నగిషీలు


Mon,November 4, 2019 12:47 AM

కిటికీ బయట వర్షం పడుతోంది
కిటికీకి లోపల వెల్తురు కురుస్తోంది
కిటికీ ఊచల మీద, చీకటి నిద్రపోతోంది
పొద్దున్నే ఆకాశం పగిలిన అద్దంలా
రోడ ్లమీదా జారిపడింది
ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళలా
పూలకుప్పలు కొట్టుకొచ్చాయి
నలిగీ నలిగి కమిలిపోయిన గాయంలా
అడ్డంగా పడిన ఆకులన్నీ ఛిద్రమయ్యాయి
అర్ధరాత్రి నిద్రలేచినపుడు
ముడుతలు పడిన దుప్పటిని గుర్తుచేస్తూ
నేలంతా నగిషీలు చెడిపోయినట్టుగా వుంది
పరదాల మీద తేలిపోయిన పాటలు
చెట్లమీదవాలి రెక్కలార్చుకొంటున్నాయి
ఝాము ఝాముకు, కాలి కరిగిన
మోంబత్తి దీపాలు
వేకువ దగ్గర, ఆఖరి తోరణాల్లా
మెరుస్తున్నాయి..
కిటికీ రెక్కల మీద గాలి వొయలుబోతోంది
కిటికీ లోపల పరిమళం,
పక్కకుతిరిగి వొలుకుతోంది
వీపు మీద మనిషిని మోస్తున్న పులిలా
దిక్కులు చూస్తూ, దినం బయలుదేరింది..
- ఆశారాజు, 93923 02245

69
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles