ఆవిష్కరణ సభ


Mon,November 4, 2019 12:41 AM

గోరటి వెంకన్న రచనలు వల్లంకితాళం, పూసి న పున్నమి, ది వేవ్ ఆఫ్ ది క్రిస్సెంట్ పుస్తకాల ఆవిష్కరణ సభ 2019 నవంబర్ 5న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్,నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరింయలో జరుగుతుంది. ఖాదర్ మోహియుద్దీన్ అధ్యక్షతన జరుగు సభలో ముఖ్య అతిథులుగా కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ హెచ్‌ఎస్ శివప్రకాశ్, శిలాలోహిత, బండి నారాయణస్వామి, పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొంటా రు. గౌరవ అతిథులుగా బి.నర్సింగరావు, అట్టాడ అప్పల్నాయుడు, ప్రొఫెసర్ బన్న అయిలయ్య, అసుర, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, యాకూబ్, శిఖామణి, సిద్ధార్థ, పసునూరి రవీందర్, దేవిప్రియ, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాస్, డాక్టర్.జి.చెన్నయ్య, క్రాంతి శ్రీనివాసరావు, జూపాక సుభద్ర, తాడి ప్రకాశ్, కోయి కోటేశ్వరరా వు హాజరవుతారు. పుస్తక శిల్పులు ఏలె లక్ష్మణ్, శం కర్ పామర్తి, బంగారు బ్రహ్మం పాల్గొంటారు.


నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా 2019 నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకు ఆంధ్రమహిళాసభ ఎన్‌బీటీ హాలు, ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. వెన్నెల పూల వాకిలి కీ.శే.సీవీ కృష్ణారావు సమర్పణలో సాగిన నెలనెలా వెన్నెల సాహిత్య కార్యక్రమం ఆయన స్ఫూర్తితో ఇకపై తెలంగాణ చైతన్య సాహితి నిర్వహిస్తుంది. అందరికీ ఆహ్వానం.
- ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్

నవలా స్రవంతి

తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా 2019 నవంబర్ 11న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది. బోయ జంగయ్య జగడంపై గోగు శ్యామల ప్రసంగం ఉంటుంది. సభకు నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు.
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి

75
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles