పశుపక్షాదుల పరిశీలనే ఉత్తమం


Mon,November 4, 2019 11:48 PM

ఇండోనేషియాలో అనక్‌ క్రకటోవా అగ్ని పర్వతం పేల టం వల్ల సునామీ ఏర్పడి 400 మందికి పైగా మరణించా రు. మరోసారి ఇదే ప్రాంతంలో భయంకరమైన సునామీ వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో సునామీ అత్యంత ప్రమాదకరమైనది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఒక ప్రాంతానికి మాత్ర మే నష్టాన్ని కలిగిస్తాయి. కానీ సునామీ కలిగించే నష్టం ఖం డాంతరాలను దాటుతుంది. 2004 డిసెంబర్‌ 26న ఏర్పడిన సునామీ వల్ల 13 దేశాల్లో దాదాపు 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు. మనదేశంపై కూడా సునామీ ప్రభావం పడింది. సముద్రంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం వల్ల సునామీ రావచ్చని నిపుణులు తెలియచేస్తున్నారు. ఆధుని క కాలంలో మానవ తప్పిదాల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని సునామీలు వస్తున్నాయి.


విద్యాలయాల్లో ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధిస్తే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో టిల్లీస్మిత్‌ అనే విద్యార్థిని నిరూపించింది. 1994లో ఇంగ్లండ్‌లో జన్మించిన టిల్లీస్మిత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి 2004 డిసెంబర్‌ 26న థాయిలాండ్‌లోని మకావులో పర్యటించింది. ఆమెకు భూగోళశాస్ర్తాన్ని బోధించే ఆండ్రూకెర్నీ అనే ఉపాధ్యాయుడు సునామీ సంభవించడానికి రెండు వారాల ముందే సునామీ ఏ విధంగా వస్తుందో వీడియోద్వారా వివరించాడు. మకావు బీచ్‌లో సందర్శకులు సరదాగా గడుపుతుంటే, టిల్లీ మాత్రం సముద్రమట్టంలో తగ్గుదలను గమనించి సముద్ర ఉపరితలంపై బుడగలు ఏర్పడటాన్ని చూసి, సునామీ రావడానికి సూచికగా భావించి ఇతరులను హెచ్చరించింది. టిల్లీ హెచ్చరికతో అప్రమత్తమై న సెక్యూరిటీగార్డులు సందర్శకులను బీచ్‌ విడిచి వెళ్లమని తెలిపారు. ఆమె ప్రతిభతో తన కుటుబ సభ్యులతోపాటు వంద మందికిపైగా ప్రాణాలను కాపాడగలిగింది. ఇటువం టి బోధన అన్ని విద్యాలయాల్లో జరుగాలి. మనుషులతో పోల్చుకుంటే జంతువులు, పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను త్వరగా పసిగడుతాయి. వాటి పరిశీలన ద్వారా విపత్తులను గుర్తిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఈ దిశగా అధ్యయనాలు అవసరం.
- ఎం, రాంప్రదీప్‌, సామాజిక కార్యకర్త

137
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles