ప్లాటో-అరిస్టాటిల్


Mon,November 4, 2019 12:44 AM

book
ప్లాటో భావవాద తత్వవేత్త. జ్ఞానాన్ని విజ్ఞానశాస్త్రం,భావన అని రెండుగా విభజింపచటం ఆయన ప్రధాన సిద్ధాం తం. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలలో అత్యున్నతుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ మొత్తం విజ్ఞానాన్ని దాని ప్రయోజనాన్ని వివరించే అంశం ఆధారంగా సైద్ధాంతిక, ఆచరాణాత్మక, సృజనాత్మక అని మూడు భాగాలుగా వర్గీకరించారు. గ్రీకు తత్వశాస్త్ర స్వర్ణయుగంలో అంటే నాలుగవ శతాబ్దంలో తత్వశాస్త్రంతో సమాజాన్ని ముందుకు నడిపించిన వారిలో అగ్రగణ్యులు వీరు..
రచన:ఎ ఎస్.బొగోమలోవ్, తెలుగు: మక్కెన సుబ్బారావు, వెల: రూ.65, ప్రతులకు:నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్,
ఎమ్.హెచ్. భవన్, ఫ్లాట్‌నెం: 21/1, అజామాబాద్, ఆర్టీసీ కళ్యాణమండపం దగ్గర, హైదరాబాద్-20.ఫోన్:040-27665420


గంగిపాటలు

book1
నండూరి ఎంకి పాటలు ఎలా ప్రజలను రంజింప చేసి, వారి మనస్సుల్లో నాటుకు పోయాయో, గంగిపాటలు అలా ప్రశస్తిపొందుతాయనటంలో సందేహం లేదు. తెలంగాణ జానపద నాయిక గంగిని నాయికగా చేసుకొని గంగి, గంగడుల ప్రణయాన్నీ, తద్వారా తెలంగాణ పల్లె పట్టుల రమణీయ స్వచ్ఛ జీవితాన్ని చిత్రీకరించిన రచయిత తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ అభినందనీయులు.
రచన: తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్, వెల: రూ.150 ప్రతులకు:తాళ్ల లక్ష్మీనారాయన గౌడ్, జానకంపేట,ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా-503186. ఫోన్: 6303795059

80
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles