాఖకే పరిమితి కావడం గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా ఉండటం వల్ల జవాబుదారీతనం లేకుండా పోయింది.

Bhavani
1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరా జ్ సంస్థలకు రాజ్యాంగపరమైన హోదాను కల్పించింది. గతంలో పంచాయతీరాజ్ సంస్థలు చాలాకాలం ఉనికిలో ఉన్నప్పటికీ, వీటికి ఏం డ్ల తరబడి ఎన్నికలు లేకపోవడం, అవి ఏర్పాటుచేసుకున్నప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలు పక్కదారి పట్టడం వల్ల ఈ లోపాలను అధిగమించడానికి 73వ రాజ్యాంగ సవరణ ప్రాతిపదిక అయ్యి చరిత్రలో నిలిచింది. 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24వ తేదీ ని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 2010 ఏప్రి ల్ 24 నుంచి జరుపుకుంటున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉత్తమంగా పనిచేసే పంచాయతీలకు అవార్డులు ఇస్తున్నారు. ఈ సంవత్స రం 10వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అత్యంత ఉత్సాహంగా ఢిల్లీలో అక్టోబర్ 23న నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ సదస్సుకు దేశంలోని 29 రాష్ర్టాల నుంచి స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి నాతో కలిపి 18 మొత్తం మంది పాల్గొన్నాం.

ఈ సదస్సులో వివిధ రాష్ర్టాల ప్రతినిధులు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు బదలాయించిన నిధులు, విధులు, సిబ్బంది, స్వేచ్ఛ, గ్రామసభ, గ్రామ పంచాయతీల నిర్వహణ లాంటి ముఖ్యమైన అంశాలను చర్చించారు. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపై పూర్తిస్థాయి ఆంక్షలు ఉండరాదు. కొన్ని పనులకే (ఉదా:రోడ్లు, డ్రైనేజీలు, జీతభత్యాలు) నిధులు ఉపయోగించాలని నిర్దేశించడం వల్ల గ్రామస్థాయి ప్రణాళికలకు నిధులు లేక గ్రామాలు వెనుకపడుతున్నాయి. నేరుగా పంచాయతీలకే నిధులు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. ప్రారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, వీధి దీపాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామస్థాయి పరిధిలోకి వచ్చే 29 శాఖలకు సంబంధించిన పనులను పర్యవేక్షణ చేసి సమీక్ష చేసే అధికారాన్ని అప్పజెప్పినప్పుడు గ్రామాలు అభివృద్ధిలో పురోగమిస్తాయి. కానీ గ్రామాల్లో 10,15 శాఖలకు సంబంధించిన శాఖలు మాత్రమే తమ విధులు నిర్వహిస్తున్నాయి. వీటిపై గ్రామ పంచాయతీకి ఎటువంటి పర్యవేక్షణ లేదు.

గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బందిని విలేజ్ లెవల్ అధికారులు అంటా రు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ సిబ్బందే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలకు సంబంధించిన సిబ్బంది కూడా పనిచేస్తారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 శాఖలకు సంబంధించిన సిబ్బందిని గ్రామ పంచాయతీకి కేటాయించబడాలి. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు అయి తే 15 శాఖలకు సంబంధించిన 29 మంది సిబ్బంది, మైనర్ గ్రామ పంచాయతీలో 10 శాఖలకు సంబంధించిన 22 మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించకపోగా ఏ శాఖకు సం బంధించిన ఉద్యోగులు ఆ శాఖకే పరిమితి కావడం గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా ఉండటం వల్ల జవాబుదారీతనం లేకుండా పోయిం ది. అన్ని శాఖల సిబ్బందిని గ్రామ పంచాయతీ కిందికి తీసుకువచ్చి, వారి జీతభత్యాలు కూడా గ్రామ పంచాయతీ చెల్లించేవిధంగా చూసుకోవాలి. ఈ నిర్ణయం వల్ల జవాబుదారీతనం ఏర్పడి గ్రామాభివృద్ధికి సిబ్బంది అం తా ఏకోన్ముఖంగా కృషిచేస్తారు.

కొన్ని ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు ధనస్వాముల చేతిలో కీలుబొ మ్మలుగా మారాయి. ఈ పద్ధతి మార్చాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థకు పూర్తిస్వేచ్ఛ ఇవ్వాలి. గ్రామ పంచాయతీలు చేసే తీర్మానాల ప్రకారం అంద రూ నడుచుకోవాలి. గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలనే గ్రామ కార్యనిర్వాహక వర్గం అమలుచేయాలి. లబ్ధిదారుల ఎంపిక, పథకాల పంపిణీ లాంటి నిర్ణయాలు పైస్థాయికి పోయే కొద్ది ఎలాంటి మార్పులకు లోనుకాకూడదు.గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి, ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి కీలకంగా ఉపయోగపడేది గ్రామసభ, గ్రామ పంచాయతీ మీటింగ్‌లు. గ్రామ పంచాయతీ మీటింగ్‌లకు ఒకరోజు ముందే గ్రామ సిబ్బంది పని సమీక్ష చేసి పంచాయతీ మీటింగ్‌లో మళ్లీ వారి పని సమీక్షించాలి. గ్రామ సభకు ముందే వార్డుసభలు జరుగాలి. అప్పుడు మాత్రమే గ్రామసభలో ఆయా వార్డుల సమస్యలు చర్చించబడుతాయి. గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్టర్ అమలు జరుగాలి. ప్రతి గ్రామసభకు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు రావాలి. సభలో వ్యక్తమ య్యే సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల వాటిని సత్వరంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓడిపోయిన సర్పంచి అభ్యర్థిని, వార్డు అభ్యర్థులను సభకు హాజరయ్యేటట్లు చేయడం వల్ల గ్రామాభివృద్ధిలో భాగం చేయవచ్చు.

పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టతకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తు న్నది. 1.స్థానిక ప్రభుత్వాల పరిపాలనను గాడిలో పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. 2.అధికార వికేంద్రీకరణ, మారుమూల ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల అభివృద్ధి కోసం కొత్తగా 1,326 గ్రామ పంచాయతీలను 4,384 గిరిజన గ్రామ పం చాయతీలను ఏర్పాటుచేశారు. వాటి అభివృద్ధికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తున్నారు. 3.గ్రామ పంచాయతీ పరిపాలనా సక్రమంగా జరిగి ప్రజల స్థానిక సమస్యలు సత్వరం పరిష్కారం కావడానికి ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించారు. 4.ప్రజారోగ్య పరిరక్షణకు భంగం కలిగించే అన్ని చర్యలకు సర్పంచిలకు జరిమానా వేసే అధికారం ఇచ్చారు. ఉదా: రోడ్ల మీద చెత్త వేయడం, బహిరంగ మల విసర్జన మీద జరిమానా విధించడం. 5.నెలకు ఒకసారి గ్రామ పంచాయతీ, 2 నెలలకు ఒకసారి గ్రామసభ జరిపేవిధంగా చట్టం చేశారు.

గ్రామసభకు కోరం పెట్టారు. 6.రెండు టర్మ్‌లు ఒకే రిజర్వేషన్స్ స్థానిక సంస్థలో పెట్టడం వల్ల ఎన్నికైన సర్పంచి అభివృద్ధి మీద దృష్టిపెట్టి మళ్లీ ప్రజల తీర్పు కోరవచ్చు. నేను వచ్చేసారికి పోటీ చేసే అవకాశం ఉండదనే భావన అభివృద్ధి పట్ల నిర్లక్ష్యానికి దారితీయవచ్చు. 7.ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా సర్పం చి, కార్యదర్శి గ్రామంలోనే ఉండాలనే నిబంధన పెట్టారు. 8.సర్పంచ్, కార్యదర్శికి వారి పనివిధానం మీద మార్క్ ్స ఇచ్చి పర్‌ఫామెన్స్ రిపోర్టు ప్రతి నెల అడుగడం, పథకాలు, విధులు సక్రమంగా నిర్వహించి బెస్ట్ ఫర్మా ర్మెమెన్స్ ఇచ్చిన వారి గ్రామ పంచాయతీకి అదనపు నిధులు, అవార్డులు ఇవ్వడం వల్ల గ్రామాల మధ్య స్నేహపూర్వక పోటీ, వాతావరణం ఏర్పడి అన్ని గ్రామాలు అభివృద్ధి బాట పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. 9.గ్రామ పంచాయతీ భవనాలు వైకుంఠధామాలు గ్రామాల్లో తప్పనిసరి గా నిర్మించుకోవాలి. ప్రభుత్వ స్థలాలు లేకపోతే గ్రామ పంచాయతీ నిధుల నుంచి స్థలం కొనుగోలు చేయాలి. 10.అభివృద్ధి పనులకు ఎవరైనా దాత లు విరాళాలు, నిధులు ఇస్తే వారి పెద్దల పేర్లు, దాతల పేర్లు అభివృద్ధి పనులకు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు.

ఈ నిర్ణయం దాతలను ప్రొత్సహించడానికి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఉపయోగపడుతుంది. 11.గ్రామ పంచాయతీల మీద వచ్చే ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించడానికి గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్స్ ఏర్పాటుచేశారు. 12.మిష న్ భగీరథ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు నీరు సప్లయి చేయ డం వల్ల చాలా పల్లెలో ్ల నీటి సమస్య పరిష్కారమవుతుంది. 13.ముప్ఫై రోజుల ప్రణాళిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో అపరిశుభ్రతను పారదోలి పచ్చని పల్లెలుగా మార్చారు. ప్రభుత్వం అన్నిరకాల మార్గదర్శకాలు చేసిన ఏండ్ల తరబడి అధికార యంత్రాంగంలో చొరబడిన జడత్వం వల్ల అవి పూర్తిగా అమలుకాక ఫలితాలు పెద్దగా కానరావడం లేదు. జడత్వం పోగొట్టాలంటే ప్రజల చైతన్యం కీలకం. నూతన చట్టం ద్వారా దేశానికి ఒక దిక్సూచిలాగా గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.

355
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles