కొన్ని సమయాలు!


Mon,November 4, 2019 12:47 AM

కొన్ని సమయాలలో
దహించే దేహయాత్రలో
చిరుచెమటల మీదుగా
ప్రవహించే వేపచెట్టు గాలి!
కొన్ని సమయాలలో
విపరీతంగా ఆకలేసి
ఏదో ఒకటి తినేయ్యాలనే
మానసిక స్థితిలో..
కొన్ని సమయాలలో
నిలదీసే మిత్రుల ప్రశ్నలకు
సమాధానాల వెదుకులాట
కొన్ని సమయాలలో
శరీరమై శత్రువై
రక్షణ కవచాన్ని లాగేసే వేళ
కొన్ని సమయాలలో
పాలకుల కుతంత్రాలతో
రాజ్యమే కాటేసినపుడు
కొన్ని సమయాలలో
దేవుడో-దయ్యం-
మూకుమ్మడిగా దాడిచేసి
నీ అంతరంగాన్ని
కత్తి అంచుపై నిలిపినప్పుడు
ఆత్మైస్థెర్యమే.. సంకల్పమే..
నీ ఆయుధం!!
- నిఖిలేశ్వర్, 91778 81201

87
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles