నిక్కచ్చి మనిషి నీళ్ల సారు


Thu,November 14, 2019 12:39 AM

svijay
విద్యాసాగర్‌రావు సార్ అనేవారు-అందరూ సొంతంగా ఏ అంశంపైన అయినా ఒరిజినల్ టెక్ట్స్ చదువాలి. అప్పుడే సరై న అవగాహన వస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ యూనిట్ కోసం పనిచేసే ప్రతి ఇంజినీర్ తప్పనిసరిగా బచావత్, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రిపోర్టులు చదువాలి. ఒకే విషయాన్ని ఒక్కొక్కరు చదివినప్పుడు ఒక కొత్త కోణం ఆవిష్కరించబడవచ్చు. ఇప్పటికే అవగాహనలోకి వచ్చిన అంశాలు మనకు సరిపోక పోవచ్చు. కొత్తగా అవగాహనలోకి వచ్చిన అంశం మన రాష్ర్టానికి ఉపయోగపడవచ్చునని చెప్పేవారు.


ట్రిబ్యునల్‌లోని జడ్జిలకు ఆల్మట్టి నుంచి డిండి వరకు, కృష్ణా బేసిన్ భౌగోళిక పరిస్థితులు గురించిన అవగాహన కల్పించాలంటే ఒక భౌతిక మోడల్ చూస్తేనే సాధ్యమవుతుందని సార్ ఒక మోడల్‌ను తయారుచే యించి ఢిల్లీలో ట్రిబ్యునల్ హాల్లో జడ్జిల ముందు ప్రదర్శింపజేశారు. ఇక్కడ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2016 అక్టోబర్ 19న వెలువరించిన ఉత్తర్వులోని ఒక పేరాను చూద్దాం. తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ తన వాదనను వినిపిస్తూ, నాటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా ట్రిబ్యునల్-I, కృష్ణా ట్రిబ్యునల్-II ఎదుట తెలంగాణ ప్రాంత అవసరాలు కావల్సిన విధంగా, సరిగా చూపించనందువల్ల తెలంగాణ ప్రాంతం నీటికోసం అలమటించాల్సి వచ్చింది. కర్ణాటక నుంచి తెలంగాణ ఎగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకు రావాలంటే భీమా నది నుంచి నారాయణ్‌పూర్ మీదుగా ఒక పొడవైన కెనాల్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ తయారుచేసిన ఒకపెద్ద ఫిజికల్ మోడల్‌ను ట్రిబ్యున ల్ ఎదుట ప్రదర్శించి దానిద్వారా భీమా నది నుంచి డిండి నది ద్వారా కృష్ణానది నీటిని తెలంగాణ ఎగువ ప్రాంతాలకు ప్రవహింపజేయవచ్చునని చెప్పారు. ఇట్లా పలుకోణాల్లో తెలంగాణ నీటి సమస్యను పామరజనం నుంచి విద్యాధికుల వరకు అవగతం చేయించే ప్రయత్నం చేశారు విద్యాసాగర్‌రావు సార్.

ట్రిబ్యునల్ ఎదుట వాదనల అంశంలో విశదీకరిస్తూ ఎవిడెన్స్ కావాలయ్యా, ట్రిబ్యునల్ ఎదుట రాతపూర్వకమైన సోర్స్ మెటీరీయల్ చాలా అవసరం అనేవారు. ఆ మాటల అంతరార్థం ఇప్పుడు రాష్ట్రం తరఫున ట్రిబ్యునల్‌కు వెళ్తుంటే నాకు అర్థమవుతున్నది. గతంలో ట్రిబ్యునళ్ల ఎదుట సమర్పించిన పత్రాలన్నీ కోస్తాంధ్రకు, ఆ తర్వాత రాయలసీమకు నీళ్లు మళ్లించేందుకు సమర్థించే విధంగానే ఉన్నాయి. అప్పటి ఆంధ్రా ప్రభుత్వాలు రాతపూర్వకంగా తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయాలని అడి గే పత్రాలు తెలంగాణ ఉద్యమ సమయంలో అక్కడక్కడ వెలువరించినప్పటికీ ట్రిబ్యునల్ ముందు సమర్పించినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో వాటికి ప్రతిగా నివేదించారు. కాబట్టి తెలంగాణకు అనుకూలంగా రాత పూర్వకమైన సోర్స్ మెటీరియల్ సేకరించడానికి అంతర్రాష్ట్ర జల వనరు ల విభాగం చాలా శ్రమించాల్సి వస్తున్నది. అయితే, తెలంగాణ నదీజలా ల అంశాల విషయంలో సార్ ఏర్పరిచిన విధానపరమైన ప్రాతిపదిక ఆధారంగా శోధించి అనేక ఆధారాలు సమకూర్చుకున్నాం. ఒక బలమైన వాదనను వినిపిస్తున్నాం. ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును, మారిన పరిస్థితుల ఆధారంగా కొత్తగా రివ్యూ చేసి పంపకాలు చేయవచ్చునని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

దాని ఆధారంగా నేడు ఇరిగేషన్, వ్యవసాయ తదితర రంగాల్లో సాధించిన శాస్త్ర, సాంకేతిక పురోగతి వల్ల నేటి వినియోగాన్ని పునఃసమీక్షించి, బేసిన్‌లో కెనాళ్ల ఆధునీకీకరణల వల్ల, నీటి వినియోగంలో ఆధునిక వంగడాలు తదితర పద్ధతుల వల్ల మిగిలిన నీటిని పోలవరం-పట్టిసీమల ద్వారా కృష్ణా బేసిన్‌కు అదనంగా చేరుతున్న నీటి ని, మొదట తెలంగాణకు బేసిన్‌లోని కరువు ప్రాంతాలకు 75 శాతం విశ్వసనీయతతో కేటాయింపులు చేసి, ఆ తర్వాత మిగిలిన నీటిని రాయలసీ మ కరువు ప్రాంతాలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మన ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, ఇక్కడ మరొక కోణం కూడా ఉన్న ది. నేడున్న ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం చాలా తక్కువ పరిధి కలిగి ఉన్నది కాబట్టి, మన రాష్ర్టానికి న్యాయం జరుగదని సార్ గ్రహించడం వల్లనే మన రాష్ట్రం 2014 జూలైలోనే, అంతర్రా ష్ట్ర నదీజల వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు సమర్పించాం. ఇప్పటివరకు కేంద్రం దానిపై నిర్ణయం తీసుకోలేదు. దానికితోడుగా ఇప్పుడు కొత్తగా అంతర్రాష్ట్ర నదీజల వివాదాల అమెండ్‌మెంట్ బిల్లు-2019 ఒక్కటి పార్లమెంట్‌లో ఉన్నది. కాబ ట్టి, వెంటనే తెలంగాణ సెక్షన్-3 ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు నివేదించాలి, లేదా అమెండ్‌మెంట్ బిల్లులో మన సెక్షన్-3 గురించిన ప్రత్యేక ప్రొవిజన్ చేర్చి ట్రిబ్యునల్‌కు నివేదించాలి. ఈ విషయంలో తెలంగాణ రాజకీయ నాయకత్వం పార్టీలకు అతీతగా స్పందించాలి. అప్పుడే సార్ ఆశించిన తెలంగాణ దీర్ఘకాలిక జలరక్షణ సాధ్యమవుతుంది.

తెలంగాణ ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, జయశంకర్ సార్‌తో విద్యాసాగర్‌రావు సార్ ఎన్నో నిద్రలేని రాత్రులు తెలంగా ణ ఇరిగేషన్ అంశాల గురించి చర్చిస్తూ గడిపిన సంగతి మనకు తెలుసు. అయి తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఒక ప్రభుత్వ సలహాదారుగా విద్యాసాగర్‌రావు సార్ ఎప్పుడూ తనకు గల తన పరిధికి లోబడే వ్యవహరించే వారు. జల సంబంధ విషయాల్లో అత్యవసరమైన విషయాల్లో స్వయంగా ఫైళ్లు తీసుకెళ్లి సీఎం సంతకం తీసుకునేవారు. ఒక సందర్భంలో సార్ నా సందేహానికి బదులిస్తూ.. సీఎంకు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉంటా యి. నేను సరైనది అనుకున్నది చెప్తాను. నా ధర్మం అది. వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి, ఆచరణలో సాధ్యాసాధ్యాలను బట్టి వినాలా, వద్దా అని వాళ్లు నిర్ణయించుకుంటారన్నారు.
RVidyasagar-rao

ఇట్లా తెలంగాణకు న్యాయమైన నీటి వాటా దక్కడానికి తన ఆరోగ్యా న్ని కూడా లెక్కచేయకుండా తనవల్ల సాధ్యమైనంత కృషిచేసిన ఆ మహనీయున్ని తలుచుకుందాం. ఆయన స్మృత్యర్థం నవంబర్ 14ను తెలంగా ణ ఇంజినీర్లు, ప్రజలు తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి తెలంగా ణ రిటైర్డ్, సర్వీస్ ఇంజినీర్స్, అభిమానులు హాజరవ్వాలని కోరుతున్నాం.
-(నేడు ఆర్.విద్యాసాగర్‌రావు సార్ జయంతి)

తెలంగాణ ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, జయశంకర్ సార్‌తోవిద్యాసాగర్‌రావు సార్ ఎన్నో నిద్రలేని రాత్రులు తెలంగాణ ఇరిగేషన్ అంశాల గురించి చర్చిస్తూ గడిపిన సంగతి మనకు తెలుసు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఒక ప్రభుత్వ సలహాదారుగా విద్యాసాగర్‌రావు సార్ ఎప్పుడూ తనకు గల తన పరిధికి లోబడే వ్యవహరించే వారు. జల సంబంధ విషయాల్లో అత్యవసరమైన విషయాల్లో స్వయంగా ఫైళ్లు తీసుకెళ్లి సీఎం సంతకం తీసుకునేవారు.

594
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles