చైతన్యపు బాటలో..


Wed,November 13, 2019 12:38 AM

Sripada
ఏం ఆగలే..
పొద్దుగాల కోడి కూసుడు ఆగలే
ఛాయ్ హోటల్లో కిరోసిన్ స్టవ్ జోరు తగ్గలే
డొక్కుబండి సైలెన్సర్లలా..
పొగరాయుల్ల హోరు తప్పలే
బుడ్డోడి పేపర్ సైకిల్‌కు బ్రేక్ పడలే
ఫ్రీ పేపర్ బ్యాచ్ బాతకానీ తగ్గలే
పిలగాడి బడి మారం మారలే
వాడి బడివ్యాన్ రావడం ఆగలే
ఏం ఆగలే..
కంకర కుప్ప చిల్లంకల్లం కాలే
లాఠీ పట్టిన ఖాకీ ఇస్త్రీ ఫోల్ పోలే
టియర్ గ్యాస్ పేల్లేదు
రబ్బరు బుల్లెటు ఎల్లలేదు
శంకరా.. అంటున్న గుడి మైకు ఆగలే
అల్లా.. అని పిలిచే మసీదు హజా తప్పలే
భాయి భాయి పిలుపు ఆగలేదు
భారతదేశం ఔన్నత్యం తగ్గలే..
ఏం ఆగలే..
అయోధ్యను సయోధ్యను చేసి
ఎనభైల దేశం కాదిప్పుడు
ఎదిగిన జాతని నిరూపించిన
అందరికి..
చెయ్యెత్తి వందనం
మనసారా పాదాభివందనం..!!
- శ్రీపాద రమణ, 79970 38355

203
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles