పచ్చని ప్రశ్న


Mon,November 4, 2019 12:48 AM

trees
ఎందరి జ్ఞాపకాలల్లో రాలిపోయి
ఎందరి పాదముద్రల్లో ఒదిగిపోయి
పచ్చని ప్రశ్నవయ్యావో..!
తపనల కొలిమి నుండి కొత్త జీవిక వెనకొచ్చినట్టు, సోయి మాయి జారి
భూగర్భాన పడె భూజముల మాటయ్యె
మళ్లీ మళ్లీ కాలపుబండిలో ప్రయాణం చేస్తున్న..!
ఇప్పటికీ బాధలకొండలను మోస్తున్న..!!
ఎన్నో భారపు ఊహలను ఎక్కి దిగు ప్రకృతి ప్రేమికులు
రంపపుముళ్ళ హృదయాలను తీతువు రెక్కలకేసి
నాగలి మొనల దుఃఖాన్నంతా ఎగిరే మబ్బులకిచ్చి
మనోపత్రంపై ఎర్రటి వీలునామా రాసే
వెదురుపొదల నెమలీకలౌతున్నరు..!
ఇది కొనసాగుతున్న అంతిమ యాత్రలుకాదు
దిగులు ముఖాల తిరుగుబాటు కాదు
బాట అంతా ప్రశ్నల సంవేదనలతో
జీరాడే పారాడే ఆందోళనల కథా సంవిధానాలు..
ఇవ్వేమీ రహస్య సంభాషణలు గావు
నిరసన గళాల బహుభాషానువాదాలే గావు
ప్రసవం పూలు విచ్చుకున్న చిక్కని చెట్లదండ
ఒక్క చోట కూర్చున్న సక్కని జీవుల వాసన..
అక్కడున్నది ఔషధ నిధి.. వర్షపు పొది..
చితి మంటలు ఎట్లదెచ్చెదవోయీ ఈ ఆశల వనానికని
కాసులగుండెల కసాయిలకు వేస్తున్నది పచ్చని ప్రశ్న...
- కొండపల్లి నీహారిణి, 98663 60082

96
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles